సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1697వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఆశీర్వాదం
2. బాబాని నమ్ముకో - నీ సమస్యలన్నీ తొలగిపోతాయి

బాబా ఆశీర్వాదం

సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నా చిన్నతనం నుంచి మా అమ్మకి సాయిబాబా అంటే చాలా నమ్మకం. అమ్మ చెప్పేవి వినడం వలనో ఏమో నాకు కూడా బాబా మీద భక్తి, విశ్వాసాలు కుదిరి ఆ వయసునుంచే బాబాని పూజించడం మొదలుపెట్టాను. నేను ఏది కోరుకున్నా అది నెరవేర్చేవారు బాబా. అలా నాకు చాలా అనుభవాలు జరిగాయి. 2020లో నా గర్భసంచిలో సమస్య వచ్చి ప్రతినెలా నెలసరి వచ్చినప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతుండేదాన్ని. అందుచేత నేను ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకొని హాస్పిటల్‌కి వెళ్లేముందు దారిలో బాబా గుడి వద్ద ఆగి బాబాని వేడుకున్నాను. ఆ సమయంలో బాబా నన్ను చూసి నవ్వినట్టు అనిపించింది. తర్వాత నేను హాస్పిటల్‌కి వెళ్ళాక డాక్టరు టెస్ట్ చేసి, "త్వరగా ఆపరేషన్ చేయించుకోండి. ఆలస్యం చేయవద్దు" అని చెప్పారు. ఒక నెల తర్వాత నేను ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్‌కి వెళ్లి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. డాక్టర్, "లాప్రోస్కోపీ చేయించుకోమ్మా, కుట్లు అయితే చాలా బాధపడాలి" అని చెప్పారు. అయితే మా వాళ్లెవరికీ లాప్రోస్కోపీ ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. అందువల్ల, "వద్దండి, నేను కుట్లు వేసే ఆపరేషనే చేయించుకుంటాన"ని చెప్పాను. ఆయన నాకు చాలా నచ్చజెప్పాలని చూసారుకానీ, నేను ఒప్పుకోలేదు. చివరికి, "సరే, నీ ఇష్టం అమ్మా" అని తర్వాత రోజు అంతా సిద్ధం చేసి నన్ను ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. బాబా చూసుకుంటారనే ధైర్యంతో నేను ఆయన్ని తలుచుకుంటూ, సాయి అష్టోత్తరనామాలు చదువుకుంటూ మంచం మీద పడుకున్నాను. అంతే, నాకేమీ తెలియలేదు, కాస్త కూడా నొప్పి అనిపించలేదు. నాతోపాటు ఆపరేషన్ చేయించుకున్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని నర్సులు చెప్తుంటే, నేను మాత్రం మర్నాడు ఉదయమే లేచి నడిచాను. ఈరోజు వరకూ నేను ఏ కాస్త కూడా ఇబ్బంది పడలేదు. ఇదంతా బాబా ఆశీర్వాదమే. ఈనాటికీ ఈ అనుభవాన్ని గుర్తు తెచ్చుకుంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈమధ్యనే ఈ బ్లాగు నా కంటపడింది. తోటి భక్తుల అనుభవాలు చదివాక నా అనుభవం పంచుకోవాలనిపించి ఇలా పంచుకున్నాను. "శతకోటి ధన్యవాదాలు బాబా. నా కొడుకు గురించి మీకు తెలుసు. వాడి ఆరోగ్యం సరి అయ్యేలా చూడు తండ్రీ. ఇంకో కోరిక కూడా మిమ్మల్ని కోరుకున్నాను. అవి నెరవేరితే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను. త్వరగా అవి నెరవేరేలా చూడు బాబా".


బాబాని నమ్ముకో - సమస్యలన్నీ తొలగిపోతాయి


నా పేరు హారిక. నేను లండన్ నివాసిని. 2018 వరకు నేను బాబా భక్తురాలిని కాదు. ఆ సంవత్సరం నేను ఒక మంచి ఉద్యోగం సంపాదించే ప్రయత్నంలో చాలా కష్టపడ్డాను. ఆ సమయంలో నాకు బాబాపట్ల నమ్మకం లేకపోయినప్పటికీ మా బంధువులు, "బాబాని నమ్ముకో. నీ సమస్యలన్నీ తొలగిపోతాయి" అని చెప్పారు. తర్వాత ఒకరోజు ఉదయం 6 గంటలప్పుడు నేను నిద్రలో ఉన్నప్పుడు స్వప్నంలో బాబా నా ముందు కూర్చొని నవ్వుతూ, "నువ్వు నన్ను నమ్మట్లేదు. అందుకే నీకు ఉద్యోగం రావట్లేదు" అని అన్నారు. దాంతో నేను బాబా మీద నమ్మకముంచి సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. వారంలోపు నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది.


ఈమధ్య మా ఆఫీసులో నా సహోద్యోగి ఒకతనికి ఛాతీలో నొప్పి వచ్చింది. అతను చాలా భయపడిపోయాడు. నేను, "అతనికి సహాయం చేయండి బాబా" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల పది నిమిషాల్లో అతని ఛాతీనొప్పి తగ్గింది. తర్వాత అతనికి టెస్టుల నిమిత్తం హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. అప్పుడు నేను మళ్లీ బాబాను, "అతని టెస్టు రిపోర్టులన్నీ నార్మల్‌గా వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. బాబా కృపతో రిపోర్టులన్నీ నార్మల్‌గా వచ్చి అతను ఇప్పుడు బాగున్నాడు. "బాబా! మీ సహాయానికి ధన్యవాదాలు. మీ ఆశీస్సులు ఎప్పుడూ నాతోనే ఉంటాయని నమ్ముతున్నాను బాబా. నేను ఫైల్స్ సమస్యతో బాధపడుతున్నాను. నా కర్మలన్నీ తొలగించి ఆరోగ్య సమస్యలు నుండి బయటపడేందుకు నాకు సహాయం చేయండి బాబా. ఏదో విధంగా నన్ను అనుగ్రహించండి బాబా".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo