సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1082వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కోరుకున్నంతనే సహాయం చేసిన బాబా
2. బాబా దయతో పరిష్కారమైన సమస్యలు
3. సమస్య ఏదైనా బాబాకు చెప్పుకుంటే తీరిపోతుంది

కోరుకున్నంతనే సహాయం చేసిన బాబా


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి. సాయి బంధువులకు నమస్కారం. నా పేరు హేమ. మేము విజయవాడలో ఉంటాము. మా అమ్మాయి బి.టెక్ నాల్గవ సంవత్సరం చదువుతున్నప్పుడు క్యాంపస్ ప్లేస్‍మెంట్స్‌లో ఉద్యోగం కోసం తను చాలా ప్రయత్నించింది. కానీ కొన్ని కారణాల వల్ల తన ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. దాంతో తను చాలా బాధపడుతుండేది. నేను ఒక గురువారంనాడు బాబాకి దణ్ణం పట్టుకుని, "బాబా! మా అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. బాబా మా మీద దయ చూపించారు. మరుసటి వారం బుధవారంనాడు మా అమ్మాయి కాలేజీ నుండి వస్తూనే చాలా సంతోషంగా ఇంటికి వచ్చి తనకి ఉద్యోగం వచ్చిందని చెప్పింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా మంచి కంపెనీలో మా అమ్మాయికి ఉద్యోగాన్ని అనుగ్రహించారు. ఇంకా లొకేషన్ ఇవ్వలేదు. మేము బెంగుళూరులో వస్తే బాగుండు అనుకుంటున్నాము. కానీ బాబాకి తెలుసు కదా మనకేది మంచిదో. "బాబా! మీకు ఎక్కడ మంచిది అనిపిస్తే, అక్కడ వచ్చేలా చేయండి. థాంక్యూ సో మచ్ బాబా. లవ్ యు బాబా".


మా అబ్బాయి బి.టెక్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ వర్కు ఇచ్చి, దానికి ఒక సార్‌ని గైడ్‍గా పెట్టారు. ఆ సార్ ఏమీ పట్టించుకోకుండా మీకు నచ్చింది చేయండి అని వదిలేసారు. అయితే మా అబ్బాయి చాలా ప్రాజెక్టులు ప్రయత్నించినప్పటికీ ఆ సార్ దేన్నీ ఆమోదించేవారు కాదు. దాంతో మా అబ్బాయి చాలా డిప్రెస్ అయ్యాడు. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! బాబుకి మంచి ప్రాజెక్ట్ దొరికేలా చేయండి" అని వేడుకున్నాను. మరుసటిరోజే మా అబ్బాయి ఒక ప్రాజెక్టుని ఎంపిక చేసుకుంటే దాన్ని వాళ్ళ సార్ ఆమోదించారు. అయితే ఆ ప్రాజెక్టు చేయాలంటే కార్పెంటర్‌తో పని ఉంటుంది. ఈ విషయంలో బాబా తమ లీలను చూపించారు. అసలు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించని మా ఇంటికి పనిచేసే కార్పెంటర్ ఒక్క ఫోన్ కాల్‍కే స్పందించి, "నేను వచ్చి మీకు కావాల్సింది చేస్తాను" అని చెప్పారు. మేము చాలా సంతోషించాము. అక్కడితో అయిపోలేదు. ఆ కార్పెంటర్ పని పూర్తి అయ్యేదాక రోజూ వచ్చి అన్ని వివరాలు అడిగి మరి ఆ ప్రాజెక్టు పూర్తి చేసారు. పైగా చేసిన పనికి డబ్బులు కూడా తీసుకోలేదు. బాబానే ఆ కార్పెంటర్ ద్వారా మా అబ్బాయి ప్రాజెక్టుని పూర్తి చేయించారని నా నమ్మకం. కోరుకున్నంతనే సహాయం చేసిన బాబాకు చాలా చాలా ధన్యవాదాలు. "లవ్ యు సో మచ్ బాబా".


బాబా దయతో పరిష్కారమైన సమస్యలు


సాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాను. ఆమధ్యకాలంలో నా నిర్లక్ష్యం వలన వ్యాపారం కొంచెం డల్ అయింది. అప్పుడు నేను బాబాతో, "బాబా! మీ దయవలన మళ్లీ వ్యాపారం బాగా జరిగేల" అని చెప్పుకున్నాను. తర్వాత బాబా దయవలన వ్యాపారం కొంచెం బాగానే ఉంది. "ధన్యవాదాలు బాబా".


కరోనా సమయంలో ఒకసారి మా నాన్నకి కొంచెం చలిజ్వరం, దగ్గు వచ్చాయి. నాకు భయమేసి బాబాతో, "బాబా! నాన్నకి ఏ ఇబ్బంది లేకుండా త్వరగా తగ్గిపోవాల"ని చెప్పుకున్నాను. బాబా దయతో నాన్నకి చాలా తొందరగా నయం అయింది. "థాంక్యూ బాబా".


మా బాబు పదవ తరగతి చదువుతూ హాస్టల్లో చేరుతానని పట్టుబట్టాడు. అది మాకు ఇష్టం లేకపోయింది. కానీ మేము ఎంత చెప్పినా బాబు వినలేదు. అప్పుడు నేను బాబాతో, "బాబా! బాబు హాస్టల్లో చేరుతానన్న నిర్ణయం మార్చుకోవాల"ని చెప్పుకున్నాను. బాబా దయవలన మా బాబు చాలా తొందరగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. అందరినీ ఇలాగే దయతో కాపాడు తండ్రి".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సమస్య ఏదైనా బాబాకు చెప్పుకుంటే తీరిపోతుంది


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి బంధువులందరికీ 'సాయి మహారాజ్' ఆశీస్సులు ఉండాలి. నేను 'సాయీ' అంటే 'ఓయీ' అనే పలికే దైవం సాయినాథుడి భక్తుడిని. నేను బాబాకి దగ్గరై సుమారు 5 సంవత్సరాలు అయింది. ఈ ఐదు సంవత్సరాలలో నేను బాబా చేసిన ఎన్నో లీలలు చూసాను. ఒకసారి మలబద్దకం సమస్య మొదలై మలంలో రక్తం రావడం నేను చాలారోజులు గమనించాను. మందులు వాడాను కానీ, తగ్గలేదు. నాకు తీరిక సమయంలో ఈ బ్లాగును చదవడం అలవాటు. అలా ఒకరోజు బ్లాగులో కొన్ని అనుభవాలు చదివాక మనసులో బాబాను ధ్యానించి, "నా ఆరోగ్య సమస్యకు పరిష్కారం దొరకాల"ని వేడుకున్నాను. తరువాత బాబా ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగాను. అలా ఊదీ నీళ్లు రెండు రోజులు త్రాగాక గమనించాను. ఆశ్చర్యం! ఊదీ మహిమ వలన నా సమస్య పరిష్కారమైంది. అదివరకు కూడా నా సమస్యలు కొన్నింటిని బాబా ఊదీతో తీర్చారు. తమను నమ్మిన భక్తుల వెన్నంటి ఉంటూ కాపాడే కల్పవృక్షం సాయినాథుడు. ఎలాంటి సమస్య వచ్చినా బాబాకు చెప్పుకుంటే తప్పకుండా పరిష్కారం చూపిస్తారు. 


శుభమస్తు! లోకా సమస్తా సుఖినో భవంతు!!!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!



7 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Baba naku job ivvandi deva interview sariga answer cheyaledhu mere edhoka miracle chesi naku aa job ivvandi baba na aardhika samasyalu teeri ph.d complete chesela ga choodandi deva please deva bless me deva .be with me and with my parents deva

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above average grade Jaisairam

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  7. Om sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo