ఈ భాగంలో అనుభవాలు:
1. సాయి ఇచ్చిన దర్శనాలు - నిదర్శనాలు
2. ఏ కష్టం వచ్చినా సాయితండ్రే రక్ష
సాయి ఇచ్చిన దర్శనాలు - నిదర్శనాలు
ఓం శ్రీసాయినాథాయ నమః. నా పేరు శిరీష. మేము హైదరాబాదులో ఉంటాం. ఒకప్పుడు నేను నిత్యం సాయి సచ్చరిత్ర పారాయణ చేసేదాన్ని. సచ్చరిత్ర 15వ అధ్యాయం చివర ఎవరైతే ఈ అధ్యాయాన్ని భక్తి, శ్రద్ధలతో పారాయణ చేస్తారో వారి కష్ఠాలన్నీ సాయినాథుని కృపచే తొడుగును అని ఉంటుంది కదా! అందుకని నేను చోల్కర్ కథ ఎక్కువగా చదివేదాన్ని. కొన్నిరోజులకి బాబా నాకు స్వప్న దర్శనం ఇచ్చారు. ఆ స్వప్నంలో నేను స్కూలుకి ఆలస్యంగా వెళ్లినందుకు స్కూల్ టీచర్ నన్ను కర్రతో చేయి మీద బలంగా కొడుతున్నారు, అప్పుడు నేను బాబా అని గట్టిగా అరుస్తున్నాను. ఆశ్చర్యంగా నాకు నొప్పి తెలియలేదు. అలా ఎలా అని నేను నా చేయి చాచి చూసుకుంటే, నా వేలికి బాబా ఉంగరం ఉంది. అంతటితో ఆ కల ముగిసింది. ఆవిధంగా బాబా నన్ను ఆశీర్వదించారని భావించాను.
నేను ఎక్కువగా వెంకటేశ్వరస్వామిని కొలిచేదాన్ని. ఒకనాటి రాత్రి కలలో బాబా విష్ణుమూర్తిగా దర్శనమిచ్చారు. ఆయన శరీరమంతా విష్ణుమూర్తిగా, తల మాత్రం సాయిగా ఉంది. తర్వాత 2015వ సంవత్సరం శ్రావణమాసంలో మా బంధువులు ఒకరు చనిపోయారు. ఆ కారణంగా మేము 15 రోజులు పూజ చేయలేదు. ఆ తర్వాత కూడా ఋతుక్రమం వల్ల 7 రోజులు పూజ చేయలేదు. శ్రావణమాసంలో అందరూ లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తున్నారు, నేను మాత్రం చేయలేకపోయాను అని బాధపడ్డాను. ఆనాటి రాత్రి కలలో బాబా లక్ష్మీ అమ్మవారిగా దర్శనం ఇచ్చారు. శరీరం అంతా లక్ష్మీమాతది, తల మాత్రం సాయిది. ఆ రెండు కలల ద్వారా సాయి తాము సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపం అని తెలియజేశారు. ఇంకా చాలా చాలా అనుభవాలు, దర్శనాలు ఇచ్చారు సాయి. "ధన్యవాదాలు సాయినాథా! శతకోటి నమస్కారాలు తండ్రీ".
ఒకసారి మా బాబుకి ఆకస్మాత్తుగా జ్వరం వచ్చింది. చూస్తే, చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంది. అప్పుడు టైం చూస్తే రాత్రి 12:45 అయింది. నేను లేచి సిరప్ వేద్దామని చూస్తే, అది ఎక్స్పైర్ అయిపోయి వుంది. నాకు ఏమీ తోచలేదు. వెంటనే సాయితండ్రికి దణ్ణం పెట్టుకొని బాబు నోట్లో ఊదీ వేశాను. ఆశ్చర్యంగా పది నిమిషాల్లో జ్వరం తగ్గి ఒళ్ళంతా చెమట పట్టింది. బాబు ప్రశాంతంగా నిద్రపోయాడు.
ఇంకోరోజు అర్ధరాత్రి నేను తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాను. నేను ఆ నొప్పితో చాలా ఇబ్బంది పడ్డాను. నా పక్కనే మా చెల్లి పడుకుని ఉంది. కానీ నేను కదలలేక, నోటితో పిలవలేక అవస్థపడుతూ మనసులో బాబాని ప్రార్థించాను. ఆశ్చర్యంగా మా చెల్లి నేను తనని నిద్రలేపకుండానే తనంతటతానే "పిలిచావా?" అంటూ లేచింది. నా పరిస్థితి చూసి బాబా ఊదీ తెచ్చి నా నోట్లో వేసింది. మరుక్షణంలో తీవ్రమైన కడుపునొప్పి మటుమాయమైపోయింది. "శతకోటి ధన్యవాదాలు సాయితండ్రీ. మీ పాదాలు ఎన్నటికీ మరవకుండా చూడండి".
ఏ కష్టం వచ్చినా సాయితండ్రే రక్ష
సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు సాహితి. 2025, జూలైలో నాకు విపరీతమైన ఒళ్ళునొప్పులతో జ్వరం వచ్చి లేచి, నడవడం చాలా కష్టమైంది. డాక్టర్ దగ్గరకి వెళితే చాలా రోజులకి జ్వరం తగ్గింది కానీ, కాళ్ల వాపులు, నొప్పులు తగ్గలేదు. బాబాను ప్రార్థిస్తూ ఇద్దరు డాక్టర్లని సంప్రదించినా తగ్గలేదు. నాకు నడవడం చాలా కష్టంగా ఉండేది. సమయానికి బాబా దయవల్ల వేరే ఊరిలో ఉద్యోగాలు చేసుకుంటున్న మా పిల్లలిద్దరికీ ఇంటి నుండి పని చేసే అవకాశం ఇవ్వడంతో వాళ్ళు ఇంటికి వచ్చారు. ఆవిధంగా బాబా నాకు ధైర్యాన్నిచ్చారు. కానీ రోజులు గడుస్తున్నా కాళ్లనొప్పులు తగ్గకపోవడంతో నేను చాలా భయపడి బాబాను ప్రార్ధించి హోమియో వైద్యుడి దగ్గరకి వెళ్తే, టెస్టులు చేయించుకోమని చెప్పారు. అసలే షుగర్ వ్యాధిగ్రస్థురాలినైన నేను ఏ కిడ్నీ సమస్యో అని చాలా భయపడి, "సాయీ! టెస్టులు చేయించుకుంటాను. ఏ సమస్య లేకుండా రిపోర్టులన్నీ నార్మల్గా వచ్చేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. బాబా కరుణించారు. టెస్టులు చేయించుకున్నాక ఎటువంటి నెగిటివ్ రిపోర్ట్ లేకుండా అన్నీ నార్మల్గా వచ్చాయి. హోమియో వైద్యుడు టాబ్లెట్లు ఇచ్చారు. వాటితో కాళ్లు నొప్పులు, వాపులు తగ్గాయి.
ఈమధ్య నా భర్త ఆరోగ్యం బాగాలేదు. ఆయన, "కాళ్ళు, చేతులు పట్టుతప్పుతున్నాయి. డ్యూటీ చేయడం కష్టంగా ఉంటుంద"ని అన్నారు. నేను బాబాని, "సాయీ! ఆయన ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది తండ్రీ. ఆయన కూడా టెస్టులు చేయించుకుంటారు. అన్ని నార్మల్గా ఉండేటట్లు చేయండి" అని వేడుకున్నాను. ఆ సాయితండ్రి మా వెంటే ఉన్నందున ఒక్క షుగర్ రిపోర్టు ఎక్కువగా ఉందని రావడం తప్ప మిగతా టెస్టు రిపోర్టులు అన్నీ బాగానే వచ్చాయి. నాకు ఏ కష్టం వచ్చినా నా సాయితండ్రే నాకు రక్ష. "ప్రతి విషయంలో మాకు తోడుగా ఉంటున్న మీకు ధన్యవాదాలు సాయితండ్రి. నా భర్త షుగర్ అదుపులో ఉండేలా దయచూపండి".

Om Sri Sai Nathaya Namaha
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Omsainadhayanamaha
ReplyDeleteOm Sai Rakshak Saranam Devaa 🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Ram
ReplyDeleteఓంసాయినాథయా నమః 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDelete