సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2051వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఉద్యోగానికి వచ్చిన అపాయం నుండి బయటపడిన బాబా
2. బాబా దయతో బాధ, భయం మాయం

ఉద్యోగానికి వచ్చిన అపాయం నుండి బయటపడిన బాబా

సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు లక్ష్మి. నేను సాయిబాబాని దృఢంగా నమ్ముతాను. బాబా దయ ఎప్పుడూ మనపై ఉంటుంది. అది మన అదృష్టం. ఆయన దయ గురించి మాటల్లో చెప్పలేము. దాన్ని అనుభూతి చెందినప్పుడు 'ఆయన చూస్తున్నారు, వింటున్నారు, కష్టం తీర్చారు' అని తెలుస్తుంది. మా చిన్న అబ్బాయి లండన్‌లో ఎం.ఎస్. పూర్తిచేసాడు. వెంటనే తనకి అక్కడ ఉద్యోగం వచ్చింది. బాబా భక్తుడైన తను కేవలం బాబా వల్లనే తనకి ఆ ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. మూడేళ్లు బాగానే గడిచాయి. అంతా బాగుంది కదా అని మేము తనకి పెళ్లి చేసాము. అదేంటో 2025, ఫిబ్రవరిలో పెళ్లి చేసుకొని తిరిగి వెళ్ళాడు. తనకి ఆఫీస్‌లో కష్టాలు మొదలయ్యాయి. ఆ విషయం తను మాకు చెప్పకుండా బిజీ అని, పని ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పాడు. తర్వాత మా కోడలు అక్కడికి వెళ్ళింది. కానీ తను కూడా మాకు ఏమీ చెప్పలేదు. ఉద్యోగం అపాయంలో పడి ఒక నెల సమయం ఉందనగా అప్పుడు నాకు విషయం చెప్పాడు మా అబ్బాయి. నాకు చాలా బాధేసింది. ఏమీ అర్ధం కాలేదు. మా అబ్బాయిని, "నీ పనిలో ఏదైనా తప్పు ఉందా?" అని అడిగాను. తను, "లేద"ని చెప్పాడు. నేను తనతో, "నీ వైపు తప్పు లేకుంటే బాబా సహాయం చేస్తారు. ఆయనకి చెప్పుకో" అని చెప్పాను. నేను కూడా, "ఈ కష్టం నుండి బయటపడేయండి బాబా" అని బాబాను వేడుకున్నాను. మా అబ్బాయికి బాబాపై మంచి నమ్మకం. వాడు బాబా చరిత్ర పారాయణ మొదలుపెట్టాడు. మా కోడలికి చికెన్ అంటే చాలా ఇష్టం. అది తినడం మానేసి తను కూడా బాబా చరిత్ర చదవడం ప్రారంభించింది. వారం రోజులయ్యాక మా అబ్బాయి ఫ్రెండ్, "నా వర్క్‌లో తప్పు ఏమీ లేదు. అంతా సరిగా ఉందని ఆఫీసులో ఫిర్యాదు చేయమ"ని సలహా ఇచ్చాడు. మా అబ్బాయి అలాగే చేసాడు. వాళ్ళు స్పందించి ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఆ మీటింగ్ తరువాత ఒక నెల సమయమిచ్చి వేరే వర్క్ ఇచ్చారు. మా అబ్బాయి ఆ వర్క్ చాలా కష్టంగా ఉందని చెప్పినప్పటికీ బాబా మీద భారమేసి పూర్తి చేసాడు. వాళ్ళు అది చూసి, "అంతా బాగానే ఉంది కదా! మరి ఎందుకలా సమస్య చేసార"ని మా అబ్బాయిని మరల ఉద్యోగంలోకి తీసుకున్నారు. అదంతా జరుగుతున్నప్పుడు యూట్యూబ్, ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' చూస్తుంటే, 'బాబా ఉన్నారు. నీ బిడ్డ గురించి చింత వద్దు. నేను చూసుకుంటాను' అనే విధంగా సాయినాథుని సందేశాలు నాకు వస్తూ ఉండేవి. అదే నిజం అయింది. ఆయనే మా అబ్బాయికి సహాయం చేసారు. తన ఉద్యోగం నిలబడింది. తను మధ్యలో, "ఈ ఉద్యోగం బాబా దయవల్లనే వచ్చింది. నా గొప్ప ఏమీ లేదు. అలాంటిది ఉద్యోగం ఇలా పోతుందమ్మా" అని అన్నాడు. కానీ తనకి బాబా మీద ఉన్న నమ్మకం తనని గట్టెక్కించింది. ఇకపోతే, ఇది మా కోడలికి మొదటి అనుభవం. మా అబ్బాయి సమస్య నుండి బయటపడ్డాడని తెలిసి తను బాబా ముందు కూర్చొని ఏడ్చింది. తనకి బాబా దయ గురించి తెలిసింది, బాబాపై చాలా నమ్మకం ఏర్పడింది. మొత్తానికి బాబా అంతటి కష్టం నుండి బయటపడేసారు. నాకు చాలా సంతోషమేసింది. ఇప్పుడు అందరం ప్రశాంతంగా ఉన్నాం. ఇది నిజంగా కేవలం బాబా దయవల్లనే సాధ్యమైంది. ఆయన ప్రేమ చెప్పనలవి కానిది.

బాబా దయతో బాధ, భయం మాయం

ఓం శ్రీ సాయినాథాయ నమ:. ముందుగా సాయిభక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ప్రతిరోజూ బ్లాగులో వచ్చే అనుభవాలు తప్పకుండా చదువుతాను. దాని వలన బాబాపై మన భక్తి, (ప్రేమలు రెట్టింపు అవుతాయి, మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. గత 4 సంవత్సరాలుగా నేను బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు బాబా భక్తులతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నా అనుభవాలకు వస్తే..  2025, నవంబర్ నెలాఖరులో ఒకరోజు రాత్రి గ్యాస్ వల్ల నా గుండెల్లో నొప్పి, దడగా ఉండేసరికి నాకు చాలా భయమేసింది. టాబ్లెట్ వేసుకున్నా ఉపశమనం కలగలేదు. ఇంట్లో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. వాళ్ళని లేపడం ఇష్టం లేక నేనే లేచి వెళ్లి బాబా ఊదీ తీసుకొని నా ఛాతికి రాసుకొని, మరికొంత ఊదీ నీళ్లలో వేసుకొని తాగాను. బాబా ఫోటో ఒకటి ఎప్పుడూ నా దగ్గర ఉంటుంది. ఆది పట్టుకొని, "బాబా! ఈ బాధ తగ్గేలా చూడండి" అని దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల కొంతసేపటికి బాధ తగ్గి నిద్రపట్టింది.

మా ఎదురింటి అతను ఎప్పుడూ ఏదో ఒక సమస్య విషయంగా అందరితో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. ఒకరోజు అతను నా భర్తని ఏదో అన్నాడు. మావారు కూడా అతనిని ఏదేదో అన్నారు. నాకు భయమేసి "గొడవ పెరగకుండా చూడు బాబా" అని మనస్సులో అనుకున్నాను. బాబా దయవల్ల అతను మౌనం వహించాడు. "ధన్యవాదాలు బాబా. నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండండి".

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.

9 comments:

  1. Om sri sairam ,🙏🙏

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🙏

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl house problem solve cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo