- తన బిడ్డలను దగ్గరుండి చూసుకుంటానని నిరూపించారు బాబా
- బాబా నిలబెట్టిన ఉద్యోగం
తన బిడ్డలను దగ్గరుండి చూసుకుంటానని నిరూపించారు బాబా
సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు లక్ష్మి. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి శతకోటి వందనాలు. ఎందుకంటే, ప్రతిరోజూ ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే అవి మన నిత్యజీవితంలో జరిగే చర్యలకు బాబా సమధానాలుగా అనిపించి చాలా సంతోషంగా ఉంటోంది. నేను ఇంతకుముందు ఈ బ్లాగులో నా అనుభవాలను కొన్నిటిని పంచుకున్నాను. ఈ మధ్యనే బాబా ఇచ్చిన మరో అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.
నేను గత 20 సంవత్సరాల నుండి ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నాను. అయితే క్రమం తప్పకుండా డాక్టర్ వద్ద చెకప్ చేయించుకుంటూ చాలా చురుకుగానే ఉండేదాన్ని. 2020, మార్చి నెల నుంచి కరోనా కారణంగా డాక్టర్స్ ఎవరినీ చెకప్ చేయటం లేదు. అందువల్ల నేను మునుపటి మందులే వాడుతూ చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. అయినా ఏమి తేడా జరిగిందో తెలియదుగానీ, దాదాపు సెప్టెంబరు నెల అంతా నా ఆరోగ్యం బాగోలేదు. రోజూ బి.పి డౌన్ అవటం, తల తిరగటం, నీరసం రావటంతో పగటిపూట కూడా నిద్రలోకి వెళ్లిపోతుండేదాన్ని. దానివలన రోజంతా పని చేసుకోలేకపోతుండేదాన్ని. ‘నా వలన ఏమైనా పొరపాటు జరుగుతోందేమో, అందుకే ఇలా జరుగుతోంది’ అని అనుకుని సహనంగా ఉంటూ బాబాకు పూజ చేసుకుంటూండేదాన్ని.
అయితే, అక్టోబరు నెలాఖరున మా పాపకు నిశ్చితార్థం అనుకున్నాము. ఆ కార్యక్రమం కోసం అవసరమైన పనులన్నీ చేసుకోవాలంటే నేను ఈ నెలరోజులపాటు ఆరోగ్యంగా ఉండాలి. ఈ విషయాన్నీ బాబాతో చెప్పుకుని, 3 రోజుల తరువాత వచ్చే గురువారం వరకు, అంటే ఈ మూడురోజులూ నీరసం రాకుండా ఉండేలా చూడమని వేడుకుని, ‘గురువారం తర్వాత నా అనారోగ్యం పూర్తిగా తగ్గేలా చూడు తండ్రీ’ అని మ్రొక్కుకుని, అలా జరిగితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. బాబా దయవలన ఆ మూడు రోజులు నీరసం తగ్గింది. బాబా తన బిడ్డలను తానే దగ్గరుండి చూసుకుంటారని నిరూపించారు. నాకు సర్వమూ బాబానే. ఆ తండ్రే ఈ నిశ్చితార్థం బాధ్యతను తీసుకుని, ఆనందంగా జరిపిస్తారని కోరుకుంటున్నాను. మీరంతా కూడా మా పాప నిశ్చితార్థం ఆనందంగా జరిగేలా ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. సాయిభక్తులందరికీ నా కృతజ్ఞతలు.
“బాబా! నీ పాదాల వద్ద నా శిరస్సునుంచి ప్రార్థిస్తున్నాను. మా భారాలను నీ భుజాల మీద వేసుకుని మమ్మల్ని మంచి దారిలో నడిపించు. మా బాధ్యతలు సక్రమంగా నెరవేరేలా ఆశీర్వదించు తండ్రీ!”
బాబా నిలబెట్టిన ఉద్యోగం
సాయిభక్తురాలు లలిత బాబా తనకి ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
నా పేరు లలిత. నేను ఎం.ఎ (తెలుగు) పూర్తిచేసి రెండునెలల కిందట రిలయన్స్ ఎల్.ఐ.సి లో ఉద్యోగిగా చేరాను. నాకు బాబా చూపిన ఒక లీలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
కరోనా పరిస్థితుల కారణంగా మా కుటుంబం తణుకుకు మారాము. అక్కడికి వెళ్ళాక సాయిసచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. చదివింది తెలుగు పండిట్ అయితే, సాయి అనుగ్రహం వలన ఏ మాత్రం అవగాహనలేని ఎల్.ఐ.సి ఉద్యోగంలో అనుకోకుండా చేరాను. అయితే రెండు మాసాలైనా ఒక్క ఇన్సూరెన్స్ కూడా చేయించలేకపోయాను. దాంతో, "వచ్చే మాసంలో మీ ఉద్యోగం పోవచ్చు" అని పైఅధికారి చెప్పారు. నేను చాలా ఆందోళన చెంది అనుకోకుండా ఒకరోజు నిత్య పారాయణ గ్రూపులోని సభ్యురాలైన శ్రీలక్ష్మి గారితో విషయం చెప్పాను. ఆమె, "మీరు 'సహాయం చేయమ'ని సాయిని అడిగారా?" అని నన్ను అడిగారు. నేను, "లేద"ని చెప్పాను. అందుకామె, "అయితే, నాచేత మీకు చెప్పిస్తున్నారు, 'సాయిబాబాని అడగండి'. ఉద్యోగం ఇచ్చిన బాబాయే ఉద్యోగం నిలబెడతారు" అని అన్నారు. అప్పుడు నేను మనస్పూర్తిగా బాబాను అడిగాను. అద్భుతం! అనుకోకుండా తెలియని, 60ఏళ్ళ వయస్సున్న ఒకాయన నా ద్వారా ఎల్.ఐ.సి చేసారు. రెండు మాసాలుగా ప్రయత్నం చేసినా అవ్వనిది, సాయిని అడిగిన వారంలో ఈ అద్భుతం జరిగింది. అసలు నా ఉద్యోగం నిలవడానికి 2,50.000 రూపాయల పాలసీ చేసినా చాలు. కాని సాయి కృపతో 5,00,000 రూపాయల పాలసీ అయింది. బాబా ప్రసాదించిన ఈ అద్భుతమైన అనుభవాన్ని నేను ఎన్నటికీ మరువలేను. దీన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది.
om sai ram
ReplyDeleteJai sairam
ReplyDeleteJai Sairam Jaigurudatta
ReplyDeleteOm sai ram
ReplyDeleteBaba, ఎంత అమోఘం మీ లీలలు.సర్వదా మిమ్మలిని ఆశ్ర యించటమే మా కర్తవ్యం కావాలి.
ReplyDeleteBaba please help and stay with us forever
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏