1. తామున్నామని నమ్మకమిస్తున్న బాబా
2. ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో బాబాకి చెప్పుకుంటే ఆయన తప్పక తీరుస్తారు
3. తోటి భక్తుల అనుభవాల విషయంలో ఆలోచనను సరిచేసిన బాబా
తామున్నామని నమ్మకమిస్తున్న బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! నాపేరు సంగీత. మాది నిజామాబాద్. ముందుగా సాయి బంధువులకు, బ్లాగు నిర్వాహకులకు నమస్కారాలు. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో వచ్చే అనుభవాలు చదువుతుంటాను. నేను కూడా ఇదివరకు నా అనాభవాలు చాలా పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను.
ఒకసారి మా ఆడపడుచు కడుపునొప్పితో రాత్రుళ్ళు నిద్రపట్టక వారం రోజుల పాటు చాలా బాధపడింది. హాస్పిటల్‍కి వెళితే, "కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. అందుకే అంతలా నొప్పి వస్తుంది" అని అన్నారు. మా ఆడపడుచు తట్టుకోలేక బాధతో ఏడుస్తుంటే నేను, "బాబా! ఆ నొప్పి నుంచి మా ఆడపడుచుకి ఉపశమనం కలిగిస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల రెండు గంటల్లో నొప్పి తగ్గిపోయింది. "థాంక్యూ బాబా".
నేను ఆరోగ్యం బాగాలేక మందులు వాడుతున్నాను. ఆ మందుల వల్ల నాకు విపరీతంగా ఆకలి వేస్తుంటే తింటూ ఉండేదాన్ని. దాంతో నేను మూడు నెలల్లో మూడు కిలోల బరువు పెరిగాను. అంతకుముందు కూడా ఇలాగే మందులు వాడుతూ చాలా లావైతే, సంవత్సరంపాటు అన్నం తినకుండా డైటింగ్ చేస్తూ చాలా కష్టపడి 8 కిలోల బరువు తగ్గాను. అందువల్ల నేను మళ్లీ ఇలాగే బరువు పెరుగుతూ పోతే సమస్య మొదటికి వస్తుందని భయపడి, "బాబా! నాకు ఆకలి వేయకుండా ఉండేలా చూసి నా బరువు తగ్గేలా చేస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. మనం ఏది కోరినా బాబా తీరుస్తారు. ఆయన దయవల్ల నాకు ఇప్పుడు ఆకలి వేయట్లేదు, సన్నగా కూడా అయ్యాను. "థాంక్యూ బాబా".
ఒకరోజు మా పాప ఆడుకుంటూ కింద పడింది. దాంతో కాలు వాచి నడవడానికి రాలేదు. హాస్పిటల్‍కి వెళ్తే, ఎక్స్-రే తీయించమన్నారు. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల పాపకి ఫ్రాక్చర్ కాకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల ఫ్రాక్చర్ కాలేదు. కానీ కాలికి బలంగా దెబ్బ తగలడం వల్ల పట్టి వేసి 15 రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. "ధన్యవాదాలు బాబా".
నేను ఈ మధ్య స్కూటీ నడపడం నేర్చుకున్నాను. అయితే నేను ఒక్కదాన్ని, ఇంకా పిల్లలను తీసుకుని నడపగలిగేదాన్ని గాని, వెనక సీటు మీద ఒకవైపే కూర్చునేవాళ్ళని ఎక్కించుకుని నడపాలంటే భయం వేసేది. ఆ విషయమై నేను, "బాబా! మీ దయవల్ల వెనకాల ఒకవైపు కూర్చునేవాళ్ళని కూర్చోబెట్టుకుని స్కూటీ నడపగలిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. తర్వాత మా అక్కని వెనుక ఎక్కించుకుని బాబా ఉన్నారనే దైర్యంతో స్కూటీ నడిపాను. బాబా దయవల్ల బాగా నడపగలిగాను. అంతా బాబా దయ. "థాంక్యూ బాబా".
మావారు ప్రభుత్వోద్యోగి. మా ప్రాంతంలో జోనల్ ఏర్పాటు చేసి ఉద్యోగస్తులకు బదిలీలు చేస్తుంటే మావారికి ఎంత దూరం బదిలీ అవుతుందో ఏమిటో అని భయమేసి, "బాబా! మావారికి బదిలీ కాకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఇప్పటివరకూ మా వారికి బదిలీ కాలేదు. ఇకముందు కూడా బదిలీ కానివ్వరని నా నమ్మకం. "ధన్యవాదాలు బాబా".
నాకు చాలా సంవత్సరాల నుంచి కళ్ళు తిరగడం, తల తిరగడం జరుగుతుంది. మొదటిసారి హాస్పిటల్‍కి వెళ్ళినప్పుడు డాక్టరు మూడు సంవత్సరాలపాటు మందులు వాడాలని చెప్పారు. తరువాత ఈ మధ్య ఒకసారి నేను హాస్పిటల్‍కి వెళ్తూ, "బాబా! నా ఆరోగ్యం ఎప్పుడూ బాగుండాలి" అని బాబాకి మ్రొక్కుకుని వెళ్ళాను. ఆయన దయవల్ల ఆరునెలలు చికిత్స తీసుకుంటే సరిపోతుంది అన్నారు. "థాంక్యూ బాబా".
మాకు కొన్ని అప్పులు ఉన్నాయి. ఒకసారి మా అన్నయ్య మాకు ఒక ప్లాటు ఇస్తానన్నాడు. అయితే మూడు సంవత్సరాలు అయినా ఇవ్వలేదు. ఈమధ్య ఒకసారి నేను అన్నయ్యతో, "మీరు ప్లాట్ ఇస్తే, అమ్మేసి అప్పులు తీర్చుకుంటాము" అని అన్నాను. అన్నయ్య సరే అన్నారు. కానీ వారం అయినా ఆ విషయం గురించి మళ్లీ ఏమీ మాట్లాడలేదు. నాకు మళ్లీ అడగాలి అనిపించక, "బాబా! మీ దయవల్ల అన్నయ్య వాళ్ళు ప్లాట్ అమ్మేసుకోండి అని చెప్పాలి" అని అనుకున్నాను. అంతే, ఆరోజు సాయంత్రం మా అన్నయ్య ప్లాట్ నెంబర్ చెప్పి అమ్మేసుకోండి అని అన్నారు. ఇలా ఎన్నో అనుభవాల ద్వారా నాకు ఏ సమస్య వచ్చినా తామున్నామని నమ్మకం ఇస్తున్నారు బాబా. "థాంక్యూ బాబా. మా అన్నయ్య, వదినల మధ్య ఉన్న ఒక సమస్యను మీరే పరిష్కరించండి బాబా".
ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో బాబాకి చెప్పుకుంటే ఆయన తప్పక తీరుస్తారు
సమర్ధ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!
సాయి భక్తులందరికీ నా నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఈ బ్లాగులో రెండవసారి నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. నాకు ఏ సమస్య వచ్చినా తీర్చేది బాబానే. ఆయనే నా తండ్రి. 2021, డిసెంబరులో నా రెండు కాళ్ళ నరాలు పట్టేసి చాలా నొప్పి పెట్టాయి. పదిహేను నిమిషాలైనా తగ్గలేదు. ఏమైందోనని నేను చాలా భయపడ్డాను. వెంటనే మనసులో బాబాను తలుచుకుని, "నొప్పి తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల వెంటనే నొప్పి తగ్గింది. "ధన్యవాదాలు బాబా. చాలా ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా".
2022, జనవరి నెల చివరిలో నాకు జలుబు, జ్వరం వచ్చాయి. బాబా దయవల్ల జ్వరం ఒక్క రోజులోనే తగ్గింది కానీ, నాలుగు రోజులైనా జలుబు తగ్గలేదు. ఏదైనా మింగుతుంటే టాన్సిల్స్ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉండేది. నాకు ఏం చేయడానికి తోచక, "బాబా! రేపు పొద్దున్నకల్లా నాకు నయం కావాలి. అలా జరిగితే బ్లాగు ద్వారా తోటి భక్తులందరితో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని అనుకున్నాను. మరుసటిరోజు(జనవరి 31) ఉదయం లేచేసరికి నాకు చాలా ఉపశమనంగా అనిపించింది. బాబా నా ప్రార్థనను మన్నించారు. జలుబు, జ్వరం అన్నీ తగ్గాయి. ఆయన అనుగ్రహానికి కృతజ్ఞతగా వెంటనే నా అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుకి పంపించాను. ఎవరికి ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో బాబాకి చెప్పుకోండి. ఆయన తప్పకుండా తీరుస్తారు. "బాబా అందరినీ చల్లగా చూడు తండ్రీ. ఎప్పుడూ మా వెంటే ఉండి మమ్మల్ని రక్షించు తండ్రీ. మీరే మాకు దిక్కు సాయి. తల్లీ, తండ్రీ, గురువు, దైవం, వైద్యుడు అన్నీ మీరే సాయి. ఐ లవ్ యు సాయి".
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!
తోటి భక్తుల అనుభవాల విషయంలో ఆలోచనను సరిచేసిన బాబా
అందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. 2022, జనవరి 8న నేను ఇంస్టాగ్రామ్‍లో చీరలు ఆర్డరు పెట్టాను. వాళ్ళు 6, 7 రోజాల్లో ఆర్డర్ డెలివరీ చేస్తామని అన్నారు. అయితే రెండు వారాలైనా వాళ్ళ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. నేను మెసేజ్ చేస్తే చూసేవాళ్ళు గాని, సమాధానం ఇచ్చేవాళ్ళు కాదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే వాళ్ళు కాదు. నేను ఆసమయంలో చాలా టెన్షన్ పడి, "బాబా! నేను పెట్టిన ఆర్డరు డెలివరీ అయితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. ఆయన దయవల్ల 2022, జనవరి 31న నా ఆర్డరు డెలివరీ అయ్యింది. ఇక్కడ నేను ఒప్పుకోవాల్సిన విషయమేమిటంటే, ఈ బ్లాగులో కొంతమంది భక్తులు బాబాకి చెప్పుకోవడం వల్ల వాళ్ల ఆర్డర్లు డెలివరీ అయ్యాయని తమ అనుభవాలు పంచుకున్నప్పుడు వాటిని చదివిన నేను 'ఇలాంటి వాటిని కూడా బాబాని అడగాలా? టెక్నికల్ సమస్యల వల్ల ఆలస్యమై ఉండొచ్చు కదా' అని నవ్వుకున్నాను. తోటి భక్తుల అనుభవాల విషయంలో నేను అలా అనుకోవటం తప్పే కదా. అందుకే బాబా నాకు ప్రాక్టికల్ అనుభవాన్ని ఇచ్చారు. తద్వారా డబ్బులు ఎవరివైనా ఒకటేనని, డబ్బులు కట్టిన తరువాత వస్తువు రాకపోతే అందరి టెన్షన్ ఒకేలా ఉంటుందని నాకు తెలిసేలా చేసారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీకు చెప్పినట్టుగానే నా తప్పుని ఒప్పుకుంటూ నా అనుభవాన్ని బ్లాగ్లులో పంచుకున్నాను. అలాగే నా తప్పుకు మిమ్మల్ని క్షమాపణలు వేడుకుంటున్నాను".
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above average grade Jaisairam
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Baba naku Job ippinchandi deva
ReplyDelete