- సాయినాథుని అనుగ్రహం
ఓం శ్రీ సాయినాథాయ నమః!!! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన సాయినాథునికి, తోటి సాయిబంధువులకు నమస్కారాలు. నా పేరు శ్వేత. నేను బెంగళూరు నివాసిని. సద్గురుని తోడులేక మనం ఒక్క క్షణం కూడా ఉండలేము. మన బాబా సహాయసహకారాలు లేకపోతే మనం అసలు జీవించి ఉండగలమా అని నాకనిపిస్తుంది. ఆయన మన అందరి జీవితాలలో ఎంత మార్పు తీసుకువస్తారో మనం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఆయన నా జీవితంలో చాలా అద్భుతాలు చేశారు. ఇప్పుడు కొన్ని అనుభవాలు పంచుకుంటాను. మావారు, ఆయన స్నేహితుడు చాలా సన్నిహితంగా ఉంటారు. ఆ స్నేహితుడు ఆర్థికంగా, ఇంకా ఇతరత్రా చాలా విషయాలలో మాకు చాలా సహాయం చేశారు. అలాంటిది ఉన్నట్టుండి మావారికి, అతనికి మధ్య అపార్ధాలు చోటు చేసుకున్నాయి. వాళ్లిద్దరూ మునుపటిలా స్నేహంగా ఉండాలని మా అందరి కోరిక. అందువల్ల నేను, "బాబా! వాళ్ళిద్దరిని ముందులా ఉండేలా కరుణించు తండ్రీ. అలా జరిగితే, మీ అనుగ్రహం సాయిబంధువులతో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. అంతే, ఒక వారం రోజులలో మావారి స్నేహితుడు మా ఇంటికొచ్చి మావారిని వాళ్ళింటికి తీసుకెళ్లి మునుపటిలా మాట్లాడుకొని కలిసిపోయారు. "బాబా! మీ సహాయానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు".
ఒకసారి నేను ఒక చోటకు వెళ్లడానికి బస్సు ఎక్కాను. తర్వాత టికెట్ తీసుకోవడానికని చూసుకుంటే, నా పర్స్ కనిపించలేదు. వెంటనే నేను బస్సు దిగి ఏ మార్గంలో వచ్చానో ఆ దారంతా చూసుకుంటూ వెళ్లాను. కానీ నా పర్స్ ఎక్కడా కనపడలేదు. ఆ పర్సులో రెండు క్రెడిట్ కార్డులు, ఒక డెబిట్ కార్డు ఉన్నాయి. వాటిని ఎవరైనా చెడుగా ఉపయోగిస్తారేమోనన్న భయంతో నా సాయినాథుని తలుచుకుంటూ వాటిని తాత్కాలికంగా రద్దు చేయించడానికి బ్యాంకుకు బయలుదేరాను. బ్యాంకు గేటు దగ్గరకు వెళ్లేసరికి నాకు ఒక కాల్ వచ్చింది. చూస్తే, ఎవరో తెలియని వ్యక్తి ఫోన్ చేస్తున్నారు. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే, అతను నా పేరు, నా పర్సులో ఉన్న నా కార్డుల వివరాల అడిగారు. నేను సరైన సమాధానాలు చెప్పడంతో, "ఫలానా చోటుకు రండి. మీ పర్సు మీకు ఇస్తాన"ని చెప్పారు. సంతోషంగా సాయినాథునికి ధన్యవాదాలు తెలుపుకొని అతను రమ్మన్న చోటుకి వెళ్లి నా పర్సు తీసుకున్నాను. నిజం చెప్పాలంటే, ఆ పర్సులో నా ఫోన్ నెంబర్ లేదు. కానీ అతను అందులో ఉన్న మెడికల్ స్టోర్ బిల్ చూసి, సదరు మెడికల్ స్టోరుకు వెళ్లి, ఆ బిల్ చూపించి, నా పర్సు పోయిన విషయం చెప్పి, వాళ్ళ వద్ద నుండి నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేశారు. ఆ వ్యక్తి రూపంలో నా సాయి దేవుడే నా పర్సు నాకు అందించి కార్డులు చెడుగా ఉపయోగింపబడకుండా కాపాడారు.
2023, అక్టోబర్ 19 అర్ధరాత్రి, ఉన్నట్టుండి నాకు వీజింగ్ ప్రాబ్లెమ్(శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది) వచ్చింది. నాకు నేను ఇంక బ్రతుకుతానా అన్నంతా భయమేసింది. బాబాను తలుచుకుంటూ నాలుగున్నర వరకు గడిపాను. అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళింట్లో మెడిసిన్ ఉందని గుర్తు వచ్చింది. సమయానికి బాబానే గుర్తు చేసారు. దాంతో వెంటనే వెళ్లి నబిలైజర్స్ వేసుకున్నాను. కాస్త ఉపశమనంగా అనిపించింది. ఉదయం హాస్పిటల్‌కి వెళితే ఎంట్రన్సులో సాయినాథుని ఫోటో నా కంటపడింది. ఆయనని చూస్తూనే, 'బాబా నా వెంట ఉన్నారు. నాకు ఏమీ కాద'ని నాకు చాలా ధైర్యం వచ్చింది. హాస్పిటల్లో అన్ని రకాల టెస్టులు చేసి అంతా నార్మల్‌గా ఉందని చెప్పి మూడు రోజులకు టాబ్లెట్లు ఇచ్చి పంపారు. మర్నాటి రాత్రి వీజింగ్ ప్రాబ్లెమ్ కాదుగాని నా ఎదలో ఏదో ఒక రకంగా అనిపించింది. అప్పుడు నేను, "బాబా! నేను నవగురువార వ్రతం చేస్తాను. పూర్తిగా నాకు ఈ బాధ నుండి ఉపశమనం కలిగించండి" అని బాబాను ప్రార్థించాను. అలాగే బాబాకి చెప్పినట్లు నవగురువార వ్రతం ప్రారంభించి మరోసారి అంతా టెస్టు చేయించుకున్నాను. బాబా దయవల్ల అంతా నార్మల్ అని రిపోర్టు వచ్చి నేను ఆరోగ్యంగా ఉన్నాను.
నాకు ఇద్దరు పాపలు. చిన్నపాప ఒకటిన్నర నెల బిడ్డగా ఉన్నప్పుడు తనకి జలుబు చేసి దగ్గు చాలా ఎక్కువగా ఉండింది. పాప దగ్గుతుంటే తన కంట నీరు కారేది. అంతలా ఉండేది సమస్య. డాక్టర్ దగ్గర చూపించాము కానీ, వాళ్ళిచ్చిన మందులకు పాపకు ఏమాత్రమూ తగ్గలేదు సరికదా ఇంకా ఎక్కువ అయ్యింది. అటువంటి సమయంలో బాబా దయవల్ల నాకు ఒక ఉపాయం తట్టింది. అదేమిటంటే, నేను డస్ట్ ఎలర్జీకి వాడుతున్న మందు పాపకి వాడాలని. అయితే డాక్టర్ సలహా లేకుండా అంత చిన్నపాపకు ఆ మందు ఎలా ఇవ్వడమని అనిపించింది. ఏం చేయాలో అర్థంకాని స్థితిలో బాబా ముందు చీటీలు వేశాను. మందు వేయమన్న చీటీ బాబా అనుగ్రహించారు. దాంతో ఆ మందు పాపకి వేసాను. ఆరోజు నుండే కొద్దికొద్దిగా పాపకు దగ్గు, జలుబు తగ్గుతూ వచ్చి నాలుగైదు రోజులకు పూర్తిగా తగ్గిపోయింది.
పెద్దపాపకు ఆరు నెలల వయసున్నప్పుడు జ్వరం వచ్చింది. ఎన్ని హాస్పిటల్లో చూపించిన తగ్గలేదు. పాప కళ్ళు అదోలా అవ్వసాగాయి. దాంతో పాపను చూస్తే, తనకి ఏమవుతుందోనని మాకు భయమేసేది. ఆ సమయంలో నేను ఏదో విషయంగా మా పక్కింటికి వెళ్లాను. అప్పుడు వాళ్ళింటికి వాళ్ళ బంధువు ఒకాయన వచ్చారు. ఆయన నన్ను చూసి, "ఎందుకమ్మా, అలా దిగులుగా ఉన్నావు?" అని అడిగారు. నేను మా పాప విషయం చెపితే, ఆయన పాపను తీసుకురా అన్నారు. నేను సరేనని మా పాపని తీసుకొని వెళ్ళాను. ఆయన అక్కడున్న ఒక తమలపాకుపై పెన్నుతో ఏదో వ్రాసి, బట్టలు కుట్టే దారం తీసుకొని దాన్ని ఆకుకి కట్టారు. తర్వాత దాన్ని మా పాపకు కట్టారు. అంతే, పది నిమిషాల్లో మా పాప సాధారణ స్థితికి వచ్చింది. ఇది 2013లో, హిందూపూర్‌లో జరిగింది. మూడు సంవత్సరాల తర్వాత అంటే 2016లో మేము గుంతకల్ దగ్గర ఉన్న కసాపురం ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్ళాము. అక్కడ మూడేళ్ళ క్రితం మా పక్కింటిలో కనిపించిన ఆయన కనబడ్డారు. నేను ఆయనను బాగున్నారా అని అడిగాను. కానీ ఆయన నన్ను అస్సలు గుర్తు పట్టలేదు సరికదా నేను ఎవరో తెలియదన్నారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. నాకప్పుడు ఆరోజు ఈయన రూపంలో వచ్చి పాపకు తాయత్తు కట్టి కాపాడింది సాక్షాత్ ఆ బాబానే అనిపించింది. బాబా అనుగ్రహం ఎంతని వర్ణించను. ఆయన లేని ఈ జగత్తు జగత్తే కాదు. సాయి లేని జీవితం ఊహించుకోవడానికి కూడా సాధ్యం కాదు. "శతకోటి వందనాలు బాబా".
ఇక ఇప్పుడు చెప్పబోయే అనుభవాలన్నీ నేను రెండోసారి ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు జరిగాయి. ఆ సమయంలో ఒకసారి మేము మా ఊరు వెళ్లడానికి రైల్వేస్టేషన్‌కు వెళ్ళాము. అప్పుడు నేను, పదేళ్ల మా పెద్దపాప పట్టాలు దాటుతున్నప్పుడు హఠాత్తుగా నేను పట్టాలపై పడిపోయాను. వెంటనే "సాయినాథా! కాపాడు బాబా" అని అనుకున్నాను. బాబా దయవల్ల నాకు పెద్దగా ఏ దెబ్బలు తగలలేదు. ముఖ్యంగా నా కడుపుకు ఏ దెబ్బలు తగలలేదు.
మరోసారి బాగా వర్షం పడి, నిలిచిన తర్వాత సరుకులు తీసుకురావడానికి నేను బయటకు వెళ్ళాను. దారికి ఒక పక్కగా నడుస్తున్న నేను హఠాత్తుగా జారీ బొక్కబోర్ల పడబోయాను. అప్పుడు కూడా నాకేమీ కాకుండా నేను నమ్ముకున్న నా సాయినాథుడు కాపాడారు.
ఇంకోసారి కూడా వర్షం బాగా పడి నిలిచిన తర్వాత నేను, మావారు, మా పాప టూవీలర్ మీద ఫంక్షన్ నుండి ఇంటికి తిరిగి వస్తున్నాము. తీవ్రమైన వర్షం వల్ల చెట్ల ఆకులు, చిన్న చిన్న కొమ్మలతో రోడ్డు పూర్తిగా నిండిపోయి ఉంది. దారి అస్సలు కనిపించడం లేదు. రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. మావారు బండి నెమ్మదిగా నడుపుతున్నప్పటికీ జారి మేము ముగ్గురం క్రింద పడిపోయాము. ఆ సమయంలో కూడా నా దేవుడు నన్ను రక్షించారు. బండి మీద నుండి క్రిందపడ్డప్పటికీ నాకుగానీ, నా కడుపులో ఉన్న బిడ్డకిగానీ ఏ దెబ్బ తగలలేదు. ఇలా నేను ఆపదలో ఉన్న ప్రతిసారీ నన్ను, నా కడుపులో ఉన్న బిడ్డను రక్షించారు బాబా. నా దేవుడు నా చేయి పట్టుకోకపోతే నా పాప బ్రతికే ఉండేది కాదు. ఇంకా ఎన్నో అనుభవాలున్నాయి. వాటిని తర్వాత పంచుకుంటాను. “చాలా చాలా ధన్యవాదాలు బాబా. కొన్ని విషయాలు మీ పాదాల దగ్గర విన్నవించుకున్నాను బాబా. వాటిని ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీర్చామని కోరుకుంటున్నాను బాబా. ఆ విషయంలో మీరు ఎలా, ఎప్పుడు కరుణిస్తారో అని వేచి ఉన్నాను బాబా. అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, అలాగే వారిని కష్టాల నుండి గట్టెక్కించు స్వామి. మనసా, వాచా నిన్నే పూజిస్తున్నాము స్వామి. నువ్వే మమ్మల్ని సదా కాపాడు తండ్రీ”.
Baba antha sajavuga jarigela mere chusukondi baba ....please 🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya Namaha🙏🙏🙏
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri
ReplyDeletebaba maa saimaadava bharam antha meede baba
ReplyDeletebaba naa DDO postni cancel cheyali maa DRE garu, ala cheste naa anubhavanni ee bloglo panchukuntanu baba, new year lopala cheyali baba.
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba safe delivery chei baba please baba meku matarame chepukogalani problem therchu baba please baba
ReplyDeleteOmsaisri Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం
ReplyDeleteOm Sri Sai Ram
ReplyDeleteOm Sai Ram 2nd Sai Leela is very nice.Baba came in another person resembles the god.Sai is best doctor to cure deases.if we trust him.He takes care of us.He is very good to his devotees.
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరామ్
ReplyDelete