1. నమ్మకం ఉంటే బాబా అనుగ్రహానికి కొదవలేదు
2. అద్భుత రీతిన బాబా ప్రసాదించిన ఉద్యోగం
3. బాబా దయతో కుదుటపడిన ఆరోగ్యం
నమ్మకం ఉంటే బాబా అనుగ్రహానికి కొదవలేదు
సద్గురు శ్రీసాయినాథునికి నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి భక్తులకు నా అభినందన పూర్వక కృతజ్ఞతలు. నా పేరు సత్యనారాయణ. మాది రావులపాలెం. 2021, మే నెలలో మా నాన్నగారు ఒక్కసారిగా విపరీతమైన, విరోచనాలతో అనారోగ్యంపాలై బాగా నీరసించిపోయారు. దగ్గర్లోని ఆసుపత్రిలో ఆయనను చేర్చగా టెస్టులు చేస్తే నాన్నకి కరోనా పాజిటివ్ వచ్చింది. తరువాత నాన్న ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. అప్పుడు నేను, "బాబా! మానాన్నగారికి స్వస్థత చేకూర్చి, మాకెవరికీ కరోనా రాకుండా ఉండేలా చూడండి తండ్రి. అలా జరిగితే ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని దణ్ణం పెట్టుకున్నాను. అలా బాబాను ప్రార్థించిన తర్వాత గంటకి నాన్న జ్వరం తగ్గడం మొదలై రెండు రోజుల్లో నార్మల్ అయి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. సాయినాథుని కృపవలన మా ఇంట్లో ఇంకెవ్వరికీ కరోనా సోకలేదు. ఆలస్యమైనా అనుకున్న ప్రకారం నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. "బాబా! ఆలస్యానికి క్షమించు తండ్రి".
తర్వాత ఒకసారి మా మేనల్లుడికి జ్వరం, జలుబు వచ్చాయి. అప్పుడు కూడా నేను మునపటిలాగే బాబాకి చెప్పుకుని దణ్ణం పెట్టుకున్నాను. మర్నాటికి కరోనా కాదని తెలియడమే కాకుండా జ్వరం, జలుబు తగ్గిపోయి వాడికి ఆరోగ్యం చేకూరింది. ఆ బాబా దయవలనే ఇది సాధ్యమైందని నా నమ్మకం. "కృతజ్ఞతలు సాయినాథా!".
కొన్నిరోజుల తరువాత ఒకరోజు రాత్రి హఠాత్తుగా గ్యాస్ట్రిక్ సమస్య వల్ల నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. వెంటనే నేను కొద్దిగా బాబా ఊదీ సేవించి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని స్మరిస్తూ నిద్రపోయాను. ఉదయానికి అంతా నార్మల్ అయింది. మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకుని కోరుకుంటే ఎటువంటి విషయంలోనైనా బాబా అనుగ్రహం పొందగలం. ఆయనే నా నమ్మకం. నమ్మకం ఉంటే బాబా అనుగ్రహానికి కొదవలేదు. "ధన్యవాదాలు బాబా. ఈ కరోనా బారినుండి అందరినీ కాపాడండి బాబా".
అద్భుత రీతిన బాబా ప్రసాదించిన ఉద్యోగం
నేను ఒక సాయి భక్తురాలిని. మన జీవితాలలో బాబా చేసే అద్భుతాలకు అంతులేదు. మనం ఎప్పుడూ ఆయనకి ఋణపడి ఉండాలి. మా పిల్లలిద్దరికీ ఉద్యోగం బాబానే ప్రసాదించారు. ముందుగా దయతో మా పెద్దబాబుకి మంచి ఉద్యోగం ప్రసాదించి మా బెంగను తీర్చారు. తరువాత మా చిన్నబాబు ఉద్యోగ విషయంలో బాబా చేసిన అద్భుతాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఆరునెలల క్రితం మా చిన్నబాబు బి.టెక్ పూర్తి చేశాడు. తనకి క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరిన తరువాత ఒకరోజు బాబు నాతో, "అమ్మా! నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది. నేను ఆ కంపెనీకి దరఖాస్తు చేయలేదుగానీ, వాళ్ళే ఇంటర్వ్యూకి పిలిచారు. నేను ఉద్యోగంలో చేరింది ఇప్పుడే కదా! ఇంతలోనే నాకు ఇంకో ఉద్యోగం ఎందుకు? ఒక సంవత్సరం అయ్యాక వేరే ఉద్యోగం గురించి చూస్తాను. కానీ వాళ్ళు పిలిచినందుకుగానూ ఊరికే ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను" అని అన్నాడు. నేను తనతో, "సరే, ముందు ఇంటర్వ్యూ సరిగ్గా ఇవ్వు. మిగిలిన విషయాలు ఇంటర్వ్యూ అయ్యాక చూడొచ్చు" అని చెప్పి నా అలవాటు ప్రకారం మన బాబా దగ్గరకి వెళ్లి, "తండ్రీ! మీ దయ. మీకు ఎలా అనిపిస్తే, అది చేయండి" అని ప్రార్థించి, ఊదీ బాబుకి పెట్టి బాబాకు దణ్ణం పెట్టుకున్నాను. ఆరోజు బాబా రోజు, గురువారం. ఆరోజు మధ్యాహ్నం చాలాసేపు ఇంటర్వ్యూ జరగడం, వాళ్ళు వెంటనే ఎంత జీతం కావాలని అడగడం, ఆఫరు లెటర్ ఇవ్వడం, వెంటనే ఉద్యోగంలో చేరాలని చెప్పడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అసలు ఒకేరోజులో అంతా జరిగిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. కొత్త ఉద్యోగం మేనేజర్ పోస్ట్. పైగా మేము ఉన్న ఊరిలోనే. కెరీర్ ప్రారంభంలోనే మేనేజర్ పోస్ట్ రావడమన్నది బాబా అపార అనుగ్రహానికి నిదర్శనం. "సాయినాథా! ప్రతిజన్మలోనూ మీరు మాకు తోడుగా ఉండి సదా మా యోగక్షేమాలు చూసుకుంటూ కాపాడు తండ్రి. మా పిల్లలిద్దరినీ మీ చేతుల్లో పెట్టాను. ఇక వాళ్ళ భారం మీదే. వాళ్లిద్దరూ అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి, ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నారు. మీ దయతో పెద్దబాబుకి త్వరగా వీసా వచ్చి ఎటువంటి ఆటంకాలు లేకుండా అమెరికా ప్రయాణమయ్యేలా ఆశీర్వదించు తండ్రి. అలాగే మా వ్యాపారం అభివృద్ధి చెందేలా, మావారికి ఉపాధి దొరికేలా అనుగ్రహించి తద్వారా ఋణ విముక్తి గావించి, మా ఆతురతలను తీసివేసి మమ్మల్ని ఒక ఒడ్డుకు చేర్చి మనఃశాంతిని ప్రసాదించు తండ్రి. అలాగే మాకు, మా మేనకోడలికి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి. తను మీ బిడ్డ తండ్రి. దయతో తనని బ్రతించించావు. కష్టపెట్టకు తండ్రి. తన భారాన్ని మీరు తీసుకుని తనపై దయచూపు తండ్రి".
బాబా దయతో కుదుటపడిన ఆరోగ్యం
సాయి భక్తులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను సాయి భక్తురాలిని. నేను ఇదివరకు ఈ బ్లాగులో చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు నేను ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి ఉన్నట్టుండి మా తమ్ముడికి జ్వరం, తలనొప్పి మొదలయ్యాయి. డాక్టరు దగ్గరికి వెళితే, టెస్టు చేసి కొన్ని టాబ్లెట్లతోపాటు ఇంజక్షన్ కూడా వ్రాశారు. హాస్పిటల్లోనే యాంటిబయోటిక్ ఇంజక్షన్ వేశాక ఇంటికి వచ్చాము. అయితే ఇంటికొచ్చాక తమ్ముడికి విరోచనాలు, వాంతులు కూడా మొదలయ్యాయి. టాబ్లెట్ వేసినా తగ్గలేదు. మరుసటిరోజు ఉదయం అర్.యమ్.పి డాక్టరుని పిలిపించి విరోచనాలు, వాంతులు తగ్గడానికి ఇంజక్షన్ చేయించి, సెలైన్ పెట్టించాం. దాంతో మా తమ్ముడు ఉన్నట్టుండి స్పృహ కోల్పోయాడు, ఒళ్లంతా చల్లబడిపోయింది. మేము చాలా భయపడిపోయి వెంటనే తమ్ముడిని హాస్పిటల్‍కి తీసుకెళ్ళాము. నేను, "బాబా! మా తమ్ముడు త్వరగా కోలుకుంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల తమ్ముడికి యాంటిబయోటిక్ ఇంజెక్షన్ పడలేదని చెప్పి టాబ్లెట్లు ఇచ్చారు. దాంతో తన ఆరోగ్యం కుదుటపడింది. అయితే నేను నా మ్రొక్కును మర్చిపోయాను. తరువాత అదివరకు నాకు ఒకసారి వచ్చి తగ్గిన ఒక అనారోగ్య సమస్య మళ్లీ మొదలైంది. అప్పుడు బాబాకి క్షమాపణలు చెప్పుకుని వెంటనే నా అనుభవాన్ని మీతో పంచుకోవడం కోసం బ్లాగు వారికి పంపించాను. "ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా. ఎల్లప్పుడూ మీ కృప మా అందరిపై ఉండేలా అనుగ్రహించు తండ్రి. మీ ప్రేమను ఇంకా ఇంకా తోటి భక్తులతో పంచుకునేందుకు నాకు చాలా చాలా అనుభవాలను ప్రసాదించు తండ్రి".
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm sai ram ��
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ReplyDelete