1. బాబా ఉన్నారు
2. ప్రతి కష్టంలో తోడుగా ఉండే బాబా
బాబా ఉన్నారు
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక ముస్లిం అమ్మాయిని. ఒకప్పుడు మా ఇంటి పక్కన ఉండే స్నేహితులు సాయిబాబా గుడికి వెళ్లే అలవాటు నాకు చేసారు. కొన్నాళ్ళకి మేము ఆ ఇల్లు మారాము. తర్వాత ఒకరోజు ఆ స్నేహితులు నాకు ఫోన్ చేసి, "మేము గుడికి వెళ్తున్నాము. వస్తావా?" అని అడిగారు. నేను వాళ్లతో "వస్తాన"ని చెప్పాను. కానీ మా నాన్నగారు, "వెళ్లొద్దు. మనం ముస్లింలం. విషయం అందరికీ తెలిస్తే నా పరువు పోతుంది" అని అన్నారు. నాకు మా నాన్న అంటే చాలా ప్రేమ, గౌరవం, మర్యాద. ఆయన అలా అనేసరికి నేను తట్టుకోలేక ఏడుస్తూ 'బాబా ఉన్నారు.. బాబా ఉన్నారు' అంటూ స్పృహ కోల్పోయాను. నాకు స్పృహ వచ్చేసరికి మా నాన్న, "ఉన్నారు, బాబా ఉన్నారు. లేమ్మా" అంటున్నారు. అంతేకాదు, అదేరోజు సాయంత్రం అమ్మానాన్న నన్ను బాబా గుడికి తీసుకొని వెళ్లారు. ఇది నా మొదటి అనుభవం.
ఇంటర్ చదువుతున్నప్పుడు అనారోగ్యం వల్ల నేను కాలేజీకి రెగ్యులర్‌గా హాజరు కాలేదు. అయినప్పటికీ ఇంటర్ రెండు సంవత్సరాలూ ఏ సబ్జెక్టులోనూ తప్పిపోకుండా అన్నీ సబ్జెక్టులు పాసయ్యాను. ఇది సాయి సచ్చరిత్ర పారాయణ చేయడం వల్లే సాధ్యమైంది. అయితే నేను తర్వాత సాయిబాబాకి దూరమయ్యాను. డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. ఎలాగో ఆ సబ్జెక్టులు పాసై ప్రైవేట్ స్కూలులో టీచరుగా చేరాను. తరువాత నాకు పెళ్లైంది. మా నాన్న వద్ద ఉండేటప్పుడు ఆయన ఉద్యోగస్తులవ్వటం వలన అమ్మానాన్న, నేను, చెల్లి హాయిగా ఉండేవాళ్ళము. కానీ నా భర్తది వ్యవసాయ కుటుంబం. వాళ్లకు మామిడి తోటలు, గేదెలు ఉన్నాయి. వాళ్ల వ్యవహారాలు, మాటతీరు, జీవనశైలి అన్నీ చాలా వేరుగా ఉంటాయి. నాకు వంట రాదు. వాళ్ల వంట నాకు పడేది కాదు. ఉదయం పూట టిఫిన్ అయితే అసలే ఉండేది కాదు. అందువల్ల నా ఆరోగ్యం పాడయ్యింది. అతి కష్టం మీద నేను గర్భవతినైనా ఒక నెల వరకు వాళ్ళింట్లో ఉన్న తర్వాత మా అమ్మ వాళ్ళింటికి వచ్చి హాయిగా ఉండసాగాను. అచ్చం మా నాన్న పోలికలతో నాకు పండంటి పాప పుట్టింది. పాప చిన్నది కావడంతో నేను మొదట్లో తనని చూసుకోలేకపోయేదాన్ని. నా భర్త దగ్గరకి వెళ్లిన వారం, పది రోజులలో పాప ఆరోగ్యం పాడయ్యేది. దాంతో నేను పాపను తీసుకొని మా నాన్న దగ్గరకి వచ్చేదాన్ని. అక్కడికి రాగానే పాప ఆరోగ్యం కుదుటపడేది. ఇలా ఉండగా కరోనా సెకండ్ వేవ్‌లో నాన్న స్వర్గస్థులయ్యారు. ఆ తరువాత అమ్మ ఆరోగ్యం క్షిణించింది. దాంతో నన్ను, నా పాపని అత్తగారింట్లోనే ఉండమన్నారు అమ్మ, చెల్లి. మేము రెండు సంవత్సరాలు చాలా ఇబ్బందిపడ్డాము. ప్రతినెలా నాకు, పాపకి జ్వరం, వాంతులు, ఇవికాక పాపకి జలుబు, దగ్గు, కడుపులో ఇన్ఫెక్షన్ ఉంటుండేవి. ఇలాంటి పరిస్థితుల్లో నా స్నేహితురాలు శ్రావణి నా పరిస్థితిలో మార్పు రావాలని, "రోజూ ఉదయం నిద్రలేవగానే, రాత్రి పడుకొనేముందు బాబాకి దణ్ణం పెట్టుకో" అని నాతో చెప్పింది. నేను అలాగే చేశాను. ఆశ్చర్యం! కొన్ని నెలల్లో మార్పు వచ్చింది. మా అమ్మ మా ఊర్లో అద్దెకు ఇల్లు తీసుకోమని, వచ్చి మాతోనే ఉండసాగింది. మూడవరోజు బాబా నాకు స్వప్న దర్శనమిచ్చి, "ఈ ఇంట్లో నువ్వే కాదు నేనూ ఉంటున్నాను, మీతో పాటు తింటున్నాను" అని అన్నారు. బాబా మాటలు నాకప్పుడు అర్థం కాలేదు కానీ, కొన్ని రోజులయ్యాక నన్ను కొత్త ఇంటికి మార్చి, అమ్మను తోడుగా ఉండేలా చేసి ప్రతిరోజూ నేను కోరుకుంటున్న కోరికను నెరవేర్చింది బాబానే అని అర్థమై నాకు తోడుగా బాబా ఉన్నారని చాలా ఆనందపడ్డాను. ఇలా బాబా అనుగ్రహం నా మీద ఉంది. ఆయనే నన్ను నడిపిస్తున్నారు. నేను బాబా మీద నమ్మకంతో ప్రతిరోజూ బాబాని ధ్యానించటం, సచ్చరిత్ర పారాయణ, 'సాయి మహారాజ్ సన్నిధి' పారాయణ చేయటం చేస్తున్నాను. ప్రస్తుతం అవి నా దినచర్య అయిపోయాయి. "బాబా! మీ కృపకు కృతజ్ఞురాలిని తండ్రీ".
ప్రతి కష్టంలో తోడుగా ఉండే బాబా
నా పేరు సరిత. నాకు ఏ కష్టమొచ్చినా నేను సాయిని తలుచుకుంటాను. ఆయన నన్ను ఎన్నోసార్లు కాపాడారు. నా భర్త చనిపోయాక ఇంట్లో చాలా కష్టంగా ఉండటంతో నేను ఒక ప్రైవేటు పాఠశాలలో జీకే టీచరుగా చేరాను. నేను ఆ పాఠశాలలో చేరేసరికి 5వ తరగతికి క్లాస్ టీచర్ లేనందున నన్ను క్లాస్ టీచరుగా నియమించారు. ఆ సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుండగా ప్రోగ్రస్ రిపోర్టులు తయారు చేయాల్సి వచ్చింది. అయితే 5వ తరగతి రిజిస్టర్ కనిపించలేదు. దాంతో నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, మా ప్రిన్సిపాల్ మేడం చాలా కోపిష్టి. ఆవిడ వెనకముందు చూడకుండా అందరిముందు తిడతారు. నాకు ఏం చేయాలో అర్ధంకాక, "సాయిబాబా! మీరే వున్నారు. ఎలాగైనా రిజిస్టర్ దొరకాలి" అని బాబాను వేడుకున్నాను. విషయం స్కూలులో టీచర్ల అందరికీ తెలిసి వాళ్ళు కూడా, 'రిజిస్టర్ పోయిందని ప్రిన్సిపాల్ మేడంకి తెలిస్తే, ఇంకేం లేదు అందరినీ ఇష్టమొచ్చినట్లు తిడతార'ని టెన్షన్ పడ్డారు. నేను అయితే రెండు రోజులు తిండి తినకుండా ఏడుస్తూ 'సాయిబాబా.. సాయిబాబా' అని అనుకుంటూనే ఉన్నాను. బాబా అద్భుతం చేశారు. రిజిస్టర్ LKG తరగతి గది కప్ బోర్డులో దొరికింది. ఇలా నా ప్రతి కష్టంలో బాబా నాకు తోడుగా ఉన్నారు. నిజంగా ఆయన లేకపోతే నేను ఈరోజు ఉండేదాన్ని కాదు. "శతకోటి ధన్యవాదాలు బాబా. నాకు, నా పిల్లలకి ఏ కష్టం లేకుండా చూసుకోండి బాబా".
Om sai ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeletePl Sai Kalyan ki marriage chai thandri na wish safalam chai thandri satha koti namaskaralu
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm Sri Sai aarogya kshemadhaaya namaha 🙏🙏🙏
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please baba
ReplyDeletebaba maa sai madava bharam antha meede baba. memu andaramu sunday nrt velli homam chese tatlu deevinchu baba.nenu naa anubhavanni ee bloglo panchukuntanu baba
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sri Sai Ram
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 kapadu Tandri
ReplyDelete