సాయి వచనం:-
'ఎప్పుడైనా, ఎవరైనా నీ దగ్గరకు భిక్షకుగానీ, మరే సహాయాన్ని ఆశించిగానీ అడగటానికి వస్తే నీకు చేతనైనంత సహాయం చెయ్యి. ఇవ్వటానికి ఇష్టం లేకపోతే అదీ నెమ్మదిగానే చెప్పు. అంతేగానీ, ఎవరినీ ఎప్పుడూ కసరవద్దు, తిట్టవద్దు.'

'శిరిడీలో అర్థవంతంగా ఒక గంట గడిపినా ఫలితం ఎన్నో రెట్లు ఉంటుంది' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1091వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్ముకున్నందుకు మంచి చేసిన బాబా
2. అనుగ్రహప్రదాత సాయి

నమ్ముకున్నందుకు మంచి చేసిన బాబా


నా పేరు పావని. సాయి నా వెంటే ఉంటూ ఎన్నో విధాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. నేను సాయికి ఎంతో ఋణపడి ఉన్నాను. ఆయన మాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా మామయ్యగారికి 70 సంవత్సరాలు. ఆయన చాలా మంచివారు. ఒకరోజు ఆయనకి తలలో విపరీతమైన నొప్పి వచ్చి బాగా వాంతులు అయ్యాయి. దాంతో మేము ఆయనను హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాము. అక్కడ అన్నిరకాల టెస్టులు చేసి, "తలలో నరం ఉబ్బింది. ఆపరేషన్ చేయాలి. కానీ ఆపరేషన్ చేసినా చెప్పలేము. అలాగని ఆపరేషన్ చేయకపోతే ఉబ్బిన నరం చిట్లిపోయి కోమాలోకి వెళ్లి ఏదైనా జరగొచ్చు" అన్నారు. అంటే, ఆపరేషన్ చేసినా, చేయకున్నా సమస్యే. మా అందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నేను, "బాబా! మామయ్యగారికి ఆపరేషన్ లేకుండా తగ్గిపోవాలి. నీవే మాకు దిక్కు సాయీ. కరుణించు తండ్రీ. నేను ఇంతవరకు శిరిడీ వెళ్ళలేదు బాబా. వెళ్ళాలని చాలా కోరిక. మీ దయ ఉంటేనే ఎవరైనా శిరిడీ వెళ్ళగలరని విన్నాను. నాకు అంత అదృష్టం లేదేమో, నా మీద మీకింకా దయ రాలేదేమో తండ్రీ. మామయ్యగారికి ఆపరేషన్ లేకుండా నయమైతే నేను శిరిడీ వస్తాను. అలా జరగకుంటే నేను నా జీవితంలో శిరిడీ రాను సాయీ. కరుణించి కాపాడు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. మనసులో మాత్రం 'ఒకవేళ మావయ్యకి ఆపరేషన్ అన్నారంటే, నేను శిరిడీ వెళ్ళలేను కదా!' అని బాధపడ్డాను. సరే, మొదట మామయ్యని ఖమ్మంలో చూపించిన మేము, డాక్టర్లు చెప్పినందువల్ల ఆయన్ని హైదరాబాద్ తీసుకుని వెళ్లి సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టరుకి చూపించాం. ఆయన కూడా ఖమ్మం డాక్టరు చెప్పినట్లే చెప్పారు. దాంతో నేను, "ఇప్పుడెలా బాబా? నేను ఎందుకలా మొక్కుకున్నాను? మామయ్యకు తగ్గదా? నేను శిరిడీ వెళ్లలేనా?" అని అనుకున్నాను. తరువాత మేము మామయ్యను నిమ్స్‌కి తీసుకుని వెళ్ళాము. వాళ్ళు అన్ని టెస్టులు రాశారు. ఒకరోజంతా టెస్టులు జరిగాయి. తరువాతరోజు రిపోర్టులు వచ్చాయి. మరుసటిరోజు డాక్టరు చూస్తారనగా నేను, "బాబా! మాకున్న చివరి అవకాశం మీరే. మాకు దిక్కు మీరే. మీ మీదే భారం వేశాము సాయీ" అని బాబాను ప్రార్థించాను. తరువాత డాక్టరు వచ్చి రిపోర్టులు చూశారు. ఇంటిదగ్గర ఉన్న నేను బాబాను తలచుకుంటూ ఉన్నాను. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. అంతలో మావారు ఫోన్ చేశారు. టెన్షన్ పడుతూ ఫోన్ తీశాను. "డాక్టరు రిపోర్టులు చూశారు. నాన్న తలలో ఏమీ లేదు. ఆయన చాలా బాగున్నారు. ఆయనకు ఆపరేషన్ అవసరం లేదు, మందులు కూడా అవసరం లేదు" అని చెప్పారు మావారు. అది విని నాకెంత సంతోషం కలిగిందో చెప్పలేను. బాబానే ఆ డాక్టరు రూపంలో వచ్చారనిపించింది. "బాబా! మిమ్మల్ని నమ్ముకున్నందుకు మాకు మంచి చేశారు. మీ పాదపద్మాలకు కోటి వందనాలు. వీలుచూసుకుని శిరిడీ వస్తాను సాయీ".


అనుగ్రహప్రదాత సాయి


తోటి సాయిభక్తులకు నమస్కారం. నా పేరు రజనీకాంత్. మేము మా కొబ్బరితోటను ఒకరికి లీజుకు ఇస్తే, వాళ్ళు తోటంతా పాడుచేశారు. పాడైపోయిన తోటను చూస్తే, మాకు చాలా బాధేసింది. ఆ తోటలోని మోటారు కూడా చెడిపోతే నేను ఎలక్ట్రీషియన్‌ని తీసుకొచ్చి బాగుచేయించాలని అనుకున్నాను. కానీ ఆ సమయంలో నాకు డబ్బులకి చాలా ఇబ్బందిగా ఉండేది. అందువల్ల నేను, "బాబా! తక్కువ ఖర్చుతో మోటారు రిపేర్ అయిపోయేలా చూడు తండ్రీ" అని బాబాతో చెప్పుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా తక్కువ ఖర్చుతో మోటారు రిపేర్ అయ్యేలా చూశారు. ఇది చిన్న విషయమే కానీ, ఆ సమయంలో నాకు అది పెద్ద సమస్యగా తోచింది. తర్వాత ఆ కొబ్బరితోటను వేరే వాళ్ళకి ఇవ్వాలని చూశాము. కానీ లీజుకు తీసుకోవడానికి ఎవరూ ముందుకు వచ్చేవాళ్ళు కాదు. దాంతో మేము చాలా ఇబ్బందిపడ్డాం. అప్పుడు మాకు తెలిసిన ఒకరితో ఆ తోటను లీజుకు తీసుకోమని చెప్పి, "బాబా! వాళ్ళు తీసుకుంటే, తోటను బాగా చూసుకుంటారు. మీ దయతో వాళ్ళు లీజుకు తీసుకోవాలి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవలన వాళ్ళు తోటను తీసుకున్నారు. కానీ 2022, ఫిబ్రవరి 9న ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. "బాబా! ఏ ఇబ్బంది, గొడవలు లేకుండా వాళ్ళు మాకివ్వాల్సిన మొత్తం డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయేలా దయచూపండి. అలాగే, నా వల్ల వాళ్ళకి ఇబ్బంది లేకుండా కరుణించు తండ్రీ. తెలిసీ తెలియక నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


7 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house construction complete chaindi manchi.sambandam vachhi marriage iyala chaindi pl

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo