సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 769వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. ప్రేమతో పిలిచిన భక్తురాలికోసం వచ్చిన బాబా
  2. బాబా కరుణ - కోవిడ్ నుండి రక్షణ


ప్రేమతో పిలిచిన భక్తురాలికోసం వచ్చిన బాబా

 

హైదరాబాదు నుండి సాయిభక్తురాలు వీణ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిభక్తులకు మరియు ఈ సాయి బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వీణ. మేము హైదరాబాదులో ఉంటాము. బాబా నాకు ప్రసాదించిన అద్భుతమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురించే అనుభవాలు చదువుతాను. ఆ అనుభవాలలో ఎంతోమంది సాయిభక్తులు ‘తమకు బాబా కనిపించార’నో లేదా ‘బాబా తమతో కలలో మాట్లాడార’నో పంచుకున్నారు. అవి చదివి ఎంతో ఆనందించిన నేను, ‘బాబా! నాకు కూడా ఏదో ఒక రూపంలో మీ దర్శనం ప్రసాదించండి’ అని బాబాను కోరుకున్నాను. నాకు ఎప్పుడూ, ‘సాయిబాబా ఒక్కరు నా దగ్గర ఉంటే చాలు, నాకు ఇంకేమీ వద్దు’ అనిపిస్తుంది. ఎందుకంటే, బాబా నా ప్రక్కన ఉంటే నా మంచిచెడులన్నీ బాబానే చూసుకుంటారని నా నమ్మకం. అందుకే నేను బాబా ఫోటో ముందు కూర్చుని, “నా దగ్గరకు రండి బాబా, మాతో ఉండండి” అంటూ కన్నీళ్ళతో ప్రార్థించేదాన్ని. ఒకరోజు నేను ‘క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్’ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి, “బాబా! నా దగ్గరకు ఎప్పుడు వస్తారు?” అని బాబాను అడిగాను. అప్పుడు బాబా, “సమయం ఆసన్నమైంది” అని సమాధానమిచ్చారు. బాబా ఇచ్చిన సమాధానంతో నేను ఎంతో సంతోషించాను. ‘బాబా చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది’ అనే నమ్మకంతో బాబా దర్శనం కోసం వేచిచూస్తూ, ప్రతిరోజూ బాబా దగ్గర కూర్చుని, “నా దగ్గరకు రా బాబా! నాకు కనిపించు బాబా!” అని ప్రార్థించేదాన్ని. నా ఎదురుచూపులు ఫలించి ఒకరోజు ఫోటో రూపంలో బాబా మా ఇంటికి వచ్చారు. ఆ ఫోటోలను కూడా ఈ క్రింద జతపరుస్తున్నాను, మీరూ చూడండి. బాబా మా ఇంటికి వచ్చిన లీలను ఇప్పుడు మీకు వివరిస్తాను. 


మా కజిన్ స్నేహితుడు లండన్‌లో ఉంటాడు. తనను ఒక అమ్మాయి ఇష్టపడింది. కానీ ఆ అబ్బాయి ఇంట్లోవాళ్ళు ఈ వివాహానికి అంగీకరించకపోవటంతో ఆ అబ్బాయి, ‘మనం మంచి స్నేహితులుగా ఉందాము’ అని ఆ అమ్మాయితో చెప్పాడు. ఆ అమ్మాయి అందుకు అంగీకరించి, ‘నేను మీకు ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను’ అని చెప్పింది. ఆ అబ్బాయి అమ్మావాళ్ళు హైదరాబాదులో ఉంటారు. ఆ అడ్రస్‌కే ఆ అమ్మాయి గిఫ్ట్ బాక్స్ పంపింది. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, “అమ్మా! ఆ అమ్మాయి పంపిన ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే, అందులో ఏమి ఉన్నా అది చూసినప్పుడల్లా ఆ అమ్మాయి నాకు గుర్తుకువస్తుంది” అని చెప్పి, “నా ఫ్రెండ్ వస్తాడు, తనకి ఆ గిఫ్ట్ బాక్స్ ఇచ్చెయ్యి” అని చెప్పాడు. మా కజినే ఆ అబ్బాయి ఫ్రెండ్. ఆ అబ్బాయి చెప్పడంతో మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ గిఫ్ట్ బాక్స్ తీసుకుని నాకు ఫోన్ చేసి, “మా ఫ్రెండ్ గిఫ్ట్ బాక్స్ ఒకటి నేను మీ ఇంటికి తీసుకొస్తాను. అందులో ఏముందో తెలియదు, ఇంకా ఓపెన్ చేయలేదు. అందులో ఏమున్నా దానిని నీ దగ్గరే ఉంచుకో” అని చెప్పాడు. నేను అందుకు అంగీకరించాను. దాంతో మా కజిన్ తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటినుండి నేరుగా మా ఇంటికి వచ్చి మా ముందే ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేశాడు. అద్భుతం! అందులో సాయిబాబా ఫోటోలు రెండు ఉన్నాయి. బాబాను చూడగానే, “బాబా ‘వస్తాను’ అన్నారు కదా, ఇప్పుడిలా ఫోటో రూపంలో వచ్చారు” అనిపించి ఎంతో సంతోషంతో బాబాకు నమస్కరించుకున్నాను. అప్పటినుండి, ‘నా బాబా నా దగ్గర ఉన్నారు, ఏమి జరిగినా నా బాబానే చూసుకుంటారు’ అనే నమ్మకం చాలా వచ్చింది. హేమాడ్‌పంత్‌కు బాబా కలలో కనిపించి “మీ ఇంటికి వస్తున్నాను” అని చెప్పి, మరుసటిరోజు ఫోటో రూపంలో వాళ్ళింటికి వెళ్ళారని సాయి సచ్చరిత్రలో చదువుకున్నాము కదా. అలానే నాకూ జరిగింది. బాబా ఇలా వస్తారని నేనసలు ఊహించలేదు. ఆ గిఫ్ట్ బాక్స్ పంపించిన అమ్మాయి ఎవరో నాకు తెలియదు. అయినా తనకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా కజిన్‌కి, తన ఫ్రెండుకి కూడా నా కృతజ్ఞతలు. “మీరు ప్రసాదించిన ఈ అనుభవాన్ని ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా!”


బాబా కరుణ - కోవిడ్ నుండి రక్షణ


హైదరాబాదు నుండి సాయిభక్తురాలు శ్రీమతి ఉష తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ఓం శ్రీ సాయినాథాయ నమః.


సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు సాయి చూపిన కరుణను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు సాయి చూపిన మరో అపార కరుణను మీతో ఆనందంగా పంచుకుంటున్నాను.


2021, ఏప్రిల్ 12వ తేదీన మావారికి జలుబు మొదలై మరుసటిరోజు నుంచి జ్వరం రావటంతో మాకు భయం వేసింది. మా అపార్టుమెంటులో అప్పటికే సుమారు 60 మందికి కోవిడ్ వచ్చింది. వారంతా సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉంటున్నారు. మా బ్లాక్‌లో ఒక్కరికి మాత్రమే కోవిడ్ ఉన్నప్పటికీ మా భయం మాది. చుట్టూ ఉన్న పరిస్థితుల దృష్ట్యా డాక్టర్ మమ్మల్నందరినీ కోవిడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పారు. దాంతో మా ఇంట్లో అందరం టెస్ట్ చేయించుకున్నాము. తరువాత నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఈ టెస్ట్‌లో మా అందరికీ నెగిటివ్ వస్తే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో మా అనుభవాన్ని పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. 24 గంటల్లో వచ్చిన రిపోర్టులో అందరికీ నెగటివ్ అని వచ్చింది. రిపోర్టులు చూసిన డాక్టర్, “ఈ జ్వరం వైరల్ జ్వరం అయివుండవచ్చు” అని చెప్పి జ్వరం తగ్గటానికి మందులు రాసిచ్చారు. తరువాత నాకు కూడా జ్వరం వచ్చింది. అయితే, కోవిడ్ టెస్టులో నాకు కూడా నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇది కూడా వైరల్ జ్వరం అయివుంటుందని చెప్పి, నన్ను కూడా ఆ మందులే వాడమన్నారు. కేవలం బాబా కరుణ వల్లనే ఈరోజు మా కుటుంబమంతా కోవిడ్ నుండి సురక్షితంగా ఉన్నాము. బాబా అందరిపైనా కరుణతో, వాత్సల్యంతో ఉంటారని కోరుకుంటున్నాను.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


9 comments:

  1. Can anyone share questions and answers link?

    ReplyDelete
  2. Om sai ram today sai leelas are nice to read baba cane in photo to bless her. Her bhakti is very strong.if we trust him whole heartly. He takes care.baba gives blessings to us in many ways. I also had one desire to see baba in dream.my desire didn't Fullfilled.i am looking forward. Om sai ram❤❤❤

    ReplyDelete
  3. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. om sairam
    sai always be with me

    ReplyDelete
  5. Om sai ram baba amma ki negative ravali thandri

    ReplyDelete
  6. Om Sri sachidhanandha samartha sadguru sai nath maharaj ki jai🙏

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo