సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1069వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. 'సాయి మహరాజ్ సన్నిధి' మిషగా పొందుతున్న బాబా అనుగ్రహం
2. బాబా ఊదీ లీలలు
3. బాబా ఊదీతో కుదుటపడిన ఆరోగ్యం

'సాయి మహరాజ్ సన్నిధి' మిషగా పొందుతున్న బాబా అనుగ్రహం


నా పేరు కృష్ణవేణి. నేను చిన్నప్పటినుండి సాయిభక్తురాలిని. కానీ, నాకు పెళ్ళయ్యాక బాబా మీద ప్రేమ కొంచెం తగ్గింది. నా కర్మల వల్ల నేను ఆయనను దూరం చేసుకున్నాను. కానీ, "నా భక్తులు ఎక్కడున్నా సరే పిచ్చుక కాలికి తాడు కట్టి ఈడ్చునట్లు వాళ్ళని నా దగ్గరకి రప్పించుకుంటాను" అని బాబా చెప్పిన మాట నా విషయంలో వాస్తవమైంది. నేను బాబాని ఎంత దూరం చేసుకున్నా ఆయన నన్ను వదిలి పెట్టకుండా తల్లిలా నా తప్పులు క్షమించి నన్ను కాపాడుతున్నారు. ఈ బ్లాగు ద్వారా బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. ఒక సంవత్సరం నుంచి నేను చాలా సమస్యలలో ఉన్నాను. ఎవరూ లేరని బాధపడుతున్న ఆ సమయంలో ఈ బ్లాగు నాకు ఫేస్‌బుక్‌లో కనిపించింది. కానీ నేను ఈ 'సాయి మహరాజ్ సన్నిధి'లో ఎలా చేరానో నాకు గుర్తు రావడం లేదు. అంతా బాబా లీలలా ఉంది. మొదట్లో నా అనుభవాలను ఎలా పంచుకోవాలో తెలియక నేను బాబాను ప్రార్థించాను. అంతే, బాబా మార్గం చూపించారు. అది కూడా బాబా మిరాకిల్‍లా అనిపిస్తుంది నాకిప్పుడు. నిజంగా ఈ బ్లాగు బాబా ఆశీర్వాదంతోనే నడుస్తోంది. ఈ 'సాయి మహరాజ్ సన్నిధి'లో చేరాక నేను చాలా మారాను. నా పాపాలకు దేవుని నిందించడం తప్పని తెలుసుకుని నన్ను నేను మార్చుకుంటున్నాను. నాలాంటివారి కోసమే, మాలోని అజ్ఞానం తొలగించడానికే ఈ బ్లాగు ఏర్పాటు చేయబడిందని అనుకుంటున్నాను. 'సాయి మహరాజ్ సన్నిధి'కి కోటి కోటి ధన్యవాదాలు.


మా అమ్మవాళ్ళ ఇల్లు బాగా పాడైపోతే స్లాబ్ మరమ్మత్తు చేయించాం. కానీ అది సరిగా సెట్ కాలేదు. అందువలన వాళ్ళు వేరేవాళ్ళ ఇంట్లో ఉండవలసి వచ్చింది. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే, నా చిన్నప్పటినుంచి వాళ్ళు వేరేవాళ్ల ఇంట్లో ఉండటం నాకు అస్సలు తెలియదు. మా ఇంటికే అందరూ వచ్చేవాళ్ళు తప్ప, వాళ్ళు ఎప్పుడూ వేరేవాళ్ళ ఇంట్లో ఉండలేదు. అందుచేత నాకు చాలా బాధేసి, "ఇంటి మరమ్మత్తు ఏ సమస్యలు లేకుండా చక్కగా జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవలన ఇంటి మరమత్తు పనులు సక్రమంగా పూర్తయ్యాయి. ఇది ఈ బ్లాగు ద్వారా బాబా నాకు ప్రసాదించిన మొదటి అనుభవం. కానీ నేను ఈ అనుభవాన్ని పంచుకోవడం మర్చిపోయి ఇతర అనుభవాలను(ఇదివరకు) పంచుకున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా. ఈ అనుభవాన్ని మర్చిపోయినందుకు నన్ను క్షమించండి బాబా". 


ఇకపోతే, 2022, జనవరి 26, మధ్యాహ్నం నేను వాట్సాప్ ఓపెన్ చేసి భక్తుల అనుభవాలు చదువుతుంటే నాకు నా అనుభవం ఒకటి గుర్తుకు వచ్చింది. జనవరి నెలలో ఒకరోజు నా భర్త కరోనా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. తరువాత మా కుటుంబసభ్యులందరికీ కూడా కరోనా లక్షణాలు కొంచెం కనపడ్డాయి. నాకు రాత్రుళ్ళు నిద్ర కూడా పట్టేది కాదు. 'బ్లాగులో పంచుకుంటానని బాబాతో చెప్పుకుంటే చాలు. ప్రతిదీ ఏముందిలే' అని తేలికగా తీసుకోవడం అలవాటైన నేను అప్పుడు కూడా తేలికగా తీసుకున్నాను. అయితే ఐదురోజులైనా జలుబు, దగ్గు తగ్గకపోయేసరికి జనవరి 23, ఆదివారంనాడు మా ఇంట్లో అందరమూ కరోనా టెస్టు చేయించుకోవడం కోసం హాస్పిటల్‌కి వెళ్ళాము. నాకు చాలా భయమేసి బాబా మీద భారం వేశాను. కానీ టెస్టు చేయించుకునేటప్పుడు బాధను తట్టుకోలేక, "బాబా! అందరికీ నెగిటివ్ వస్తే, ఈరోజే బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఆటోలో విగ్రహరూపంలో సాయిబాబా ఎదురొచ్చారు. అలా బాబా దర్శనం అయినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను. మేము ఆటో ఆపించి దక్షిణ సమర్పించాము. ఆ స్వామి, "నిండు నూరేళ్లు వర్ధిల్లమ"ని మా కుటుంబసభ్యులందరినీ ఆశీర్వదించారు. ప్రత్యేకించి ఆయన నాతో, "ఆ సాయినాథుని కృప మీ మీద ఎప్పుడూ ఉంటుంది" అని అన్నారు. ఆయన రూపంలో బాబానే అలా అన్నట్లు నాకు అనిపించింది. బాబా దయవల్ల నా భర్తతో సహా అందరికీ కోవిడ్ నెగిటివ్ వచ్చింది. "థాంక్యూ సో మచ్ బాబా. నన్ను, నా కుటుంబాన్ని ఇలాగే అన్ని సమస్యల నుంచి కాపాడు తండ్రీ. మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని అన్నివైపుల నుండి రక్షిస్తున్నారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. కానీ బాబా, ఆదివారమే నా అనుభవాన్ని పంచుకుంటానని మీకు మాటిచ్చి ఈరోజు పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి. నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి బాబా. మాకు ఒక స్థలం కొనాలని ఆశగా ఉంది బాబా, మీ ఆశీర్వాదంతో ఆ స్థలం మాకు వచ్చేలా చేయండి తండ్రీ. ఈ బ్లాగు ఎప్పుడూ ఇలాగే కొనసాగాలి బాబా. ఇంకా మీ కృప మాపై ఇలాగే ఉండాలి బాబా".


బాబా ఊదీ లీలలు

 

'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు, సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి. నేను సాయిభక్తురాలిని. భక్తురాలినని అనుకోవటానికి కూడా నాకు కొంచెం సంకోచంగానే ఉంది. ఎందుకంటే, నేను బాబా చెప్పిన బోధనలను ఆచరించటం తక్కువ, కోరికలు కోరడం ఎక్కువ. ఎప్పుడు ఏ అవసరమొచ్చినా, "బాబా ప్లీజ్! ఇది చేయి, అది చేయి" అని నా సాయితండ్రిని అడుగుతూనే ఉంటాను. ఆయన ఇస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి బాబా మీద నమ్మకంతో 'తన బిడ్డలకు ఏమి కావాలో ఆయనకి తెలుసు కదా' అనుకుంటాను. ఒక్కొక్కసారి బాబాకు తెలుసునని తెలిసి కూడా అడుగుతుంటాను. అయినా బాబా నన్ను బిడ్డగా ఆదరిస్తూనే ఉన్నారు. ఇక నా అనుభవాల విషయానికి వస్తే... 2022, జనవరి 22న మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేక ఆమెను హాస్పిటల్‍కి తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. కానీ ఈ కోవిడ్ సమయంలో హాస్పిటల్‍కి వెళ్లాలంటే అమ్మకి భయమేసింది. అయినా బాబా మీద భారం వేసి హాస్పిటల్‍కి వచ్చింది. అక్కడ అమ్మ తలకి ఒక టెస్టు చేయాలని చెప్పారు. అప్పుడు నేను బాబా ఊదీ అమ్మకు పెట్టి, కొంచెం ఊదీని ఆమె తలకు కూడా రాసి టెస్టుకి పంపించాను. తరువాత నేను, "అమ్మకు ఏ సమస్యా లేదు, నార్మల్‍గా ఉందని వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి  చెప్పుకున్నాను. బాబా దయవల్ల అమ్మకి అంతా నార్మల్‍గా ఉందని డాక్టరు చెప్పారు.


మా బాబు బి.టెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. తను చదివే కాలేజీలో, చివరికి తన క్లాసులో కూడా కోవిడ్ కేసులు నమోదవుతున్నా నేను ప్రతిరోజూ బాబా ఊదీని బాబు త్రాగే మంచినీళ్ళలో వేసి కాలేజీకి పంపిస్తుండేదాన్ని. 2022, జనవరి 22, శనివారం మా బాబు పరీక్ష వ్రాసిన తరువాత 12 గంటలకి నాకు ఫోన్ చేసి, "నాకు బాగోలేదు, డాడీని కాలేజీకి వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పమ్మా" అని చెప్పాడు. తరువాత తను ఇంటికి వచ్చేసరికి వాడు బాగా జ్వరంతో ఉన్నాడు. దాంతో నాకు చాలా భయమేసింది. అయినా మనకు బాబా ఉన్నారని ధైర్యం తెచ్చుకుని బాబుకి ఊదీ పెట్టి, ఊదీ తీర్థాన్ని ఇచ్చి ఆర్.ఎమ్.పి డాక్టరుతో వైద్యం చేయించాము. నేను మనసులో, 'బాబుకి త్వరగా తగ్గిపోవాలి. వాడికి తగ్గితే నా తండ్రి అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులందరితో పంచుకుంటాను' అనుకున్నాను. వెంటనే బాబుకి జ్వరం తగ్గి, ఆరోగ్యంగా ఉన్నాడు. ఇదంతా నా సాయితండ్రి కృప. "ధన్యవాదాలు బాబా. మీ అమగ్రహం మీ బిడ్డలపై ఎల్లవేళలా ఉండేలా చూడు తండ్రీ".


బాబా ఊదీతో కుదుటపడిన ఆరోగ్యం


ప్రియమైన సాయి కుటుంబసభ్యులారా! బాబా మనందరికీ 'మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాల'ని కోరుకుంటున్నాను. ఈ బ్లాగు 'ఆధునిక సచ్చరిత్ర'. ఇందులోని భక్తుల అనుభవాలు చదవందే నా రోజు పూర్తికాదు. ఈ బ్లాగు నిర్వాహకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. "బాబా! దయచేసి అద్భుతమైన సాయి సేవ చేస్తున్న ఈ బ్లాగు నిర్వాహకులకు మీ ఆశీస్సులు అందించండి". ఇక నా అనుభవానికి వస్తే... నేనొక సాయిభక్తుడిని. వయసు పైబడిన మా నాన్నగారు క్రమశిక్షణతో కూడిన ఆహారం తీసుకుంటారు. బాబా కృపవలన ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.  కానీ ఇటీవల పండుగ సమయంలో ఆయన బయట ఆహారాన్ని తీసుకున్నారు. దాంతో ఆయన కడుపులో సమస్య అయి 5 రోజులకు పైగా విరోచనాలతో బాధపడ్డారు. యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పటికీ నీళ్ల విరోచనాలు ఆగలేదు. మేమంతా చాలా టెన్షన్ పడ్డాం. రోజురోజుకీ ఆయన క్షీణించిపోతున్నారు. కరోనా కారణంగా బయట పరిస్థితి విషమంగా ఉన్నందున మేము ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లలేము. అట్టి స్థితిలో నేను బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. ఇంకా నా దగ్గర ఒక శిరిడీ ఊదీ ప్యాకెట్ ఉంటే, దాన్ని మా అమ్మకి ఇచ్చి, "ఈ ఊదీని నీళ్లలో వేసి రోజుకు మూడుసార్లు నాన్నకి ఇవ్వు" అని చెప్పాను. ఆమె అలాగే చేసింది. అప్పుడు నేను, "బాబా! నాన్న ఆరోగ్యం బాగైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. వెంటనే నాన్న ఆరోగ్యం కుదుటపడి సాధారణ స్థితికి వచ్చింది. ఇదంతా బాబావల్లే జరిగింది. కాబట్టి ప్రియమైన భక్తులారా, దయచేసి శ్రద్ధ, సబూరీని కలిగి ఉండండి. "ధన్యవాదాలు బాబా".



6 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹Thank you so much baba your divine blessings and support and love 🙏🙏🙏🙏🙏Naku Chala santhosham ga undi na anubhavam evala post Inanduku..THANK YOU SO MUCH BABA.. Baba na husband ki eye problem taginchu tandri.. Aa anubavam kuda blog lo panchukuntanu.. Plz bless me Baba always my head under your feet 👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌OM arogya kshema dayakaya namaha, om apadbandavaya namaha🌷🌷🌷🌷🌷🌷🌷🌷nee mida ney na baram vestunna...

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam. Help me to pass IIMC Executive MBA program 🙏

    ReplyDelete
  6. Om sai ram ��

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo