సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1742వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతి విషయంలో తోడుగా ఉన్న బాబా
2. నమ్మకంతో వుంటే అన్ని సవ్యంగా జరిపిస్తారు బాబా

ప్రతి విషయంలో తోడుగా ఉన్న బాబా


సాయిబంధువులకు నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. 2023, అక్టోబర్ నెలలో ఒక వారం రోజులపాటు నా కింద పెదవి కొట్టుకుంటూ ఉండేది. అది ఏ అనారోగ్యానికి సూచనో అని నాకు చాలా భయమేసి బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థనను ఆలకించి హోమియో డాక్టర్ దగ్గరకు వెళ్ళమని సూచించారు. దాంతో నేను హోమియో డాక్టర్ని సంప్రదించారు. ఆవిడ చూసి, "కొన్ని టెస్టులు చేయించాలి. మందులు వాడుతూ వారంలో టెస్టులు చేయించుకోమ"ని అన్నారు. నేను డాక్టర్ చెప్పిన అన్నీ టెస్టులు చేయించుకొని, "బాబా! టెస్టులో ఏ ప్రాబ్లం లేదని వచ్చేటట్లు చూడండి. అలా చేస్తే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విన్నారు. టెస్టులన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఒక్క షుగరే  కొంచెం ఎక్కువగా ఉందని డాక్టర్ మందులిచ్చారు. బాబా దయవల్ల నాకు ఇప్పుడు బాగానే ఉంది. షుగర్ కూడా నార్మల్గానే ఉంది.


ఒకరోజు మా ఇంట్లోకి ఒక ఎలుక వచ్చింది. అవి అంటే నాకు చిన్నప్పటినుండి చాలా భయం. అందువల్ల దాన్ని చూడగానే నాకు ఒకటే ఏడుపు వచ్చి, "ఏమిటి తండ్రీ! అది లోపలికి ఎలా వచ్చింది? నేను ఇంటిలో ఎలా పని చేసుకోవాలి?" అని బాబా దగ్గర చాలా ఏడ్చాను. తర్వాత కూడా నేను హాల్లోనే బాబా దగ్గర కూర్చొని, "బాబా! అది ఎలాగైనా బయటకు వెళ్ళిపోవాలి తండ్రీ. నేను చూస్తుండగానే అది వెళ్ళిపోతే నాకు భయం పోతుంది. లేకపోతే టెన్షన్‌తో నేను ఏ పని చేయలేను" అని దుఃఖిస్తూ బాబాతో చెప్పుకున్నాను. బాబా నా మొర విన్నారు. ఇంట్లోనే ఉన్న మావారు 'అది ఏం చేస్తుంది?' అని తేలికగా తీసుకొని చూసి, "లేదు, వెళ్ళిపోయింద"ని అన్నారు. సరిగ్గా అప్పుడే అది ఫ్రిడ్జ్ కింద నుండి వెళ్ళటం నేను చూశాను. ఆ విషయం నేను మావారికి చెపితే, వెంటనే వెళ్లి నేను చూస్తుండగానే దాన్ని బయటకు తరిమేశారు. "శతకోటి ధన్యవాదాలు బాబా".


మా బాబు బీటెక్ పూర్తి చేశాడు. తను 2023లో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. కానీ అపాయింట్మెంట్ ఆర్డర్ రావడం ఆలస్యమైంది. దగ్గరదగ్గర ఆరునెలలు అయినా పిలుపు రాలేదు. అందువల్ల నేను, "బాబా ఏంటి? ఎందుకని బాబుని ఇంకా పిలవలేద"ని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. సెప్టెంబరు నెల నుండి కొంతమందిని పిలవడం మొదలుపెట్టారు. కానీ మా బాబుని పిలవలేదు. అందువల్ల వాడు బాధపడుతూ బాబా గుడికి వెళ్తుండేవాడు. నేను తనతో, "బాబా మీద నమ్మకముంచు తప్పక పిలుస్తార"ని చెప్పి, బాబా దివ్యపూజ ఏడు వారాలు చేస్తానని మొక్కుకొని పూజ మొదలుపెట్టాను. రెండో గురువారం వచ్చేసరికి అక్టోబర్ 30న జాయిన్ అవ్వమని మా బాబుకి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. అలా బాబా మా కోరిక నెరవేర్చారు.


మావారు లారీ కొందామనుకొని లారీ దొరక్క ముందే 2023, జూన్ నెలలో లోన్ తీసుకున్నారు. నేను, "బాబా! లారీ ఇంకా దొరకలేదు. ఈయన లోన్ తీసేసుకున్నారు. ప్రతినెలా లోన్ డబ్బులు కట్టాలి. మీరే ఏదో ఒకటి చేయండి" అని బాబాను అడుగుతూ  ఉండేదాన్ని. బాబా నా మొర ఆలకించి దారి చూపడంతో మావారు 14 లక్షలు పెట్టి పవర్ కొన్నారు. కానీ ట్రాలీ దొరకలేదు. దాంతో నేను బాబాను, "దానికోసం ఎక్కడ తిరగాలి బాబా? తొందరగా మావారికి దారి చూపించు తండ్రీ. అప్పులు పెరగకుండా మా దగ్గరున్న 21, 22 లక్షల్లో పని అయిపోయేలా చూడ తండ్రీ. మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని అడుగుతూ ఉండేదాన్ని. బాబా నేను కోరినట్లే కనికరించి మా దగ్గరన్న డబ్బుల్లోనే ట్రాలీ దొరికేలా చేసి లారీ వచ్చేలా చేశారు. ఇలా చెప్తూ పోతే ప్రతి విషయంలో బాబా మాకు తోడుగా ఉన్నారు. "శతకోటి ద్నన్యవాదాలు బాబా. బ్లాగుకి పంపడం కాస్త ఆలస్యమైంది, నన్ను క్షమించండి బాబా. బండ్లకు మంచి డ్రైవర్లు దొరికేలా చేయండి సాయితండ్రీ".


నమ్మకంతో వుంటే అన్ని సవ్యంగా జరిపిస్తారు బాబా


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు స్వాతి. బ్లాగులో బాబా లీలలు చదువుతుంటే రోజురోజుకు బాబాపై నాకు నమ్మకం పెరుగుతుంది. 2023, నవంబర్ నెలలో ఇన్సూరెన్స్ కోసం మావారు టెస్టులు చేయించుకున్నారు. రిపోర్టుల ఆధారంగా క్రియాటిన్ ఎక్కువగా ఉందని, దానివల్ల బీపీ ఉందని తెలిసింది. దాంతో కిడ్నీ బయాప్సీ చేసి డాక్టర్, 'మావారు తన జీవితాంతం మందులు తీసుకోవాలని, పప్పు తినకూడదని' చెప్పారు. దాంతో ఎంతో సంతోషంగా సాగుతున్న మా జీవితంలో పెద్ద బండరాయి పడినట్లు అయింది. రెండు రోజులు ఏడుపు తప్ప ఇంకేమీ తెలీలేదు మాకు. ఆ సమయంలో బాబా కృపతో ఈ సంవత్సరం కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయలేదని గుర్తు వచ్చింది. అయితే అప్పటికి ఇంకా ఒక్క సోమవారమే మిగిలి వుంది. అదీకాక అది నా నెలసరి సమయం. ఎప్పుడూ 3, 4 రోజుల ముందే వచ్చే నెలసరి ఆనెల రాలేదు. అయినా బాబాని, "నెలసరి అడ్డంకి రాకుండా వ్రతం చేసుకోగలిగితే, మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని ప్రార్థించి ఆయన మీద సంపూర్ణంగా భారమేసి సత్యనారాయణ స్వామి గుడిలో వ్రతం చేయడానికి సిద్ధమయ్యాము. ఆ గుడిలో బాబా మూర్తి లేదు. కానీ నా మనసు బాబా కోసం వెతుకుతూ వుంది. అంతలో వ్రతం మొదలైంది. నేను మాత్రం నిరాశగా అన్ని గోడల వైపు చూస్తున్నాను. ఆశ్చర్యంగా నా నాన్న(బాబా) ఒక ప్రకటన క్యాలండరులో చిన్నగా నాకు కనిపించారు. ఆయనని చూసాక నేను కొండంత ధైర్యంగా వ్రతం చేసుకున్నాను. అనంతమైన నమ్మకంతో వుంటే బాబా అన్ని సవ్యంగా జరిపిస్తారు. "ధన్యవాదాలు బాబా. లవ్ యు నాన్న".


16 comments:

  1. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  5. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  6. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  7. Om sai ram, amma nannalani kshamam ga chudu, chelli intern location hyd ki change ayyi naaku asi konchem thodu unde la chudu baba pls

    ReplyDelete
  8. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri vadini bless cheyandi

    ReplyDelete
  9. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  10. Baba nanu e apula badhalo nundi bayata padiyi thandri Nenu ne Charanalanu asrayinchani roju ledhu thandri Plzzz baba save me om sai ram baba Plzzz baba save my life

    ReplyDelete
  11. sai baba, maa sai madava puttinaroju repu. madavani aseervadinchadaniki maa intiki ravali baba. white dress lo ravali baba. madava bharam anta meede baba.

    ReplyDelete
  12. గురుబ్రహ్మ పరమాత్మ సాయినాథ నాలోని సకలకోటి రోగాలు సకలకోటి దోషాలు సకలకోటి పాపాలు తొలగించి నేను నా భర్త కలిసి కాపురం చేసిన చేయి తండ్రి

    ReplyDelete
  13. Baba ,mere nannu ee situation nundi kapadandi....naa chuttu nannu nammi vunna evariki problem rakunda memu evanni close cheselaga dari chupinchandi please 🙏

    ReplyDelete
  14. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo