1. నా పక్కనే ఉన్నానని తెలియజేసిన బాబా2. ఉద్యోగంలో సాయి చేసిన సహాయం
నా పక్కనే ఉన్నానని తెలియజేసిన బాబా
అందరికీ నమస్తే. నా పేరు కిరణ్మయి. నేను ఇప్పుడు పంచుకోబోయే అనుభవం చిన్నదే అయినప్పటికీ నిజంగా బాబా నా పక్కనే ఉన్నారని, కష్టకాలంలో నాకు అండగా ఉన్నారని తెలియజేసింది. దీన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాని ప్రార్థించలేదు. అయినా ఆయన ప్రేమను మీ అందరితో పంచుకోవాలనిపించింది. ఇక విషయానికి వస్తే.. నేను ఒక రకమైన వ్యక్తిని. దేన్నీ సానుకూలంగా తీసుకోలేను, ప్రతిదీ ప్రతికూలంగానే చూస్తాను. ప్రతికూలంగా ఆలోచిస్తే నాకు నేను నచ్చజెప్పుకోవడం చాలా కష్టమైపోతుంది. అయినా నేను ఒక రకమైన మొండి పట్టుదల గల వ్యక్తినైనందున ఎలాంటి సానుకూలతను అంగీకరించలేను. అలాంటి నా జీవితం ఇటీవల చాలా నిరుత్సాహంగా మారింది. ఆ పరిస్థితి నన్ను తీవ్రంగా ప్రభావితం చేయడంతో నేను నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాను. ఇలాంటి స్థితిలో 2023, నవంబర్ 10న నేను బాబాను, "ఈరోజు మీరు ఫోటో రూపంలో నా వద్దకు రావాల"ని కోరాను. అయితే నేను విదేశాలలో ఉంటున్నందున ఎవరి ద్వారానైనా ఏదైనా బాబా ప్రసాదంగా పొందే అవకాశం అంతగా లేదు. ఎవరైనా భారతదేశానికి వెళ్ళొస్తేనే బాబా ప్రసాదం లేదా ఫోటో లభించే అవకాశం ఉంది. అందుచేత నేను అదివరకు విరాళమిచ్చిన ఏదైనా బాబా మందిరంవాళ్ళు ఆ మందిరానికి సంబంధించి ఏదైనా పేపర్ వంటిది పంపారేమోనని నా పోస్ట్ బాక్స్ చెక్ చేశాను. అందులో బాబాకి సంబంధించి నాకు ఏమీ కనిపించలేదు. తర్వాత నేను నా భర్తని కూరగాయల కోసం నన్ను ఏదైనా భారతీయ కిరాణా దుకాణానికి తీసుకెళ్లామని అడిగాను. నేను అక్కడ 'సాయి ఫ్లోరా' అగర్బత్తి తీసుకుందామని, తద్వారా బాబా నా వద్దకు వస్తారని అనుకున్నాను. కానీ, నేను షాపుకి వెళ్లలేకపోయాను. ఇక నేను నా పనుల్లో నిమగ్నమయ్యాను. కొంతసేపటికి నేను నా వద్ద ఉన్న ఒక బాబా పుస్తకం తీస్తే, అందులో పాస్‌పోర్ట్ సైజు బాబా ఫోటో దర్శనమిచ్చింది. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. అప్పటికి 4 నెలల క్రితం మేము భారతదేశానికి వెళ్ళినప్పుడు నేను, నా మేనకోడలి ద్వారా అమెజాన్ మరియు కొన్ని ఇతర వెబ్‌సైట్‌ల ద్వారా కొన్ని బాబా పుస్తకాలు తెప్పించుకున్నాను. వాటిలోని ఒక పుస్తకంలో 4X5 సైజులో చాలా అందమైన ఒక బాబా ఫోటో వుంది. నేను ఆ ఫోటోని, శిరిడీ నుండి తెచ్చుకున్న ఒక సాయి లాకెట్‌ని నా సోదరికి ఇచ్చాను. తర్వాత నేను ఆ పుస్తకాన్ని చాలాసార్లు చెక్ చేశాను. అందులో వేరే ఫోటో ఏమీ కనిపించలేదు. అలాంటిది నాలుగు నెలల తర్వాత నవంబర్ 10న ఆ పుస్తకాన్ని తీస్తే అందులో ఆ ఫోటో కనిపించింది. అది చూసాక నేను పొందిన ఆనందాన్ని మీరు ఊహించగలరనుకుంటున్నాను. మనలని రక్షించడానికి బాబా ఎప్పుడూ మనకంటే ఒక అడుగు ముందే ఉంటారు. "ధన్యవాదాలు బాబా".
ఉద్యోగంలో సాయి చేసిన సహాయం
ఓం శ్రీసాయినాథాయ నమః!!! అందరికీ నమస్కారాలు. నా పేరు గోపిశాంతిశ్రీ. నేను ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేసున్నాను. కారు లోన్స్ సెక్షన్‌లో పని చేస్తున్న మాకు ప్రతినెలా టార్గెట్స్ ఉంటాయి. అయితే ప్రతినెలా మంచిగా చేసే నేను 2023 మేలో నా టార్గెట్ పూర్తి చేయలేకపోయాను. దాంతో మా మేనేజర్ నాకు జీతం రాదని అన్నారు. కానీ ఆ నెలాఖరులో ఒక ఫైల్ రావడంతో నా టార్గెట్ రీచ్ అయి జీతం వచ్చింది. ఆ నెల అలా గడిచిపోయింది కానీ, తరువాత జూన్, జూలై నెలల్లో కారు లోన్‌కి సంబంధించిన ఫైల్స్ రాలేదు. అందువల్ల నేను చాలా బాధపడుతుండేదాన్ని. ఆ బాధతో నాకు రాత్రిళ్ళు నిద్రపట్టేది కాదు. అలాంటి సమయంలో ఒకరోజు నేను నా ఫోన్ చూస్తుంటే, 'సాయిభక్తుల అనుభవమాలిక' అని కనిపించింది. అది ఓపెన్ చేసి బాబా భక్తుల అనుభవాలు చదివిన తరువాత మనసులో, "బాబా! నాకు మంచిగా లోన్స్ ఫైల్ అయి జీతంతోపాటు ఇన్సెంటివ్ కూడా మంచిగా వస్తే, నేను నా సంతోషాన్ని సాయిభక్తుల అనుభమాలికలో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అప్పటినుంచి బాబా భక్తుల అనుభవాలు చదువుతూ ఉండేదాన్ని. బాబా దయతో మంచిగా లోన్స్ ఫైల్ అయి ఇన్సెంటివ్ కూడా వచ్చింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
Om Sri Sai Arogyakshemadhaaya namaha🙏🙏🙏
ReplyDeleteOm sri sai ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteఓం సాయిరాం బాబా తండ్రి గురుదేవా ఆ ప్రభువు కోర్టు కేసులు లేకుండా నేనిందలు అవమానాలు గొడవలు లేకుండా నా భర్త మారి నన్ను అర్థం చేసుకొని ప్రేమతో నన్ను స్వీకరించి కాపురానికి తీసుకెళ్లేలా చూడు తండ్రి గురు దేవా మహా ప్రభువా
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri meku satha koti vandanalu
ReplyDeleteOm sairam 🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
sai baba maa sai madava bharam antha meede baba. eeroju madava baaga chaduvukoni exams lo machi marks techuukovali baba. alage maa thammudiki voka thoduni chupinchu baba. maa attagaru, maavaru alochanalu maarali baba.
ReplyDeleteOm Sai Ram when I feel health problem he solved that problem.i suffered with depression for 8 months.i felt hell.i used to cry in front of Sai Baba.In that pain we went to Shirdi before guru poornima.He blessed me with new doctor.with his blessings I recovered . my life is peaceful.Now I am feeling better.with bad thoughts I suffered very much.Thank you Sai
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
House kattukovalibaba
ReplyDeleteఓం సాయిరాం
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please bp normal ga vundali thandri please baba.. complications lekunda chudu baba safe delivery chei baba please baba
ReplyDeleteOm Sri Sainathaya Namah
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteOmsaisri Sai Jai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete