సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2090వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృపతో వీసా ఆమోదం
2. కోరుకున్నట్లు అనుగ్రహించిన బాబా 

బాబా కృపతో వీసా ఆమోదం

సాయిభక్తులందరికీ నమస్కారం. నా తండ్రి సాయిబాబాకు పాదాభివందనాలు. నా పేరు శ్రీనివాసరావు. ఏమని చెప్పను నా తండ్రి నా జీవితంలో చేసిన అద్భుతాల గురించి? అధఃపాతాళంలో ఉన్న నాకు ఈ సమాజంలో గౌరవం కల్పించి, నా కుటుంబాన్ని ఎల్లపుడూ కాపాడుతూ ఉన్నారు నా తండ్రి బాబా. ఇప్పుడు నేను నా పెద్ద కుమారుని విషయంలో బాబా అనుగ్రహాన్ని పంచుకుంటున్నాను. నా పెద్ద కుమారుడి MS చదువు జర్మనీలో 2025, మార్చికి పూర్తైంది. తన వీసా 2026, మార్చి 18 వరకే ఉండటంతో ఆ లోపల తనకి ఉద్యోగం రాకపోతే తను ఇండియా తిరిగి వచ్చేయాలి. కాబట్టి తను చివరి సంవత్సరం చదువుతుండగానే ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తుండేవాడు. అయితే ఇంటర్వ్యూలు చాలా బాగా జరిగినప్పటికీ ఏదో ఒక అడ్డంకి వచ్చి కాల్ లెటర్లు మాత్రం వచ్చేవి కావు. అందువల్ల నా కుమారుడు చాలా నిరాశకు గురవుతుండేవాడు. మేము బాబాను, "నా కుమారునికి జీవితాన్ని ప్రసాదించమ"ని వేడుకుంటూ ఉండేవాళ్ళం. అందుకు బాబా, "నేను ఉన్నాను. తప్పక సహాయం చేస్తాను. శ్రద్ధ-సబూరీతో ఉండమ"ని సందేశాలు ఇస్తూ ధైర్యం కలిగిస్తుండేవారు. మేము మా కుమారునితో "బాబాపై నమ్మకంతో ఉండమ"ని చెప్పేవాళ్ళం. బాబా దయవల్ల కొన్నిరోజులకి నా కుమారుడికి ఒక కంపెనీలో పార్ట్ టైమ్ ఉద్యోగిగా ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీవాళ్ళు నా కుమారుడి పనితనం చూసి కొత్త ప్రాజెక్టుకోసం ట్రైనింగ్ ఇచ్చారు. అలా 2026, ఫిబ్రవరి వరకు కాలం గడిచింది. అప్పుడు ఆ కంపెనీవాళ్ళు థర్డ్ పార్టీ ద్వారా నా కుమారుడి వీసా ఎక్స్టెన్షన్‍కి అప్లై చేశారు. మా అబ్బాయి వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాక 2026, ఏప్రిల్ 27 వరకు  ప్రొవిజినల్ వీసా ఇస్తూ, అప్రూవల్ కోసం పైఅధికారులకి పంపారు. మేము దాదాపు వీసా ఎక్స్టెన్షన్ అవుతుందని భావించి 2 సంవత్సరాల నుండి నా కుమారుడు ఇండియా రానందున ఒకసారి వచ్చి, వెళ్ళమని తనతో అన్నాము. తాను సరేనని మే 10వ తేదీకి  ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ అనుకోకుండా వీసా అప్లికేషన్ రిజెక్ట్ అయినట్లు నా కుమారునికి మెయిల్ వచ్చింది. దాంతో నా కుమారుడు, మేము చాలా ఆందోళనకు గురై ఇప్పుడు ఏం చేయాలని చాలా ఆలోచించాము. నేను, "ఏంటి బాబా ఇలా చేశారు? వీసా అప్రూవ్ అవుతుందనుకుంటే ఇలా చేసారేంటి? నిన్నే నమ్ముకున్న మమ్మల్ని ఆదుకోండి. మీ జీవితచరిత్ర(సచ్చరిత్ర) సప్తాహ పారాయణ చేస్తాను. దయచేసి ఎలాగైనా నా కుమారునికి వీసా వచ్చేటట్లు దారి చూపండి" అని కన్నీటితో ప్రార్ధించి 2026, ఏప్రిల్ 9న సప్తాహ పారాయణ మొదలుపెట్టాను(అప్పటికి 10, 15 రోజుల ముందునుంచి మా అబ్బాయి రోజూ బాబాకి పూజ చేసి, తనని ఆదుకోమని ప్రార్ధిస్తూ ఉండేవాడట). అదేరోజు బాబా చేసిన మిరాకిల్ చూడండి! ఆరోజు సాయంత్రం నా కుమారుడు ఫోన్ చేసి, 'ప్రస్తుతం తను పార్ట్ టైమ్ ఉద్యోగిగా పనిచేస్తున్న కంపెనీవాళ్ళు, జూన్ 8 నుండి తనని శాశ్వత ఉద్యోగిగా చేస్తున్నట్లు లెటర్ వీసా కార్యాలయానికి పంపారని, అలాగే వీసా ఎక్స్టెన్షన్‌కి కూడా రికమెండ్ చేస్తున్నట్లు లెటర్ పంపారని' చెప్పాడు. ఆ క్షణం మా అందరికీ ఎంతో ఆనందం కలిగింది. నేను నా తండ్రి సాయినాథునికి వేలవేల పాదాభివందనాలు తెలుపుకున్నాను. తర్వాత నా సప్తాహ పారాయణ చివరిరోజున పారాయణ ముంగించిన ఒక గంట తరువాత నా కుమారుడు "వీసా అప్రూవ్ అయింది నాన్న" అని నాకు మెసేజ్ పెట్టాడు. ఆ తండ్రికి ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మా జీవితాలు ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నాయంటే అది బాబా పెట్టిన భిక్షే. "ధన్యవాదాలు బాబా. తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను, నా కుటుంబాన్ని క్షమించండి బాబా. మేము మా జీవితాంతం మీ పాదాలకు శరణాగతి చెంది ఉండేలా ఆశీర్వదించండి బాబా".


8 comments:

  1. Omsai srisai jayajayasai

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om Sai Ram 🌹🌹...Baba ne blessings eppudu ma family pina undela chudu swamy 🙏🙏

    ReplyDelete
  4. Om sri sairam 🙏🙏

    ReplyDelete
  5. Om sai ram tandri, chala tension ga undi baba asalu manasuki shanti ga ledu na samasyalu meeku telusu annitiki teerchi naaku manashantini ivvandi baba pls meere naaku unna Asha tandri alage amma nannalani na kutumbanni andarni anni velala kshamam ga ayur arogyalatho kapadandi tandri pls.

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo