1. బాబా చూపిన దయ
2. సాయి చూపించిన దివ్యలీల
బాబా చూపిన దయ
నేను ఒక సాయిభక్తుడిని. ఒకరోజు నేను బట్టలు మార్చుకుంటునప్పుడు మంచం అంచు నా కాళ్ళకి గట్టిగా తగిలింది. గాయమై రక్తమొచ్చి, ఆ చుట్టుపక్కల వాచిపోయింది కూడా. నేను వెంటనే బాబా ఊదీ గాయమైన చోట రాసి 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని అనుకున్నాను. అసలు ఏ టాబ్లెట్ వాడకుండా మరుసటిరోజుకి నొప్పి మొత్తం తగ్గేలా చూశారు సాయితండ్రి.
ఒకసారి ఆఫీసుకి సంబంధించిన అత్యవసర పని మీద ముంబాయి వెళ్లి అక్కడ 3 రోజులు ఉండాల్సిన అవసరం నాకు వచ్చింది. ఆ పని మీద నేను ముంబాయి వెళితే సోలాపూర్లోని మా ఇంట్లో 20 నెలల బాబు, గర్భవతి అయిన నా భార్యకు తోడు ఎవరూ ఉండరు. అందువల్ల నేను, "బాబా! వాళ్లకు ఎటువంటి సమస్యలు రాకుండా చూడండి తండ్రీ" అని బాబాని ప్రార్థించి వెళ్ళాను. బాబా దయవల్ల ఆ మూడు రోజులు నా భార్యాబిడ్డలకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. ఇక నేను ముంబాయి నుండి వచ్చిన రెండు రోజుల తర్వాత మా తాత్కాలిక ఇంచార్జి రాత్రి 8:30కి నాకు ఫోన్ చేసి, "ముంబయిలో అత్యవసర పని ఉంది. రాత్రి 10:30 ట్రైన్కి వెళ్ళాలి" అని అన్నారు. నేను అతనితో, "నేను రెండు రోజుల ముందే ముంబాయి నుండి వచ్చాను. ఇప్పుడు మీరు నాకు అప్పగిస్తున్న పని కూడా నాకు సంబంధించింది కాదు. ఆ పనికి సంబంధించిన ఇంజనీరుని పంపిస్తే మంచిది" అని చెప్పాను. అతను అప్పుడు మా ఆఫీసరుకి ఫోన్ చేసి, ఏ విషయమూ చెప్తానన్నారు. నేను ఈలోపు బాబాని మనసారా, "బాబా! మళ్ళీ నేను గర్భవతి అయిన నా భార్యని, చిన్నపిల్లాడిని వదిలి ముంబాయి వెళ్ళేలా చేయకండి. ఈ ఆఫీసు పని మీద నన్ను ముంబాయి పంపకుండా చూడండి" అని విన్నవించుకొని, "ఒకవేళ ఈ టూర్ మీ దయవల్ల రద్దైతే, మీ మందిరంలో 101 రూపాయల దక్షిణ సమర్పించుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయ చూపారు. ఆ వర్క్ సంబంధిత ఇంజనీరునే పంపేలా కరుణించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నా భార్య గర్భంతో ఉన్న ఈ సమయంలో నేను తనతో గడిపి తనకు అన్ని పనుల్లో తోడుగా ఉండేలా కరుణించండి తండ్రీ. మీ కృప మీ భక్తులందరిపై ఉండేలా అనుగ్రహించండి".
సాయి చూపించిన దివ్యలీల
సాయిభక్తులందరికీ నమస్కారములు. నేను ఒక సాయి భక్తురాలిని. మా అక్కవాళ్ళ పాప ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతుంది. ఒకరోజు పొద్దున్న నిద్రలేవగానే తన నడుము పట్టేసింది. మా అక్క భయపడి నాకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అప్పుడు నేను మా అక్కవాళ్ళ ఇంటికి వెళితే పాప చాలా విపరీతమైన నొప్పితో బాధపడుతుంది. కానీ అక్క తనని హాస్పిటల్‌కి తీసుకెళ్లడానికి 'చిన్న వయస్సు కదా! అక్కడ ఇంజెక్షన్ వేస్తే, తర్వాత ఇబ్బంది అవుతుందేమోనని' చాలా భయపడింది. అప్పుడు నేను బాబాకు నమస్కారం చేసి, అక్కవాళ్ళింట్లో బాబా ఊదీ ఉంటే పాప నడుముకి రాసి, మరి కొంచెం ఊదీ నీళ్లలో కలిపి తాగించి, పాపని బాబా నామస్మరణ చేసుకోమని చెప్పాను. తర్వాత మెడికల్ షాపు నుండి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తెప్పించి పాపకి ఇచ్చాము. అయినా పాపకి నొప్పి తగ్గలేదు. ఇక అప్పుడు బాబాకి నమస్కారం చేసుకొని, "తండ్రీ! పాపకి నొప్పి తగ్గితే, తనని గురువారం మీ మందిరంకి తీసుకొని వస్తాన"ని మొక్కుకున్నాను. అంతటితో పాపకి నొప్పి కొంచెం కొంచెంగా తగ్గడం మొదలై పూర్తిగా తగ్గిపోయింది. పాపకి కొంచెం తగ్గిన తర్వాత నేను తనని బాబా మందిరానికి తీసుకెళ్దామని నా మనసులో అనుకున్నాను. కానీ నేను ఆ విషయం వాళ్ళకి చెప్పలేదు. అయితే గురువారంనాడు మేము మందిరానికి బయలుదేరుతుంటే మా అక్కవాళ్ళ పాప, "పిన్నీ! నేను కూడా మీతో మందిరానికి వస్తాను" అని తనంటతతానే నన్ను అడిగింది. నేను ఆశ్చర్యపోయాను. ఇదంతా సాయి చూపించిన దివ్యలీల. "ధన్యవాదాలు బాబా".
అనంతకోటి బ్రహ్మాండనాయక యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
Sai thandri me daya mariyu me aasirvadam elappudu matho undela chuskondi. Om Sai Ram.
ReplyDeleteSri Sachidananda Samardha Sadguru Sainath Maharaj ki Jai!!!
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram, amma nannalani kshamam ga chudandi valla badyata meede, na manasuki nachakunda yedi jaragakunda chudandi na manasu meeku telusu, ofce lo anta bagunde la chesi na manasulo anukunnadi jarige la chayandi tandri pls.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
baba, madava ki eeroju books konelaga cheyandi baba. malli venaka padipotadu baba. madava ni kapadandi baba.
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOmsairam
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education. Baba, please give first rank in PG NEET exam for my daughter. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDelete🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sri Sairam 🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete