సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1080వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నిజంగా బాబా ఉన్నారు - వేడుకున్నంతనే అనుగ్రహిస్తున్నారు
2. రానున్న సమస్యకు ముందుగానే సందేశమిచ్చిన బాబా
3. తొందరగా కోలుకునేలా అనుగ్రహించిన బాబా

నిజంగా బాబా ఉన్నారు - వేడుకున్నంతనే అనుగ్రహిస్తున్నారు


ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. 2022, జనవరి రెండవ వారంలో ఒకరోజు నేను బాబా ముందు నిలుచుని, "బాబా! మేము ఏమన్నా మొక్కులు మర్చిపోయి ఉంటే, వాటిని గుర్తు చేయండి. అలాగే ఆ మొక్కులు తీర్చుకునే శక్తినివ్వండి. మొక్కులు తీర్చుకోనందుకు అనేకానేక క్షమాపణలు" అని వేడుకున్నాను. మరుసటిరోజు మా అత్తయ్యగారు మాటల్లో తను మొక్కుకున్న ఒక మొక్కు గురించి చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రెండు రోజుల తర్వాత ఇంకో మొక్కు గురించి చెప్పారు. నాకు పెళ్ళై రెండు సంవత్సరాల రెండు నెలలు అయింది. ఇంతకాలంగా మొక్కుల గురించి ఎప్పుడూ చెప్పని అత్తయ్య హఠాత్తుగా బాబాని వేడుకున్నంతనే చెప్పడం బాబా అనుగ్రహానికి నిదర్శనం. నిజంగా బాబా ఉన్నారు.


2022, జనవరి నెల చివరి వారంలో మా అత్తయ్యగారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎప్పుడూ ఉల్లాసంగా ఆఫీసు పని, ఇంట్లో పని చేసుకునే ఆమె ఒక్కసారిగా గృహనిర్బంధంలోకి వెళ్లడంతో ఇల్లంతా బోసిపోయి ఏదో తెలియని ఆందోళన మొదలైంది. ఇంకా ఆపరేషన్ అయి 3 నెలలు కూడా పూర్తి అవ్వని నేను పనులన్నీ చేసుకోవాల్సి వచ్చింది. నా బాబా దయవల్ల నా భర్త, మా మామయ్యగారు మంచివాళ్ళు అవటం వలన నాకు చాలా సహాయం చేసారు. అయితే మా ఇంట్లో వయస్సు పైబడిన మావారి నాన్నమ్మ ఉన్నారు. ఆవిడకి రెండు కళ్ళు కనపడవు. ఆమెకోసం పనిమనుషులు ఉన్నారు. వాళ్ళకి టిఫిన్లు, కాఫీలు చేయడం, మూడు నెలలు కూడా నిండని మా పాపని చూసుకోవడం వంటి వాటివల్ల నాకు కాస్త కష్టంగా అనిపించింది. అప్పుడు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు గుర్తొచ్చి, 'అత్తయ్యకి కరోనా తగ్గి ఇంకా ఎవరికీ  ఆ మహమ్మారి అంటుకోకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. అంతే, ఆ మరుసటిరోజు మా అత్తయ్యగారికి వచ్చింది 'కరోనా కాదు, ఒమిక్రాన్ అని, దానివల్ల అసలు భయమే లేదు' అన్నారు. తరువాత అది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు అత్తయ్య మునుపటిలా చక్కగా ఆఫీసుకి వెళ్లొస్తున్నారు. ఇంకా ఇంట్లో ఎవరికీ ఆ ఒమిక్రాన్ అంటుకోలేదు. ఇదంతా బాబా దయవల్లనే.


అత్తయ్యగారికి కరోనా ఉన్న సమయంలో పగలంతా మా పాప పడుకునేది. ఆ సమయంలో నేను ఇంట్లో పని చేసుకునేదాన్ని. అయితే పగలు నిద్రపోవడం వల్ల పాప రాత్రిళ్ళు నిద్రపోయేది కాదు. అందువలన నాకు రాత్రి నిద్ర ఉండక పగలు బాగా అలసటగా ఉంటూ నిద్ర వస్తుండేది. అలా మూడురోజులు గడిచాక నాల్గవరోజు రాత్రి నేను, "బాబా! మీ ఊదీ పాపకి పెడుతున్నాను. పాప కనీసం 4 గంటలైనా నిద్రపోవాలి. అలా జరిగితే నేను కూడా నిద్రపోయి పొద్దున్న ఉల్లాసంగా పని చేసుకోగలుగుతాను. నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకుని కొద్దిగా ఊదీ పాపకి పెట్టాను. అంతే ఆరోజు పాప చక్కగా నిద్రపోయింది. నేను కూడా నిద్రపోయాను. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. మా పాప ఆరోగ్యం బాగు అయ్యేట్టు చూడండి. నా బిడ్డకు పూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించండి".


రానున్న సమస్యకు ముందుగానే సందేశమిచ్చిన బాబా


సాయి బంధువులకు నమస్కారం. నా పేరు గోష్టేశ్వరి. నాకు మళ్ళీ ఇంత త్వరగా నా అనుభవాలను పంచుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మధ్య ఒకరోజు బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు, "ఆమెకు నయమవుతుంది. నువ్వేమీ దిగులు చెందకు. నా ఊదీ నీళ్లలో కలిపి ఇవ్వు చాలు" అన్న సందేశం కనిపించింది. అయితే అప్పటికి మా ఇంట్లో అందరమూ బాగానే ఉన్నందున నేను ఆ మెసేజ్ నాకు కాదేమో అనుకున్నాను. కానీ ఆ రోజు రాత్రి 2 గంటల సమయంలో మా పాపకు విపరీతమైన జ్వరం వచ్చింది. నాకు భయమేసి బాబాను ప్రార్థించి పాపకి టాబ్లెట్ ఇచ్చాను. మరుక్షణం ఉదయం బ్లాగులో కనిపించిన మెసేజ్ గుర్తుకు వచ్చింది. వెంటనే ధైర్యం తెచ్చుకుని పాపకి ఊదీ కలిపిన నీళ్ళు ఇచ్చాను. అంతే, పాపకి జ్వరం తగ్గి మళ్ళీ రాలేదు. ఇదివరకు చెప్పానుగా 'నా బాబా నన్ను అడుగడుగునా కాపాడుతున్నార'ని. కానీ నాకు టెన్షన్ ఎక్కువని బాబాకి తెలుసు. కాబట్టే ముందుగా "నువ్వేమి దిగులుకు చెందకు" అని చెప్పారు. "ఇలా నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతున్న మీకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే బాబా!".


ఈ మధ్య మా ఫోన్ ఒకటి కనిపించలేదు. కాల్ చేస్తే, 'కవరేజ్ ఏరియా'లో లేదని వస్తుండేది. ఆ ఫోన్ కోసం రెండు రోజులు ఎంత వెతికినా అది కనిపించలేదు. అప్పుడు మా పాప, "ఫోన్ దొరికితే, మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకుంది. తర్వాత బాబా దయవల్ల ఫోన్ దొరికింది. "ధన్యవాదాలు తండ్రీ! ఎన్ని జన్మలైనా నేను మీ బిడ్డగానే పుట్టాలి. ఇంకా నా తప్పులు ఏవైనా ఉంటే మన్నించండి బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


తొందరగా కోలుకునేలా అనుగ్రహించిన బాబా


సాయిభక్తులకు బాబా ప్రసాదించిన తమ అనుభవాలను సోదర సాయిభక్తులతో   పంచుకునే అద్భుత అవకాశాన్నిచ్చిన సాయికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాయిభక్తులందరికీ నా వినయపూర్వక ప్రణామాలు. నాపేరు బాలాజీ. నేను సాయిభక్తుడిని. ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకునే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు మరో అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇటీవల ఒమిక్రాన్ వైరస్ భయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, మేము దానికి మినహాయింపు కాదు. భయపడినట్లే మొదట నా కొడుకు తరువాత నేను అనారోగ్యం పాలయ్యాము. మేము ముఖ్యంగా వయసుపైబడిన నా తల్లిదండ్రుల గురించి భయపడి సామాజిక దూరాన్ని పాటిస్తూ ఒంటరిగా గదిలో ఉండసాగాము. అయినప్పటికీ ముందు మా అమ్మ, తరువాత మా నాన్న కూడా అనారోగ్యం పాలయ్యారు. అప్పుడింక ఒమిక్రాన్ లక్షణాలు తెలుసుకుని, మన ప్రియమైన సాయిమహరాజ్‌ని, "ఎక్కువ బాధకలగకుండా తొందరగా నా తల్లిదండ్రులకు ఉపశమనం చేకూర్చండి బాబా. అదే జరిగితే మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని హృదయపూర్వకంగా ప్రార్థించాను. నా ప్రార్థనను సాయిమహరాజ్ ఆమోదించి నా తల్లిదండ్రులు ఎక్కువ బాధపడకుండా చాలా త్వరగా కోలుకునేలా చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. బాబాకి మాటిచ్చినట్లు నేను ఈ అనుభవాన్ని నా ప్రియ సోదర సాయి భక్తులతో ఇప్పుడిలా పంచుకున్నాను. సాయిమహరాజ్‍కి నా వినయపూర్వక నమస్కారాలు.


శ్రీసమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై!!!



7 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om sai ram ��

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  4. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to pass and get good grades Jaisairam

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞BABA nannu kuda YE apadala nundi kapadu tandri please help me baba 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  7. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo