1. మనకు మంచిదైతే తప్పకుండ అనుగ్రహిస్తారు బాబా2. బాబా దయ
3. కోరుకున్న విధంగా అనుగ్రహిస్తారు బాబా
మనకు మంచిదైతే తప్పకుండ అనుగ్రహిస్తారు బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను సాయి భక్తురాలిని. సంవత్సరం క్రితం మేము ఇల్లు మారాము. అప్పుడు మా సామాన్లన్నీ మా నాన్న ఒక ట్రాలీ ఆటోలో ఎక్కించి కొత్త ఇంటికి బయలుదేరారు. నాన్న మధ్య దారిలో ఒక హోటల్లో ఆగి టిఫిన్ చేసారు. ఆపై కొత్త ఇంటికి వెళ్లి ఆటోలో సామాన్లన్నీ దింపేసి వెళ్లిపోయారు. ఒక వారం తరువాత చూస్తే, ఒక బాక్స్ కనిపించలేదు. అందులో చాలా బట్టలున్నాయి. నాన్న మధ్య దారిలో టిఫిన్ చేయడానికి హోటల్ వద్ద ఆగినప్పుడు ఎవరో ఆ బాక్స్ తీసుంటారని మేము అనుకున్నాము. అవి పోయినందుకు నాకు ఏమీ బాధ లేదు కానీ ఒక సంవత్సరం తరువాత, "బాబా! మా బట్టలు మాకు దొరికేలా చేయి తండ్రి" అని బాబాను వేడుకున్నాను. అవి ఎలాగూ దొరకవని తెలిసి కూడా నేను బాబాను "దయతో దొరికేలా చేయమ"ని అడిగినప్పటికీ ఆయన దయ చూపారు. ఇంటికి పెయింటింగ్ చేస్తున్నప్పుడు పైన అటకలో ఆ బట్టలు దొరికాయి. అసలు విషయమేంటంటే, ఇల్లు మారినప్పుడు వంటగదిలో అదనంగా ఉన్న సామాన్లన్నీ ప్యాక్ చేసి అమ్మ వాళ్ళింట్లో వేయాలని అనుకున్నాము. వాటితోపాటు పొరపాటున బట్టలున్న బాక్స్ కూడా వెళ్ళిపోయింది. ఏదేమైనా బాబా ఆశీర్వాదంతో దొరకవనుకున్నవి దొరికాయి. "బాబా! మీరే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, అన్నీ. దయతో మా బట్టలు మాకు దొరికేలా చేసిన మీకు చాలా చాలా ధన్యవాదాలు".
ఒకసారి మేము మా ప్లాటు ఒకటి అమ్మదలచి రిజిస్ట్రేషన్ కోసం తేదీ నిర్థారించుకున్నాము. అయితే రిజిస్ట్రేషన్ జరగాల్సిన తేదికి రెండురోజుల ముందు నుండి ఆ ప్లాటుకి సంబంధించిన పేపర్ల కోసం ఎంతలా వెతికినా రిజిస్ట్రేషన్ అనుకున్న రోజు మధ్యాహ్నం వరకు దొరకలేదు. దాంతో ఆరోజు రిజిస్ట్రేషన్ ఆపేసి పేపర్లు దొరికాక చేద్దామని అనుకున్నారు. నిజానికి ఆ పేపర్లు కనపడటంలేదన్న విషయం నాకు అప్పటివరకు తెలీదు. ఆరోజు మధ్యాహ్నమే నాతో చెప్పారు. నేను వెంటనే, "బాబా! పేపర్లు దొరికేలా చేసి రిజిస్ట్రేషన్ జరిగేలా చూడండి తండ్రి" అని బాబాను వేడుకున్నాను. బాబా చేసిన అద్భుతం చూడండి. రెండురోజులుగా దొరకని పేపర్లు బాబాను ప్రార్థించిన 15 నిమిషాల్లో దొరికాయి. ఇంకా అదేరోజు రిజిస్ట్రేషన్ జరిగింది. "మీ కరుణ గురించి ఏమని చెప్పను బాబా? మీ అశీస్సులు ఎప్పటికీ మాపై ఇలాగే ఉండేలా చూడు తండ్రి".
ఇకపోతే దయతో బాబా మా అమ్మాయికి ఉద్యోగాన్ని అనుగ్రహించారు. ఆ అనుభవం గురించి ఇప్పుడు చెప్తాను. 7 పోస్టులకు 400 మంది పోటీపడితే నా బిడ్డకి 8వ స్థానం వచ్చింది. కొద్దిపాటిలో అవకాశం చేజారిపోయిందని మేము చాలా బాధపడ్డాము. "బాబా! మీరే ఎలాగైనా మా అమ్మాయికి ఉద్యోగం వచ్చేలా చూడాలి తండ్రి" అని బాబాను వేడుకుని ఆయన మీద భారం వేసాము. బాబా మాపై దయ చూపారు. మా అమ్మాయికన్నా ముందున్న 7 మందిలో ఒకరు 'తనకి ఆ ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వచ్చింద'ని వెళ్లిపోయారు. అంతే, ఆ స్థానంలోకి నా బిడ్డను తీసుకున్నారు. బాబా కృపవల్ల తన ట్రైనింగ్ బాగానే జరిగింది. అయితే తర్వాత తనని సదరు పోస్టులోకి తీసుకునే ముందు 'నా బిడ్డ పెర్ఫార్మన్స్ బాగాలేద'ని ఒక మేనేజర్ అంటుండేవారు. అప్పుడు మేము మళ్ళీ బాబాను తలుచుకుని, "ఏమిటిది బాబా? మీరే ఈ సమస్య నుండి కాపాడి నా బిడ్డకి ఉద్యోగం వచ్చేలా చూడాలి తండ్రి" అని వేడుకున్నాము. ఒక నెలలో ఆ మేనేజర్ బదిలీ మీద వేరే చోటుకి వెళ్లిపోయేలా చేసారు బాబా. అలా జరుగుతుందని మేము అస్సలు అనుకోలేదు. మనకు మంచిదైతే ఎవరూ ఊహించని విధంగా బాబా అనుగ్రహిస్తారు. "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండేలా అనుగ్రహించు తండ్రి".

Omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteJaisairam bless me for the IIMC EMBA certificate course. Help me to pass in all module's with above average grade. Bless me in the world of yours Jaisairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram baba ma arogya samasyalani tondarga teerchu thandri sainatha pleaseeee thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDeleteఓం శ్రీ సాయిరాం 🙏🙏
ReplyDelete