1. శ్రీసాయి అనుగ్రహ ధారలు
2. ఓపికగా ఉంటే బాబా మనకి ఏదో ఒక దారి చూపిస్తారు
3. మేరే బాబా
శ్రీసాయి అనుగ్రహ ధారలు
సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. తను తన కల నెరవేర్చుకోవడం కోసం హైదరాబాద్ వెళ్లాడు. తను అక్కడికి వెళ్ళడానికి కొన్నిరోజుల ముందు తన అక్క తనకొక వెండి బ్రేస్లెట్ కొనిచ్చింది. ఆ బ్రేస్లెట్‍ను తను హైదరాబాద్ వెళ్లిన తరువాత ఎక్కడో పోగొట్టుకున్నాడు. దానికోసం తను ఎంత వెతికినా అది కనిపించలేదు. అప్పుడు నేను, 'తన బ్రేస్లెట్ తనకి దొరకాల'ని బాబాతో చెప్పుకున్నాను. అదేరోజు సాయంత్రం ఆ బ్రేస్లెట్ తనకి దొరికింది. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే, తను మొత్తం అంతా వెతికినా దొరకనిది, బాబాతో చెప్పుకున్నంతనే దొరికింది. "ధన్యవాదాలు బాబా. నిజంగా మీ లీలలు అద్భుతం".
నేను ఒకసారి వేరే ఊరు వెళ్లి తిరిగి మా ఊరు రావాల్సి ఉండగా ఆ ఊరి నుండి సరైన బస్సు సదుపాయం లేదు. అంటే బస్సులు అంతగా ఉండవు. కానీ సమయానికి మా ఊరు వెళ్లాల్సిన అవసరం నాకు చాలా ఉంది. అందుచేత నేను బాబాతో, "బాబా! నేను వెళ్ళడానికి సౌకర్యంగా ఉండే బస్సు, అదికూడా నేను అనుకున్న సమయానికి వచ్చేలా చూడండి బాబా. ఎందుకంటే, నేను సమయానికి తప్పనిసరిగా వెళ్ళాలి" అని చెప్పుకున్నాను. అంతే, నేను అనుకున్న బస్సు ఐదు నిమిషాల్లో వచ్చింది. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నేను అనుకున్న బస్సుకోసం నేను ఖచ్చితంగా ఒక గంట సమయమైనా వేచి చూడాలి. అలాంటిది ఐదు నిమిషాల్లోనే వచ్చేసరికి అది బాబా దయ అని నేను పూర్తిగా నమ్మాను. "ధన్యవాదాలు బాబా!".
2022, భోగిరోజు రాత్రి హఠాత్తుగా నాకు చలిజ్వరం వచ్చి నా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. నేను తట్టుకోలేక ఏడుస్తూ బాబాని తలుచుకుని, "బాబా! నేను ఈ బాధని భరించలేకపోతున్నాను. ఉదయానికి కొంచమైనా నా పరిస్థితి అదుపులోకి తీసుకురండి" అని చెప్పుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను. ఇంకా మధ్యలో లేవకుండా తెల్లారేవరకు ప్రశాంతంగా నిద్రపోయాను. ఉదయానికి జ్వరం తగ్గి నార్మల్ అయ్యాను. కానీ సాయంత్రానికి మళ్ళీ జ్వరం రావడమే కాకుండా వెన్నునొప్పి మొదలైంది. నేను బాధతో బాబాకి చెప్పుకుంటూ ఏడుస్తుంటే, నన్ను చూసి మా అమ్మానాన్న కూడా బాధపడసాగారు. ఆ రోజు సంక్రాంతి అయినందున ఏ డాక్టరుకి ఫోన్ చేసినా సరైన స్పందన లేదు. ఇంకా నేను బాబాని పిలుస్తూ, "నేను బాధని తట్టుకోలేకపోతున్నాను. మీరైనా రండి బాబా. నన్ను ఈ బాధనుంచి బయటపడేయండి బాబా" అని అడగసాగాను. అంతలో అనుకోకుండా ఒక డాక్టరు వచ్చి, "మీరు కాల్ చేశారు. నాకు రావడానికి అవ్వదేమో అనుకున్నాను. కాని, రాగలిగాను" అని అన్నారు. నేను బాబానే ఆయనను పంపించారు అనుకున్నాను. "ఎల్లప్పుడూ నాతో ఉండి నన్ను, నా కుటుంబాన్ని రక్షిస్తున్నందుకు మీకు పాదాభివందనాలు బాబా".
ఒకరోజు చిన్న గొడవ కారణంగా ఏదో ఆవేశంలో ఏదీ ఆలోచించుకోకుండా నా 'ఫోన్ పే' నుంచి వేరొక 'ఫోన్ పే' అకౌంటుకి 58,000 రూపాయలు పంపించాను. కాని ఆ డబ్బులు ఆ అకౌంటుకి వెళ్లకుండా ప్రాసెస్‍లో ఉండిపోయాయి. మరుసటిరోజు 'ఫెయిల్డ్' అని మెసేజ్ వచ్చింది. ఇంకంతే, రోజూ 'ఫోన్ పే'లో రిక్వెస్ట్ పెడుతున్నా నా డబ్బులు నా అకౌంటులోకి తిరిగి రాలేదు. నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే, నా దగ్గరగాని, నేను పంపించాల్సిన వాళ్ళ దగ్గరగాని ఆ డబ్బులు తప్ప ఒక్క రూపాయి కూడా లేవు. ఇంకా ఆ డబ్బులు మాకు రావేమో అనుకున్నాము. అప్పటికే నాలుగు రోజులు అవుతుంది. టెక్నాలజీ గురించి నాకు అంతగా తెలియనందున ఇంకేం చేయాలో తెలియలేదు. అంతే బాబాకి చెప్పుకున్నాను, "బాబా ఈ రోజు బుధవారం. రేపు గురువారం అంటే మీ రోజు. నాకు నా డబ్బులు రేపు ఖచ్చితంగా వస్తాయని నేను నమ్ముతున్నాను బాబా" అని. బాబా లీలలు చెప్పలేనంత అద్భుతంగా ఉంటాయి. ఆయన తన బిడ్డలను ఎప్పుడూ నష్టపోనివ్వరు. నేను అడిగినట్లుగానే గురువారం సాయంత్రానికి నా డబ్బులు నాకు వచ్చేలా చేశారు బాబా. నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా డబ్బులు నాకు వచ్చినందుకు కాదు, బాబా కృపకి నేను పాత్రురాలినైనందుకు. "ధన్యవాదాలు బాబా. మీ పాదాలకు నా శతకోటి వందనాలు బాబా".
ఓపికగా ఉంటే బాబా మనకి ఏదో ఒక దారి చూపిస్తారు
తోటి సాయి భక్తులకి నమస్కారం. నా పేరు రజనీకాంత్. 2021లో నేను ఎమ్.సి.ఏ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పుడు మా అక్క, "బాబా పూజ చేయి. నీకు మంచి ఫలితం వస్తుంది" అని చెప్పింది. నేను వెంటనే ఐదు వారాల సాయి దివ్యపూజ మొదలుపెట్టి, "ఐదు వారాలు పూర్తయ్యేలోపు నాకు ఒక ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించు తండ్రి" అని దణ్ణం పెట్టుకున్నాను. అయితే నేను ఎప్పుడూ బాబాను, "నేను నా ఉద్యోగం కోసం తగినంత ప్రయత్నం చేస్తాను. నాకు సదా తోడుగా ఉండి నా కష్టానికి తగ్గ ఫలితం వచ్చేలా చూడు తండ్రి" అని దణ్ణం పెట్టుకునేవాడిని. కానీ ఐదు వారాలు పూజ పూర్తి చేసాక కూడా నాకు ఉద్యోగం రాలేదు. అయినా నేను నమ్మకం కోల్పోకుండా మా అమ్మని కూడా దివ్యపూజ చేయమని చెప్పాను. దాంతో అమ్మ 9 వారాలు దివ్యపూజ మొదలుపెట్టింది. కొన్ని ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు అయ్యాయి. అంతా బాగానే ఉంది కానీ, ఆపై నాకు ఏ కాల్ రాలేదు. అమ్మ పూజలో ఎనిమిది వారాలు పూర్తయి తొమ్మిదో వారం దగ్గరలో ఉండగా పరిస్థితులు కొంచం ఇబ్బందిగా మారాయి. ఇంకా నేను, "బాబా! ఏదో ఒక ఉద్యోగం వచ్చేలా దయ చూపు తండ్రి" అని అనుకుంటుండేవాడిని. తొమ్మిదో వారంనాడు నేను, "బాబా! నేను అడిగింది ఇంకా అవ్వట్లేదు. అయినా మీకు ఏది మంచిదనిపిస్తే అదే మీరు చేయండి బాబా" అని అనుకున్నాను. అలా అనుకున్న పది నిమిషాలకి నేను ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యానని తెలియజేస్తూ నాకు ఒక మెయిల్ వచ్చింది. "థాంక్యూ బాబా. అనుకున్న మెయిల్ వచ్చింది. నిజానికి వాళ్ళు సరిగ్గా స్పందించే వాళ్ళు కాదు. అయినా నేను ఎప్పుడూ బాధపడలేదు. అయ్యేది అవుతుందని ఎదురు చూసి చూసి నాకేది మంచిదైతే అది చేయండి అనుకున్నాను. మీ దయవల్ల ఒకసారి కాల్ వచ్చింది. కానీ మళ్ళీ గ్యాప్ వచ్చింది. అప్పుడు కూడా మీకేది మంచిది అనిపిస్తే అది చేయండి అనుకున్నాను. ఈసారి కాల్‍తో పాటు ఆఫర్ లెటర్ వచ్చింది. ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ ప్యాకేజీ వచ్చింది. థాంక్యూ బాబా. ఏం చేయాలో తెలియనప్పుడు నాకు ఉద్యోగావకాశం వచ్చేలా చేసారు. నేను ఎప్పుడూ మిమ్మల్ని కోరుకునేది ఒకటే బాబా. నాకు తండ్రి లేరు. నా తండ్రి స్థానంలో మీరుండి నన్ను ఎల్లప్పుడూ నడిపించండి బాబా. ఎప్పుడైనా, ఏమైనా తెలిసీతెలియక తప్పులు చేసి ఉంటే క్షమించు తండ్రి. ఇంకా ఈ ఉద్యోగంలో నాకెప్పుడూ తోడుండి నా కష్టానికి ఫలితం చూపించమని కోరుకుంటున్నాను తండ్రి". చివరిగా ఈ అనుభవం ద్వారా నాకు ఓపికగా ఉంటే బాబా మనకి ఏదో ఒక దారి చూపిస్తారన్న నమ్మకం కలిగింది.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
మేరే బాబా
సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు ఉమ. నాకు నా బాబాపట్ల చాలా విశ్వాసం. మా అమ్మకి 85 సంవత్సరాలు. ఆమె 2022, జనవరి నెల చివరిలో జ్వరం, ఒళ్లునొప్పులతో బాగా నీరసించిపోయింది. ఆ సమయంలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉన్నందున నాకు భయమేసి, "బాబా! అమ్మను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి" అని బాబాను శరణువేడాను. ఆ తర్వాత మేము అమ్మకి కోవిడ్ టెస్టు చేయించాము. టెస్టు చేసేటప్పుడు నేను, "బాబా! మీరు మా దయగల తండ్రి. దయచేసి అమ్మకి నెగిటివ్ వచ్చేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. ఆయన దయవల్ల రిపోర్టులో నెగిటివ్ అని వచ్చింది. "మేరే బాబా, ఓ కరుణామయ తండ్రి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను మేరే బాబా. సదా మాకు మంచి జరిగేటట్లు చూడండి మేరే దయామయ తండ్రి".
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam. Bless me for my MBA exam and help me to pass the exam. Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDelete