ఈ భాగంలో అనుభవాలు:
1. ప్రతి సమస్యకి దారి చూపే బాబా
2. బాబా దయ
ప్రతి సమస్యకి దారి చూపే బాబా
సాయి బంధువులకు నమస్కారం. నా పేరు రేవతి. నేను చిన్నప్పటి నుండి సాయి భక్తురాలిని. ఆయనే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. బాచా నన్ను ఎన్నో విషయాల్లో కాపాడారు, కాపాడుతూనే ఉన్నారు. మేము మా బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాము. అయితే ఆ డబ్బులు తిరిగి చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు డబ్బు చెల్లించి మా బంగారం విడిపించుకుందామంటే మా దగ్గర అంత డబ్బు లేకుండా పోయింది. మాకు ఏమీ తోచక బాధపడ్డాము. ఆ సమయంలో నేను, "బాబా! ఈ సమస్య నుండి మమ్మల్ని బయటపడేయండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మావారికి తెలిసినవాళ్ళు మా బంగారం విడిపించి, వెంటనే మళ్ళీ తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులు తిరిగి వాళ్ళకి ఇచ్చేవిధంగా ధన సహాయం చేసారు. మేము ఆ డబ్బులతో బంగారం విడిపించాము. కానీ మళ్ళీ తాకట్టు పెడదామంటే సర్వర్ పని చేయలేదు. మేమేమో సాయంత్రానికి మాకు డబ్బులు ఇచ్చిన వ్యక్తికి తిరిగి ఇవ్వాల్సి వుంది. మళ్ళీ మాకు ఏమీ తోచలేదు. ఆ స్థితిలో నేను బ్యాంకులోనే బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల కొద్దిసేపటికి సర్వర్ పనిచేస్తుందని చెప్పారు. మేము బంగారం తిరిగి తాకట్టు పెట్టి, డబ్బులు తీసుకుని ఆపదలో మమ్మల్ని ఆదుకున్న అతనికి ఇచ్చేసాము. ఆ విధంగా బాబా మమ్మల్ని కాపాడారు.
2025, కార్తీకమాసంలో మా కుటుంబమంతా శ్రీశైలం వెళ్ళాము. అది చివరి సోమవారం అయినందున భక్తులు రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులను కంపార్టుమెంట్లలో ఉంచి ఒక్కొక్క కంపార్టుమెంట్లోని భక్తులను దర్శనానికి పంపిస్తున్నారు. రద్దీ వలన తోపులాట, గొడవ జరిగి మేము, మా ఎదురుగా ఉన్న వాళ్ళు కొట్టుకున్నాము. వాళ్ళు నన్ను, నా భర్తను దుర్భాషలాడి కొట్టబోయారు. "దర్శనం చేసుకుని బయటకి రా, ప్రాణం తీస్తాం" అని నా భర్తను, నన్ను బెదిరించారు కూడా. మాకు చాలా భయమేసింది. ఎందుకంటే, వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఏం చేయాలో తోచలేదు. నేను నా భర్తపై చేయి చేసుకున్నారని బాధపడుతూ, "ఎటువంటి గొడవ జరగకుండా మేము శ్రీశైలం నుండి బయటపడేలా చేయమ"ని బాబాని వేడుకున్నాను. తర్వాత మేము దర్శనం చేసుకునేటప్పుడు ఎవరో ఒకతను ఆ గొడవలో మమల్ని కాపాడినట్లు, విడదీసినట్లు చెప్పి, 'బయట ఏమీ కాదని' భరోసా ఇచ్చారు. ఆ బాబానే ఆవిధంగా చేసారని, చెప్పారని అనుకున్నాను. మేము తిరిగి మా ఊరికి వచ్చేసాము. మేము సురక్షితంగా ఇంటికి వచ్చేలా బాబానే దయ చూపారు.
మా పాప నెలసరి విషయంలో కూడా చాలా సహాయం చేసారు బాబా. ఆయన ప్రతి సమస్యలో దగ్గరుండి దారి చూపుతారు. ఆయన నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. అందులో కొన్ని ఇవి. ప్రతీక్షణం మన వెన్నంటే ఉండి మనల్ని రక్షించే బాబాకు కృతజ్ఞతలు తప్ప ఇంకేమి చెప్పగలము? "మీ బిడ్డగా నన్ను స్వీకరించినందుకు ధన్యవా దాలు బాబా".
బాబా దయ
సాయి బంధువులకు నమస్కారం. నా పేరు స్వాతి. సాయినాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే! ఆయన దయతోనే నేను ఈమాత్రం సంతోషంగా ఉండగలుగుతున్నాను. నేను ఈ మధ్యకాలంలో దంత సమస్యలతో చాలా బాధపడ్డాను. రెండుసార్లు డాక్టర్ దగ్గరకి వెళ్లినా ఉపయోగం లేకపోయింది. తిండి కూడా తినలేకపోయాను. అప్పుడు ఒకరోజు బాబా దగ్గర ఏడుస్తూ, "ఈ సమస్యను తీర్చు బాబా" అని వేడుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ని సంప్రదిస్తే, బాబా దయవల్ల నా పళ్ళు కొన్ని సరి చేయడంతో చాలావరకు నా సమస్య తగ్గింది.
2025, అక్టోబర్ నెల రెండో వారంలో మేము మా బంధువుల అబ్బాయి పెళ్లికి వెళ్లాము. ఆ పెళ్లిలో నా భర్త బ్రాస్లెట్ ఎక్కడో పడిపోయింది. ఇప్పుడున్న బంగారం ధరకి ఎంత నష్టమో అని నాకు కాళ్ళు, చేతులు ఆడలేదు. "ఇంత పరీక్ష ఏంటి బాబా? మీ దయతో ఆ బ్రాస్లెట్ దొరుకుతుంది కానీ, అంతవరకు ఈ టెన్షన్ ఎలా భరించాల"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. అంతే! బాబా 2 నిమిషాల్లో బ్రాస్లెట్ మా అక్కకి దొరికేలా అనుగ్రహించారు.
2025, ఆగస్టు 16 రాత్రి ఉన్నట్టుండి నా కళ్ళు చాలా దురదగా ఉండి ఎడమ కన్ను చాలా లావుగా అయింది. నేను చాలా భయపడి బాబాకి దణ్ణం పెట్టుకొని ఊదీ రాసుకున్నాను. బాబా దయవల్ల మర్నాటికి వాపు తగ్గింది. ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పను? "ఎల్లవేళలా మమ్మల్ని నడిపిస్తున్న మీకు చాలా ధన్యవాదాలు బాబా".

Om Sai Ram 🙏🙏🙏
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl house problem solve cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయిరామ్
ReplyDelete