1. సాయి ఆశీస్సులు
2. మనసులో అనుకున్నంతనే అనుగ్రహించిన సాయి
3. ఆరోగ్యం చేకూరేలా అనుగ్రహించిన బాబా
సాయి ఆశీస్సులు
నా పేరు సంధ్య. ముందుగా సాయిబంధువులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. ఉదయాన నిద్రలేవగానే ఈ బ్లాగును చూస్తే మనస్సుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇందులోని భక్తుల అనుభవాలు చదువుతుంటే 'సాయితల్లి' ఎప్పుడూ మనతోనే ఉన్నారనిపిస్తుంది. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను ఈ బాబా బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను. మా అమ్మావాళ్ల ఇల్లు కట్టించి చాలా సంవత్సరాలు అవుతున్న కారణంగా ఆ ఇల్లు చాలా పాడైపోయింది. ఎప్పటినుంచో బాగుచేయాలనుకుంటుంటే ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉండేది. అప్పుడు నేను సాయితల్లికి దణ్ణం పెట్టుకుని, "ఇల్లంతా పెయింటింగ్ వేయించాలి బాబా. ఎప్పటినుంచో ఉన్న నా ఈ కోరిక నెరవేరేలా చూడు బాబా" అని వేడుకున్నాను. నా సాయితల్లి నా ప్రార్థన విన్నారు. పెయింటింగ్స్‌తో పాటు కప్‌బోర్డ్స్ కూడా పెట్టించుకునేలా అనుగ్రహించారు.
ఒకసారి అనుకోకుండా మా తమ్ముడు తన స్నేహితులను కలిశాడు. వాళ్ళ ద్వారా మా తమ్ముడికి కరోనా వచ్చింది. నాకెంతో బాధ అనిపించి, "బాబా! తమ్ముడికి ఎటువంటి బాధ లేకుండా త్వరగా తగ్గేలా చూడు తండ్రీ. వాడికి ఆర్.టి.పి.సి.ఆర్ టెస్టులో నెగిటివ్ వస్తే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని సాయితల్లికి మొక్కుకున్నాను. తమ్ముడు 15 రోజులు గృహనిర్బంధంలో ఉన్నప్పటికీ బాబా దయవల్ల కొద్దిపాటి లక్షణాలతో కరోనా నుండి భయపడ్డాడు.
ఒకరోజు రాత్రి అనుకోకుండా మా చిన్నబాబుకు వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. వాటికి తోడు జ్వరం కూడా ఉండేసరికి నాకు చాలా భయమేసి, "బాబా! బాబుకు త్వరగా తగ్గేలా చేయండి తండ్రీ" అని వేడుకున్నాను. తరువాత బాబుని తీసుకుని హస్పిటల్‌కి వెళ్ళి మందులు వాడుతున్నప్పటికీ రెండురోజులైనా విరోచనాలు అవుతూనే ఉన్నాయి. అప్పుడు నేను బాబుకి కొద్దిగా బాబా ఊదీ పెట్టి, మరికొంత ఊదీని నీళ్ళలో కలిపి త్రాగించి, "బాబా! బాబుకి వెంటనే తగ్గితే మీ గుడికి వచ్చి స్వీట్లు పంచుతాను. అలాగే ఈ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. సాయి దయవల్ల రెండు రోజుల్లో బాబు పూర్తిగా కోలుకున్నాడు. "సాయీ! మీకు శతకోటి వందనాలు తండ్రీ".
ఒకరోజు ఎంత వెతికినా నా నల్లపూసలు కనపడలేదు. 'శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామాన్ని చెప్పుకుంటూ నేను, మావారు చాలాసేపు వెతికినప్పటికీ ఆ నల్లపూసలు కనిపించలేదు. అయితే బాబా దయవల్ల ఆరోజు సాయంత్రానికి నా పర్సులోనే నల్లపూసలు కనిపించాయి. సంతోషంగా సాయితల్లికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇలాగే ఒకసారి మా అమ్మావాళ్ళ ఇంట్లో అమ్మ నా నల్లపూసలు ఎక్కడో పెట్టి మరిచిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు నేను, "బాబా! మీ గుడికి వచ్చి 116 రూపాయల దక్షిణ సమర్పించుకుంటాన"ని మొక్కుకున్నాను. ఆశ్చర్యంగా 10 నిమిషాల్లో నా నల్లపూసలు దొరికాయి. "సాయితల్లీ, మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే మాకు ఉండాలి తండ్రీ. అందరినీ చల్లగా చూడు స్వామీ. ఈ కరోనా నుండి అందరినీ కాపాడు తండ్రీ".
మనసులో అనుకున్నంతనే అనుగ్రహించిన సాయి
నా పేరు అభి. ముందుగా సాయిబంధువులకు, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈమధ్య మేము ఇల్లు కట్టాలనుకుని ఆ స్థలంలో ఉన్న రాళ్లను ట్రాక్టరులో తరలించాలని అనుకున్నాం. అయితే ఏ ట్రాక్టర్ వచ్చినా అక్కడున్న బురదలో ఇరుక్కుని ముందుకు కదిలేది కాదు. అప్పటికీ ఒక డ్రైవరు లోడ్ దింపి కదిలించాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దాదాపు నాలుగు గంటలు ప్రయత్నం చేసినా ట్రాక్టర్ బయటకి రాలేదు. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా ట్రాక్టర్ బయటకు వచ్చేలా చేయండి" అని మనసులో అనుకున్నాను. అంతే, బాబా దయవల్ల పదినిమిషాల్లో ట్రాక్టర్ బురదలో నుంచి బయటకు వచ్చింది.
ఒకరోజు రాత్రి హఠాత్తుగా నాకు మైగ్రేన్ తలనొప్పి వచ్చి ఏ ప్రయత్నం చేసినా తగ్గలేదు. అది రాత్రివేళ కావడం వల్ల చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు, "బాబా! తలనొప్పి తగ్గించండి" అని మనసులో అనుకున్నాను. అలా అనుకున్న కాసేపటికే అద్భుతం జరిగినట్లు తలనొప్పి తగ్గిపోయింది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ దయ ఎప్పటికీ నామీద, నా కుటుంబం మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను సాయీ"
శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఆరోగ్యం చేకూరేలా అనుగ్రహించిన బాబా
నేనొక సాయిభక్తురాలిని. ముందుగా సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. రోజూ బ్లాగులో ప్రచురితమయ్యే సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే బాబాకు దగ్గరవుతున్న అనుభూతి కలుగుతుంది. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మేము సంక్రాంతికి ముందు మా ఊరు వెళ్లాలనుకుని, కరోనా కారణంగా ముందుగానే రైలు టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకున్నాము. అయితే మా ప్రయాణానికి ముందు హఠాత్తుగా మా అత్తమ్మకి ఆరోగ్యం బాగోలేకుండా పోయింది. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "అత్తమ్మ ఆరోగ్యం బాగుపడితే, నేను నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను బాబా" అని బాబాను వేడుకుని రెండు రోజులు ఊదీ నీళ్లలో కలిపి అత్తమ్మకి ఇచ్చాను. బాబా దయవలన మేము ఊరు వెళ్లేరోజుకి అత్తమ్మ ఆరోగ్యం కుదుటపడింది. "చాలా ధన్యవాదాలు సాయీ. ఇలాగే మా కుటుంబాన్ని సదా కాపాడు తండ్రీ".
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete