శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
నా పేరు శివకుమారి. మా నివాసం గుంటూరు. బాబా ఇచ్చిన అనుభవాలను ఇలా బ్లాగు ద్వారా సాయిబంధువులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా మా అబ్బాయి విషయంలో బాబా ఇచ్చిన అనుభవాన్ని చెప్తాను.
మా అబ్బాయి చదివింది ఫార్మసీ. కానీ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. తనకి విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. ఐతే వీసా విషయంలో స్టడీస్ గురించి ప్రశ్నలు వస్తాయేమో, అది సమస్య అవుతుందేమోనని మేమంతా చాలా భయపడ్డాము. "బాబా! మీకు ఇష్టమైతే తనకి వీసా వచ్చేలా చేయండి, లేకపోతే లేదు" అని చెప్పుకుని పూర్తిగా భారం బాబాపై వేశాం. బాబా కరుణామయుడు. ఆయన తన బిడ్డల కోరికలు నెరవేరుస్తారు కదా! ఆయన దయవలన స్టడీస్ గురించి కాకుండా వేరే చిన్న చిన్న ప్రశ్నలిచ్చి వీసా ఆమోదించారు.
ఇక మా మనుమరాలి విషయంలో కూడా బాబా దీవెనలు అద్భుతం ...
పుట్టుకతోనే పాప గుండెలో రంధ్రం ఉంది. అది దానంతటదే మూసుకుపోవడం కష్టం. కాబట్టి 6వ నెలలో పాపకి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. మేము బాబానే నమ్ముకున్నాము. "పాపని కాపాడమ"ని బాబాను ప్రార్థించి, రోజూ పాపకి ఊదీ పెట్టి, తన దగ్గరే కూర్చొని సచ్చరిత్ర పారాయణ చేసాము. 8వ నెలలో వైద్యులను సంప్రదిస్తే, మళ్ళీ ఈకో(echo) టెస్ట్ చేయించమన్నారు. రిపోర్ట్స్ చూసిన కార్డియాలజిస్ట్, "రంధ్రం(హోల్) మూసుకుపోయింది, శస్త్రచికిత్స అవసరంలేదు, నిజంగా ఇది మిరాకిల్" అన్నారు. ఇదంతా బాబా కరుణే! "బాబా! చాలా చాలా ధన్యవాదాలు బాబా!".

🌸🌸🌸🌸💐💐💐💐💐💐🏵️🏵️🏵️🏵️🌲🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌺🌺🌺🌼🌼🌼🌼🥀🥀🥀🥀🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌺🌺🌺🌺🌺🌻🌻🌻🌻💐🌸🏵️🌹🥀🌺🌻🌼🌷
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me