సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1696వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సాయినాథుని అండదండలు

నేను ఒక సాయిభక్తురాలిని. 2023, జూన్ 18న నేను, నా కుటుంబం శిరిడీ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నాము. అయితే అవి ఆర్ఏసీ టికెట్లు. ఆర్ఏసీ 125 ఉంది. మా స్నేహితులు, "మీ శిరిడీ ప్రయాణం జరగదు. టికెట్లు కన్ఫర్మ్ కావు" అని ఒకటే ఊదరగొట్టారు. నేను వాళ్ళతో, "నేను సాయి బిడ్డను. ఎలాగైనా నన్ను, నా కుటుంబాన్ని ఆయన శిరిడీకి రప్పించుకుంటారు. ఏదో అద్భుతం చేస్తారు" అని బల్లగుద్ది చెప్పాను. నేను చెప్పినట్టే టికెట్లు కన్ఫర్మ్ అవ్వడంతో మేము ఎంతో సంతోషంగా సాయి దర్శనానికి శిరిడీ ప్రయాణమయ్యాము. అక్కడికి వెళ్ళాక ఒక చిన్న కారణంగా మాకు భక్తినివాస్‌లో రూము దొరకలేదు. అందుకు నేను చాలా బాధపడి బాబా మీద అలిగాను, 'నిన్ను చూద్దామ'ని వస్తే రూమ్ దొరకలేద'ని బాబాతో పోట్లాడాను. మళ్లీ అంతలోనే ఆయన చరిత్రలో 'కొబ్బరికాయ సమర్పించాలని వచ్చిన ఒక భక్తురాలి ముక్కెర కనపడకుండా పోవడం, కొబ్బరికాయ సమర్పించగానే దొరకడం' గుర్తొచ్చి బాబా ఇష్టమైనవాళ్ళని ఆటపట్టిస్తారని, నన్ను కూడా కాస్త ఆటపట్టిస్తున్నారు అనుకున్నాను. అదే నిజమేమో! మాకు రూము దొరకకపోయినప్పటికీ మాతోపాటు వచ్చిన చుట్టాలకి రెండు రూములు దొరికాయి. వాళ్ళు మేము వద్దన్నా ఒక రూము మాకు ఇచ్చారు. అలా సాయి మా వసతి సమస్యను తీర్చారు.


నేను శిరిడీ వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వంటివి తీసుకెళ్లడం మర్చిపోయాను. నేను తీసుకెళ్లిన డబ్బంతా ఖర్చు అయిపోవస్తున్న తరుణంలో చుట్టాలని అడగటం ఇష్టంలేక అవసరమైతే గూగుల్ పే, ఫోన్ పే ఉన్నాయిగా అనుకొని శనిసింగణాపూర్‌కి బయలుదేరాను. అప్పుడు మా వద్ద ఉన్న డబ్బులు లెక్క పెట్టి పర్సులో పెట్టాము. ఆరోజు శనిసింగణాపూర్‌లో దర్శనం చేసుకుని మరుసటిరోజు తెల్లారి తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు మా చెల్లి ఇంకోసారి డబ్బులు లెక్కపెడితే పర్సులో ఉండాల్సిన దానికంటే 2,500 రూపాయలు అదనంగా ఉన్నాయి. అది చూసి మేము, 'నిన్న లెక్కపెడితే అంత తక్కువగా ఉంది కదా! ఇంతలో 2,500 రూపాయలు అదనంగా ఎలా వచ్చాయ'ని ఆశ్చర్యానికి లోనై, 'ఆ డబ్బు సాయి తప్ప ఇంకెవరు పెట్టగలరు? మా ఇబ్బంది గ్రహించి, మేము బాధపడకూడదని ఆయనే ఆ డబ్బు మా పర్సులో పెట్టార'ని అనుకున్నాము. అప్పుడు మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అనుభవాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. మా జీవితంలో ఇటువంటి అనుభవం ఊదీ విషయంగా ఇంతకుముందు ఒకసారి జరిగింది.


మేము మా ఇంట్లో ఎవరికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఊదీనే ఔషధంగా వాడతాం. అదే మా రోగనివారిణి. 2017లో మేము శిరిడీ వెళ్ళినప్పుడు ఊదీ తెచ్చుకొని ఒక డబ్బలో నింపుకున్నాం. ఒకసారి మా పక్కింటి ఆంటీవాళ్ళు వాళ్ళింట్లో ఒకరి ఆరోగ్యం బాగాలేకపోతే ఊదీ అడిగారు. మా చెల్లి వాళ్లకి ఊదీ ఇచ్చాక, "అక్కా! ఇంకా కొంచమే ఊదీ ఉంది" అని అంది. నేను తనతో, "పర్లేదులే, మనం మళ్లీ శిరిడీ వెళ్తాం కదా!" అని చాలా ధీమాగా అన్నాను. కానీ మేము నాలుగు సంవత్సరాల వరకు శిరిడీ వెళ్లలేకపోయాము. అయినప్పటికీ మా ఇంట్లో ఊదీ నిండుకోలేదు. ఎంత వాడుతున్నా తరగకుండా డబ్బలో ఉన్న ఊదీ ఉన్నది ఉన్నట్లే ఉంది. అలాగని ఎవరూ శిరిడీ నుండి ఊదీ తెచ్చి మాకు ఇవ్వలేదు. సాయికి మాకు ఏం కావాలో, ఎంత కావాలో తెలుసు. ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయానికి ఏదో ఒక రూపంలో అన్నీ మాకు అందజేస్తారు.


ఒకప్పుడు మా చెల్లికి తరచుగా దగ్గు వస్తుండేది. ఎన్ని హాస్పిటళ్లకు తిరిగినా తగ్గలేదు. చివరికి టీబీ టెస్ట్ చేయించాము. బాబా దయవల్ల ఆ వ్యాధి లేదని వచ్చింది. కానీ చెల్లి దగ్గుతో ఇబ్బంది పడుతూనే ఉండేది. అప్పుడు అమ్మ, చెల్లి ఇద్దరూ దగ్గు తగ్గిపోవాలని సాయికి ఉపాసవముండటం నచ్చదని తెలిసి కూడా ఐదు గురువారాలు ఉపవాసం ఉన్నారు. ఆనాటినుండి ఈనాటివరకు మా చెల్లి మళ్లీ ఆ దగ్గు సమస్యతో బాధపడలేదు. ఈమధ్య ఒక అర్థరాత్రి మా చెల్లికి తీవ్రమైన తలనొప్పి వచ్చింది. టాబ్లెట్ వేసినా తగ్గలేదు. నేను మూడుసార్లు 'సాయిరక్ష' స్తోత్రం చదివి 'సాయిరాం' అని 108 సార్లు జపించాను. అంతే, క్షణాల్లో తలనొప్పి అదృశ్యమైంది. ఇలా అన్ని విషయాల్లో ఆ సాయినాథుని అండదండలు మాకు ఉన్నాయి. ఆయన మాకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా కాపాడుతున్నారు.


నేను ఒక కోర్టు వ్యవహారంలో ఉన్నాను. ఆ కేసుని  డీల్ చేస్తున్న లాయర్ నాతో చాలా దురుసుగా ప్రవర్తిస్తూ అమర్యాదగా మాట్లాడుతుంటే ఆ విషయాన్ని సాయికి చెప్పికొని  బాధపడ్డాను. తర్వాత ఒకరోజు ఆ లాయరుని కలవాల్సిన అవసరం వచ్చింది. నేను వెళ్లేముందు సాయిని, "ఆ లాయరు ప్రవర్తన ఏమీ బాగోలేదు. నాకు సహాయం చేస్తాడా?" అని అడిగి 'క్వశ్చన్ అండ్ ఆన్సర్' వెబ్సైటులో చూస్తే, "యువకుడు నీకు సహాయం చేస్తాడు" అని వచ్చింది. నిజంగానే అతను ఆరోజు ఎంతో మర్యాదగా సమాధానం చెప్పి నాకు సహాయం చేస్తానని మాటిచ్చాడు. ఇలా ఆ సాయినాథుడు చిన్న విషయంలో అయినా, పెద్ద విషయంలో అయినా మా కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. "ధన్యవాదాలు సాయి. నన్ను దీవిస్తున్నట్టే మీ భక్తులందరినీ దీవించు బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.


20 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  7. ఓం సాయిరామ్

    ReplyDelete
  8. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  9. Which website do you check for question and answers?

    ReplyDelete
  10. Sai dayachupu Kalyan ki marriage chai thandri

    ReplyDelete
  11. sai baba maa sai madava eeroju english examki velladu madava rayagaligina questions vachhelaga cheyandi baba. alage maavaru madava kosam chese homam ki , abhishekam ki nrt vachhi cheselaga ayanaku bodhinchandi baba.maa tammudiki kuda oka thodu ni chupinchu baba.maa illu padayipothondi emi cheyalo ardham kavatledu baba

    ReplyDelete
  12. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  13. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  14. Om sri sairam 🙏

    ReplyDelete
  15. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please

    ReplyDelete
  16. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  17. Om sainathaya namah om Sri sainathaya namaha om Sri Sai nathaya namaha
    Swamy Naku Sandhya ki marriage ayela chudu tandri om Sri satchitananda sadguru sai nath maharaj ki jai
    Omsairam omsairam Omsairam Omsairam omsairam

    ReplyDelete
  18. Om Sri Sai Nathya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo