సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1869వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ప్రార్థించినంతనే తోడుగా ఉన్నానని నిదర్శనమిచ్చే బాబా

సాయిబంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సంధ్య. శ్రీసాయినాథుని దివ్యపాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నా అనుభవాలను పంచుకుంటున్నాను. మేము సంగారెడ్డి వాస్తవ్యులం. మా పిల్లల చదువు ఇంటర్ వరకు సంగారెడ్డిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. తర్వాత వాళ్ళు బీటెక్ చదువుకోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడినుండి రావడానికి, పోవడానికి వాళ్ళకి ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారింది. అందువల్ల మేము సిటీలో ఉండాలని నిర్ణయించుకొని సిటీలో అద్దెఇల్లు వెతికే ప్రయత్నాలు మొదలుపెట్టాం. కానీ మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అప్పుడు నేను పిల్లల పరిస్థితి చూడలేక, "బాబా! పిల్లల చదువుల కోసం సిటీలో మాకు ఒక మంచి ఇల్లు ఇవ్వు తండ్రీ" అని బాబాను ప్రార్థించాను. తర్వాత తెలిసినవాళ్ళందరి సహాయం కోరాను. అయినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడొకరోజు నేను చూస్తున్న 'సద్గురుసాయి' టీవీ సీరియల్లో ఒక పిచ్చుక చెట్టుపై గూడుకట్టుకుని, గుడ్లు పెట్టి, పిల్లల్ని పొదిగాక పిల్లలతో సహా వేరొక చోటుకు వెళ్ళిపోతే, ఒక వ్యక్తి ఆ గూడుని తొలగించాలని ప్రయత్నిస్తుంటే, "ఆ గూడును తొలగించొద్దు. మరో పిచ్చుక నివాసం ఉంటుంద"ని బాబా అతనితో చెబుతూ నా వంక చూశారు. ఆ మాట బాబా నాకే చెప్తున్నారనిపించి, 'బాబా నాకోసం, నా పిల్లలకోసం సిటీలో ఒక ఇల్లు కేటాయించార'ని దృఢవిశ్వాసం కలిగింది. "పిల్లల చదువు, ఉద్యోగ విషయంగా మాపై ప్రేమతో మీరు ఎక్కడో ఒకచోట మాకు ఒక ఇల్లు చూసిపెట్టారు. ఆ ఇల్లు ఎక్కడుందో మాకు చూపించు తండ్రీ" అని ఆర్తిగా బాబాను ప్రార్థించి, 'ఓం శ్రీసాయి అసహాయ సహాయాయ నమః' అనే మంత్రాన్ని పఠించాను. 


తర్వాత ఒకరోజు బాబాకి చెప్పుకొని సింగిల్ బెడ్‌రూమ్ అయినా, డబుల్ బెడ్‌రూమ్ అయినా పర్వాలేదని హైదరాబాదులో ఇల్లు వెతకడానికి బయలుదేరాము. కానీ మేము ఊహించని విధంగా ఇంటి యజమానులు అద్దె చాలా ఎక్కువ చెప్పారు. దానికి కూడా సరే అనుకున్నాము కానీ, ఆ ప్రాంతంలో ఉన్న వాటర్ ట్యాంకర్స్‌ను చూసి అక్కడ నీళ్ల సమస్య ఉందని గ్రహించాము. ఆ నిస్సహాయస్థితిలో నాకున్న ఒకే ఒక్క దిక్కైన నా సాయితండ్రిని తలుచుకొని, 'ఓం శ్రీసాయి అసహాయ సహాయాయ నమః' అనే మంత్రాన్ని మనసులో ఉచ్ఛరిస్తూ ఆయన సహాయాన్ని అర్థించాను. అద్భుతం! వెంటనే మా కజిన్ బ్రదర్ నుండి మాకు ఫోన్ వచ్చింది. అతను, "సిటీలో అద్దెలు ఎక్కువగా ఉన్నాయి. మేమున్న గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉంది. వచ్చి చూడండి" అని చెప్పాడు. మేము అది ఆ సాయీశ్వరుని పిలుపుగా భావించి వెళ్లి ఆ ఇల్లు చూశాము. అది ట్రిపుల్ బెడ్‌రూమ్ ప్లాట్. ఇల్లు ఎంతో చక్కగా, శుభ్రంగా ఉంది. నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. అదీకాక ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే, 'ఇది బాబా మాకోసం కేటాయించిన ఇల్లు' అనే భావన కలిగింది. అయినప్పటికీ ఆ ఇల్లు తీసుకోవాలా, వద్దా అనే ఆలోచనతో క్వశ్చన్&ఆన్సర్ సైట్ తెరిస్తే, 'మీరు ఒక్కరోజులో పని పూర్తి చేయాలి. విజయం సాధిస్తార'ని సందేశం వచ్చింది. అది బాబా ఆశీర్వాదంగా భావించి అదేరోజు రాత్రి రెండు నెలల అద్దె ఆన్లైన్ ద్వారా అడ్వాన్స్ ఇంటి యజమానికి పంపించాము. "సింగిల్ బెడ్‌రూమ్ అయినా, డబుల్ బెడ్‌రూమ్ అయినా సరే నాకు ఏది సరైనదో దాన్ని దయతో ప్రసాదించు సాయీ" అని ప్రార్థించగానే బాబా నాకోసం త్రిబుల్ బెడ్‌రూమ్ ఇల్లును ప్రసాదించారని ఆయన ప్రేమకు నా కళ్ళనుండి ఆనందాశ్రువులు పొంగిపొర్లగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "బాబా! సాయితండ్రీ! పదాలకందని మీ ప్రేమను ఎలా వ్రాయను? ఏమని పొగడను? మీరు చూపిస్తున్న ప్రేమను పొందుతూ మా కన్నులు వెంట వచ్చే ఆనందాశ్రువులతో మీ పాదాలను అభిషేకించడం తప్ప. సద్గురుసాయీ! మీ పాదాలే శరణం”.


2024, జూన్ 2న మావారికి జ్వరం వచ్చింది. నేను తగ్గుపోతుందిలే అని డోలో-650 టాబ్లెట్ వేశాను. కానీ, జ్వరం తగ్గలేదు. సరికదా, విపరీతంగా ఆయన ఒళ్ళు కాలిపోసాగింది. నాకు చాలా భయమేసి, "బాబా! నా భర్తకు జ్వరం తగ్గిపోయేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించి మళ్ళీ మావారికి టాబ్లెట్ ఇచ్చాను. అయినా జ్వరం తగ్గకపోయేసరికి మావారిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేసి 'వైరల్ ఫీవర్' అని చెప్పారు. నేను, "దయతో నా భర్తకి జ్వరం తగ్గించు సాయీ" అని బాబాను ప్రార్థిస్తూ మందులు వేస్తూ, మావారి నుదుటన ఊదీ పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః’ అని జపించి ఆ తీర్థాన్ని మావారి చేత తాగించాను. దాంతో మావారికి జ్వరం తగ్గి ఆరోగ్యంగా ఉన్నారు. అందుకు కారణం బాబా ఆశీర్వాదం తోడుంది. నాకు ఏ విధంగా భయమేసినా నేను సాయితండ్రిని ప్రార్థిస్తాను. వెంటనే ఆయన 'నీకు నేను తోడున్నా'నంటూ నిదర్శనమిస్తారు. "సాయితండ్రీ! నా భర్తకు జ్వరం తగ్గించి, నాకు. నా భర్తకు మానసిక బాధను తొలగించిన మీ అపార ప్రేమకు వేల వేల కృతజ్ఞతలు".

10 comments:

  1. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om sai ram, amma nannalani kshamam ga chudandi tandri vaalla badyata meede, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls, illu konali anna na korika neravere la chudandi tandri pls, ofce lo anta bagunde la chayandi tandri

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete
  6. Baba, bless my children and fulfill their wishes in education. Baba, please give first rank in PG NEET exam for my daughter. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete
  7. sai baba maa sai madava bharam antha meede baba, 8th class lo baaga chadavali baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo