1. సాయి వర్షించిన అనుగ్రహాలు
2. బాబా లీలలు
3. కరోనా వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూసిన బాబా
సాయి వర్షించిన అనుగ్రహాలు
ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!!
అందరికీ నమస్తే. నేను ఒక సాయి భక్తురాలిని. బాబాకి మాటిచ్చిన ప్రకారం మన సాయి వర్షించిన మూడు అనుగ్రహాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
మొదటి అనుగ్రహం: 2021, నవంబర్ నెలలో కురిసిన వర్షాలప్పుడు నా మేనల్లుడికి జలుబు, జ్వరం వచ్చాయి. అవి తగ్గినట్లే తగ్గి మళ్ళీ తిరిగి వస్తుంటే నేను, "బాబా! బాబుకి జలుబు, జ్వరం పూర్తిగా తగ్గిపోతే, ఈ అనుభవాన్ని మన బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. తరవాత బాబా దయవలన తొందరగానే బాబుకి పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. బాబు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేలా అనుగ్రహించండి సాయీ. కొంచెం ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకున్నందుకు క్షమించండి బాబా".
రెండవ అనుగ్రహం: మా చెల్లి(బాబాయి కూతురు) డెలివరీ సమయంలో మేము కొంచెం టెన్షన్ పడ్డాము. అంటే, డెలివరీ డేట్ కన్నా ముందే తనకి సర్జరీ చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను నా సాయితల్లికి, "చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి" అని చెప్పుకుని సంకల్ప పారాయణ చేయించాను. బాబా ఆశీర్వాదంతో ఇప్పుడు తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. "ధన్యవాదాలు బాబా. వాళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి బాబా".
మూడవ అనుగ్రహం: ఒక పెళ్లికి వెళ్లిన మా బంధువు ఒకావిడ హఠాత్తుగా కళ్ళుతిరిగి పడిపోయింది. అప్పటికి బాగానే ఉన్న ఆవిడ ఆరోగ్యం ఒక వారానికి బాగా క్షీణించిపోయి స్పృహలేని స్థితికి వచ్చింది. స్కాన్ చేసి, "బ్లడ్‌లో క్లాట్స్ ఉన్నాయి. ఉన్నపళంగా సిటీకి తీసుకెళ్ళి సర్జరీ చేయాల"ని చెప్పారు. పెద్దవయసు, పైగా ఆస్త్మా పేషెంట్ కావటం వల్ల సర్జరీ చేస్తే ఏమవుతుందోనని అందరం భయపడ్డాము. సర్జరీ చేస్తుండగా వాళ్ల అమ్మాయి, "బాబాని ప్రార్థించమ"ని నాకు మెసేజ్ చేసింది. నేను ఆమె పేరు మీద సంకల్ప పారాయణ పెట్టించి, "బాబా! మీ దయతో ఆవిడ కోలుకుంటే మన బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహం కురిపించారు. ఆవిడ ఇప్పుడు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చి తన కుటుంబసభ్యులతో సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకుంది. "థాంక్యూ సో మచ్ బాబా". ఇంకా కొన్ని బాబా వర్షించిన అనుగ్రహాలు ఉన్నాయి. అవి కూడా మీతో పంచుకోవాలని అనుకున్నాను. అయితే వాటిని పంచుకోవాలనుకున్నది బాబాకి మ్రొక్కుకున్నందువల్ల కాదు, బాబా ప్రేమను మీ అందరితో చెప్పుకోవాలని. వీలైనంత త్వరగా అవి పంచుకుంటాను. "వాటిని త్వరగా పంచుకునేలా దీవించండి బాబా".
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!
బాబా లీలలు
సాయి భక్తులకు/బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు తులసి. నేను ఇంతకుముందు నా అనుభవాలు కొన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు బాబా అనుగ్రహించిన మరికొన్ని వరాలను మీకు తెలియజేయడానికి మళ్ళీ వచ్చాను. 2020లో నేను మా అమ్మాయి ఉద్యోగం గురించి బాబాతో విన్నవించుకున్నాను. ఆయన అనుగ్రహంతో మా అమ్మాయికి ఒక ఉద్యోగం వచ్చింది. కొంతకాలానికి తను, 'తనకి ప్యాకేజీ(జీతం) ఎక్కువ కావాల'ని బాబాకు విన్నవించుకుంది. అప్పుడు నేను, "మా అమ్మాయి కోరిక తీరిస్తే, ఆ అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మాటిచ్చాను. బాబా అనుగ్రహంతో 2022లో మా అమ్మాయికి మంచి ప్యాకేజీతో ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది. "ధన్యవాదాలు బాబా".
2021, డిసెంబరులో మా అబ్బాయిని తను పనిచేసే కంపెనీవాళ్ళు వెంటనే ఆఫీసుకొచ్చి విధులలో చేరాల్సిందిగా చెప్పారు. దాంతో మా అబ్బాయి, కోడలు బెంగళూరు వెళ్లి కాపురం పెట్టారు. కొన్నిరోజులకు జనవరిలో ఒమిక్రాన్ వల్ల కంపెనీవాళ్ళు మళ్లీ వర్క్ ఫ్రం హోం అన్నారు. దాంతో మా అబ్బాయి, కోడలు ధర్మవరంలో ఉన్న మా కోడలి పుట్టింటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన రోజు నుండి ఫుల్ ఫీవర్, జలుబు, దగ్గుతో వాళ్ళు చాలా బాధపడ్డారు. ఆ విషయం వాళ్ళు ఫోన్ చేసి చెప్పేసరికి నాకు చాలా బాధేసింది. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా వాళ్లకు నయమయ్యేలా అనుగ్రహించండి" అని బాబాను ఎంతగానో వేడుకున్నాను. ఆ మరుసటిరోజు నా కోడలు నాకు కాల్ చేసి, "నాకు తెలిసిన డాక్టర్ కొన్ని మందులిచ్చింది. అవి తీసుకున్న తరువాత మాకు పూర్తిగా నయమైంది" అని చెప్పింది. అది విని నాకు చాలా సంతోషమేసి బాబాకు దణ్ణం పెట్టుకున్నాను. బాబా తాము చెప్పినట్లే తమ బిడ్డలు బాధపడుతుంటే చూడలేరు, ఎలా అయినా వాళ్ళకి మంచి చేస్తారు.
2020లో నేను బాబాతో, "బాబా! అందరూ తమ అనుభవాలలో మీరు దర్శనమిచ్చారని పంచుకుంటున్నారు. మరి నాకు ఎప్పుడు దర్శనమిస్తారు?" అని అడిగాను. ఆ తరువాత 2021లో కరోనా కారణంగా నేను, నా కూతురు మావారు ఉద్యోగం చేస్తున్న అనంతపురంకి వచ్చేశాము. ఒకరోజు మావారు తనతోపాటు పనిచేసే ఒక ఆఫీసర్ శిరిడి నుండి పాలరాతి బాబా పాదుకలు తెచ్చి తనకి ఇచ్చారని నాకు చూపించారు. వాటిని చూడగానే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అలా బాబా మా ఇంటికి తమ పాదుకల రూపంలో రావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నేను ఎప్పుడూ, "బాబా! నేను నీ పాదం విడువను, నువ్వు నా చెయ్యి విడువకు" అని అనుకుంటూ ఉండేదాన్ని. ఆ రూపంలోనే బాబా నాకు దర్శనం ఇచ్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
కరోనా వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూసిన బాబా
సాయి కుటుంబీకులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మాది విశాఖ జిల్లా. ఈ మద్య మేము మా ఊరు వెళ్లాల్సి ఉండగా ఆ ముందురోజు మావారు పనిచేసే చోట ఒకరికి కరోనా వచ్చింది. దాంతో అతనికి కరోనా వచ్చింది కదా! ఇప్పుడు మేము ఊరు వెళితే మావల్ల ఇంకెవరైనా ఇబ్బందిపడతారేమో అని ఊరు వెళ్ళడం మానేద్దామని అనుకున్నాము. కాని ఊరు వెళ్లకపోతే మా పిల్లలు చాలా బాధపడతారు. భారం బాబాపై వేసి, "బాబా! మేము ఊరు వెళ్తున్నాము. మాకు, మా వల్ల ఎవరికీ ఏ ఇబ్బందీ రాకుండా చూడండి బాబా. ఎవరికీ ఏ కష్టం రాకుండా ఉంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. దయామయుడు తమ దయను మాపై కురిపించి మమ్మల్ని అందరినీ చల్లగా చూసారు. మేము ఊరి నుండి వచ్చి వారం రోజులు అయ్యింది. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. "బాబా! శతకోటి నమస్కారాలు తండ్రి. మీ దయ అందరి మీద ఉండాలి సాయినాథా. మళ్ళీ కరోనా పెరిగిపోతుంది తండ్రి. ఈ కరోనా నుండి అందరినీ కాపాడి చల్లగా చూడండి బాబా".
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam.bless me to pass IIMC Executive MBA program. Jaisairam
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞BABA karunichu tandri, please bless me baba,... Om apadbandavaya namaha, om arogya kshema dayakaya namaha.... 👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai��������
ReplyDeleteSairam to all , sai leelas so nice, సంకల్ప పారాయణ group Kosam cheppandi pls
ReplyDelete