సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1066వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మనకు మంచిదైతే తప్పకుండ అనుగ్రహిస్తారు బాబా
2. బాబా దయ
3. కోరుకున్న విధంగా అనుగ్రహిస్తారు బాబా

మనకు మంచిదైతే తప్పకుండ అనుగ్రహిస్తారు బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను సాయి భక్తురాలిని. సంవత్సరం క్రితం మేము ఇల్లు మారాము. అప్పుడు మా సామాన్లన్నీ మా నాన్న ఒక ట్రాలీ ఆటోలో ఎక్కించి కొత్త ఇంటికి బయలుదేరారు. నాన్న మధ్య దారిలో ఒక హోటల్లో ఆగి టిఫిన్ చేసారు. ఆపై కొత్త ఇంటికి వెళ్లి ఆటోలో సామాన్లన్నీ దింపేసి వెళ్లిపోయారు. ఒక వారం తరువాత చూస్తే, ఒక బాక్స్ కనిపించలేదు. అందులో చాలా బట్టలున్నాయి. నాన్న మధ్య దారిలో టిఫిన్ చేయడానికి హోటల్ వద్ద ఆగినప్పుడు ఎవరో ఆ బాక్స్ తీసుంటారు అని మేము అనుకున్నాము. అవి పోయినందుకు నాకు ఏమీ బాధ లేదు కానీ ఒక సంవత్సరం తరువాత, "బాబా! మా బట్టలు మాకు దొరికేలా చేయి తండ్రి" అని బాబాను వేడుకున్నాను. అవి ఎలాగూ దొరకవని తెలిసి కూడా నేను బాబాను "దయతో దొరికేలా చేయమ"ని అడిగినప్పటికీ ఆయన దయ చూపారు. ఈ మధ్య ఇంటికి పెయింటింగ్ చేస్తున్నప్పుడు పైన అటకలో ఆ బట్టలు దొరికాయి. అసలు విషయమేంటంటే, ఇల్లు మారినప్పుడు వంటగదిలో అదనంగా ఉన్న సామాన్లన్నీ ప్యాక్ చేసి అమ్మ వాళ్ళింట్లో వేయాలని అనుకున్నాము. వాటితోపాటు పొరపాటున బట్టలున్న బాక్స్ కూడా వెళ్ళిపోయింది. ఏదేమైనా బాబా ఆశీర్వాదంతో దొరకవనుకున్నవి దొరికాయి. "బాబా! మీరే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, అన్నీ. దయతో మా బట్టలు మాకు దొరికేలా చేసిన మీకు చాలా చాలా ధన్యవాదాలు". 


ఒకసారి మేము మా ప్లాటు ఒకటి అమ్మదలచి రిజిస్ట్రేషన్ కోసం తేదీ నిర్థారించుకున్నాము. అయితే రిజిస్ట్రేషన్ జరగాల్సిన తేదికి రెండురోజుల ముందు నుండి ఆ ప్లాటుకి సంబంధించిన పేపర్ల కోసం ఎంతలా వెతికినా రిజిస్ట్రేషన్ అనుకున్న రోజు మధ్యాహ్నం వరకు దొరకలేదు. దాంతో ఆరోజు రిజిస్ట్రేషన్ ఆపేసి పేపర్లు దొరికాక చేద్దామని అనుకున్నారు. నిజానికి ఆ పేపర్లు కనపడటంలేదన్న విషయం నాకు అప్పటివరకు తెలీదు. ఆరోజు మధ్యాహ్నమే నాతో చెప్పారు. నేను వెంటనే, "బాబా! పేపర్లు దొరికేలా చేసి రిజిస్ట్రేషన్ జరిగేలా చూడండి తండ్రి" అని బాబాను వేడుకున్నాను.  బాబా చేసిన అద్భుతం చూడండి. రెండురోజులుగా దొరకని పేపర్లు బాబాను ప్రార్థించిన 15 నిమిషాల్లో దొరికాయి. ఇంకా అదేరోజు రిజిస్ట్రేషన్ జరిగింది. "మీ కరుణ గురించి ఏమని చెప్పను బాబా? మీ అశీస్సులు ఎప్పటికీ మాపై ఇలాగే ఉండేలా చూడు తండ్రి".


ఇకపోతే దయతో బాబా మా అమ్మాయికి ఉద్యోగాన్ని అనుగ్రహించారు. ఆ అనుభవం గురించి ఇప్పుడు చెప్తాను. 7 పోస్టులకు 400 మంది పోటీపడితే నా బిడ్డకి 8వ స్థానం వచ్చింది. కొద్దిపాటిలో అవకాశం చేజారిపోయిందని మేము చాలా బాధపడ్డాము. "బాబా! మీరే ఎలాగైనా మా అమ్మాయికి ఉద్యోగం వచ్చేలా చూడాలి తండ్రి" అని బాబాను వేడుకుని ఆయన మీద భారం వేసాము. బాబా మాపై దయ చూపారు. మా అమ్మాయికన్నా ముందున్న 7 మందిలో ఒకరు 'తనకి ఆ ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వచ్చింద'ని వెళ్లిపోయారు. అంతే, ఆ స్థానంలోకి నా బిడ్డను తీసుకున్నారు. బాబా కృపవల్ల తన ట్రైనింగ్ బాగానే జరిగింది. అయితే తర్వాత తనని సదరు పోస్టులోకి తీసుకునే ముందు 'నా బిడ్డ పెర్ఫార్మన్స్ బాగాలేద'ని ఒక మేనేజర్ అంటుండేవారు. అప్పుడు మేము మళ్ళీ బాబాను తలుచుకుని, "ఏమిటిది బాబా? మీరే ఈ సమస్య నుండి కాపాడి నా బిడ్డకి ఉద్యోగం వచ్చేలా చూడాలి తండ్రి" అని వేడుకున్నాము. ఒక నెలలో ఆ మేనేజర్ బదిలీ మీద వేరే చోటుకి వెళ్లిపోయేలా చేసారు బాబా. అలా జరుగుతుందని మేము అస్సలు అనుకోలేదు. మనకు మంచిదైతే ఎవరూ ఊహించని విధంగా బాబా అనుగ్రహిస్తారు. "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండేలా అనుగ్రహించు తండ్రి".


బాబా దయ

శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
 ఓం శ్రీసాయినాథాయ నమః!!! 

సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన చిన్న చిన్న అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఆన్లైన్‌లో చీరలు, డ్రెస్సులు కొంటూ ఉంటాను. ఆ అలవాటు ప్రకారం 2022, జనవరి 5న చీరలు ఆర్డర్ పెట్టాను. వాటి విలువ 6,800 రూపాయలు. అవి పశ్చిమ బెంగాల్ నుంచి రావాల్సి ఉండగా సాధారణంగా ఐదారు రోజుల్లో వచ్చే కొరియర్ 20 రోజులైనా రాలేదు. నేను ఆ చీరలు అమ్మేవాళ్ళకి విషయం తెలియపరిచాను. వాళ్ళు విచారించిన మీదట కొరియర్ అక్కడినుండి నాలుగు రోజులలోనే నెల్లూరు చేరిందని అన్నారు. కానీ కొరియర్ నాకిక్కడ డెలివరీ కాలేదు. నాకు ఆందోళనగా అనిపించి, "బాబా! చీరలు నాకు అందిన వెంటనే బ్లాగులో పంచుకుని మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను" అని మొక్కుకున్నాను. అలా బాబాను ప్రార్థించిన వెంటనే బెంగాల్ కొరియర్ వాళ్ళు స్పందించారు. దాంతో జనవరి 21న నా కొరియర్ నాకు అందింది. నాకు చాలా సంతోషంగా అనిపించి ఈవిధంగా ఈ బ్లాగు ద్వారా బాబాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

ఇకపోతే సాయినాథుని కృప ఎంతటిదో తెలియజేసే మరొ చిన్న అనుభవాన్ని తెలియజేస్తాను. మా అమ్మకు 80 ఏళ్ల వయసు. ఆమెకి కళ్ళు సరిగ్గా కనపడవు, చెవుడు కూడా ఉంది. 2022, జనవరి మూడోవారంలో ఆమెకు బాగా చలి జ్వరం, గొంతునొప్పి వచ్చాయి. ప్రస్తుత కరోనా సమయంలో ఆ లక్షణాలు అంటే మనకు కోవిడ్ అని అనుమానం వస్తుంది కదా! నేను చాలా భయపడి అమ్మకి కోవిడ్ టెస్టు చేయించి, బాబాను శరణువేడి, "బాబా! మీ దయతో అమ్మకి నెగిటివ్ రిపోర్ట్ వస్తే, వెంటనే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుని మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను" అని వేడుకున్నాను. తరువాత 2021, జనవరి 22 రాత్రి 12:30కి అమ్మకి కోవిడ్ నెగిటివ్ అని మెసేజ్ వచ్చింది. అది చూసి నా ఆనందానికి అంతు లేదు. అంతా బాబా దయ. ఆయన దయ లేకుంటే ఈ వయసులో ఆమెకు, మాకు కూడా చాలా సమస్య అయ్యేది. బాబాకు సర్వస్య శరణాగతి చేస్తే ఆయన మనకు తోడుగా ఉంటారు. ఈ విధంగా నా అనుభవాలను ఈ బ్లాగులో పంచుకునే అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.

కోరుకున్న విధంగా అనుగ్రహిస్తారు బాబా

శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!! 

నా చిన్నతనం నుండి నేను బాబా భక్తురాలిని. ఏ చిన్న సమస్య వచ్చినా నేను బాబాను ప్రార్ధించేదాన్ని. ప్రతిసారీ బాబా నా ప్రార్థన మన్నించేవారు. లెక్కలేనన్ని సార్లు ఆయన నాతోనే ఉన్నాను అనే ధైర్యాన్ని కలిగించారు. నేను ఇప్పుడు మీతో పంచుకునే అనుభవం చిన్నదైనప్పటికి బాబా నా ప్రార్థనలు వింటున్నారని తెలియపరచడానికి ఇది ఒక చిన్న నిదర్శనం. 2022, జనవరి మూడో వారంలో హఠాత్తుగా మా అక్కకి ఒళ్లునొప్పులు, జ్వరం వచ్చాయి. కరోనా పరీక్ష చేయిస్తే నెగిటివ్ వచ్చింది. కానీ జ్వరం ఏ మాత్రమూ తగ్గలేదు. నేను ఆరోగ్యపరంగా మా అక్కకి ఇంకేమైనా బాగాలేదోమోనని చాలా భయపడి, "అక్కకి ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండకూడదు బాబా" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల తనకి ఇతర ఆరోగ్య సమస్యలేమీ కాదు. రెండురోజుల తర్వాత మళ్లీ కరోనా పరీక్ష చేస్తే, పాజిటివ్ వచ్చింది. అప్పుడు నేను, "బాబా! మీ దయతో అక్క కరోనా నుండి కోలుకోవాలి. తనకి త్వరగా నెగిటివ్ రావాలి. అలాగే తన కుటుంబంలోని మిగిలిన సభ్యులందరూ బాగుండాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల అక్క త్వరగానే కోలుకుంది. అలాగే తన కుటుంబసభ్యులందరూ బాగున్నారు. నేను బాబాను ఏదైతే కోరుకున్నానో అలానే ఆయన అనుగ్రహించారు. మన ప్రతి ఆలోచన ఆయనకి తెలుసు. మనం కోరుకునేవి మంచి కోరికలైతే బాబా వెంటనే తీరుస్తారు. అదికూడా మనం కోరిన విధంగా అని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. "ధన్యవాదాలు బాబా".


6 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Jaisairam bless me for the IIMC EMBA certificate course. Help me to pass in all module's with above average grade. Bless me in the world of yours Jaisairam

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. Om sai ram baba ma arogya samasyalani tondarga teerchu thandri sainatha pleaseeee thandri

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo