- బాబా కృపతో అమ్మకి ఆరోగ్యం - ఫోన్ సమస్య పరిష్కారం
- పారాయణ ఆగకుండా నడిపించిన బాబా
బాబా కృపతో అమ్మకి ఆరోగ్యం -ఫోన్ సమస్య పరిష్కారం
సాయిభక్తురాలు రూప తనకి బాబా ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరాం! నేను సాయిభక్తురాలిని. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. ఇటీవల జరిగిన నా అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. కొద్దిరోజుల క్రితం మా అమ్మకి బాగా ఆయాసం వచ్చింది. తనకి ఆస్తమా వుంది. ఇప్పుడున్న పరిస్థితులలో హాస్పిటల్‌కి వెళ్లాలంటే కరోనా సోకుతుందేమోనని భయం. అందువల్ల నేను బాబానే నమ్ముకొని, “బాబా! హాస్పిటల్‌కి వెళ్ళకుండానే అమ్మకి ఆయాసం తగ్గిపోవాలి. మీ కృపవల్ల అమ్మకి ఆయాసం తగ్గిపోతే నేను ఈ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు మ్రొక్కుకున్నాను. తరువాత బాబా అనుగ్రహంతో ఒక వారంరోజుల్లో అమ్మకి ఆయాసం తగ్గిపోయింది. “బాబా! మీకు శతకోటి వందనాలు తండ్రీ! మాకు ఎల్లప్పుడూ తోడునీడగా, అండగా ఉండు తండ్రీ!”
ఓం శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై! సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
మరొక చిన్న అనుభవం:
ఒకరోజు మా తమ్ముడి ఫోన్ ఉన్నట్టుండి పని చేయటం మానేసింది. ఇప్పుడు అది రిపేర్ చేయాలంటే ఖర్చవుతుంది. మా తమ్ముడికి మనీ ప్రాబ్లెమ్ ఉంది. అందువల్ల నేను బాబాకు నమస్కరించి, “బాబా! ఎలాగయినా తన ఫోన్ పనిచేసేలా చేయి తండ్రీ” అని బాబాను వేడుకున్నాను. ఒకరోజు గడిచాక మా తమ్ముడికి ఆ ఫోనుకి ఉన్న ఒక సంవత్సరం వారంటీ డేట్ గుర్తుకువచ్చి చూశాడు. ఆ వారంటీ ముగియడానికి ఇంకా 15 రోజుల సమయం వుంది. ‘థాంక్ గాడ్’ అనుకొని కంపెనీవాళ్ళకి ఫోన్ చేస్తే రిపేర్ చేస్తామని చెప్పారు. అలా వారంటీ ఉండటంతో డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఫోన్ రిపేర్ అయిపోయింది. ఇదంతా బాబా దయనే. బాబానే వారంటీ డేట్ ఇంకా ముగియలేదని మా తమ్ముడికి గుర్తు చేశారు. “బాబా! మీరు మాతోనే ఉండండి బాబా. మాకు తల్లి, తండ్రి, గురువు అన్నీ మీరే బాబా. మేము ఏదైనా తప్పు చేస్తే అమ్మలా మమ్మల్ని క్షమించండి బాబా! సదా మీ బిడ్డలందరినీ కాపాడండి తండ్రీ!
సాయినాథ్ మహారాజ్ కీ జై!
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
ఓం సాయిరామ్!
పారాయణ ఆగకుండా నడిపించిన బాబా
సాయిభక్తురాలు నళిని తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
అందరికీ సాయిరాం! నా పేరు నళిని. ఇటీవల నేను మహాపారాయణ గ్రూపులో చేరాను. విజయదశమిరోజున మహాపారాయణ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము. ఇంతలో అనుకోకుండా విజయదశమి ముందురోజు నా ఫోన్ పనిచేయటం మానేసింది. ఫోన్ పనిచేయకపోవడం వల్ల మహాపారాయణలో నాకు ఏ అధ్యాయాన్ని కేటాయించారో తెలియలేదు. నేను మొదటిసారిగా ప్రారంభించిన మహాపారాయణ ఇలా ఫోన్ పనిచేయకపోవడం వల్ల ఆగిపోతున్నందుకు నేనెంతో బాధపడ్డాను. బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఈ సమస్యకు నువ్వే పరిష్కారం చూపించాలి” అని వేడుకున్నాను. బాబా దయవల్ల విజయదశమి రోజు సాయంత్రానికల్లా నాకు ఇంకొక ఫోన్ వచ్చింది. అప్పుడు ఫోనులో మహాపారాయణకు సంబంధించిన మెసేజ్ చూశాను. అందులో, మరొక సభ్యులు నాకు కేటాయించిన అధ్యాయాలు పారాయణ చేసినట్లు ఉంది. బాబా నా పారాయణ ఆగకుండా నా బదులు వేరేవాళ్ళతో చదివించారని అనుకొని సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మరుసటి వారం నుంచి నేను నా పారాయణ కొనసాగించాను.
Please bless my son with long life
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
551 sairam
ReplyDeleteMahaparayana group Loki ela cherali
ReplyDeletesai naa whatsapp number 7842156057 ki message cheyandi. vacancy vunte teliyajestanu sai
DeleteOm sai ram
ReplyDeleteJai Sairam! Jai Gurudatta!
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏