1. ఆరోగ్య ప్రదాత శ్రీసాయి
2. మా క్షేమాన్ని చూసుకుంటున్న బాబా
3. బాబా కృపతో తగ్గుముఖం పట్టిన స్పాండిలైటిస్
ఆరోగ్య ప్రదాత శ్రీసాయి
అందరికీ నమస్తే. నా పేరు అంజలి. ఈ మధ్య బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఇదివరకు మా బాబు కుడికన్నుకి ఆపరేషన్ జరిగింది. 2022, జనవరి రెండవ వారంలో మొదలై పదిరోజుల పాటు సరిగా సర్జరీ జరిగిన చోట ఆ కన్ను ఎర్రగా అవుతుండేది. మాకు భయమేసి గుంటూరు హాస్పిటల్లోని డాక్టరుకి చూపించాలని అనుకున్నాము. అనుకున్నట్లే పండగ హాలిడేస్ అవుతూనే బాబుని గుంటూరు తీసుకుని వెళ్లి డాక్టరుకి చూపించాము. ఆ డాక్టరు ఐ డ్రాప్స్ ఇచ్చి, "దీనితో తగ్గకపోతే, కన్ను స్కాన్ చేద్దాం" అన్నారు. అప్పుడు నేను బాబాని, 'ఎలాగైనా ఐ డ్రాప్స్ తో బాబుకి తగ్గిపోయేలా చూడమ"ని వేడుకున్నాను. బాబా దయవల్ల మా బాబు కంటి సమస్య తగ్గిపోయింది.
నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అయితే నా ఆరోగ్యరీత్యా డాక్టరు నన్ను స్వీట్లు తినొద్దని చెప్పారు. కానీ నేను వాటిని తినటం మానలేకపోతున్నాను. ఎన్నోసార్లు స్వీట్లు తిననని బాబాకి మాట ఇచ్చాను. ఎందుకంటే, అలాగైనా వాటిని తినకుండా ఉంటానని. కానీ నావల్ల కావడం లేదు. 2022, సంక్రాంతి పండగకి మా సొంత ఊరు వెళ్లి అక్కడ అరిసెలు తిన్నాను. ఇంక అంతే, పండగ తరువాత అక్కడి నుండి తిరిగి వచ్చినప్పటి నుండి నాకు విపరీతంగా జలుబు, ఒళ్లునొప్పులు మొదలయ్యాయి. ప్రయాణం వల్ల అయుంటుందని నేను పెద్దగా పట్టించుకోలేదు. అయితే రెండు రోజులైనా తగ్గలేదు. పైగా చలి ఎక్కువగా ఉన్నందువల్ల ఆయాసం కూడా ఉందేమో అనిపించింది. అలా అనిపించడానికి కారణమేమిటంటే, కొన్ని సంవత్సరాల క్రితం నేను చదువుకునే రోజుల్లో చలికాలంలో నాకు తరుచుగా కొద్దిపాటి జలుబు వచ్చినా ఆయాసం వస్తుండేది. కానీ ఐదు సంవత్సరాల నుండి బాబా దయవల్ల ఆ ఆయాసం చాలావరకు తగ్గింది. అయితే మళ్లీ ఇప్పుడు ఆ సమస్య వచ్చిందేమో అనిపించి ఆయుర్వేద మందు వేసుకున్నాను. తరువాత ఆక్సిజన్ లెవల్స్ చూసుకుంటే 96 ఉంది. నాకు ఎప్పుడూ ఆక్సిజన్ లెవెల్స్ అంతలా తగ్గలేదు. చివరికి నాకు కోవిడ్ వచ్చినపుడు కూడా నా ఆక్సిజన్ లెవెల్స్ 98 లేక 99 ఉండేవి. అందువలన నాకు కొంచం టెన్షన్‍గా అనిపించి, "బాబా! నాకు తొందరగా నయమయ్యేలా అనుగ్రహించండి" అని బాబాకి చెప్పుకుని ఆయన మీదనే భారం వేసాను. 'ఇంట్లో ఎవరికీ ఏమీ కాకూడదని, నాకు తొందరగా తగ్గాలని' సంకల్ప పారాయణ కూడా పెట్టించాను. అప్పుడు, "ఇంగ్లీష్ మందులు వేసుకో" అని బాబా సందేశం ఇచ్చారు. దాంతో మావారు వద్దంటున్నా బాబా చెప్పారని ఇంగ్లీషు మందులు తెచ్చుకుని రెండు రోజులు వేసుకున్నాను. బాబా దయవల్ల నాకున్న ఇబ్బందులన్నీ తగ్గిపోయి నార్మల్ అయ్యాను. ఇంట్లో అందరూ కూడా క్షేమంగా ఉన్నారు.
2022, జనవరి 27 లేదా 28న జలుబు, తలనొప్పితో మావారి ఆరోగ్యం బాగాలేకపోతే నేను బాబాను, "ఎలాగైనా తెల్లారేటప్పటికీ మా వారికి జలుబు, తలనొప్పి తగ్గిపోయేలా చూడండి బాబా" అని వేడుకున్నాను. ఆయన దయవల్ల తెల్లారేటప్పటికీ మావారికి తగ్గిపోయింది. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా".
మా ఆఫీసులో నాకు సహోద్యోగి, సాయి ఇచ్చిన తమ్ముడు ప్రసాద్ వాళ్ళది ఉమ్మడి కుటుంబం. అతను సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ల అత్తగారి ఊరికి వెళ్ళాడు. అతను అటు వెళ్ళగానే అతని తల్లికి జ్వరం, మేనకోడలి కాలు కాలింది, అక్కకి కోవిడ్ అలా ఇంట్లో ఒకటే ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. నేను ఫోన్ చేసినప్పుడు అతను చాలా డల్‍గా ఉన్నాడు. ఇంట్లో ఎవరి ఆరోగ్యమూ బాగాలేదని పండుగ వాతావరణాన్ని అస్వాదించలేకపోతున్నాడు. అప్పుడు నేను, 'వాళ్ళ ఇంట్లో అందరి ఆరోగ్యం బాగైతే, బ్లాగులో పంచుకుంటాన'ని అనుకుని వాళ్ళ అక్క గురించి బాబా గ్రూపులో సంకల్ప పారాయణ చేయించాను. బాబా దయవల్ల ఆమెకి మూడు రోజుల్లో కోవిడ్ నెగిటివ్ వచ్చింది. వాళ్ళ అమ్మకు జ్వరం తగ్గింది. ప్రసాద్ కూడా టెన్షన్ ఫ్రీ అయ్యాడు. "థాంక్యూ బాబా. మీ దయ ప్రసాద్‍వాళ్ళ కుటుంబంలో అందరిమీదా, అలాగే మా అందరి మీదా ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి".
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ మహరాజ్ కీ జై!!!
మా క్షేమాన్ని చూసుకుంటున్న బాబా
సాయినాన్న పాదపద్మములకు శతకోటి వందనాలు. బ్లాగు నిర్వాహకులకు అభినందనలు. మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. 2022వ సంవత్సరంలో మేము సంక్రాంతి పండగకి మా ఊరు వెళ్ళాము. అక్కడ చాలా కరోనా కేసులు ఉన్నాయి. ఊరు నుండి తిరిగి వచ్చాక మావారికి కొద్దిగా జ్వరం, జలుబు వచ్చాయి. ఇంట్లో చాలా పెద్దవాళ్ళు ఉన్నందున చాలా భయమేసింది. అదే కరోనా అయితే మేము ఎవరినైనా కలిస్తే వాళ్ళకి ఏమవుతుందోనని చాలా కంగారుపడ్డాను. అయినా 'మనకి బాబా ఉన్నారు కదా!' అని, "బాబా! ఇది మామూలు జలుబు, జ్వరమే అయుండాలి. తగ్గితే మీ బ్లాగు ద్వారా అందరితో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత నాకు కూడా నలతగా అనిపించింది. రెండు రోజులు కొంచెం ఇబ్బందిగా అనిపించినా బాబా దయవల్ల తగ్గింది. తరువాత మా డ్రైవరుకి కూడా ఆరోగ్యం బాగాలేకపోయింది. తను మాత్రం అందరమూ ఒకేచోట ఉంటున్నాము, ఎందుకైనా మంచిదని కరోనా టెస్టు చేయించుకున్నాడు. అయితే బాబా తన బిడ్డలని కంటికి రెప్పలా కాపాడుకుంటారు కదా! టెస్టు రిపోర్టు నెగిటివ్ వచ్చింది. అది తెలిసి మేము చాలా సంతోషించాము.
ఒక స్థలం విషయంలో కొంచెం సమస్య ఉంటే, "బాబా! ఏ ఇబ్బందీ లేకుండా చేయండి. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. 2021, డిసెంబర్ 31న బాబా దయవల్ల ఆ పని సగం వరకు అయింది. బాబా దయతో మీ అందరి ఆశీస్సులతో మిగిలిన సగం కూడా పూర్తి కావాలని కోరుకుంటున్నాను.
ఈ మధ్య నేను, మావారు కొన్ని టెస్టులు చేయించుకున్నాము. అప్పుడు నేను 'ఆ రిపోర్టులన్నీ నార్మల్ రావాలని, బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా దయవల్ల అన్నీ నార్మల్ వచ్చాయి.
2021, డిసెంబర్ 29న ఒక ఫ్రెండ్‍వాళ్ళ గర్భవతి అయిన కోడలు కడుపునొప్పితో బాధపడుతుంటే, "ఏమీ కాదు.. బాబా ఊదీ పెట్టండి" అని చెప్పాను. వాళ్ళు అలాగే చేసారు. వెంటనే ఆమె కడుపునొప్పి తగ్గిపోయింది. ఏ సమస్యనైనా బాబా చూసుకుంటారు. "బాబా! ఎప్పుడూ ఇలానే మా అందరినీ కాపాడండి తండ్రి. మిమ్మల్ని ఎప్పటికప్పుడు బాగా విసిగిస్తున్నాననుకుంటున్నాను. కానీ మీరే మాకు పెద్ద దిక్కు కదా. విదేశాల్లో ఉన్న పిల్లలందరినీ చల్లగా చూడండి బాబా. తప్పులుంటే క్షమించండి బాబా".
బాబా కృపతో తగ్గుముఖం పట్టిన స్పాండిలైటిస్
ఓం సద్గురు శ్రీసాయినాథాయ నమః!!!
నా పేరు మల్లేశ్వరి. మేము హైదరాబాదులో ఉంటాము. 1983 నుంచి నేను సాయినాథుని పూజిస్తున్నాను. ఆ తండ్రి ఎన్నోసార్లు ఎన్నో ఆపదలు, కష్టాల నుండి నన్ను కాపాడారు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఆ తండ్రి ప్రతిక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడబట్టే. 2021, డిసెంబర్ 12, తెల్లవారుఝామున నాకు తల తిరిగి మైకం కమ్మినట్లు అయ్యింది. చాలా భయంతో బాబాను తలుచుకుని ఉదయం హాస్పిటల్‍కి వెళ్ళాను. డాక్టర్ చాలా టెస్టులు వ్రాసి వాటి ఆధారంగా నాకు 'వర్టిగో' అని అన్నారు. నేను భయంతో బాబాను ప్రార్ధించి, 'ఈ వ్యాధి తగ్గితే బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. ఇంకా "ప్రతిక్షణం ఈ వ్యాధి గురించి తలుచుకుంటూ నా బాధ్యతలేవీ నెరవేర్చట్లేదు సాయీ. దయ చూపించు తండ్రీ" అనుకుని ప్రతిరోజూ రెండుపూటలా పూజ చేసే సమయంలో శిరిడీ ఊదీని నీళ్ళలో కలుపుకుని తీసుకుంటూ ఉండేదాన్ని. డాక్టర్ చెప్పిన మందులు ఒక వారం రోజులు వాడాక మా ఫ్యామిలీ డాక్టరు దగ్గరకి వెళ్లాను. ఆ డాక్టరు మెడకి ఎక్స్ రే తీయించమన్నారు. మా పాప ఎక్స్ రే తీయించింది. రిపోర్టు స్పాండిలైటిస్ అని వచ్చింది. డాక్టరుగారు, "కంగారు పడవద్దు. కొన్నిరోజులు మందులు వాడితే తగ్గుముఖం పట్టే వ్యాధి ఇది, పూర్తిగా తగ్గిపోతుంది" అని అన్నారు. బాబా దయవల్ల ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది. అందుకే బాబాకిచ్చిన మాట ప్రకారం నా అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నాను. ఈ అవకాశమిచ్చిన బ్లాగు వారికి కృతజ్ఞతలు. 2021లో వరసకు కూతురైన దేవి అనే అమ్మాయి ద్వారా నాకు ఈ బ్లాగు గురించి తెలిసింది. అంతకుముందు ఇలాంటి ఒక బ్లాగు ఉంటుందని నాకు తెలియదు. ఈ బ్లాగును పరిచయం చేసిన తనకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. "బాబా! మీ పాదారవిందములకు అనంతకోటి నమస్కరాలు".
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷Na husband ki eye problem nayam cheye tandri please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏arogya kshemam dayakaya namaha, apadbandavaya na aha. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee
ReplyDeleteViswam antha prema, Amanda, mounam tho nindipoyela deevinchu thandri.
ReplyDeleteLoka samastha sukinobavanthu. OM Sai Ram 🙏
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete