- బాబా ప్రేమ - కోపం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు మణిదీపిక. నేను ఇదివరకు చాలాసార్లు నా అనుభవాలు ఈ బ్లాగులో పంచుకున్నాను. మళ్లీ ఇన్నాళ్లకు ఆ సాయినాథుని లీలలు పంచుకునే అదృష్టం నాకు దక్కింది. నేను 2022 నుండి యుఎస్‌లో ఉంటున్నాను. నేను ఎప్పుడూ సాయిని నమ్ముతూ ఉన్నప్పటికీ 2025 వరకు 3 సంవత్సరాల్లో నా జీవితంలో ఎలాంటి ప్రగతి కనిపించలేదు. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఉద్యోగం చేసేదాన్ని. పెళ్ళై యుఎస్ వచ్చాక ఉద్యోగం దొరకలేదు. నా వయసు వాళ్లందరికీ పిల్లలు కలిగినా మాకు కలగలేదు. సొంత ఇల్లు కూడా లేదు. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి. నెలసరి సక్రమంగా రాని కారణంగా చెక్ చేయించుకుంటే బ్రెయిన్లో ట్యూమర్ ఉందని, అందుకే నెలసరి సరిగ్గా రావడం లేదన్నారు. ఇన్ని సమస్యల నడుమ సాయి దయ ఏమిటంటే, ఆ ట్యూమర్ మాత్రలతో తగ్గించగలిగేదని డాక్టర్లు చెప్పడం. నేను డాక్టరు ఇచ్చిన మందులు వాడటం ప్రారంభించి, 2022 నుండి 2025 వరకు నా జీవితంలో పెద్దగా ఎలాంటి మార్పు లేకుండా గడిచిపోయినప్పటికీ నేను సాయిని ప్రార్థించడం ఆపలేదు. చివరికి 2025, జూలైలో రెగ్యులర్ చెక్‌ప్ కోసం MRI స్కాన్ చేయించుకున్నప్పుడు ట్యూమర్ పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు. అప్పుడు నాకు సహాయం చేస్తున్నది బాబానే అని స్పష్టంగా అనిపించి ఆయన మీద నాకు నమ్మకం మరింత పెరిగింది.
తర్వాత 2025, డిసెంబర్లో ఎవరూ ఊహించని విధంగా మేము ఒక ఇల్లు కొనుగోలు చేసాము. ఆ రోజే నేను మా కొత్త ఇంట్లో పెద్ద సాయిబాబా ఫోటో తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. గృహప్రవేశం కోసం తేదీ నిర్ణయించుకున్నాక కొత్త ఇంటికోసం షాపింగ్ అంతా ఇండియాలో చేశాను. ఆ క్రమంలో సాయి లీలలు ఎలా అనుభవమవుతుండేవి అంటే, నేను ఏం ఆర్డర్ చేసినా ఎక్కువ వస్తువులు డెలివరీ అవుతుండేవి. మార్కెట్లో 15–20 వేల రూపాయల విలువ ఉన్న కొండపల్లి బొమ్మలు నాకు కేవలం 3–4 వేలకే లభించాయి. అంతేకాదు, నేను ఆర్డర్ చేయని కొన్ని బొమ్మలు కూడా వచ్చాయి. నగలు ఆర్డర్ చేస్తే, అవి రెండేసి వచ్చాయి. చాలా వస్తువులు తక్కువ ధరలో, ఎక్కువ నాణ్యతతో వచ్చాయి. ఇంకా నేను ఆర్డర్ చేయనివి కూడా వచ్చాయి. ఇది అంతా సాయి దయ అని నేను చాలా ఆనందించాను. ఇలా జరుగుతుండగా నేను బాబా ఫోటో కొనాలని నా భర్తకి చెప్తే, "ఇప్పుడేం అవసరం లేదు. తర్వాత చూద్దాం” అన్నారయన. నా మనసులో మాత్రం వెంటనే కొనాలని ఉన్నా నా భర్త మాటకి విలువిచ్చి కొన్నిరోజులకోసం వాయిదా వేసాను. చెప్పాలంటే, ఆ సమయంలో నేను సాయిని కొంచెం వెనక్కి నెట్టాను. అప్పటివరకు బాబా చూపిన ప్రేమ మాత్రమే చూసిన నేను, ఆ తర్వాత ఆయన కోపం ఎలా ఉంటుందో అనుభవించాను. ఆ రోజు నుండి నేను చేసే ప్రతి పనిలో అడ్డంకులు మొదలయ్యాయి. ఆన్లైన్లో బట్టలు ఆర్డర్ చేస్తే డబ్బులు కట్ అయి కూడా డెలివరీ అయ్యేవి కాదు. గాజులు ఆర్డర్ చేస్తే, షాపువాళ్ళు స్పందించడం మానేశారు. ఇంకో షాపులో నగలు ఆర్డర్ చేస్తే అవుట్ ఆఫ్ స్టాక్ అని పంపలేదు. బొమ్మలు ఆర్డర్ చేస్తే ట్రాన్స్‌పోర్ట్‌లోనే ఆగిపోయాయి. ఇలా ప్రతిరోజూ ఏదో ఒక సమస్య వస్తుండేది. అప్పుడు నాకు, 'ఇది బాబా కోపం' అని అర్థమైంది. వెంటనే నేను బాబా ఫోటో కోసం వెతకడం ప్రారంభించాను. అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో శిరిడీకి చెందిన ఒక గిఫ్ట్ స్టోర్ కనిపించింది. అక్కడి నుండే ఫోటో కొనాలని నిర్ణయించుకున్నాను. ఆ తరువాత సమస్యలు కాస్త తగ్గుతూ పరిస్థితి కుదుటపడటం ప్రారంభమై, బాబా ఫోటో ఆర్డర్ చేసిన తరువాత అన్ని సమస్యలు సర్దుకున్నాయి.
శిరిడీ నుండి బాబా ఫోటో వచ్చాక గృహప్రవేశం నిమిత్తం మా అమ్మానాన్న యుఎస్ రావడానికి టికెట్లు బుక్ చేయాలనుకుని వాళ్లకు అది మొదటి అంతర్జాతీయ ప్రయాణం అయినందున "వాళ్లు సురక్షితంగా రావాల"ని సాయిని వేడుకున్నాను. సాయి ఎంత పెద్ద సహాయం చేసారంటే, — మొదట మేము 2026, ఫిబ్రవరి 28కి టికెట్లు బుక్ చేయాలనుకున్నప్పటికీ ధర ఎక్కువగా ఉండడంతో 2026, ఫిబ్రవరి 27కి బుక్ చేసాము. అమ్మవాళ్ల మొదటి అంతర్జాతీయ ప్రయాణం సాఫీగా జరిగి యుఎస్‌లో ల్యాండ్ అయిన వెంటనే 'ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ మధ్య యుద్ధ వాతారవరణం నెలకొందని, దుబాయ్‌లో అన్ని ఫ్లైట్లు ఆపేశారని తెలిసింది. ఒకవేళ మేము 28కి టిక్కెట్లు బుక్ చేసి ఉంటే, మా అమ్మానాన్న రాలేకపోయేవారు. గృహప్రవేశానికి కావలసిన సామాగ్రి అంతా వాళ్ల దగ్గరే ఉన్నందున మేము చాలా ఇబ్బందిపడాల్సి వచ్చేది. బాబా అంత పెద్ద క్లిష్ట పరిస్థితి నుండి కాపాడి 'నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను' అని ప్రత్యక్ష నిదర్శనమిచ్చారు. ఆయన దయతో ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరిగింది. కానీ శిరిడీ నుండి వచ్చిన బాబా ఫోటోను నేను ఇంట్లో వెంటనే పెట్టలేదు. అందువల్ల బాబా నాపై ఇంకా కోపంగా ఉన్నారేమో! మేము చేయని తప్పులకు మా డబ్బులు పోతుండేవి. ఎవరిని అడిగినా సహాయం దొరకలేదు. అప్పుడు నాకు బాబా ఫోటో పెట్టకపోవడమే కారణం అని స్పష్టంగా అర్థమైంది. అప్పటికి ఉగాది పండుగ దగ్గర పడటంతో ఆ రోజు బాబా ఫోటోను ఇంట్లో ప్రతిష్టించాము. ఆ తర్వాత సమస్యలు క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. ఇదంతా బాబా చూపించిన ప్రత్యక్ష లీల. ఇప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలున్నా, బాబా దయతో అన్నీ సర్దుకుంటాయని నాకు పూర్తి నమ్మకం ఉంది. "ధన్యవాదాలు బాబా. ఇలా ఎప్పటికీ మీ దయ అందరిపై ఉండాలి. త్వరలో మాకు సంతానం ప్రసాదిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాము తండ్రీ".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

Om Sai ram
ReplyDeleteఓమ్ సాయిరాం. సాయి లీల చాలా బాగుంది. మనకి సాయిరాం పట్ల శ్రద్ధ, సబూరి ఉన్న మన జీవితం పూల పానుపు అవుతుంది. సాయి దీవెనలు ఉన్నా ఇ.
ReplyDeleteOm Sai baba very nice experience. Om Sai ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram tandri, ofce lo unna samasyalu anni teeri nenu anukunnattu unde project loki vellela chesi naaku manashanti ni ivvandi baba pls, vachi shirdi darshanam chesukuntanu.
ReplyDeleteom sai ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Omsairam
ReplyDeleteOm Sairam 🙏🙏🙇🙇
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu house koni pettandi baba
ReplyDelete