ఈ భాగంలో అనుభవాలు:
- దక్షిణ స్వీకరించి అనుగ్రహాన్ని వర్షిస్తున్న శ్రీసాయి
- ఒకేరోజు మూడు అనుభవాలను ప్రసాదించిన బాబా
దక్షిణ స్వీకరించి అనుగ్రహాన్ని వర్షిస్తున్న శ్రీసాయి
హైదరాబాదు నుండి సాయిభక్తుడు వెంకటేశ్వరరావు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
ముందుగా శ్రీసాయినాథునికి సాష్టాంగ నమస్కారములు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నమస్కారములు. నా పేరు మిరియాల వెంకటేశ్వరరావు. మేము హైదరాబాదులో ఉంటాము. ఇంతకుముందు నేను కొన్ని అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుందామని మీ ముందుకు వచ్చాను.
మొదటి అనుభవం: ఇది దాదాపు ఇరవై సంవత్సరాల క్రిందట జరిగినది. ఆరోజు గురువారం. శ్రీసాయి సచ్చరిత్ర సప్తాహపారాయణ పూర్తిచేసి, శ్రీసాయికి పూజ చేసి, పదకొండు రూపాయలు దక్షిణ సమర్పించి పూజ ముగించాను. ఇంతలో డోర్ బెల్ మ్రోగింది, తలుపు తీశాను. ఎదురుగా పరిచయంలేని మనిషి. నన్ను చూడగానే, “సార్! మేము సాయిబాబా గుడిలో అన్నదానం చేస్తున్నాము. మీ ఇష్టమున్నంత చందా ఇవ్వండి” అని, మళ్ళీ అంతలోనే, “పదకొండు రూపాయలు ఇవ్వండి” అన్నాడు. నేను లోపలికి వెళ్ళి అంతకుముందే పూజలో బాబాకు సమర్పించిన దక్షిణను తీసుకొచ్చి అతనికి ఇచ్చి, ‘బాబా గుడి ఎక్కడుంద’ని అడిగాను. అతను అడ్రస్ చెప్పి వెళ్ళిపోయాడు. అంతలోనే, అన్నదానానికి మరికొంత డబ్బు ఇవ్వాలనిపించి అతని కోసం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. చుట్టుప్రక్కల వాళ్ళను కూడా అతని గురించి వాకబు చేశాను. “చందా కోసం ఎవరూ రాలేదు” అన్నారందరూ. ఎంత ప్రయత్నించినా అతను చెప్పిన బాబా గుడి అడ్రస్ నాకు గుర్తుకురాలేదు. ఏదో మాయలాగా అనిపించింది. తరువాత నిదానంగా ఆలోచిస్తే, శ్రీసాయియే ఆ రూపంలో వచ్చి దక్షిణ స్వీకరించారని అర్థమై ఎంతో సంతోషించాను. మరి నన్ను మాత్రమే చందా అడిగి, ఇంకెవరింటికీ వెళ్ళకుండా, ఎవరినీ చందా అడగకుండా కళ్ళముందే మాయమైతే, ఇది సాయిలీల కాక మరేమిటి? ఇన్ని సంవత్సరాల తరువాత ఈ లీలను మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది.
రెండవ అనుభవం: ఇది ఇటీవలే (2021) జరిగింది. నేను మార్చి 8న కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాను. ఆ మరునాడు బాగా జ్వరం వచ్చింది. నేను చాలా భయపడ్డాను. ‘జ్వరం త్వరగా తగ్గిపోయేలా అనుగ్రహించమ’ని బాబాను ప్రార్థించి, బాబా ఊదీని పెట్టుకుని, కొంతసేపు ‘శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ మంత్రం జపించి పడుకున్నాను. బాబా దయవల్ల మరునాటికల్లా జ్వరం తగ్గిపోయి నార్మల్ అయ్యాను. శ్రీసాయిని తలచుకుంటే చాలు, మన ప్రక్కనే ఉండి కాపాడుతారు.
మూడవ అనుభవం: మా చిన్నమ్మాయికి ఫిబ్రవరిలో డెలివరీ అయింది. తనకు పాప పుట్టింది. పాపకు తల్లిపాలు సరిపోయేవికావు. దాంతో మేము బాబాకు నమస్కరించుకుని, పాపకు తల్లిపాలు సమృద్ధిగా లభించేలా ఆశీర్వదించమని మనసారా ప్రార్థించి, బాబాకు పాలాభిషేకం చేయిస్తామని మ్రొక్కుకున్నాము. తరువాత మేము బాబా గుడికి వెళ్ళి బాబాకు పాలాభిషేకం చేయించాము. ఆ తరువాత నుంచి పాపకు పోతపాలు త్రాగించాల్సిన అవసరం లేకుండా తల్లిపాలు సమృద్ధిగా వచ్చేలా శ్రీసాయి ఆశీర్వదించారు. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము.
Jaisairam
ReplyDeleteJai sai ram you are Siva.all gods are you.udi dakshin are your gift to human being.your mandir closed due pandamic. Your mandir will open for darshan to people. Om sai ram❤❤❤
ReplyDeleteOm sai ram,, corona ni thagginchandi baba
ReplyDeleteOm Sairam
ReplyDelete🙏🙏🙏
om sairam
ReplyDeletesai always be with me
741 days
ReplyDeletesairam
Om sai ram baba amma problem tondarga cure cheyi thandri please
ReplyDeleteBaba corona ni taggichu thandri
ReplyDeleteOm sai ram baba stomach pain tagginchu thandri
ReplyDelete🌺🌼🌺🙏Om Sri sainadhaya namaha🙏🌺🌼🌺
ReplyDelete