సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1068వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ప్రసాదించిన మూడు కానుకలు
2. బాబా తీర్చిన సమస్యలు
3. బాబా ఆశీస్సుల వల్లనే సంతోషం

బాబా ప్రసాదించిన మూడు కానుకలు


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!

శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నా పేరు నిట్టల సూర్యనారాణయమూర్తి. మేము హైదరాబాదులోని విజయనగర్ కాలనీ వాసులం. ప్రియ సాయి భక్తులారా! సాయి భక్తులకు శ్రీ'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ఒక మొక్కులు తీర్చుకునే హుండీ. ఈ హుండీ ప్రత్యేకత ఏమిటంటే, దీనిలో డబ్బులు, నగలు వేయనక్కరలేదు. కేవలం మనం భక్తితో బాబాకు మొక్కుకున్న కోరికలు తీరితే, మనం పొందిన అనుభవాన్ని అంటే బాబా మనపై చూపిన ప్రేమను, అనుగ్రహాన్ని ప్రేమ, వినయములతో ఈ బ్లాగులో కానుకగా సాయినాథునికి సమర్పిస్తే చాలు. ఆ కానుక బాబా ప్రసాదమై తోటి భక్తులకు చేరి వారిని బాబా ప్రేమలో ఓలలాడిస్తుంది. అట్టి మూడు కానుకలను నేను ఇప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను.


నేను పని చేస్తున్న ఆఫీసులో బ్యాంకు విషయాలన్నీ నేనే చూసుకుంటాను. మా యాజమాన్యానికి నా మీద ఎంతో నమ్మకం. వాళ్ళు నేను పంపే బ్యాంకు చెక్కులపై సంతకాలు చేసి మరునాడు నాకు అందజేస్తారు. ఇలా గత 20 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇక ప్రస్తుత అనుభవానికి వస్తే...  2022, జనవరి 10న నేను పంపిన చెక్కులన్నీ తిరిగి వచ్చాయికాని, వాటిలో మూడు చెక్కులు నాకు అందలేదు. బ్యాంకువాళ్ళు క్యాష్ బుక్ క్లోజ్ చేయాలంటే ఆ మూడు చెక్కులు అవసరమని నాపై ఒత్తిడి తెచ్చారు. కానీ అనారోగ్య కారణంగా మా మేనేజ్మెంట్ ఆఫీసుకి రావడం తగ్గించారు, అందుకే నేను ఆ చెక్కులను వాళ్ళింటికి పంపాను. సరే, అవి వాళ్ళింట్లో ఎక్కడైనా మిస్ అయ్యాయేమోనని వాళ్ళింట్లో ఉన్న నౌకర్లకు చెప్పి అంతా వెతికించాను. కానీ ప్రయోజనం లేదు. దాంతో నేను 2022, జనవరి 14న స్వయంగా బ్యాంకుకు వెళ్లి ఆఖరి ప్రయత్నంగా రెండు రోజులు గడువు అడిగి, "2022, జనవరి 17న చెక్కులు పంపిస్తాన"ని చెప్పి వచ్చాను. అదేరోజు రాత్రి బాబా దగ్గర కూర్చుని, "చెక్కులు నాకు దొరికేలా చేయండి బాబా. అలా చేస్తే వెంటనే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకుని నిశ్చింతగా సంక్రాంతి పండుగ చేసుకున్నాను. తరువాత 2022, జనవరి 17న  యథావిధిగా ఆఫీసుకి వెళ్ళాను. ఆరోజు మా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఆఫీసుకి వచ్చారు. వాళ్ళు నాకు కొన్ని ముఖ్యమైన పేపర్లు అందజేస్తుండగా ఆ పేపర్ల కింద ఆ మూడు చెక్కులు కనపడ్డాయి. అది చూసి వాళ్ళు కూడా చాలా బాధపడి, "ఆరోజు హడావుడిలో ఈ మూడు చెక్కులు ఈ పేపర్ల కింద పెట్టి, అలాగే మర్చిపోయి సూట్ కేసులో ఈ పేపర్లతోపాటు పెట్టేసాము. అందుకే ఆలస్యమైంద"ని చెప్పి సంతకాలు పెట్టి ఆ చెక్కులు నాకు ఇచ్చారు. ఇది నిజంగా బాబా నా పట్ల చూపిన కరుణ. బ్లాగులో పంచుకుంటానని బాబాకి మ్రొక్కుకున్న మూడు రోజుల్లో అద్భుతం చేసారు బాబా. లేకుంటే బ్యాంకువాళ్ళ ముందు నాకున్న విలువ పడిపోయేది. మా ఆఫీసులో గత 20 సంవత్సరాలుగా నాపై ఉన్న నమ్మకం పోయేది. "ధన్యవాదాలు బాబా! మీకు మ్రొక్కుకున్నట్లు మీ ప్రేమ లీలను మీ బ్లాగులో పంచుకున్నాను".


ఇకపోతే 30 సంవత్సరాలుగా మా ఆఫీసుకు సంబంధించి ఒక ముఖ్యమైన డాక్యుమెంట్లు కనపడేవి కాదు. అవి అసలు ఉన్నాయో, లేదో కూడా తెలిసేది కాదు. గత 20 సంవత్సరాలుగా నేను వాటి గురించి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ వాటి జాడ దొరికేది కాదు. చివరికి 2022, జనవరి 14న పైన చెప్పిన చెక్కులతోపాటు ఈ డాక్యుమెంట్ల జాడ కూడా తెలియపరచమని బాబాని వేడుకుని, అవి దొరికితే బ్లాగులో పంచుకుంటానని చెప్పుకున్నాను. ఆశ్చర్యంగా 2022, జనవరి 18న ఇన్‍కమ్‍ టాక్స్ ఆఫీసువాళ్ళు ఫోన్ చేసి ఆ డాక్యుమెంట్లు దొరికాయని, తమ దగ్గర ఉన్నాయని, కానీ కొన్ని నిబంధనల ప్రకారం వాటిని త్వరలో అందజేస్తామని చెప్పారు. ఆ డాక్యుమెంట్లు నా చేతికి వస్తే బ్లాగులో తెలియపరుస్తాను.


2022, జనవరి 19, 20 తేదీలలో నాకు కొద్దిగా జలుబు, దగ్గు, జ్వరం ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా గాని, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాకు భయమేసింది. మా ఫ్యామిలీ డాక్టరు, "మందులతో తగ్గుతుంది. భయం లేద"ని చెప్పినా నాకు ఆందోళన తగ్గలేదు. 2022, జనవరి 20న నేను, "బాబా! ఇంతకుముందు నేను బ్లాగుకి పంపిన కాశీయాత్ర అనుభవాలు రేపు అంటే 2022, జనవరి 21న బ్లాగులో వస్తే, నేను ఇంకా భయపడను. ఈ విషయాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఆశ్చర్యంగా మరుసటిరోజు నా కాశీయాత్ర విశేషాలు బ్లాగులో 'సాయిభక్తుల అనుభవమాలిక' 1026వ భాగంలో 'సాయి ఆదేశంతో కాశీలో వ్రతాలు - వారి అనుగ్రహం' అనే టైటిల్‍తో ప్రచురింపబడటం నా సాయి నాకిచ్చిన వరం, నాకు కరోనా కాదని ఇచ్చిన అభయం. అట్టి కరుణామూర్తి సాయికి నా నమస్కారాలు. అతి త్వరలో ఈ కరోనా వ్యాధిని తరిమివేయమని, భక్తులందరినీ చల్లగా చూడమని, ఈ బ్లాగు నిరంతరం సాయి భక్తుల కానుకలతో నిండిపోవాలని బాబాను ప్రార్థిస్తున్నాను.


బాబా తీర్చిన సమస్యలు


శ్రీసమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ఎల్లవేళలా నాకు అండగా ఉండే ఆ సాయినాథునికి నా నమస్కారాలు. మా అనుభవాలను తోటి భక్తులతో పంచుకునేందుకు అనువుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. కాలేజీలో ప్లేస్మెంట్స్ జరిగేటప్పుడు నా కుమారుడు ఎంత బాగా చేసినా చివరి రౌండులో అవకాశాలు చేజారిపోతుండేవి. అప్పుడు నేను బాబా ముందు అగరుబత్తి వెలిగించి, "బాబా! మంచి ప్యాకేజీతో బాబుకి ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాను కోరాను. దయగల సాయి నా కోరికను మన్నించి బాబుకి మంచి ప్యాకేజీతో ఉద్యోగం ప్రసాదించారు. "ధన్యవాదాలు బాబా".


2021, డిసెంబరులో మాకు ఇంకో సమస్య వచ్చింది. 10 సంవత్సరాల క్రితం మేము ఒక స్థలం కొన్నాము. అప్పుడు ఆ స్థలాన్ని మాకు అమ్మిన వ్యక్తి ఆ స్థలం విలువ పెరిగిందని ఇప్పుడు మాకు ఎదురు తిరిగి మమ్మల్ని ఆందోళనకు గురి చేశాడు. తొందరగా అక్కడ గది నిర్మించేంతవరకు ఆ వ్యక్తి కుటుంబం తాగి రావడం, అక్కడ కూర్చోవడం చేస్తుండేవాళ్ళు. అప్పుడు నేను, "బాబా! నువ్వే మాకు దిక్కు" అని బాబాను వేడుకున్నాను. బాబా దయతో ఎలాంటి తగాదాలు లేకుండా ఆ సమస్య సమసిపోయింది. "ధన్యవాదాలు బాబా. ప్రస్తుతం నాకు మరో సమస్య వచ్చింది. మీ దయవలన 25 సంవత్సరాలుగా నా వైవాహిక జీవితం సవ్యంగా నడిచింది. ఉమ్మడి కాపురంలో చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్దగా ఏమీ ఉండేవి కాదు. నాకు కోడలు వచ్చింది. ఈ మధ్య మా అత్తగారితో కొద్దిగా మనస్పర్ధలు ఏర్పడి అన్నదమ్ముల మధ్య, తోడికోడళ్ళ మధ్య కొద్ది దూరం ఏర్పడుతోంది. అన్నదమ్ములు, తోడికోడళ్ళం అందరం కలిసిమెలసి సంతోషంగా ఉండాలనుకునే నా కోరిక సబబైతే నా తండ్రి, ఓ సాయినాథా, నాకు ఎప్పుడు అండగా ఉండే నా బాబా మా మధ్య ఉండే మనస్పర్థలు, అపోహలు తొలగించి తిరిగి మమ్మల్ని ఒకటి చేయి. ఇన్ని రోజులు ఆనందంగా ఉన్నవాళ్ళం ఇప్పుడిలా ఉండడం వలన మనసుకి ప్రశాంతత పోయింది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథా! నా ఈ కోరికను తీర్చి ప్రశాంతతను చేకూర్చవయ్యా. ఈ కోరిక తీరితే బ్లాగులో పంచుకుంటాను బాబా. పెద్ద సమస్యల నుండి మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతున్నావు తండ్రి. ఇది కూడా పరిష్కరించు సాయినాథా. నీ పాదాలే నాకు శరణ తండ్రి. నీవు తప్ప నాకు దిక్కు ఎవరు?".


బాబా ఆశీస్సుల వల్లనే సంతోషం


నేను ఒక సాయి భక్తురాలిని. సాయి బంధువులకి మరియు ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి భక్తులకు నా నమస్కారాలు. నేను ఈ బ్లాగులోని 'సాయిభక్తుల అనుభవమాలిక'లో వచ్చే భక్తుల అనుభవాలు చదువుతుంటాను. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మీతో పంచుకుంటాను. ఒకరోజు మా అమ్మగారికి విపరీతమైన జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మేము చాలా టెన్షన్ పడ్డాం. అదే సమయంలో నేను సాయిభక్తుల అనుభవమాలికలోని అనుభవాలు చదువుతూ బాబా ఊదీ మహత్యం గూర్చి తెలుసుకున్నాను. నేను వెంటనే, "బాబా! అమ్మ ఆరోగ్యం కుదుటపడితే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకుని ఊదీ నీళ్లలో కలిపి అమ్మకి ఇచ్చాను. ఒక్క  గంటలో జ్వరం తగ్గి అమ్మ ఆరోగ్యం కుదుటపడింది. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవం పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా".

  

ఈమధ్య మా డాడీకి ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టరుని సంప్రదించాము. డాక్టరు డాడీకి బైపాస్ సర్జరీ చెయ్యాలని చెప్పారు. మేము చాలా టెన్షన్ పడ్డాం. 2022, జనవరి 21న డాడీని ఐ.సి.యుకి మార్చినప్పుడు నేను సాయిభక్తుల అనుభవమాలిక చదువుతూ, సాయి నామం చెప్పుకుంటూ, సాయిబాబా ఫోటో చూస్తూ బాబాని ప్రార్థించాను. వెంటనే బాబా, "నీకు నేనున్నాను" అని అభయమిస్తూ దర్శనమిచ్చారు. తరువాత బాబా ఆశీస్సులతో డాడీకి చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాము. ఈ సంతోషం బాబా ఆశీస్సుల వలనే. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ కరుణ ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలి తండ్రి".



6 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam and supporting for the IIMC-Executive MBA program

    ReplyDelete
  4. Om sai ram ��

    ReplyDelete
  5. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞BABA na husband eye problem taginchu tandri🙏🙏🙏🙏🙏🙏🙏om arogya kshemadyakaya namaha, om apadbandavaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣👣👣🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo