1. శ్రీసాయి కృపామృతధారలు
2. బాబా తీర్చిన సమస్యలు
3. చెప్పుకున్నంతనే ఆరోగ్యాన్ని ప్రసాదించిన సాయి
శ్రీసాయి కృపామృతధారలు
ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి భక్తులందరికీ నమస్కారం. నేను సాయి భక్తురాలిని. ఆ సాయినాథుడు నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుందామనుకుంటున్నాను. నా భర్త ఐటి రంగంలో పనిచేస్తున్నారు. ఆయన ఇదివరకు ఒక ఆర్గనైజేషన్‍లో 9 సంవత్సరాలపాటు పని చేసారు. ఆన్ని సంవత్సరాలపాటు ఓకే సంస్థలో పనిచేసినప్పటికీ 3 సంవత్సరాలుగా ఆయనకి రావాల్సిన ప్రమోషన్, జీతంలో పెరుగుదల, గుర్తింపు వంటివేవీ రాకపోవడంతో నా భర్త చాలా బాధపడి ఆ కంపెనీ వదిలి వేరే కంపెనీకి మారిపోవాలని అనుకున్నారు. అప్పుడు మేము బాబాకి మ్రొక్కుకుని ఐదు వారాల సాయి దివ్యపూజ మొదలుపెట్టాము. మొదటి వారం పూజచేసాక మావారికి ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ ఏదో కారణంగా జాయిన్ అయ్యేలోపు క్యాన్సిల్ అయ్యింది. అయినా మేము బాబా మీద నమ్మకంతో పూజ పూర్తి చేసాం. బాబా దయవల్ల ఒక మంచి MNC సంస్థలో మంచి జీతంతో మావారికి తగిన ఉద్యోగం వచ్చింది. ఈ ప్రక్రియలో బాబా చూపిన మరో అనుగ్రహాన్ని కూడా చెప్తాను. మేము మాకు గ్రీన్ కార్డు కావాలనే ఉద్దేశ్యంతో అది ప్రాసెస్ చేసే కంపెనీలో ఉద్యోగమివ్వమని బాబాను కోరుకున్నాము. ముందుగా ఉద్యోగం ఆఫర్ చేసిన కంపెనీవాళ్ళు, "ఒక సంవత్సరం తరువాత గ్రీన్ కార్డు ప్రాసెస్ చేస్తాము. కానీ ఎలాంటీ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వము" అని చెప్పారు. అయినప్పటికీ మేమున్న పరిస్థితుల్లో ఉద్యోగం మారడమే ముఖ్యం కాబట్టి ఆ ఉద్యోగ అవకాశానికి సరే అన్నాము. కానీ ఆ సమయంలో నేను, నా భర్త చాలా మానసిక సంఘర్షణకు లోనయ్యాం. నేను బాబా మీద అలిగి, 'ఏదీ సాఫీగా జరగడం లేద'ని బాబాని నిందించాను కూడా. అయితే రెండోసారి ఉద్యోగాన్ని ఆఫర్ చేసిన కంపెనీవాళ్ళు ఆరునెలల్లోనే గ్రీన్ కార్డుకి దరఖాస్తు చేస్తామని అన్నారు. వాళ్ళు కూడా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వమన్నప్పటికీ మేనేజర్ వ్యక్తిగతంగా మావారితో మాట్లాడి "మీకు GC (గ్రీన్ కార్డు) దరఖాస్తు చేసేలా చూసే పూచి నాది" అని హామీ ఇచ్చారు. అప్పుడు నాకు అర్థమైంది, 'మొదటి కంపెనీలో కంటే రెండో కంపెనీలోనే మేము అనుకున్నది త్వరగా జరుగుతుందనే బాబా ఆ విధంగా చేసార'ని. "థాంక్యూ బాబా. ఈ ప్రాసెస్‍లో మిమ్మల్ని చాలా నిందించాను. అందుకే భక్తులందరి ముందు మీకు క్షమాపణలు అడుగుతున్నాను. దయచేసి క్షమించండి బాబా".
ఒకసారి మావారికి కడుపులో నొప్పి వచ్చి 4రోజులైనా తగ్గలేదు. అప్పుడు నేను మావారికి బాబా ఊదీ ఇచ్చి, కొంత ఊదీ ఆయనకు నొప్పి ఉన్నచోట పూసి, "నొప్పి తగ్గితే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో నొప్పి తగ్గిపోయింది.
ఒకసారి నాకు నెలసరి రావడానికి 10 రోజుల ముందు నుంచి నా బ్రెస్టులో నొప్పి మొదలైంది. నేను నెలసరి తరువాత ఆ నొప్పి తగ్గిపోతుంది అనుకుని బాబా ఊదీ రాసుకుంటూ, మరికొంత ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగుతూ ఉండేదాన్ని. కానీ నెలసరి వచ్చిన తరవాత కూడా నొప్పి ఉండేసరికి నా మనసులో లేనిపోని భయాలు, ఆలోచనలు మొదలయ్యాయి. అప్పుడు నేను, "బాబా! ఈ అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి నాకు లేదు. ఈ నొప్పి తగ్గిపోయేలా నువ్వే చూడాలి బాబా" అని బాబాను వేడుకున్నాను. ఆ సమయంలో, "ఊదీ రాసుకో, ఊదీ తీర్థాన్ని తాగు" అని బాబా సందేశం వస్తుండేది. నేను ఆయన మీద నమ్మకంతో అలానే చేస్తూ ఉండేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు అర్థరాత్రి నొప్పి చాలా ఎక్కువగా వచ్చింది. వెంటనే నేను బాబా ఊదీ రాసుకుని, "బాబా! నొప్పి తగ్గిపోతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఉదయానికి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఎలాంటి నొప్పి లేదు. నమ్మినవాళ్లకు ఊదీ నిజంగానే సంజీవని. అయితే మనం అనుభవించాల్సిన కర్మను ఇలా నొప్పి రూపంలో తీసేస్తారు ఆ తండ్రి.
చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు, జరిగిన సంఘటనల వల్ల నేను మానసికంగా చాలా బాధను అనుభవిస్తూ వచ్చాను. ఆ కారణంగా నేను ఒక్కోసారి దేవుని పూజ చేసుకోలేను, కనీసం దేవుని వైపు కూడా చూడలేను. నా మానసిక సమస్యలు వల్ల నాకు వచ్చే చెడు ఆలోచనల వల్ల నేను బాధపడుతూ, తప్పు చేస్తున్నానని భయపడుతూ, నేను ఇలా ఆలోచించటం వల్ల దేవుడు నన్ను శిక్షిస్తాడని అనుకుంటూ ఉండేదాన్ని. అలా నేను బాధపడుతున్న సమయంలో ఒకసారి నాకు ఇన్‍స్టాగ్రామ్‍లో ఈ క్రింది మెసేజ్ వచ్చింది. అది చదివి నేను ఆశ్చర్యపోయాను.
భావం:- 'నా ప్రియమైన నీకు చెడు మరియు ప్రతికూల ఆలోచనలు వస్తున్నాయి కదా? కాబట్టి నువ్వు నీ దృష్టిని కొత్తగా ఏదైనా నేర్చుకోవడంపై పెట్టు. తద్వారా నువ్వు నీ చెడు ఆలోచనలకు దూరంగా ఉండగలవు. నువ్వు నీ మనసును పరిశుద్ధ పరుచుకో బిడ్డా!'
అది చదివాక నాకు అర్థమైంది, 'మనం చెప్పుకోలేక మనసులోనే మధనపడే ప్రతి విషయం బాబాకి తెలుసు. దానికి ఆయన ఏదో ఒక రకంగా సమాధానమిస్తార'ని. అది మనం నమ్మాలి. దానికి నా అనుభవమే నిదర్శనం. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చిన ప్రకారం నా అనుభవాలను పంచుకున్నాను తండ్రి. తెలిసీతెలియక చేసిన తప్పులకి క్షమాపణలు కోరుకుంటున్నాను తండ్రి".
బాబా తీర్చిన సమస్యలు
నా పేరు దివ్య. ముందుగా ఎంతోమంది సమస్యలకు పరిష్కారం అందిస్తున్న ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నమస్కారాలు. నేను ఇంతకుముందు నాలుగు అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను. 2022, జనవరి చివరి వారంలో నా శరీరంపై దురదలు వచ్చాయి. ఆ కారణంగా చాలావరకు దద్దుర్లు వచ్చి చాలా నొప్పిగా, మంటగా ఉంటుండేది. అప్పుడు నేను, "బాబా! ఈ దురదలు తగ్గితే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకుని ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగి, చేతులకు కూడా ఊదీ రాసుకున్నాను. బాబా దయవలన నా బాధ చాలావరకు తగ్గింది. ఇది చాలా చిన్న అనుభవమే కానీ, నేను చాలా బాధని అనుభవించాను. "ధన్యవాదాలు బాబా. మీకు చెప్పినట్టుగానే నా అనుభవాన్ని పంచుకున్నాను".
మా సిస్టర్‍కు సంవత్సరం మూడునెలల వయస్సున్న పాప ఉంది. మూడు నెలల క్రితం నుండి పాప అసలు ఏమీ తినట్లేదు. కనీసం ఉగ్గు కూడా తినేది కాదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ తనచేత తినిపించడం మావల్ల అయ్యేది కాదు. పాపని హాస్పిటల్స్ కి తీసుకెళ్ళినా, దేవుళ్లకు మ్రొక్కుకున్నా ప్రయోజనం లేకపోయింది. చివరికి మా సిస్టర్, "బాబా! పాప అన్నం తినడం మొదలుపెడితే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకుంది. అప్పటినుంచి పాప కొంచెం కొంచెంగా తినడం మొదలుపెట్టింది. "చాలా ధన్యవాదాలు బాబా". అలాగే పాపకి 3 నెలల వయస్సున్నప్పుడు తను చాలా అంటే చాలా ఏడ్చింది. అసలు సమస్యేమిటో మాకు ఏమాత్రం అర్థంకాలేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తను ఏడుస్తూనే ఉండేది. చివరికి నేను మా సిస్టర్ బాధ చూడలేక బాబాతో, "బాబా! పాప ఏడవటం ఆపితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవలన పాప కొంచెం కొంచంగా ఏడవటం ఆపింది. ఇంకోసారి కూడా పాప చాలా ఏడవడం మొదలుపెట్టి ఏం చేసినా ఏడుపు ఆపకుండా నిరంతరాయంగా 3 రోజులపాటు ఏడుస్తూనే ఉంది. అప్పుడు మా సిస్టర్, "బాబా! పాప ఏడుపు ఆపితే కిచిడి నైవేద్యంగా పెడతాను. అలాగే బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకుంది. బాబా దయవల్ల పాప ఏడుపు ఆపింది. "ధన్యవాదాలు బాబా! నా నిర్లక్ష్యం వల్ల ఈ అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యమైంది. దయచేసి నన్ను క్షమించండి. బాబా! నాకున్న హార్ట్ ప్రాబ్లమ్ వల్ల వచ్చిన సంబంధాలు కుదరడం లేదు. మీకు తెలుసు, నేను ఎంత బాధపడుతున్నానో! నా జీవితానికి ఒక దారిని చూపండి ప్లీజ్ బాబా. మిమ్మల్ని హృదయపూర్వకంగా ఎన్నోసార్లు అమ్మా అని పిలిచాను. నా మనస్సులో ఉన్నది జరిగేలా చూడండి. మీ సమాధానం కోసం ఎంతో ఎదురుచూస్తున్నాను. రెండు సంవత్సరాల నుండి ఇప్పటి వరకూ మీకు చెప్పుకుంటూనే ఉన్నాను కానీ, ఒక్క మిరాకిల్ కూడా జరుగలేదు బాబా. ఇక మీ దయ బాబా. చివరిగా దయచేసి కరోనా బారినుండి అందరినీ కాపాడండి".
సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!!!
చెప్పుకున్నంతనే ఆరోగ్యాన్ని ప్రసాదించిన సాయి
అందరికీ నమస్తే. నాపేరు శ్రీనివాసరావు. 2022, జనవరి నెల చివరి వారంలో బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. 2022, జనవరి 25న విపరీతమైన గ్యాస్ వల్ల నా పొట్ట అంతా బిగుసుకుపోయింది. దాంతో విపరీతమైన వెన్నునొప్పి వచ్చి నేను చాలా ఇబ్బందిపడ్డాను. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. పైగా గ్యాస్ పైకి ఎగదన్నుతుండటం వల్ల నేను మరింత ఇబ్బందిపడ్డాను. చివరికి నా తండ్రి బాబాను "బాబా! నువ్వే ఈ బాధనుండి బయటపడవేయాలి" అని ప్రార్థిస్తూ ఊదీ నా పొట్టపై రాసుకున్నాను. మరుసటిరోజుకి బాబా నాకున్న ఇబ్బందిని తొలగించారు. ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటానని బాబాకి మాట ఇచ్చినట్లుగా మీతో పంచుకుంటున్నాను.
2022, జనవరి 23న నా భార్యకు 99 డిగ్రీల జ్వరం వచ్చింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల నా భార్య చాలా భయపడింది. తను, "బాబా! నాకు జ్వరం తగ్గి, కరోనా వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి. అలా అయినట్లయితే గురువారం మీకు పూజచేసి వెజ్ బిర్యాని నైవేద్యంగా పెడతాను" అని బాబాకి మొక్కుకుంది. విచిత్రంగా ఒక్క మందు బిళ్ళ అయిన వేసుకోకుండానే మళ్లీ జ్వరం రాకుండా నా భార్య ఆరోగ్యం కుదుటపరిచారు బాబా. సంతోషంగా గురువారం బాబాకి పూజచేసి బిర్యాని నివేదించి మొక్కు తీర్చుకున్నాము. "ధన్యవాదాలు బాబా. ఇలాగే మా పిల్లల్ని మంచి ఆరోగ్యంతో, మంచి నడవడికతో, ఎటువంటి చెడు ఆలోచనలు కలగకుండా ఉండేలా, మంచి బుద్ధితో పదిమందికి సహాయం చేసేలా, ఇంకా భవిష్యత్‍లో వాళ్ళు మంచి వృద్ధిలో ఉండేటట్లు అనుగ్రహించండి. మీ దీవెనలు ఎల్లవేళలా మా అందరిపై ఉండాలి తండ్రి".
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam. Bless me TO PASs in MBA exam. Jaisairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDelete