- సందేశాలతో మాతోనే ఉన్నామని నిదర్శనమిచ్చిన బాబా
శ్రీ శిరిడీ సాయినాథునికి నమస్కారాలు. నా పేరు ఫణి. మాది విజయనగరం జిల్లా, చీపురుపల్లి. 2022, మార్చి 10న మా నాన్నకి ఆరోగ్యం బాగాలేకపోతే స్థానిక డాక్టరుకి చూపించాము. డాక్టరు టెస్టు చేసి నాన్న హార్ట్‌లో బ్లాకులు ఉన్నాయని చెప్పారు. అది విని మాకు చాలా భయమేసింది. డాక్టరు హార్ట్‌కి సంబంధించి మందులిచ్చారు. తర్వాత మార్చ్ 18న నాన్న కుడికాలి చూపుడు వేలు గ్యాంగ్రేన్ కారణంగా తొలగించాల్సి వచ్చింది. దానివల్ల నాన్న చాలా నరకం చూసారు. అయన బాధ చూసి మేము ఎంతగానో ఏడ్చి బాబాని ప్రార్ధించాము. అదేరోజు శిరిడీ నుండి మా ఉమా మావయ్య ఊదీ ప్రసాదం తెచ్చి ఇచ్చారు. మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిజానికీ మా మావయ్య శిరిడీ వెళ్లినట్లు మాకు తెలియదు. అంతా బాబా మహిమ. ఇకపోతే, నాన్న వేలి ఆపరేషన్ గురించి, గుండెలో బ్లాకుల గురించి మా మేనత్త టి.ఎల్.సత్యవతి(వైజాగ్ కెజిహెచ్, కార్డియాలజీ విభాగంలో రిటైర్డ్ హెడ్ నర్సు)తో చెప్పాము.ఆవిడ వెంటనే నాన్నని డా.పి.రమణారావు(సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్)కి చూపించారు. ఆ డాక్టరు నాన్నకి యాంజియోగ్రామ్ చేసి, "వెంటనే బైపాస్ సర్జరీ చేయాలి. హై రిస్క్ ఉంది. అపరేషన్ చేస్తే మధ్యలో ఏమైనా జరగొచ్చు" అని అన్నారు. అలాగని ఆపరేషన్ చేయించకపోతే నాన్న బతకరు. మేము మా నాన్నని కోల్పోతామేమోనని చాలా ఏడ్చాము. మాకు ఏమి చేయాలో తోచలేదు. ఈ పరిస్థితిలో మా మేనమామ కూతురు నాకు ఫోన్ చేసి, "ఆపరేషన్ విజయవంతమైతే శిరిడీ వస్తామని మ్రొక్కుకో" అని అంది. తను చెప్పినట్లు మేము వెంటనే బాబాకి మ్రొక్కుకున్నాము. కానీ ఆపరేషన్ చేయించడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఆ విషయంలో కూడా సహాయం చేయమని బాబాని ప్రార్ధించగా, ఆయన దయతో డబ్బులు సమకూరాయి. బంధువులు లక్షల్లో సహాయం చేసారు. డా.పి.రమణారావుగారు విశాఖపట్నంలో ఉన్న స్టార్ పినాకిల్ హాస్పిటల్‌లోని డాక్టర్ ఎల్. విజయ్(ctvs)కి రెఫర్ చేసారు. ఆయన చాలా ఫేమస్ సర్జన్, గుండె మార్పిడి కూడా చేస్తారు. అంతలో మరో సమస్య వచ్చింది. రక్తదాతలు కావాలన్నారు. మేము ఈ మహానగరంలో రక్తదాతలని ఎక్కడని వెతికేది అనుకున్నాము. అప్పుడు మా రెండో మేనత్త అల్లుడి బావ రతన్ కుమార్ 'friend 2 support' వెబ్‌సైట్ ద్వారా కొంతమంది రక్తదాతల ఫోన్ నంబర్లు సేకరించి మాకు ఇచ్చారు. ఆ నెంబర్లకి ఫోన్ చేస్తే నేనంటే నేను ఇస్తానంటూ చాలామంది రక్తదానం చెయ్యడానికి ముందుకొచ్చారు. అయితే మొదట మా బంధువులే ముగ్గురు ఇచ్చారు. ఇంకా మెడికోవర్ హాస్పిటల్ ఫిజిషియన్ డా.నరేష్ కూడా ఇచ్చారు. జూన్ 2, గురువారంనాడు ఆపరేషన్ చేయడానికి నిశ్చయించారు. మా మేనమామ లక్ష్మినారాయణకి ప్రతిరోజూ శిరిడీ నుండి సందేశం వస్తుంది. మేము 'ఈరోజు ఏం సందేశం వస్తుందా?' అని అనుకుంటూ ఉండగా, "అంతా సవ్యంగా జరుగుతుంది. భయపడవద్దు. నేను నీ ప్రక్కనే ఉన్నాను" అని వచ్చింది. అది చూసి మాకు ఎంతో ధైర్యంగా అనిపించింది. తర్వాత నాన్నకి ఆపరేషన్ మొదలుపెట్టారు. బాబా దయవల్ల 3 గంటల్లో డాక్టర్ బయటకి వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందన్నారు. మా కళ్ళ నుండి ఆనందభాష్పలు రాగా ఆయనకి పాదాభివందనం చేసాము. ఎందుకంటే, బతకరేమో అనుకున్న నాన్నని కాపాడింది ఆయనే. బాబాకి, సర్జన్‌కి కృతజ్ఞతలు. ఏమిచ్చినా వారి ఋణం తీర్చుకోలేము. అలాగే మాకు సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు.
మూడు రోజుల తర్వాత నాన్నని ఐసియు నుండి వార్డ్‌కి షిఫ్ట్ చేసారు. ఆ రోజు రాత్రి అనగా జూన్ 5వ తేదీ రాత్రి ఒంటి గంటప్పుడు నాన్నకు విపరీతంగా ఒళ్లునొప్పులు వచ్చాయి. నాన్న నిద్రలేచి, "సాయీ! నొప్పులు భరించలేకపోతున్నాను. చచ్చిపోవాలనిపిస్తుంది సాయి" అని చాలా ఏడ్చారు. అప్పుడు నేను, "మిమ్మల్ని కాపాడిన బాబా మీ నొప్పుల్ని తగ్గించలేరా" అని ధైర్యం చెప్పాను. ఇంతలో నర్సు వచ్చి నాన్నకి ఇంజక్షన్ ఇచ్చింది. అప్పుడు నాన్న, "సాయీ! నిన్ను చూడాలని ఉంది. నీ శిరిడీకి వచ్చేస్తాము సాయి" అని అన్నారు. ఇదంతా నాన్నకు, నాకు, నర్సుకి మరియు బాబాకి మాత్రమే తెలుసు. మా మావయ్యకి తెలీదు. కానీ తెల్లవారేసరికి మా మావయ్య ద్వారా, "నువ్వు ఎందుకు శిరిడీ రావాలని తెగ ఆరాటపడుతున్నావు. నేను నీ చెంత లేనా? నేను భౌతికంగా నీకు కనిపించడం లేదు. కానీ నేను నీ ప్రక్కనే ఉన్నాను. కొన్నాళ్లు ఇంట్లో ఉండి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించు" అని బాబా సందేశం వచ్చింది. అది విని నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత ఆయనకున్న నొప్పులు తగ్గిపోయి ధైర్యం వచ్చింది. ఇకపోతే, ఆ కష్ట సమయంలో బాబా మా వెన్నంటి ఉన్నారనడానికి ఇంకో నిదర్శనం ఏమిటంటే, నాన్న ఒళ్లునొప్పులతో బాధపడిన రాత్రి మా అమ్మ, "బాబా! నాకు ఏ పూజలు చేయాలని లేదు. నాకు చాలా కోపంగా ఉంది, బాధగా ఉంది. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఏమీ బాగోలేదు" అని ఏడ్చారట. మర్నాడు పై సందేశంతోపాటు మా మావయ్యకి శిరిడీ నుండి ఇంకో సందేశం కూడా వచ్చింది. దాన్ని కూడా ఆయన మాకు పంపారు. అది ఏంటంటే, "అమ్మా! నువ్వు పూజలు చేయడం ఆపవద్దు. నీకు నా మీద కోపం ఉందేమో కానీ, నీ మీద నాకు ఎటువంటి కోపమూ లేదమ్మా. మీరు అన్నివిధాల బాగుంటారు" అని. అవి చూసాక మా కళ్ళు వెంబడి నీళ్ళు ఆగలేదు. స్వయంగా బాబా మాట్లాడుతున్నట్లు ఉందని ఆనందపడ్డాము. తర్వాత ఇంకో పెద్ద కష్టం వచ్చింది కానీ, మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న బాబానే ఈ కష్టం నుండి కూడా మమ్మల్ని గట్టెక్కిస్తారన్న నమ్మకంతో ఉండసాగాము. తర్వాత డిసెంబర్ నెలలో మా సాయిబాబా గుడి నుండి కొంతమంది భక్తులు సాయి మాల ధరించి శిరిడీ వెళ్తుంటే మాకు కూడా శిరిడీ వెళ్ళాలనిపించి బాబాని అడిగాను. ఆ మరునాడు, "నా ఆజ్ఞ లేనిదే. నువ్వు శిరిడీ రాలేవు" అని సందేశం వచ్చింది. తర్వాత అదే నెలాఖరులో, "నువ్వు శిరిడీ రావడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాను. సిద్ధంగా ఉండు" అన్న సందేశం వచ్చింది. ఆ మర్నాడు, "నువ్వు శిరిడీ రావడానికి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసాను. నీ సమస్యలు, బాధలు అన్నీ పోతాయి. ద్వారకామాయి నీ గురించి ఎదురుచూస్తుంది" అని మరో సందేశం వచ్చింది. వెంటనే మేము రైలు టిక్కెట్లు బుక్ చేసుకొని బాబాని దర్శనానికి శిరిడీ వెళ్ళాము. అక్కడ సమాధి దగ్గరకి వెళ్ళగానే మాకందరికీ దుఃఖం ఆగలేదు. బాబా చేసిన ఉపకారానికి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని బాబాని, శిరిడీని విడిచిరాలేక చాలా బాధతో ఇంటికి తిరిగి వచ్చాము. బాబా లీలలు అనంతం. ఆయన ఊదీ పరమ పవిత్రం. "బాబా! ఎన్ని జన్మలెత్తినా మీతో మాకు ఋణానుబంధం ఇలానే ఉండాలి. ఎప్పుడూ మా చేతులు విడవ వద్దని మనవి బాబా".
Om Sai Ram please bless my family 🙏🙏 Be with us.Give health to my family.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteBaba please bless my child and Bruno 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jai Shri Sai Sadguru Sainath Maharaj ki Jai!!! Om Sai ram.!! Nannu na family ni ellappudu kapadandi Sai. Meere maku dikku.
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Omsairam
ReplyDeleteOmsairam
ReplyDeletebaba naa computer work chesetattu chesavu baba. madava bharam antha meede baba.
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education. Baba, please give first rank in PG NEET exam for my daughter. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDelete