సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 766వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. వద్దనుకున్నా, బాబా ఎన్నటికీ విడిచిపెట్టరు
  2. బాబా దయతో ఆరోగ్యం

వద్దనుకున్నా, బాబా ఎన్నటికీ విడిచిపెట్టరు


పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులకు నమస్కారం. నేను బాబాను వద్దనుకున్నప్పటికీ, బాబా మాత్రం ఎంతో ప్రేమతో నన్ను అనుగ్రహించిన లీలను మీతో పంచుకుంటాను. నా జీవిత ప్రయాణం పెళ్లికి ముందుదాకా చాలా సంతోషంగా సాగింది. మంచి కుటుంబం. చదువులో ఎప్పుడూ ముందుండేదాన్ని. చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం లభించింది. ఉద్యోగంలో ప్రమోషన్ రానప్పటికీ, బాబా నా ఉద్యోగ నిర్వహణలో ఎలాంటి టెన్షన్స్ లేకుండా చేసేవారు. కానీ, ఎన్నో ఆశలతో చేసుకున్న పెళ్లి మాత్రం మానసిక అశాంతిని రేపింది. మా వివాహమై ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది, కానీ ఏరోజూ ప్రశాంతత లేదు. ప్రతిరోజూ మా మధ్య గొడవలే. చాలాసార్లు మేము గొడవపడి విడిగా ఉన్నాము. ఇటీవల మా మధ్య అపార్థాలు తారాస్థాయికి చేరాయి. ఈ గొడవలకు మూలకారణం, మా అత్తింటివారికి వారి మాటే నెగ్గాలి అన్న పంతం. వివాహమైన ఇన్ని సంవత్సరాలలో మా అమ్మానాన్నలు కనీసం ఒక కేజీ బియ్యం కూడా తినివుండరు మా ఇంట్లో. మా పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళాలన్నా గొడవే. నా వారిని నాకు దూరం చేసినా, నా మీద నిందలు మోపినా భరించాను. ఈ అశాంతికి ఉపశమనం - నాకు బాబా ఇచ్చిన ఇద్దరు అన్నలు. ఒక అన్న బాబా మార్గం వీడకుండా ఉండటానికి నాకు మార్గనిర్దేశం చేస్తుంటే, మరొక అన్న నాకు మానసిక ధైర్యాన్ని ఇస్తున్నారు.


ఏప్రిల్ నెలలో మా జీవితాలలోని ఒక ముఖ్యమైన రోజు సందర్భంగా ఇద్దరం కలిసి సంతోషంగా గుడికి వెళ్ళాలని నేను చాలా ఆశపడ్డాను. కానీ ఆ ముందురోజు నేను మావారిని ఒక చిన్న కోరిక కోరితే, దానికి ఆయన చాలా కోపం తెచ్చుకొని నన్ను బాగా తిట్టారు, మా అమ్మానాన్నలను అనరాని మాటలు అన్నారు. నాకెంతో బాధ కలిగింది. ఎంతో ఏడ్చాను. నిద్రపట్టడం కోసం 4 నిద్రమాత్రలు కూడా తీసుకున్నాను. నిద్ర రాలేదు కానీ కళ్ళు తిరిగాయి. తరువాత సాయి అన్నకి ఫోన్ చేసి, “బాబా నా మొర పట్టించుకోవటం లేదు, అందుకే ఆయన విగ్రహాలన్నీ తీసేశాను” అని చెప్పి ఏడ్చేశాను. ఆ విషయం అన్నకి చెప్తుంటే మావారు విని, నేను తన గురించి తప్పుగా చెప్తున్నానని అపార్థం చేసుకుని, “ఎందుకు వేరేవాళ్ళకి చెప్పి ఏడుస్తున్నావు?” అంటూ కోపంతో ఇంట్లోనించి వెళ్లిపోయారు. ఫోన్ చేస్తే ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. కొంతసేపటి తరువాత ఫోన్ లిఫ్ట్ చేసి ఫోనులోనే నన్ను అరిచి చాలా గొడవచేశారు. బాబాకు తెలుసు నేను ఎలాంటి క్షోభపడ్డానో. తన అరుపులతో నీరసించిపోయాను. ఈ విషయం అత్తగారికి తెలిస్తే ఇంకా నాకు బాధలు.


తరువాత ఒకరోజు ఒక ఫంక్షన్‌కు హాజరవడం కోసం మేము మావారి సొంత ఊరికి బయలుదేరాము. మేము వెళ్ళే దారిలో ఒక బాబా గుడి ఉంటే, దర్శనానికి వెళ్ళాము. బాబాపై కోపంతో ఇంట్లో బాబా విగ్రహాలు తీసేసినప్పటికీ ఆ గుడిలో బాబా చక్కని దర్శనాన్ని ప్రసాదించారు. ఊదీ ప్రసాదం కూడా లభించింది. వెళ్లేటప్పుడు అక్కడ వ్యక్తితో మాట్లాడితే ఆయన నాకొక సంచి ఇచ్చారు. అది 40 రోజుల దీక్ష సంచి. ఆ సంచిలో ప్రతి ఒక్కరూ ఒక గుప్పెడు బియ్యం పోయాలి. అలా ప్రోగైన బియ్యం, దానితో పాటు మనకు తోచినంత దక్షిణ ఇస్తే వాటిని గుడిలో అన్నదానానికి ఉపయోగిస్తారు. ఆ సంచిలో చిన్న బాబా విగ్రహం, బియ్యం, ఊదీ, బాబా ప్రసాదం ఉన్నాయి. నేను ‘ఓంసాయి శ్రీసాయి జయజయసాయి’ గ్రూపులో ఉన్నానని చెప్పగానే ఆ వ్యక్తి ఆశీర్వచనం టికెట్ ఇచ్చారు. పూజారి వచ్చి అక్షింతలు వేసి బాబా ఫోటో, సాయి సచ్చరిత్ర పుస్తకం ఇచ్చారు. బాబా చూపుతున్న ప్రేమకు ఎంత ఆనందించానో మాటలలో చెప్పలేను. నేను ప్రేమించేవాళ్ళు నన్ను వద్దనుకున్నా, నన్ను ఎంతగానో ప్రేమించే బాబాను నేను వద్దనుకున్నా, నా బాబా మాత్రం నన్ను ఎన్నటికీ విడిచిపెట్టరు అని ఈ లీల ద్వారా నిర్ధారణ జరిగింది.


బాబా దయతో ఆరోగ్యం


పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తనకి బాబా ప్రసాదించిన అనుభావన్నిలా పంచుకుంటున్నారు:

  

సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. సాయిబాబా చల్లని చూపు వలన నేను కరోనా నుండి కోలుకున్నాను. కానీ ఆ తరువాత నుండి చాలా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాను. అవి కూడా బాబా దయవల్ల త్వరలోనే తీరుతాయని గట్టి నమ్మకం ఉంది. 


ఈ కరోనా సమయంలోనే ఒకరోజు మా అమ్మగారికి పక్షవాతం వచ్చింది. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఇద్దరు తెలిసిన డాక్టర్లతో అమ్మకు ఇంటివద్దే చికిత్స ఇప్పించారు. అమ్మ వారం రోజుల్లోనే కోలుకుంది. ఇదంతా బాబా దయతోనే సాధ్యమైంది. నేను నవగురువారవ్రతం చేసుకున్నాను. బాబా అనుగ్రహంతో మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది. “నా మనసు ఎప్పుడూ ఆనందంగా సత్సంగానికి వెళ్ళేలా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి బాబా”. మరలా త్వరలోనే మరో అనుభవాన్ని మీతో పంచుకుంటాను.




8 comments:

  1. Om sai ram 1st sai leela is nice.some husbands why they treat their wifes like slaves.this is bad mentality.they must change.there are good husbands also.my husband is nice person.he treats me like angel.baba blessed me with good husband.mine happy family. Om sai ram❤❤❤

    ReplyDelete
  2. సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om sai ram baba pleaseeee bless my mother with good health sai

    ReplyDelete
  5. సాయినాథ థాంక్యూ తండ్రి.. మీ బిడ్డ సాయిచరణ్అ తేజ్నా అనారోగ్యం సమూలంగా తీసేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు... నీ కరుణా కటాక్ష వీక్షణాలు మాపై చూపి, అనునిత్యం కాపాడుతున్ననందుకు..ఎల్లవేళలా మాపైన మీ దయా దృష్టి ఉండాలని ఆశిస్తూ, మమ్మల్ని అన్ని విధాలుగా మంచి ఆశీస్సులు అందించి ముందుకు నడుపుతున్నందుకు థాంక్యూ తండ్రి సాయినాథ థాంక్యూ వెరీ మచ్.. నీవే కలవు నీవు తప్ప మాకు ఎవరున్నారు ఈ లోకంలో 🙏🙏🕉️✡️🙏🙏

    ReplyDelete
  6. సాయినాథ థాంక్యూ తండ్రి.. సాయి వర ప్రసాదం.. మీ బిడ్డ సాయిచరణ్ తేజ్.. అనారోగ్యం సమూలంగా తీసేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు... నీ కరుణా కటాక్ష వీక్షణాలు మాపై చూపి, అనునిత్యం కాపాడుతున్ననందుకు..ఎల్లవేళలా మాపైన మీ దయా దృష్టి ఉండాలని ఆశిస్తూ, మమ్మల్ని అన్ని విధాలుగా మంచి ఆశీస్సులు అందించి ముందుకు నడుపుతున్నందుకు థాంక్యూ తండ్రి సాయినాథ థాంక్యూ వెరీ మచ్.. నీవే కలవు నీవు తప్ప మాకు ఎవరున్నారు ఈ లోకంలో 🙏🙏🕉️✡️🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo