సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1719వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. టాప్ 1 కాలేజీలో మెడికల్ సీటు అనుగ్రహించిన బాబా
2. మానసిక ప్రశాంతతను ప్రసాదించిన బాబా

టాప్ 1 కాలేజీలో మెడికల్ సీటు అనుగ్రహించిన బాబా


సాయిభక్తులందరికీ నమస్తే. నాపేరు శ్రీనివాసరావు. నా తండ్రి సాయిబాబా నా కుమారునికి మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంకు వచ్చేటట్లు అనుగ్రహించిన అనుభవం గతంలో మీతో పంచుకున్నాను. ఇప్పుడు సాయినాథునికి నమస్కారములతో మా కుమారునికి మంచి కాలేజీలో మెడికల్ సీటు వచ్చేటట్లు చేయడంలో ఆయన ఎలా దయ చూపారో మీతో పంచుకుంటాను. 2023, ఆగస్టులో ప్రభుత్వం పీజీ మెడికల్ సీట్లు భర్తీ చేయడానికి ప్రక్రియ మొదలుపెట్టింది. అందులో భాగంగా మొదట అల్ ఇండియా ఫేజ్ 1 కోట రిలీజ్ చేసారు. నా కుమారుడు మంచి కాలేజీలు చూసి కొన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాడు. అప్పుడు మా అబ్బాయికి సీటు రాలేదు. మేము కొంచెం టెన్షన్ పడ్డాము. నేను బాబాను, "బాబా! తదుపరి ఫేజ్‌లో అయినా నా కుమారుడికి సీటు వచ్చేలా దయ చూపండి" అని ప్రార్థించాను. తర్వాత స్టేట్ ఫేజ్ 1కి ఆప్షన్స్ పెట్టుకోమని, అలాగే అల్ ఇండియా ఫేజ్ 2కి కూడా ఆప్షన్స్ పెట్టుకోమని వచ్చింది. దాంతో మా అబ్బాయి కొన్ని కాలేజీలు ఆప్షన్ పెట్టుకున్నాడు. ముందుగా అల్ ఇండియా ఫేజ్ 2 ఫలితాలు విడుదల అయ్యాయి. అందులో నా కుమారుడికి విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజీలో పీజీ జనరల్ సర్జన్ సీటు వచ్చింది. ఆ కాలేజీకి వెళ్లి ఫీజులు అన్ని కట్టి జాయిన్ అవుదామనుకున్న సమయంలో స్టేట్ ఫేజ్ 1 కోట ఫలితాలు విడుదలయ్యాయి. అందులో నా కుమారుడికి గుంటూరు మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. మాకు చాలా సంతోషమేసింది. ఎందుకంటే, విజయవాడ కాలేజీ కంటే గుంటూరు కాలేజీ చాలా బాగుంటుంది. అదీకాక మేము నివాసం ఉండేది గుంటూరులోనే కాబట్టి, తను మాకు తోడుగా ఉంటూ ఇంటివద్ద నుండే కాలేజీకి వెళ్లి, రావొచ్చు. అందుచేత నా కుమారుడు వెంటనే గుంటూరు మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. తర్వాత అల్ ఇండియా ఫేజ్ 3 కోటకి ఆప్షన్స్ పెట్టుకోమని వచ్చింది. నా కుమారుడు గుంటూరు మెడికల్ కాలేజీ కంటే వైజాగ్‌లోని ఆంధ్ర మెడికల్ కాలేజ్ మంచిదని, అక్కడ వస్తుందేమోనన్న ఆశతో ఆప్షన్ పెట్టుకున్నాడు. ఆంధ్ర మెడికల్ కాలేజీ రాష్ట్రంలోనే టాప్ 1 కాలేజీ. అందులో చదవాలని నా కుమారుడి ఆశ. అయితే ఆ కాలేజీలో సీటు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే, టాప్ ర్యాంకర్లు అందరూ ముందుగా ఆంధ్ర మెడికల్ కాలేజీనే ఆప్షన్ పెట్టుకుంటారు. కాబట్టి ఆ కాలేజీలో సీటు రావడం కష్టమని అనుకున్నాము. అయినా నేను బాబాను, "నా కుమారుడికి ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదవడం చాలా ఇష్టం బాబా. దయచేసి తనకి ఆ కాలేజీలో సీటు వచ్చేలా చేయండి" అని ప్రార్థించాను. మేము అనుకున్నట్లే అల్ ఇండియా ఫేజ్ 3లో మావాడికి ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీటు రాలేదు. అప్పటికే జాయిన్ అయిన గుంటూరు మెడికల్ కాలేజీలోనే సీటు వచ్చింది. తర్వాత స్టేట్ ఫేజ్ 2కి ఆప్షన్స్ పెట్టుకోమని వచ్చింది. నా కుమారుడు మరల ఆశతో ఆంధ్ర మెడికల్ కాలేజీకి ఆప్షన్ పెట్టాడు. కానీ ఆ కాలేజీలో సీట్ రాదని అనుకున్నాము. ఎందుకంటే, నా కుమారుని కంటే మంచి ర్యాంక్ వచ్చినవాళ్ళు ఆ కాలేజీలో జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళు తప్పుకుంటే తప్ప నా కుమారునికి ఆ కాలేజీలో సీట్ వచ్చే పరిస్థితి లేదు. కానీ బాబా గొప్ప అద్భుతం చేసారు. అక్కడ చదువుతున్న ఒకరు వేరే కాలేజీకి మారడం వల్ల నా కుమారునికి ఆ కాలేజీలో సీటు వచ్చింది. అలా అస్సలు రాదనుకున్న కాలేజీలో సీటు వచ్చేటట్లు బాబా అనుగ్రహించారు. ఆ తండ్రి చూపిన దయకు మేము ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? ఒక్క ఆయన పాదాల వద్ద శరణువేడటం తప్ప. "ధన్యవాదాలు బాబా. మేము తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించు తండ్రీ. మా పిల్లలకు మంచి బుద్ధిని, మంచి నడవడికను, మంచి ఆలోచనలను, మంచి భవిష్యత్తును, అలాగే  అందరికీ సహాయం చేసే మంచి మనసును ఇవ్వు తండ్రీ. అలాగే మా అందరి ఆరోగ్యం బాగుండేటట్లు దీవించు తండ్రి. మేము నిన్నే నమ్ముకున్నాము. మాకు ఏ ఆపదలు రాకుండా  కాపాడు తండ్రీ".


సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.


మానసిక ప్రశాంతతను ప్రసాదించిన బాబా

అందరికీ నమస్కారం. నా పేరు అరుణ. నా సాయితండ్రి నా చేయి ఎప్పుడూ వదలలేదు. ఆయన దయవల్ల నేను నా జీవితంలో ఎన్నో కష్టాలు నుండి సులువుగా బయటపడుతున్నానని అనిపిస్తుంది. ఇక అనుభవానికి వస్తే..  2023, అక్టోబర్ నెల ఆరంభం నుండి నేను మానసికంగా చాలా ఇబ్బందిపడ్డాను. రాత్రిళ్ళు నిద్ర వచ్చేది కాదు, హార్ట్ బీట్ ఎక్కువయ్యేది, మనసంతా ప్రతికూల ఆలోచనలతో నేను చాలా ఇబ్బందిపడ్డాను. నా అవస్థ చూసిన మావారు, "సైకియాట్రిస్ట్ దగ్గరకి వెళదామ"ని అన్నారు. నేను, "వద్దులే, ఒక వారం చూద్దాం" అని చెప్పి, "బాబా! ఈరోజు గురువారం మరుసటి గురువారం లోపు నా ఆరోగ్యం పూర్తిగా బాగుండాలి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల మరుసటి గురువారం అక్టోబర్ 12 నాటికి నాకు దాదాపు 80% ఉపశమనం లభించి డాక్టర్ దగ్గరకి వెళ్ళే అవసరం రాలేదు. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇదంతా బాబా వల్లే సాధ్యమైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

14 comments:

  1. గురు బ్రహ్మ పరమాత్మ సాయినాథ నాలోని సకల కోటి రోగాలు సకలకోటి దోషాలు సగటు పాపాలు తొలగించి నేను నా భర్త కలిసి కాపురం చేసేలా చేయి తండ్రి ఏ కోర్టు కేసులు ఏ ఇబ్బందులు లేకుండా నా భర్త మనస్పూర్తిగా నన్ను భారీగా స్వీకరించి కాపారానికి తీసుకెళ్లేలా చూడు బాబా సాయి

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri

    ReplyDelete
  4. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  5. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  6. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  7. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  8. ఓం సాయిరామ్

    ReplyDelete
  9. Om Sri Sai Arogyakshemadhaaya Namaha 🙏🙏🙏

    ReplyDelete
  10. Om sairam🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  11. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please safe delivery chei baba nose and mouth nunchi bleeding rakunda chudu baba please baba delivery ayyaka mana Sai Maharaj sannidhi blog lo post chestha thandri please baba

    ReplyDelete
  12. Omsaisri Sai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  13. ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  14. baba maa saimadava bharam antha meede baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo