1. బాబా ప్రసాదించిన చిన్న చిన్న అనుభవాలు2. కుదరదన్న సెలవులు లభించేలా అనుగ్రహించిన బాబా
బాబా ప్రసాదించిన చిన్న చిన్న అనుభవాలు
నా పేరు సంధ్య. ఎన్నోసార్లు కష్టకాలంలో బాబా నేనున్నానని నన్ను ఆదుకున్నారు. మా ఇంట్లో మా బావగారు, అత్తమ్మ ఎంతో ఆప్యాయంగా ఉంటారు. అలాంటిది అనుకోకుండా వారిరువురి మధ్య చిన్న గొడవ జరిగింది. అప్పుడు నేను, "బాబా! రేపు ఉదయానికల్లా వాళ్ళు కలిసిపోతే, మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటానని మొక్కుకున్నాను. బాబా దయవల్ల మర్నాడు ఉదయం వాళ్ళు ముందురోజు జరిగిన సంఘటనను మర్చిపోయి మామూలుగా మాట్లాడుకున్నారు. "థాంక్యూ బాబా".
మా బాబుకి వీక్లీ టెస్టుల్లో చాలా తక్కువ మార్కులు వస్తుండేవి. అప్పుడు నేను 'సాయి దివ్యపూజ' చేసి బాబాను వేడుకున్నాను. అంతే, నేను ఉహించలేనంతగా మరుసటివారంలో బాబుకి మంచి మార్కులు వచ్చాయి. నాకు చాలా ఆశ్చర్యమేసింది. బాబా మహిమలు అనంతం. "థాంక్యూ బాబా".
మా సిస్టర్ కూడా బాబా భక్తురాలు. మేమిద్దరమూ ప్రతిరోజూ బ్లాగులో ప్రచురితమయ్యే అనుభవాలు చదువుతుంటాం. ఒకరోజు రాత్రి హఠాత్తుగా తన ఫోన్ ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆన్ కాలేదు. మంచి ఫోన్ అలా ఆఫ్ అయ్యేసరికి తనకి భయమేసి, "బాబా! ఇప్పుడు నా దగ్గర కొత్త ఫోన్ కొనేంత డబ్బులు లేవు. దీన్ని ఎలాగైనా బాగు చేయండి" అని బాబాతో చెప్పుకొని ఫోన్‌కి కొంచెం ఊదీ పెట్టి, "తెల్లారేసరికి ఆన్ అయ్యేలా చేయండి" అని వేడుకొని పడుకుంది. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయం నిద్రలేచి ప్రెస్ చేస్తే, ఫోన్ ఆన్ అయింది. తను ఆనందంగా నాకు ఫోన్ చేసి నా అనుభవాన్ని బ్లాగుకి పంపమని చెప్పింది. "థాంక్యూ బాబా".
కుదరదన్న సెలవులు లభించేలా అనుగ్రహించిన బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో తల్లి కావడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. 2022, డిసెంబరులో బాబా కృపతో మాకు ఒక పాపని అనుగ్రహించారు. నేను ఉద్యోగస్థురాలిని. కాన్పు తర్వాత 6 నెలల సెలవులు ఉన్నప్పటికీ అవి ఎలా గడిచిపోయాయో తెలియలేదు. మరో ఒకటి, రెండు వారాల్లో నేను తిరిగి డ్యూటీలో చేరాల్సిన సమయం వచ్చింది. అప్పుడే పాపకు అన్నప్రాసన చేసాము కానీ, ఇంకా మామూలుగా తినే ఘన పదార్థాలు అలవాటు చేయలేదు. అలాంటి స్థితిలో నేను ఆఫీస్ వర్క్ మొదలుపెట్టాలంటే పాపని చేసుకోవడానికి ఎవరైనా ఉండాలి. కానీ పాపని చూసుకునే సహాయం చేసే వాళ్ళెవరూ లేరు. అలాగని ఉద్యోగం మానేద్దామంటే కుటుంబ పరిస్థితుల వల్ల నేను ఉద్యోగం చేయక తప్పదు. అందువల్ల నాకు ఏం చేయాలో తోచలేదు. మా మేనేజరుతో మాట్లాడి సెలవు పొడిగించమని అభ్యర్థించాను కానీ, కుదరదు అన్నారు. అయ్యో.. అని బాధపడుతూ రాత్రి నిద్రపట్టక ఫేస్బుక్ చూస్తుంటే, ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుకి సంబంధించిన 'సాయి మహారాజ్ సన్నిధి' ఫేస్బుక్ పేజీ కనిపించింది. అప్పుడు నేను నా మనసులో, 'ఎలాగైనా సెలవు పొడిగిస్తే, బాబా అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన'ని అనుకోని పడుకున్నాను. మరుసటిరోజు సెలవులు పొడిగించినట్లు నాకు మెయిల్ వచ్చింది. అది చూసి, 'ఇది కలా?, నిజమా?' అని నాకు అనిపించింది. ఇది చాలా చిన్న విషయంలా అనిపించవచ్చుగాని నాకు సెలవులు లభించడం సాయి కృపే. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, నేను పనిచేసే కార్పొరేట్ కంపెనీలో కొన్ని కారణాల వల్ల, నేను అంతకుముందు తీసుకున్న సెలవుల వల్ల ఎక్కువ సెలవులు తీసుకునే అవకాశం నాకు లేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ దర్శనార్థం శిరిడీ వచ్చే ప్రణాళిక ఉంది. ఎప్పుడు అనుగ్రహిస్తావో తండ్రీ!".
Om Sai Ram please bless my family with long life 🙏🙏🙏 you are my parents.i lost both of them.with your blessings my health improved.Thank you Baba
ReplyDeleteBaba, pl give good health to my son.
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteSai always be with me
Baba, bless my daughter with Ms Mch neurosurgery seat in AIIMS College.
ReplyDeleteGive first rank in PG NEET exam.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram
ReplyDeleteఓం సాయిరాం సాయి ఏ గొడవలు ఏ ఇబ్బందులు ఏ చాడీలు ఈ అబద్ధాలు ఏ నిందలు లేకుండా ఏ కోర్టు కేసులు లేకుండా నా భర్త ప్రేమతో నా కోసం తిరిగి వచ్చేస్తున్నాను భారీగా స్వీకరించి కాపారానికి తీసుకెళ్లిన చూడు సాయి నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ప్రసాదించు సాయి
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః
Deleteమీ కోరిక తోందరలోనే నెరవేరుతుంది
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Sai Arogyakshemadhaaya namaha 🙏🙏🙏
ReplyDeleteOm sai ram Naku Sandhya ki marriage ayela chey tandri
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri meku satha koti vandanalu
ReplyDeletesai baba maa sai madava bharam antha meede baba. eeroju science exam madava baaga rasetattu madavaki shaktini evvandi. alage maa tammudiki kuda oka thoduni evvandi baba.
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please BP normal ga vundali thandri please.. complications lekunda chudu baba.. safe delivery chei baba please..
ReplyDeleteఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం
ReplyDeleteSai ram ma Current problem బాగుచేసారు, దన్యవాదాలు
ReplyDeleteOm Sai Ram Jai Sai Ram 🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba na biddalaki hair eppudosthundi baba
ReplyDelete