ఈ భాగంలో అనుభవం:
- బాబా ప్రసాదించిన అనుభవమొకటే - ఆనందమెందరికో?
బాబా ప్రేమ అద్భుతం, వారి చర్యలు అనంతం. వారు ప్రసాదించే అనుభవం చూసేందుకు చిన్నదిగా అనిపించినా అంతర్లీనంగా ఎన్నో హృదయాలను పరవశింపజేసే వారి ప్రేమమాధుర్యం వారు అనుగ్రహిస్తేగాని మన మనస్సు గుర్తించలేదు. నేనిప్పుడు పంచుకోబోయే నా స్వీయానుభవం అటువంటిదే. 2021, జులై 31 రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను శిరిడీలో బాబా దర్శనం కోసం క్యూలో నిల్చొని ఉన్నాను. ఇంకా ఆ కలలోనే ఒక సాయి అక్క తాను శిరిడీ వెళ్ళొచ్చానని, బాబా ప్రసాదం, ఊదీ ఇస్తూ కనిపించారు. అయితే అప్పుడు నేను శిరిడీలోనే ఉన్నానా, లేక వేరే ఏ చోట ఉన్నానా అన్నది తెలియదు. బాబా దర్శనం కాకపోయినప్పటికీ శిరిడీలో ఉన్నందుకు, బాబా ప్రసాదం, ఊదీ లభించినందుకు కలలోనే నాకు ఎంతో ఆనందానుభూతి కలిగింది. ఉదయం లేచాక కూడా చాలా ఆనందంగా అనిపించి, ఆ సాయి అక్కకి కల గురించి మెసేజ్ చేసి నా రోజువారీ పనుల్లో పడ్డాను. చిన్న అనుభవంలా ఉన్నా ఈ అనుభవం వెనుక ఎంత బాబా అనుగ్రహం దాగి ఉందో ఇప్పుడు వివరిస్తాను.
శిరిడీ దర్శనం కోసం నా మనసు ఎప్పుడూ అరాటపడుతుంటుంది. కానీ నాకున్న పరిస్థితులు వలన పదేపదే వెళ్ళలేక కనీసం సంవత్సరానికి ఒకసారైనా శిరిడీ వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఆ ఘడియకోసం సంవత్సరమంతా నీరిక్షిస్తూ ఉంటాను. అలాంటిది కరోనా కారణంగా శిరిడీ వెళ్లొచ్చి సంవత్సరంన్నర కాలం దాటినా మళ్ళీ శిరిడీ వెళ్ళే సమయం రాక నా మనసులో చాలా బాధ ఉంది. ముఖ్యంగా శిరిడీకి సంబంధించిన వీడియో ఏదైనా చూస్తే, ఆ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. 2021, జూన్/జూలై నెలలో ఒకరోజు నేను బాధతో, "బాబా! మీ దర్శనానికి మమ్మల్ని ఎలాగూ శిరిడీకి పిలవట్లేదు. కనీసం ఎవరి ద్వారానైనా ఊదీ, ప్రసాదం పంపవచ్చు కదా బాబా!" అని అనుకున్నాను. తరువాత 2021, జూలై 19న పోస్టల్ ద్వారా శిరిడీ నుండి ఒక కవరు వచ్చింది. అందులో ఊదీ ఉండి ఉంటుంది అనుకున్నాం గాని, కరోనా కారణంగా మా తమ్ముడు ఆ కవర్ వెంటనే ఓపెన్ చేయకుండా ఓ చోట ఉంచాడు. నేను మాత్రం శిరిడీ నుండి బాబా ఊదీ వచ్చిందని చాలా ఆనందించాను. అయితే, నేను అడిగినందుకే బాబా ఆ ఊదీ పంపారని గ్రహించక 'కొన్నిరోజుల ముందు నేను ఆన్లైన్‍లో ఊదీకోసం ఒక ఫార్మ్ ఫిల్ చేసినందువల్లే ఆ ఊదీ వచ్చింద'ని అనుకున్నాను. అదలా ఉంచితే, నేను నా బ్లాగు వర్క్ లో బిజీగా ఉంటూ ఎప్పుడూ బాబా ప్రేమను పంచుకునే ఒక అత్యంత అప్తురాలైన సాయిబంధువుతో కొన్నిరోజులుగా మునుపటిలా తరచు మాట్లాడట్లేదు. మధ్యలో ఎప్పుడైనా మాట్లాడినా బాబా ప్రేమ గురించికాక ఏవో విషయాలు మాట్లాడుకుని కలత చెందుతున్నాము. అందువల్ల నేను బాబాను, "మేము ఏదేదో మాట్లాడుకుని అనవసరంగా కలత చెందుతున్నాం బాబా. మీ ప్రేమను పంచుకుంటూ ఆనందంగా కన్నీళ్లు పెట్టుకునేలా అందమైన ఒక అనుభవాన్ని ఇవ్వండి బాబా" అని అడిగాను. తరువాత ఒకటి, రెండు రోజుల్లో 2021, జూలై 31న మా తమ్ముడు జూలై 19న శిరిడీ నుండి వచ్చిన కవర్ ఓపెన్ చేసాడు. అందులో ఊదీ, ప్రసాదం తోపాటు ఒక రశీదు ఉంది. ఆ రశీదు ద్వారా అర్థమైంది ఏమిటంటే, '2021, జూన్ 16న మా తమ్ముడు ఆన్లైన్‍లో బాబా అభిషేకానికి డబ్బులు కట్టిన దానికి బదులుగా ఆ ఊదీ ప్రసాదాలు పంపబడ్డాయి' అని. నిజానికి మా తమ్ముడు ప్రతినెలా ఆన్లైన్‍లో శిరిడీ సంస్థాన్‍కి డబ్బులు కడుతుంటాడు. అయితే, ఇంతకుముందెన్నడూ మాకు శిరిడీ నుండి ఊదీ, ప్రసాదాలు రాలేదు. అదే మొదటిసారి. అప్పుడు శిరిడీ దర్శనభాగ్యం లేనందుకు బాధతో ఊదీ, ప్రసాదాలు పంపమని బాబాను అడిగినందుకు ఆయన ఈవిధంగా అనుగ్రహించారని నాకు స్పష్టంగా అర్థమై చెప్పలేని ఆనందం కలిగింది. ఆ రాత్రే నేను మొదట్లో చెప్పిన కల ద్వారా నన్ను శిరిడీలో ఉండేలా అనుగ్రహించి, ఊదీ ప్రసాదాలు కూడా ఇచ్చి మరోసారి తమ అనుగ్రహానికి నిదర్శనం ఇచ్చారు బాబా. ఇదంతా బాబా నాకు ప్రసాదించిన అనుభవానికి సంబంధించి ఒక కోణం. ఇక మరో కోణం చూడండి.
రాత్రి నాకొచ్చిన కల గురించి కలలో కనిపించిన సాయి అక్కకు ఉదయం మెసేజ్ పెట్టి నా రోజువారీ పనుల్లో పడ్డాను అని చెప్పాను కదా! నేను నా పనులన్నీ పూర్తి చేసుకుని ఉదయం 9:20కి వాట్సాప్ ఆన్ చేసి చూస్తే, అక్క 'దయచేసి వీలు చూసుకుని నాకొక్కసారి ఫోన్ చేయి సాయి' అని మెసేజ్ పెట్టి ఉన్నారు. 'అలాగే చేస్తాన'ని రిప్లై ఇచ్చాను. కాసేపాగి తనకి ఫోన్ చేద్దామని ఫోన్ తీస్తే, అప్పటికే తను రెండు, మూడు సార్లు కాల్ చేసి ఉన్నారు. అంటే నాకొచ్చిన కలకి తనకి ఏదో సంబంధం ఉందనుకుంటూ బాబా లీల ఏమిటో చూద్దామని కుతూహలంగా అక్కకి ఫోన్ చేశాను. అక్క ఫోన్ లిఫ్ట్ చేస్తునే చాలా ఆనందంగా మాట్లాడారు. నేను, "అక్కా! ఏమిటి విషయం? మీకు కూడా ఏదైనా అనుభవమా?" అని అడిగాను. అందుకు తను, "నువ్వు ముందు నీకొచ్చిన కల గురించి చెప్పు. తరువాత నేను చెప్తాను?" అన్నారు. సరేనని నా కల గురించి అక్కతో చెప్పాను. అప్పుడు అక్క, "నాకు చాలా సంతోషంగా ఉంది. నీకొచ్చిన కల ద్వారా బాబా నాకు సమాధానమిచ్చారు" అని అన్నారు. అదెలా అక్క అని అడిగితే, తనిలా చెప్పారు:
"2021, జూలై 24, శనివారం, గురుపౌర్ణమి రోజు ఉదయం నేను రోజులాగే బాబా గుడికి వెళ్ళాను. బాబాకి అభిషేకం జరిగే సమయానికి నా స్నేహితురాలు గుడికి వచ్చింది. అప్పుడే తనను గుర్తు చేసుకున్నాము. అంతలోనే బాబా పంపినట్లు తను వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపించింది. ఆ విషయమే నేను తనతో చెపుదామని తన దగ్గరకి వెళ్లి, "ఇప్పుడే నిన్ను గుర్తు చేసుకున్నాము" అని అన్నాను. అప్పుడు తను 'నేనే బాబా భక్తురాలిని' అన్నట్లు ఒక విధమైన చూపు చూసి, ఏమీ మాట్లాడలేదు. ఆ సమయంలో తన ముఖకవళికలు నాకు ఒకరకంగా కనిపించాయి. తరువాత అక్కడున్నంతసేపూ నేను తనతో మాట్లాడాలని చూసానుకానీ, తను ఒక విధంగా ప్రవర్తించింది. తన ఆ ప్రవర్తన వల్ల నా మనసుకి బాధగా అనిపించింది. తర్వాత వచ్చిన గురువారం నాటికి కూడా నా మనసులో ఆ బాధ అలానే ఉంది. ఆరోజు నేను బాబా ముందు కూర్చుని బాధపడుతుంటే, రెండు, మూడు సంవత్సరాల క్రితం, 'నాకు బాబాపట్ల అంత లోతైన భక్తి లేద'ని నీ స్నేహితుడు అన్న మాటలు గుర్తొచ్చాయి. దాంతో బాబా ముందర చాలా బాధపడి, "నేను నిజంగా మీ భక్తురాలినైతే సాయి తమ్ముడికి ఏవిధంగానైనా కలలో దర్శనమిచ్చి చూపించు బాబా" అని వేడుకున్నాను. ఆ రోజంతా బాధపడుతూనే ఉన్న నేను మరుసటిరోజు ఉదయానికి మాత్రం ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. ఈరోజు (రెండురోజుల తర్వాత ఆదివారం) ఉదయం నాకు నీ నుండి "అక్కా! రాత్రి నేను శిరిడీ వెళ్లినట్లు కల వచ్చింది. ఇంకా ఆ కలలో మీరు కూడా శిరిడీ వెళ్ళొచ్చానని, బాబా ప్రసాదం, ఊదీ నాకు ఇస్తు కనిపించారు. బాబా దర్శనం కాలేదుగానీ, శిరిడీ వెళ్లినట్లు, బాబా ప్రసాదం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది అక్కా. ఇంతకన్నా వివరాలేవీ గుర్తు లేదు కానీ, చాలా సంతోషంగా ఉంది" అని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడగానే నా కళ్ళనుండి జలజలా కన్నీరు కారిపోయింది. నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. ఆ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో అర్థంకాక, నాలో నేనే దాచుకోలేక చాలా సతమతమయ్యాను. చివరికి నీతోనే ఇలా పంచుకుంటున్నాను. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది తమ్ముడు. రెండురోజుల ముందు బాధతో బాబాను అడిగిన దానికి నీకు స్వప్నదర్శనమిచ్చి, 'నేను తమ భక్తురాలిన'ని బాబా నిదర్శనమిచ్చారు. నాకు ఇంతకన్నా ఏం కావాలి?" అని.
అక్క చెప్పింది విన్నాక నా ఆనందం రెట్టింపు అయింది. సాధారణంగా నాకు ఎప్పుడోగాని కలలు రావు. ఒకవేళ వచ్చినగాని అందులో బాబా దర్శనమివ్వడం, తెలిసిన వ్యక్తులు కనిపించడమన్నది చాలా అరుదు. అలాంటిది కలలో అక్క కనిపించడం, తను శిరిడీ వెళ్ళొచ్చానని నాకు ఊదీ, ప్రసాదాలు ఇవ్వడం, ఆపై ఈ కల ద్వారా అక్కకు సమాధానమిచ్చి తన మనసులో చోటుచేసుకున్న బాధను తొలగించడం అపారమైన బాబా కృపకు నిదర్శనం. ఇకపోతే బాబా ప్రసాదించిన ఈ ఆనందాన్ని ముగ్గురు సాయి బంధువులతో పంచుకుంటే, అటు వాళ్ళకో, ఇటు నాకో ఏదో ఒక విషయంలో సమాధానం దొరకడం లేదా స్పష్టత రావడం జరగడంతో చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. ఒకే అనుభవం ఎందరికి ఆనందాన్ని ఇచ్చిందో చూడండి! ఇది ఇక్కడితో ఆగదు కూడా. ఎందుకంటే, ఇలా మనం పంచుకునే ఈ అనుభవాలు ఎందరో మనసులను స్పృశిస్తాయి. వాళ్ళలో కొందరికి మనఃశాంతినిస్తాయి, ఇంకా కొందరికి ధైర్యాన్నిస్తాయి, మరికొందరిని బాబా ప్రేమలో పరవశింపజేస్తాయి, ఒక్క మాటలో చెప్పాలంటే వారివారి మనఃస్థితిని బట్టి వారికి అనుసంధానమవుతాయి. అదే బాబా ప్రత్యేకత. మాములుగా చూస్తే, నేను బాబాను అడిగిన వాటికి (ఊదీ ప్రసాదాలు, అందమైన అనుభవం), అక్క బాబాను అడిగినదానికి ఏ సంబంధమూ లేదు. కానీ బాబా తాము ప్రసాదించిన ఆ కల గురించి అక్కకు మెసేజ్ పెట్టాలన్న ప్రేరణనిచ్చి తద్వారా ఇంత లీలను ఆవిష్కృతం చేసారు. "థాంక్యూ సో మచ్ బాబా. నేను కోరుకున్నట్లే మీ ప్రేమకు కన్నీళ్లపర్యంతమయ్యే అనుభవాన్ని ప్రసాదించారు. ఎప్పుడూ ఇలాగే మీ ప్రేమలో మేమంతా ఆనందంగా ఉండేలా అనుగ్రహించండి బాబా".
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram om sai ram om sai ram����❤️
ReplyDeleteJaisairam
ReplyDeleteBless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me and help to pass my MBA exams .jaisairam