1. సాయి సంరక్షణ
2. ప్రమాదం జరిగినా పెద్దగా సమస్య లేకుండా కాపాడిన బాబా
3. కష్టకాలంలో ఉద్యోగాన్ని అనుగ్రహించిన బాబా4. బాబా ఊదీతో తగ్గిన యూరిన్ ఇన్ఫెక్షన్
సాయి సంరక్షణ
ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు, సాటి సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు మూడు నెలల పాప ఉంది. పాప పుట్టిన తర్వాత నేను హైదరాబాదులో ఉన్న మా అత్తవారింటికి వెళ్ళాను. అక్కడ మా పాపను డాక్టరుకి చూపిస్తే మళ్లీ మూడు నెలల తర్వాత రమ్మన్నారు. అందువల్ల నేను ఈ మూడు నెలలు అక్కడే ఉన్నాను. మూడు నెలలు గడిచాక పాపని డాక్టరుకి చూపించి, ఆ తర్వాత ఆంధ్రలో ఉన్న పుట్టింటికి రావడానికి బయలుదేరాను. నన్ను, పాపను పుట్టింట్లో దింపడానికి మావారు కూడా మాతో బయలుదేరారు. అంటే మమ్మల్ని మా పుట్టింట్లో దించేసాక ఆయన ఒక్కరే హైదరాబాద్ తిరిగి వెళ్ళాలి. నేను పక్కన ఉంటే సరేగాని, ఆయనొక్కరే కారు డ్రైవ్ చేస్తూ అంత దూర ప్రయాణమంటే నాకు చాలా భయం. అందువల్ల నేను, "బాబా! మావారు నన్ను, పాపని పుట్టింట్లో వదిలిపెట్టి తిరిగి మా ఇంటికి క్షేమంగా వెళితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల మేము క్షేమంగా మా పుట్టింటికి చేరుకున్నాం. ఇకపోతే, మావారి తిరుగు ప్రయాణం విషయానికి వస్తే, ఇంట్లో పరిస్థితులు మరియు ట్రాఫిక్ జామ్ వల్ల బాగా చీకటి పడ్డాక ఆయన కారు నడపాల్సి వచ్చింది. నిజానికి మావారికి రాత్రివేళ కారు నడిపే అలవాటు లేదు. అందువల్ల నాకు కొంచం టెన్షన్‌గా అనిపించి బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల మావారు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. "థాంక్యూ సో మచ్ బాబా. నా కుటుంబాన్ని సదా సంరక్షించండి బాబా".
2022, ఫిబ్రవరి 8 సాయంత్రం హఠాత్తుగా మాపాప చాలా ఏడ్చింది. ఎంత సముదాయించినా తను ఏడుపు ఆపలేదు. అసలే తనకి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. అందువల్ల తనకి ఏ కష్టం వచ్చిందో, ఎందుకు ఏడుస్తుందో అర్ధంకాక నాకు చాలా బాధేసి కన్నీళ్లు పెట్టుకున్నాను. వెంటనే బాబా గుర్తొచ్చి, 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' అనే నామాన్ని 108 సార్లు చెప్పుకుని, "బాబా! పాపకి ఏం బాధ ఉందో అది తగ్గిపోయి, తను నవ్వితే నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల 30నిమిషాల్లో పాప ఏడుపు అపేసి అడుకోసాగింది. "థాంక్యూ బాబా. మా పాపకి హార్ట్ ఆపరేషన్ చేయాలంటున్నారు. మీరు పాప దగ్గరుండి ఆపరేషన్ విజయవంతమయ్యేలా చూసి పాపని 'దీర్ఘాయుష్మాన్ భవ' అని దీవించండి సాయినాథా. కొన్ని కారణాల వల్ల కొన్నిరోజులుగా నేను మిమ్మల్ని మర్చిపోయినందుకు నన్ను క్షమించండి బాబా".
ఓం శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!
ప్రమాదం జరిగినా పెద్దగా సమస్య లేకుండా కాపాడిన బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. మన దైవం బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ముందుగా నేను సాయినాథుని పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. నాకు 8 సంవత్సరాల వయస్సున్న కుమార్తె ఉంది. ఒక గురువారంనాడు తను ఆడుకోవడానికని బయటకి వెళ్ళినప్పుడు రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఒక బైక్ తనని ఢీకొట్టింది. దాంతో తను కిందపడి తల రోడ్డుకి గుద్దుకుని వాపు వచ్చింది. శరీరానికి కూడా కొన్ని చిన్న గాయాలు అయ్యాయి. మేము తన తలకి వాపు రావడం వల్ల ఆందోళన చెంది వెంటనే పాపను తీసుకుని డాక్టరు వద్దకు వెళ్లాము. డాక్టరు CT స్కాన్ చేయించి "స్పెషలిస్ట్‌ని సంప్రదించమ"ని సూచించారు. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నపుడు నేను, "బాబా! పాపకి ఏ సమస్య రాకూడదు. ఇది సాధారణ గాయమే అయి ఉండాలి బాబా" అని బాబాను ప్రార్థించాను. స్పెషలిస్ట్ డాక్టరు పాపకి ఎం.ఆర్.ఐ స్కాన్ చేసి, "ఇది మామూలు గాయమే, ఆందోళన చెందనవసరం లేదు" అని చెప్పారు. తల రోడ్డుకు గుద్దుకున్నప్పటికీ ఎటువంటి ప్రమాదమూ లేకుండా బాబా నా బిడ్డను కాపాడారు. ఇది బాబా చేసిన అద్భుతం. "థాంక్యూ సో మచ్ బాబా".
సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
కష్టకాలంలో ఉద్యోగాన్ని అనుగ్రహించిన బాబా
"బాబా! మీకు శతకోటి పాదాభివందనాలు. మొట్టమొదటి సారిగా నా అనుభవాలు పంచుకుంటున్నాను. తప్పులు ఉంటే క్షమించండి బాబా". నాపేరు అశోకరాణి. 1996వ సంవత్సరంలో ఒక ముస్లిం కుటుంబం ద్వారా నాకు శ్రీసాయిబాబాతో పరిచయం జరిగింది. ప్రస్తుతం నా కుటుంబం సమస్యల వలయంలో ఉండగా నా కుమారునికి గుంటూరులో ఉద్యోగం ఉందని పిలుపు వచ్చింది. అయితే ఆ ఉద్యోగం తనకి రాలేదు. దాంతో నా మానసిక వేదన ఎక్కువైపోయింది. అంతలో ఈ బ్లాగు నా కంటపడింది. ఇందులో అనుభవాలు చదివిన వెంటనే నేను దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్లాను. ఆ రోజు గురువారం(2022, జనవరి 20). "బాబా! నేను నడి సముద్రంలో ఉన్నాను. మీరే దిక్కు" అని బాబాతో చెప్పుకుని ఒక కొబ్బరికాయ కొట్టి, దణ్ణం పెట్టుకుని ఇంటికి వచ్చాను. అదేరోజు సాయంత్రం నాకు తెలిసిన ఒకామె నాకొక ఉద్యోగ ప్రకటనను పంపింది. మరుసటిరోజు నా కుమారుడు ఇంటర్వ్యూకు వెళ్లి, సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు నా కుమారుడు ఆ సంస్థలో చేరి ఉద్యోగం చేస్తున్నాడు. "సాయి నాన్నా! మీరు ఉన్నారు. తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, ఆప్తుడు, ఆత్మీయుడు, స్నేహితుడు, శ్రేయోభిలాషి అన్నీ మీరే నాకు. సత్ప్రవర్తనతో కుటుంబంపట్ల బాధ్యతగా నడుచుకునేటట్లు నా కుమారుడిని మలిచే భారాన్ని మీ మీద పెడుతున్నాను తండ్రి. తన విషయంలో మీరే నాకు దిక్కు నాన్నా. నేను చాలా అలసిపోయాను. మరలా మరలా నా అనుభవాలను పంచుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి బాబా".
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!
బాబా ఊదీతో తగ్గిన యూరిన్ ఇన్ఫెక్షన్
నేను సాయి భక్తురాలిని. కొన్నిరోజుల క్రితం యూరిన్ కి వెళ్ళేటప్పుడు నాకు చాలా మంటగా అనిపిస్తుండేది. అదివరకు కూడా ఒకసారి అలానే అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నారు. అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యి చికిత్స తీసుకుంటూ మందులు వాడితేనే తగ్గింది. మళ్లీ అదే సమస్య రావడంతో నాకు చాలా భయమేసి, "ఇదేంటి బాబా, మళ్లీ అదే పరిస్థితి వచ్చినట్లు ఉంది. దయచేసి మంట తగ్గేలా అనుగ్రహించండి. మీ కృపవలన తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకుని ఊదీ నీళ్ళలో కలుపుకుని తాగాను. అలాగే కొబ్బరినీళ్లలో కూడా బాబా ఊదీ వేసుకుని తాగాను. బాబా దయవలన నొప్పి, మంట తగ్గి సాయంత్రానికల్లా నార్మల్ అయ్యాను. "థాంక్యూ బాబా. నాకున్న మిగతా సమస్యలు కూడా త్వరగా సమసిపోయేలా చూడండి బాబా".
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairan
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam. Bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram ��
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete