ఈ భాగంలో అనుభవాలు:
- బాబా శక్తిని నిరూపిస్తున్నారు!
- తమ కాళ్ళు ఒత్తించుకొని నా నొప్పి తీసేసిన కరుణామయుడు బాబా
- 'పిలిస్తే పలుకుతాన'ని మరోసారి నిరూపణ ఇచ్చిన బాబా
బాబా శక్తిని నిరూపిస్తున్నారు!
పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు చక్రవర్తి రాజు స్వామి. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలోనుండి ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. మేము భీమవరంలో ఉండగా ఒకరోజు కొంతమంది మా వద్దకు వచ్చి, ‘బాబాను పోలిన ఒక వ్యక్తి వచ్చార’ని చెప్పారు. అది విన్న నా భార్య ఆ వ్యక్తిని సందర్శించాలని కోరుకుంది. “ప్రజలను మోసం చేసే నకిలీ బాబాలు చాలామంది ఉన్నారు, ఇతను కూడా అలాంటివాడే” అని నేను ఆమెకు చెప్పాను. కానీ ఆమె ఆ వ్యక్తిని చూడటానికి వెళదామని ఎంతో బలవంతం చేసింది. మేము అక్కడకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి నన్ను చూసి, “ప్రజలను మోసం చేసే నకిలీ బాబాలు ప్రపంచంలో ఉన్నారని టీవీలోనూ, పేపర్లలోనూ వార్తలు వస్తున్నాయి, వినలేదా?” అని అన్నారు. ఈ మాటలు విని నేను నిర్ఘాంతపోయాను. అవి అచ్చం నేను నా భార్యతో చెప్పిన మాటలే! ఆయన సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపోతూ వెంటనే నేలపై సాష్టాంగపడి ఆయనకు నమస్కరించుకున్నాను.
ఆ తరువాత కూడా నా బాబా శక్తిని నిరూపించే ఎన్నో అనుభవాలు నాకు కలిగాయి. ఎల్లప్పుడూ నాకు సహాయం చేయడానికి నా బాబా ఉన్నారు. ఎప్పుడైనా నేను ఏదైనా కోల్పోయానని భావిస్తే నేను బాబా గురించి ఆలోచిస్తాను. ఆశ్చర్యకరంగా, అవి నేను ఊహించని విధంగా సక్రమంగా జరుగుతాయి. ఒకసారి తన గ్రీన్‌కార్డు ప్రాసెస్‌లో ఏదో సమస్య వచ్చి మా అబ్బాయి ఆందోళనపడుతున్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించమని నేను బాబాను ప్రార్థించాను. అదేరోజు రాత్రి మా అబ్బాయి నాకు ఫోన్ చేసి, ‘అంతా బాగానే జరిగింది’ అని చెప్పాడు. బాబా అనుగ్రహంతో నాకు ఇలాంటి అనుభవాలెన్నో కలిగాయి. బాబా మా రక్షకుడు.
తమ కాళ్ళు ఒత్తించుకొని నా నొప్పి తీసేసిన కరుణామయుడు బాబా
సాయిభక్తురాలు శ్రీమతి జ్యోతి తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయిభక్తులందరికీ నా నమస్సుమాంజలి. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా ప్రణామములు. నా పేరు జ్యోతి. బాబా నాకు ప్రసాదించిన మూడు అనుభవాలను నేను ఇదివరకు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఈరోజు మరొక అనుభవాన్ని పంచుకోబోతున్నాను.
నేను 2010వ సంవత్సరం నుండి, అంటే 12 ఏళ్లుగా ప్రతి ఏటా 11 రోజులపాటు 'సాయి నామజప' పూజా కార్యక్రమం చేస్తున్నాను. అది సాయిభక్తుల సహకారంతో ఒక ఉత్సవంలా జరుగుతుంది. అందులో భాగంగా బాబాకు ఆరతులు, నైవేద్యాలు సమర్పించి, సాయి నామజపము, విష్ణుసహస్రనామ పారాయణ, సాయి సత్యవ్రతం, ఏకాహం (బియ్యంతో నామజప పూజ), పల్లకీ సేవ, సచ్చరిత్ర పారాయణ, భజన, అన్నదానం మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి. ఆ సమయంలో పని ఎక్కువగా ఉంటుంది, రోజంతా నడవాల్సిన అవసరం ఉంటుంది. ఉదయం నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులు వారి వారి అనుకూల సమయాలలో వచ్చి జపం చేస్తుంటారు. అయితే, ఒక ఏడాది నా ఎడమకాలి పిక్క వాచి నొప్పిగా ఉండేది. కొద్దిగా నడిచినా నొప్పి ఎక్కువై నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ నొప్పి రెండు నెలలపాటు ఉంది. సరిగ్గా ఆ సమయంలోనే పూజ కార్యక్రమం ప్రారంభం అయింది. మొదటిరోజు పూర్తయ్యేసరికి నా కాలు బాగా వాచి నొప్పి ఎక్కువ అయింది. మరునాడు నడవడం కష్టంగా ఉన్నప్పటికీ అలాగే చేసుకుంటూ, "బాబా! ఒక్కరోజు అయింది. ఇంకా పదిరోజులు ఈ నొప్పితో ఎలా చేస్తానో, ఏమో, నువ్వే అనుగ్రహించు తండ్రీ" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత నా పనుల్లో నిమగ్నమయిపోయాను. ఆరోజు సాయంత్రం ఆరతి సమయంలో కళ్ళు మూసుకుని ఆరతి పాడుతున్నాను. అప్పుడు బాబా నాకు ఒక దృశ్యం చూపించారు. ఆ దృశ్యంలో, బాబా ద్వారకామాయిలో తమ సహజ రీతిలో కూర్చుని ఉన్నారు. నేను బాబా కాళ్ల పిక్కలు ఒత్తుతూ ఉన్నాను. బాబా నన్ను చూసి నవ్వారు. ఈలోగా ఆరతి పూర్తయింది. బాబాకు నైవేద్యం సమర్పించి, అందరికీ ప్రసాదం పంచిపెట్టాను. రాత్రి నిద్రపోయి మర్నాడు ప్రొద్దున్నే లేచి నడిస్తే కాలినొప్పి ఏ మాత్రమూ తెలియలేదు. బాబాకు పువ్వులు పెట్టి, మాలవేసి పూజ ముగించాను. కాసేపటి తర్వాత మళ్ళీ గమనించాను, 'నా కాలు నొప్పి లేద'ని. నాకు చాలా ఆశ్చర్యము, ఆనందమూ కలిగాయి. ఇది బాబా మహిమే. ఆయన తమ కాళ్ళు ఒత్తించుకొని నా నొప్పి తీసేశారు. కరుణామయుడు బాబా. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ నొప్పి రాలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
'పిలిస్తే పలుకుతాన'ని మరోసారి నిరూపణ ఇచ్చిన బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
నా పేరు అరుణలక్ష్మి. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 2021, ఏప్రిల్ 24వ తేదీ ఉదయం నేను ఎప్పటిలాగే నా డ్యూటీకి వెళ్ళాను. కానీ కడుపులో నొప్పి వలన నాకు చాలా అసౌకర్యంగా అనిపించి తిరిగి ఇంటికి వచ్చేశాను. అలా నొప్పితో బాధపడుతూనే అతి కష్టం మీద భోజనం చేసి మా ఇంట్లో ఉన్న బాబా ఫోటో (నేనెప్పుడూ దాన్ని ఫోటోగా భావించను, స్వయంగా బాబానే అక్కడ కూర్చొని ఉన్నారని తలుస్తాను) వద్దకు వెళ్లి, "బాబా! ఈ కడుపునొప్పితో చాలా బాధపడుతున్నాను. నొప్పి తగ్గించు తండ్రీ" అని సాయితండ్రిని వేడుకున్నాను. తరువాత కొద్దిగా ఊదీ తీసుకొని బాబాను స్మరిస్తూ నోటిలో వేసుకున్నాను. అంతే, కొద్దిసేపట్లో నొప్పి పూర్తిగా తగ్గిపోయి నాకు హాయిగా అనిపించింది. ఇంతకంటే ఇంకేం కావాలి? మనసా, వాచా, కర్మణా ఎవరు సాయితండ్రిని కొలుస్తారో, సాయితండ్రి వారి వెంట ఉండి సదా కాపాడుతారు. అర్థించినంతనే నొప్పి నుండి ఉపశమనం కలిగించడం ద్వారా 'పిలుస్తే పలుకుతాన'ని మరోసారి బాబా నిరూపించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
Raja ram 🙏🙏🙏
ReplyDeleteOm sai ram❤❤❤
ReplyDeleteOm sai ram messages are very nice to read and follow.udi is gift of baba. It has power to cure health.baba please bless my family with health. In this pandemic period you only our hope.om sai ram❤❤❤
ReplyDeleteOm Sairam 🙏🙏🙏
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
736 days
ReplyDeletesairam
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete