సాయి వచనం:-
'ఈ మసీదును ఆశ్రయించినవారి చెడుకాలం అంతరిస్తుంది. ఈ ద్వారకామాయిలో అడుగిడినవారి జీవితనౌక సురక్షితంగా ఆవలితీరానికి చేరుకుంటుంది. దీన్ను గుర్తుంచుకోండి. ఇక అన్ని చింతలూ మరచిపొండి.'

'సంస్కరణాకార్యంలో భాగంగానే సద్గురువు మనకు అనుభవాలు ప్రసాదిస్తారు. సద్గురువు ప్రసాదించే ప్రతి అనుభవం వల్ల మనలో మార్పు, సంస్కార పరిణతి రావాలి' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1088వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రిన్సిపాల్ మనసు మార్చి సహాయం చేసిన బాబా
2. మనసు కుదుటపరిచి సమస్య లేకుండా చేసిన బాబా

ప్రిన్సిపాల్ మనసు మార్చి సహాయం చేసిన బాబా

సాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇప్పుడు మీతో బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఇంటర్మీడియెట్ పూర్తిచేసి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరాను. ఒకసారి నేను ఇంటర్మీడియట్ చదివిన కాలేజీలో ఉన్న నా సర్టిఫికెట్లకోసం కాలేజీకి వెళ్ళాను. అయితే నేను చదివినప్పుడు ఉన్న ప్రిన్సిపాల్ స్థానంలో కొత్త ప్రిన్సిపాల్ వచ్చి ఉన్నారు. ఆ ప్రిన్సిపాల్ సర్టిఫికెట్లు కావాలంటే 18 వేల రూపాయలు కట్టాలని, ఒక్క రూపాయి తగ్గినా ఎవరికీ సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని అన్నారు. దాంతో నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! పది వేల రూపాయలు కట్టాల్సిన దానికి అన్యాయంగా 18 వేల రూపాయలు కట్టమంటున్నారు. 10 వేల రూపాయలకే నా సర్టిఫికెట్లు నా చేతికి వచ్చేలా అనుగ్రహించండి" అని ప్రార్థించాను. తరువాత మా నాన్న తన స్నేహితుడితో కలసి కాలేజీకి వెళ్లారు. అప్పుడు కూడా ఆ ప్రిన్సిపాల్ 18,000 రూపాయలు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని అన్నారు. నేను మళ్ళీ నమ్మకంతో బాబాను ప్రార్థించాను. 15 నిమిషాల తర్వాత ప్రిన్సిపాల్ తన మనసు మార్చుకుని 10,000 రూపాయలు కడితే సర్టిఫికెట్లు ఇస్తానని ఫోన్ చేశారు. ఇలా ప్రతీసారి నన్ను కాపాడుతున్న బాబాకు నేను భక్తురాలినవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

మనసు కుదుటపరిచి సమస్య లేకుండా చేసిన బాబా

సాయి బంధువులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా నాయందు ఎప్పుడూ ఉంటూ పిలిచిన వెంటనే పలికే సాయి తండ్రికి కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నాకు ఈ మధ్యనే వివాహం నిశ్చయమైంది. ఒకరోజు నేను నాకు కాబోయే భర్తతో మాట్లాడుతూ మాటల మధ్యలో, "నీ విషయంలో నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను" అని అనేశాను. ఆ మాటలకి తను 'నువ్వు నాకొద్దు' అనేంతలా బాధపడ్డారు. నాకు ఏం చేయాలో తెలియక, "బాబా! నేను తప్పు చేశాను. తన విషయంలో మాట జారాను" అని బాధతో బాబాకి చెప్పుకుని, "నన్ను మీరే కాపాడాలి బాబా. తన మనసు కుదుటపడి మునుపటిలా నార్మల్‌గా ఉండాలి" అని వేడుకున్నాను. సాయికి నాపై దయ కలిగి నాకు కాబోయే భర్త మనసును కుదుటపరిచారు. తను నాతో బాగా ఉండసాగారు. "నన్ను నమ్మిన వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టన"ని బాబా చెప్పారు. అది అక్షరసత్యం. "థాంక్యూ బాబా".


7 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Na manasu kuduta parachi aayana manasuni marchandi baaba🙏🙏🙏

    ReplyDelete
  3. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  4. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

    ReplyDelete
  7. Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house construction complete chaindi manchi varini rent ki pampandi naku unna e problem solve cheyandi pl

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo