సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1085వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆందోళన నుండి బయటపడేస్తున్న బాబా
2. గొంతునొప్పి తగ్గించిన బాబా
3. బాబా దయవల్ల కోరుకున్నట్లే గురువారం డెలివరీ అయిన కారు

ఆందోళన నుండి బయటపడేస్తున్న బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. బ్లాగు నిర్వాహకులకు పేరుపేరునా కృతజ్ఞతలు. నా పేరు సౌదామిని. మేము భీమవరంలో నివాసముంటున్నాము. నేను ఇదివరకు కొన్ని అనుభవాలు బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. నాకు ఇదివరకు కరోనా వచ్చి బాబా దయవల్ల తగ్గింది. అయితే పోస్ట్ కోవిడ్ ప్రభావం వల్ల ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను భూతద్దంలో చూసి ఆందోళన చెందడమేకాక అందరినీ కంగారు పెట్టేసేదాన్ని. బాబా దయవలన 3 నెలలకు ఆందోళన తగ్గి నార్మల్ అయ్యాను. చాలారోజుల తరువాత సంక్రాంతి పండగ ముందు మళ్ళీ నాకు అదే సమస్య వచ్చింది. వరుసగా రెండు రోజులు ప్రతి చిన్న విషయానికి ఒత్తిడిగా అనిపించి ఆందోళన చెందుతూ చాలా బాధపడ్డాను. అప్పుడు నేను బాబాకి నా కష్టం చెప్పుకుని, "బాబా! నా సమస్య తగ్గితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. ఆయన దయవలన రెండు రోజుల్లో నేను నార్మల్ అయ్యాను. నా సాయినాథుడు మనతో ఉంటే మనం ఏ ఒత్తిడినైనా, ఆందోళనైనా జయిస్తాం. ఆయన దయవల్లనే నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నా క్షేమాన్ని ఆయనే చూసుకుంటారని నా నమ్మకం. "ధన్యవాదాలు బాబా. నేను జన్మజన్మలందు మీకు ఋణపడి ఉంటాను బాబా".

ఇకపోతే 2022, సంక్రాతి పండుగ రోజు సాయంత్రం నాకు విపరీతంగా కడుపునొప్పితోపాటు వాంతులు కూడా అయ్యాయి. నీళ్లు త్రాగినా కూడా వాంతి అయిపోతుండటం, పొట్ట అంతా ఉబ్బరంగా ఉండడంతో నాకు చాలా భయమేసింది. మరుసటిరోజు నేను ఎప్పుడూ చూపించుకునే హోమియో డాక్టరు దగ్గరకు వెళ్ళి మందులు వేసుకున్నాను. మరుసటిరోజుకి నాకు పూర్తిగా తగ్గిపోయింది. ఈ సమస్య నుండి కూడా నా తండ్రి బాబానే గట్టెక్కించారని నా విశ్వాసం. అందుకే ఈ అనుభవాన్ని కూడా సాయి బంధువులతో పంచుకోవాలనుకున్నాను. ఇంకా అప్పటినుండి నాకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా బాబా నామజపం చేస్తూ అంతా ఆయన చూసుకుంటారనే నమ్మకంతో ఉంటున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము తండ్రి. ఎల్లప్పుడూ నన్ను మీ బిడ్డలా చూసుకుంటున్నావు. మిమ్మల్ని నమ్ముకుంటే చాలు తండ్రి. మా అందరి వెంట ఉండి నడిపిస్తావు. ఆ విషయం నాకు బాగా అర్ధమైంది బాబా". చివరిగా బాబా పాదాలకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ముగిస్తున్నాను.

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!

గొంతునొప్పి తగ్గించిన బాబా

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!

నేను ఒక సాయి భక్తురాలిని. నేను రోజూ ఉదయం నిద్రలేస్తూనే బాబాని చూసి ఆపై నా నిత్యకృత్యాలు చేసుకుంటాను. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా బాబాను తలచుకుంటాను. నాకు తెలియకుండానే ఆ సమస్య తీరిపోతుంది. చాలాసార్లు నేను భయపడుతున్నప్పుడు 'ఏమీ కాదు' అన్న అనుభూతి బాబా కలిగిస్తూ ఉంటారు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి మనఃపూర్వక నమస్సులు. నేను ఎన్నోసార్లు బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు 23వ అనుభవం పంచుకోవడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. 2022, జనవరి నెలాఖరులో నేను మా అక్కయ్యవాళ్ల మనవరాలి పుట్టినరోజు వేడుకకి వెళ్ళాను. ఆ వేడుక అయ్యాక భోజనాలు చేస్తున్నప్పుడు మాంసాహారం తింటుంటే ఒక చిన్న ఎముక నా గొంతుకు రాసుకుపోయింది. దాంతో గొంతు కొంచెం నొప్పిగా అనిపించడంతో నేను తినడం ఆపేసి, లేచి నీళ్లు త్రాగి ఇంటికి వచ్చేసాను. మరుపటిరోజు కూడా నొప్పి ఉంది. నిజానికి నాకు ఎప్పుడయితే ఆ నొప్పి తెలిసిందో అప్పుడే నేను, "బాబా! నాకు ఏమీ కాకూడదు. ఆ ఎముక గీరుకోవడం వల్ల నాకు ఎలాంటి సమస్య రాకూడదు" అని అనుకున్నాను. అయినా మరుసటిరోజు, ఆ మరుసటిరోజు కూడా నొప్పి ఉంది. అప్పుడు, "బాబా! నాకు నొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకుని కొంచం ఊదీ గొంతుకు రాసుకున్నాను. అంతే, బాబా దయవల్ల నొప్పి పోయింది. ఇలాంటి అనుభవాలు బాబా నాకు చాలా ప్రసాదించారు. "బాబా! నేను తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి. సాధ్యమైనంతవరకు నన్ను ఏమైనా అడిగితే ఎవరికీ కాదు అనను, నాకు తోచినంతలో సహాయం చేస్తాను. నాకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేసే అవకాశం కల్పించండి బాబా. సదా మా కుటుంబాన్ని కాపాడండి బాబా".

బాబా దయవల్ల కోరుకున్నట్లే గురువారం డెలివరీ అయిన కారు

సాయి బంధువులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తుడిని. 2021, డిసెంబరు నెలలో మేము ఒక కారు కొనాలనుకుని బాలినో కారుకి అడ్వాన్సు ఇచ్చాము. తరువాత ఒక గురువారంనాడు ఆ కారు డెలివరీ తీసుకోవాలనుకుని అడ్వాన్స్ ఇవ్వగా మిగిలిన మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా బదిలీ చేయదలచాను. అందుకోసం బుధవారంనాడు డబ్బు బ్యాంకులో జమచేసి, ఆపై ఆన్లైన్‍లో షోరూమ్ వాళ్ళకి డబ్బు బదిలీ చేశాను. కానీ షోరూమ్ వాళ్ళు ఆ డబ్బు తమ అకౌంట్లోకి రాలేదని అన్నారు. దాంతో మరుసటిరోజు కారు డెలివరీ తీసుకునేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నేను బాబాని తలుచుకుని, "బాబా! నేను గురువారంనాడు కారు డెలివరీ తీసుకుందామని అనుకున్నాను. కానీ కుదరదేమో సాయి. దయ చూపండి బాబా" అని వేడుకున్నాను. మరుసటిరోజు నేను మళ్ళీ షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే, "డబ్బు మాకు అందింది. 'సాయి' అనే వ్యక్తి మీకు కారు డెలివరీ చేస్తాడ"ని చెప్పారు. మేము చాలా ఆనందించాం. అలా బాబా దయవల్ల మేము కోరుకున్నట్లు గురువారమే కారు మాకు డెలివరీ అయ్యింది. "ధన్యవాదాలు బాబా".


6 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above average grade Jaisairam

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo