సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1086వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నాతో ఉన్నానని, నా బాధని వింటున్నానని నిదర్శనమిచ్చిన బాబా
2. ఎప్పుడూ మా వెంటే ఉంటూ కోరుకున్న ప్రతిదీ వింటున్నారు బాబా
3. దయతో ఆరోగ్య సమస్యలు తీసేసిన బాబా

నాతో ఉన్నానని, నా బాధని వింటున్నానని నిదర్శనమిచ్చిన బాబా


"పిలవగానే పలికే బాబా, మీకు నా ప్రణామాలు. జన్మజన్మలకు నేను మీకు ఋణపడి ఉంటాను". బాబా భక్తులందరికీ నమస్కారం. బాబా ప్రసాదించిన అనుభవాలను పంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ బాబా మీద నమ్మకాన్ని పెంచుతూ ధైర్యాన్నిస్తున్న ఈ బ్లాగు నిర్వాహకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎప్పటినుంచో బాబా భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకోవాలనుకుంటున్నాను. ఈమధ్య నేను ఒకరోజు అన్ని గ్రూపుల్లో బాబా భక్తుల అనుభవాలను చూసి, "అందరితో పంచుకునే అలాంటి అనుభవాలు నా జీవితంలో ఎందుకు లేవు బాబా? నేను మిమ్మల్ని సరిగ్గా ప్రేమించట్లేదా? నా భక్తి సరిగ్గా లేదా?" అని అనుకున్నాను. అలా అనుకున్న మరుసటిరోజు గురువారం. ఆ రోజు ఉదయం నిద్రలేచేసరికి నా ఇన్స్టాగ్రామ్‍లో నేను అనుసరించే ఒక అమ్మాయి దగ్గర నుండి నాకొక మెసేజ్ వచ్చింది. నిజానికి నేను ఆ అమ్మాయిని ఫాలో అవుతాను కానీ, ఆ అమ్మాయితో మాట పరిచయం లేదు. అంతేకాదు తనకి బాబా అంటే ఇష్టమని కూడా నాకు తెలీదు. అంటే ఎవరు ఏమిటని తెలియకుండానే తను నాకు 'సాయి మహారాజ్ సన్నిధి' గ్రూపు లింక్ పంపి, అందులో జాయిన్ అవ్వమని చెప్తూ, ఈ మెసేజ్ ఎందుకో మీకు పంపాలనిపించింది అని చెప్పింది. తన మెసేజ్ చూడగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను అడగగానే బాబా ఈవిధంగా నా జీవితంలో అద్భుతం చేసి నేను ఉన్నానని, నా భక్తి గురించి తమకు తెలుసని తెలియజేసి తమపై నాకున్న నమ్మకాన్ని పెంచారు. "థాంక్యూ సో మచ్ బాబా".


అదేరోజు ఒక గ్రూపులో ఎవరో 'తాను కోరుకున్న కోరికను సచ్చరిత్ర పారాయణ పూర్తి చేసే లోపు బాబా నెరవేర్చార'ని తన అనుభవాన్ని పంచుకున్నారు. అది నా మనసులో బాగా ముద్రించుకుపోయింది. అప్పటికే నేను ఉద్యోగం మారాలని ప్రయత్నాలు చేస్తూ కొన్ని ఇంటర్వ్యూలకు హాజరై ఉన్నాను. ఒక కంపెనీకి సంబంధించి హెచ్.అర్. రౌండు కూడా పూర్తయింది. కానీ ఆ తరువాత నాకు వాళ్ల నుంచి కాల్ రాలేదు. నేను బాబాపై దృఢమైన నమ్మకముంచి, "బాబా! నేను పారాయణ పూర్తి చేసే లోపు నాకు ఆ కంపెనీ నుండి కాల్ వచ్చేలా చేస్తారని ఆశిస్తున్నాను" అని అనుకుని సచ్చరిత్ర పుస్తకం తెరిచాను. అంతే, "ఉపవాసం చేయొద్ద"ని మెసేజ్ వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఎందుకంటే, ఆ రోజు గురువారమని నేను ఉపవాసం చేస్తున్నాను. ఆ సమయంలో నా ఆనందానికి అవధుల్లేవు. చాలా చాలా సంతోషంగా అనిపించింది. అది బాబా చేసిన ఇంకో అద్భుతం. తరువాత నమ్మకంతో పారాయణ అంతా పూర్తి చేసి, 'ఓం సాయిరామ్' అని 1116 సార్లు చెప్పుకుని, బాబాకి నమస్కారం చేసుకుని ఫోన్ చూస్తే నేను హెచ్.ఆర్ రౌండు పూర్తి చేసిన కంపెనీ నుండి వచ్చిన మిస్డ్ కాల్ కనిపించింది. నేను మొత్తం పారాయణ పూర్తి చేయడానికి 5 నిమిషాల ముందే ఆ మిస్డ్ కాల్ వచ్చినట్లు ఉంది. వెంటనే నేను ఆ కంపెనీవాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడానికి ముందు ఇంకో రౌండు ఉందని చెప్పడానికి కాల్ చేశామని చెప్పారు. అలా బాబా తామున్నామని ఇంకోసారి నా నమ్మకాన్ని బలపరిచారు. "చాలా  చాలా ధన్యవాదాలు బాబా. మీ లీలల గురించి ఏమని చెప్పగలం తండ్రి? 'నాకు అనుభవాలు ప్రసాదించరా?' అని మిమ్మల్ని అడిగినంతనే ఒక్కరోజులో ఎన్ని లీలలు చేసి చూపించావయ్యా బాబా. ప్రతిక్షణం, ప్రతి విషయంలో మీరు నాతో ఉన్నానని, నా బాధని వింటున్నానని నిదర్శనమిచ్చావు తండ్రి. ఇది చాలు బాబా".


బాబా చేసిన ఇంకో అద్భుతం గురించి ఇప్పుడు చెప్తాను. ఒకరోజు ఉదయం నిద్రలేస్తూనే నాకు బాగా కడుపునొప్పిగా ఉండి విరోచనాలు మొదలయ్యాయి. మధ్యాహ్నం వరకు చూసి తగ్గకుంటే డాక్టరుని పిలిచి టాబ్లెట్స్ తీసుకుందామనుకుని బాబాను ప్రార్థించాను. వెంటనే నాకు బాబా చరిత్ర పారాయణలో చదివిన ఒక కథ గుర్తు వచ్చింది. అదేమిటంటే, విరోచనాలతో బాధపడుతున్న ఒక భక్తునికి బాబా వేరుశెనగ పప్పులు ఇచ్చి తినమని చెప్తారు. అవి తినగానే అతనికి విరోచనాలు తగ్గిపోతాయి. వెంటనే నేను బాబా మాటలపై విశ్వాసముంచి మా ఇంట్లో ఉన్న వేరుశెనగ పప్పులు తీసుకుని తిన్నాను. ఆశ్చర్యంగా అవి తిన్నంతనే నాకు విరోచనాలు, కడుపునొప్పి రెండూ తగ్గిపోయాయి(నేను కనీసం ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు). ఆ క్షణం నాకు బాబా మీద నమ్మకం ఇంకా ఇంకా పెరిగింది. బాబా అనుగ్రహానికి ఆనందంతో నా మనసంతా నిండిపోయింది. "బాబా! నా జీవితంలో ఉన్న సమస్యలన్నీ మీకు తెలుసు. మీరే ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తారని మిమ్మల్నే నమ్ముకున్నాను. ఒక దారి చూపించి నా మనసుకి నచ్చినట్లు చేయి తండ్రి".


ఎప్పుడూ మా వెంటే ఉంటూ కోరుకున్న ప్రతిదీ వింటున్నారు బాబా


సాయి బంధువులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. మేము దుబాయ్‌లో ఉంటున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరికీ కారు ఉండడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. అయితే ఇక్కడ కారు లైసెన్స్ తెచ్చుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. మావారికి కూడా కొన్ని కఠిన పరీక్షలు ఎదురుకున్నాకే కారు లైసెన్స్ వచ్చింది. లైసెన్స్ వచ్చిన తరువాత కారు తీసుకుందామంటే ఏ కారు చూసినా మావారికి పెద్దగా నచ్చేది కాదు. ఆయన ప్రతిరోజూ కార్లు చూడడానికి వెళ్లి నిరాశతో ఇంటికి తిరిగి వచ్చేవారు. చివరికి 2022, జనవరి 27, గురువారంనాడు నేను, "బాబా! మా బడ్జెట్‌కి తగినట్లు అన్నివిధాల మాకు నచ్చే కారు దొరికేలా అనుగ్రహించండి. మీ దయతో వచ్చే గురువారం కారు వచ్చేలా దయ చూపండి" అని బాబాని వేడుకున్నాను. ఆశ్చర్యం! ఎప్పుడూ మా వెంటే ఉంటూ, కోరుకున్న ప్రతిదీ వింటున్నారనేలా నేను అడిగినట్లే మరుసటి గురువారం అంటే ఫిబ్రవరి 3న మేము అనుకున్న బడ్జెట్‍లో మాకు కారు దొరికింది. నా ఆనందాన్ని వెంటనే మీతో పంచుకోవాలనిపించి క్షణం కూడా ఆగకుండా నా అనుభవం వ్రాసి బ్లాగుకు పంపాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహానికి మేము, మా పిల్లలు చాలా సంతోషించాము బాబా".


బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


దయతో ఆరోగ్య సమస్యలు తీసేసిన బాబా


నా పేరు శ్రీలక్ష్మి. 2022, జనవరి నెల చివరిలో మా పెదనాన్న మా అక్కవాళ్ళని తీసుకుని రావడం కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడినుండి వచ్చిన మరుసటిరోజు నుండి తలనొప్పి, దగ్గ, బాగా నీరసంతో ఆయన ఆరోగ్యం బాగాలేదు. మూడురోజులు అయినా తగ్గలేదు. దాంతో మాకు ఈ కోవిడ్ సమయంలో ఆయనకి ఏమవుతుందోనని భయమేసింది. 2022, ఫిబ్రవరి 1న ఆయనకి 101 డిగ్రీల జ్వరం కూడా ఉండేసరికి మాకు మరింత భయంగా అనిపించింది. అప్పుడు నేను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేస్తే, అందులో ఒక భక్తురాలు తన బాబుకి జ్వరమొస్తే, 'మరుసటిరోజు ఉదయానికి తన బాబుకి జ్వరం తగ్గించమ'ని బాబాను వేడుకున్నానని, ఆయన దయవల్ల మరుసటిరోజుకి తన బాబుకు జ్వరం నుండి ఉపశమనం లభించిందని పంచుకున్నారు. అది చదివిన నేను, "బాబా! రేపటికి మా పెదనాన్నకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు" అని అనుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి పెదనాన్నకు తగ్గింది. "బాబా! మీకు శతకోటి నమస్కారాలు".


జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!



7 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. Eumaxindia specializing in Radio Advertising like suryan fm,redfm,big92.7fm,radio city,hello106.4fm.we are provides all types of online radio advertising.

    Radio ad agency in Chennai

    ReplyDelete
  6. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo