సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1874వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • కోరుకున్నది అనుగ్రహించి ఆనందింపజేసిన బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయిబంధువులకు నమస్కారం. నా పేరు లక్ష్మీదేవి. నాకు బాబా అంటే ఎనలేని భక్తి, విశ్వాసం, ప్రేమ. నేను పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన్ని పూజిస్తున్నాను. గడిచిన ఈ 12 సంవత్సరాలలో నాకొచ్చిన కష్టకాలంలో బాబా నాకు తోడు నీడగా ఉండి సమస్యల నుంచి గట్టెక్కించారు. ఎన్నో అనుభవాలను చూపారు. అందులో ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను.


నేను, నా భర్త హైదరాబాదులో ఒక ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్నాం. దానికోసం చాలా చోట్ల తిరిగాక చివరికి ఒక ప్లాట్ కుదిరి అడ్వాన్స్ ఇచ్చాము. నేను ఒక ఎకరం పొలం అమ్మగా వచ్చిన డబ్బు, నా భర్త కష్టార్జితం కలిపి ఆ ఫ్లాట్ తీసున్నాము. రిజిస్ట్రేషన్ మా ఇద్దరి పేరు మీద చేయించుకుందామనుకుంటే నాకు అడ్రస్ ప్రూఫ్ లేదు. అది రావడానికి టైం పడుతుందన్నారు. మా బంధువులంతా రిజిస్ట్రేషన్ నా భర్త పేరు మీద చేయించమని నాపై ఒత్తిడి తెచ్చారు. నేను సాయిని, "రిజిస్ట్రేషన్ మా ఇద్దరి పేరు మీద ఉంటే బాగుంటుంది" అని ఆర్తిగా వేడుకున్నాను. మన కోరికలు న్యాయమైనవైతే బాబా ఎందుకు తీర్చరు? సాయి నా భర్త స్నేహితుని అన్నయ్య ద్వారా ఐడి ప్రూఫ్ విషయంలో సహాయం చేయించారు. దాంతో హౌసింగ్ లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకు లోన్ డీటెయిల్స్‌లో నా భర్త పేరుతో పాటు నా పేరు జత చేసారు. దాని ఆధారంగా రిజిస్ట్రేషన్‌లో నా పేరు కూడా యాడ్ చేసి రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తైంది. నేను చాలా సంతోషించాను.


అంతేకాదు, బాబా గృహప్రవేశ విషయంలో కూడా చాలా సహాయం చేశారు. సరిగా పూజ సమయానికి అంటే ముహూర్తం దగ్గర పడుతుండగా పసుపు-కుంకుమ కనపడలేదు. నేను చాలా ఆందోళన చెందాను. అక్కడున్న ఒక ప్లాట్ వాళ్ళని అడిగితే, వాళ్ళు శుక్రవారం అని ఇవ్వలేదు. దాంతో నాకు ఏం చేయాలో తెలియక చాలా టెన్షన్ పడి, అవి దొరికేలా చేయమని బాబాను వేడుకున్నాను. ఎందుకంటే, ఈ ముహూర్తం దాటితే మరో ఆరు నెలల వరకు ముహుర్తాలు లేవు. బాబా దయవల్ల సరిగా ముహూర్తం దగ్గర పడుతుండగా సాయి భక్తురాలైన మా పక్క ఫ్లాటు అమ్మాయి పసుపు-కుంకుమ తెచ్చి ఇచ్చింది. అదే సమయానికి మా అమ్మకి కూడా మేము తెచ్చిన పసుపు-కుంకుమ కనిపించాయి. దాంతో బాబా చిత్రపటం పట్టుకొని సరిగ్గా సమయానికి గృహప్రవేశం చేసాము. నా ఆనందం మాటల్లో చెప్పలేనిది. "కృతజ్ఞతలు బాబా. మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మీకు జీవితాంతం ఋణపడి ఉంటాము. నేను జీవించి ఉన్నంతకాలం గురువారంనాడు మీ పూజ మానను.  మీరు మీ భక్తులపై చూపే ప్రేమ అమోఘమైనది. మిమ్మల్ని నమ్ముకున్న భక్తులను ఎప్పుడూ తల్లిదండ్రుల వల్లే కంటికి రెప్పలా కాపాడుతుంటారు.

నేను కోరుకున్న ఒక కోరికను మీరు ఎప్పుడు తీరుస్తారా అని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాను తండ్రీ. అది తీరితే నా జీవితం సంపూర్ణమవుతుంది. తొందరగా అనుగ్రహించు తండ్రీ. అలాగే మమ్మల్ని నమ్ముకున్న భక్తులందరినీ కాపాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo