సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1747వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాధను విని రిపోర్టులు నార్మల్‌గా వచ్చేలా అనుగ్రహించిన బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. బాబా నాకు చాలా విషయాల్లో సహయం చేశారు. వాటిలో నేను ఎక్కువగా ఆందోళన పడిన ఒక సమస్యకు బాబా ఎలా తమ మహిమను చూపి పరిష్కరించారో నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. మా అమ్మనాన్నలకు మేము ముగ్గురు సంతానం. మాకు ఇంతవరకు సొంత ఇల్లు లేదు. మాకు ఆర్థికంగా, మానసికంగా కొన్ని సమస్యలున్నాయి. ఎన్ని వివాహ ప్రయత్నాలు చేసినా ఏదీ కలిసిరాక మా అక్క వివాహం చాలా ఆలస్యం అవుతుంది. అలా చాలా రోజుల నుండి కష్టాలు పడుతున్న మేము రాబోయే రోజులు మంచిగా ఉంటాయన్న ఆశతో బ్రతుకుతున్నాం. ఎలాగైనా మా సమస్యలను దాటుకుని త్వరగా అక్క వివాహం చేయాలని, సొంత ఇల్లు తీసుకోవాలని ఎంతో ఆరాటపడుతూ ఉన్నాము. ఇలాంటి సమయంలో ఒకరోజు మా కుటుంబ పెద్దైన మా నాన్నగారికి కడుపులో నొప్పి వచ్చింది. కొద్దిసేపు నొప్పి తగ్గుతుందని వేచి చూశాం కానీ, నొప్పి తగ్గలేదు. దాంతో నాన్నని హస్పిటల్‌కి తీసుకెళ్ళాము. అక్కడ డాక్టర్ కొన్ని రక్త పరీక్షలు, స్కానింగ్ చేయించి, రిపోర్టులు వచ్చిన తర్వాత, 'ప్రోస్టేట్ గ్రంధి పెరిగిందని, అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని' చెప్పి కొన్ని మందులు వ్రాసిచ్చారు. మేము ఇంటికి వచ్చేసి మందులు వాడితే తగ్గిపోతుందని ఆ సమస్య గురించి పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిరోజుల తర్వాత చెకప్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్, "ఎలా ఉంది?" అని నాన్నని అడిగారు. అప్పుడు నాన్న, "ఇంకా కొంచెం సమస్య ఉంద"ని కొన్ని లక్షణాలు చెప్పారు. దానితో డాక్టర్ ఇంకొక రక్త పరీక్ష చేయించి, "రిపోర్ట్ రావడానికి కొంచెం సమయం పడుతుంద"ని చెప్పారు. అప్పుడు మేము, "రక్త పరీక్ష దేనికోసం" అని అడిగితే, "ప్రోస్టేట్ గ్రంథిలో అసాధారణ కణాలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయడానికి" అని డాక్టర్ చెప్పారు. ఆ విషయం వినగానే మేము కొంత ఆందోళన చెందాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆ సమస్య గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే, అసాధారణ కణాలు ఉంటే చాలా ప్రమాదకరమని తెలిసింది. దాంతో మా ఆందోళన మరింత ఎక్కువైంది. నోట మాట రాలేదు. జీవితంలో ఇటువంటి సమస్య ఎదురవుతుందని మేము ఎన్నడూ ఊహించలేదు. నేను అయితే చాలా ఆందోళనపడ్డాను. అసలే కష్టాలలో ఉన్న నాకు ఇక ఇంతేనా మా జీవితం అని చాలా బాధపడ్డాను.  అసలు ఎందుకు ఈ జీవితం అనిపించింది.


నాన్న రక్తపరీక్ష శాంపిల్స్ ఇచ్చి వచ్చినప్పటినుండి నేను సాయిబాబా నామాన్ని జపిస్తూ, "బాబా! రిపోర్టు నార్మల్గా రావాలి. ఎటువంటి సమస్య ఉండకూడద"ని ప్రతిరోజూ బాబాకి నా బాధ చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఇలా ఉండగా రిపోర్ట్ తీసుకునే సమయం రానే వచ్చింది. "బాబా! రిపోర్ట్ నార్మల్‌గా రావాల"ని మనసులో ప్రార్థిస్తూ హాస్పిటల్‌కి వెళ్ళాము. కానీ రిపోర్ట్ తీసుకున్నాక కవర్ తెరవడానికి మా చేతులు వణికాయి. అంతలా భయపడుతున్న నేను బాబాను తలచుకుంటూ రిపోర్ట్ ఓపెన్ చేశాను. అందులో మామూలుగా ఉండాల్సిన వాల్యూస్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నట్లు వుంది. అది చూసి, "ఇలా జరిగిందేమిటి బాబా?" అని చాలా బాధపడ్డాను. తర్వాత డాక్టర్ దగ్గరకి వెళ్తే ఆయన, "ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇలానే చూపిస్తుంది. మళ్లీ నెలరోజుల తర్వాత టెస్ట్ చేద్దాం. అప్పుడు తగ్గితే పరవాలేదు కానీ, పెరిగితే మాత్రం సర్జరీ చేయాలి. ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటుంద"ని చెప్పారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి నాన్న గురించే నా ఆలోచన. ప్రతిరోజూ బాబాకి నా బాధ చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఇలా ఉండగా అనుకోకుండా ఒకరోజు ఫోనులో 'శ్రీసాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణం’ గురించి చూశాను. అది చూసాక నాకు బాబాపై ఇంకా నమ్మకం పెరిగింది. నేను కూడా సచ్చరిత్ర పుస్తకం తెచ్చుకొని నాన్న ఆరోగ్యం మంచిగా ఉండాలని, రిపోర్టులన్నీ నార్మల్గా రావాలని సప్తాహ పారాయణ మొదలుపెట్టాను. అదే సమయంలో బాబా భక్తుల అనుభవాల బ్లాగు కనిపించింది. అప్పటినుండి బ్లాగులో అనుభవాలు చదవడం నా దినచర్యలో భాగం అయిపోయింది. బాబా అనుగ్రహం వలన సప్తహపారాయణ చాలా మంచిగా పూర్తిచేసి, "నాన్న రిపోర్టులు నార్మల్‌గా ఉండి, ఆయన ఆర్యోగ్యం మంచిగా ఉంటే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను. అలాగే నాన్నని మీ దర్శనానికి శిరిడీ తీసుకొస్తాను" అని బాబాకి మొక్కుకున్నాను. అలాగే రోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అయినా మనసులో కాస్త ఆందోళన కూడా ఉండేది. కానీ ప్రతిరోజూ భక్తుల అనుభవాలు చదవడం వలన నాకు బాబాపై దృఢవిశ్వాసం ఏర్పడి, బాబా భక్తులందరికీ సహాయం చేసినట్లే, నాకు కూడా సహాయం చేస్తారన్న నమ్మకంతో భారమంతా ఆయనపై వేశాను.


చివరికి మళ్ళీ టెస్ట్ చేయించాల్సిన రోజు రానే వచ్చింది. మనసులో కొంచెం ఆందోళనగా ఉండటం వలన బాబా ఊదీ నాన్నకి పెట్టి, మరికొంత ఊదీ నాన్న, నేను స్వీకరించి హాస్పిటల్‌కి వెళ్లి రక్తపరీక్షకి శాంపిల్స్ ఇచ్చాము. రిజల్ట్ రావడానికి కాస్త సమయం పడుతుందని చెప్పాక ఇంటికి వచ్చేసాము. నేను అప్పటినుండి ప్రతిక్షణం బాబా నామాన్ని జపిస్తూ గడిపాను. ఇంకో రెండు రోజుల్లో టెస్ట్ రిజల్ట్ వస్తుందనగా బాబా ఒక అద్భుతం చూపించారు. ఆరోజు నేను ఇంట్లో బాబాకి పూజ చేస్తున్న సమయంలో నాన్న ఆరోగ్యం గురించి ఆందోళన, భయం ఎక్కువగా ఉండడం వల్ల నాకు కన్నీళ్ళు ఆగలేదు. బాబా దగ్గర చాలాసేపు ఏడ్చేసి నా బాధ ఆయనతో చెప్పుకున్నాను. సరిగ్గా అప్పుడే పూజగదిలో చివరన అటొకటి, ఇటొకటి ఉన్న నెమలి ఈకలలో ఒకటి వచ్చి నా తలపై పడింది. నిజానికి ఆ నెమలి ఈక నేను ఉన్న చోటుకు చాలా దూరంగా ఉంది. అది పడితే అక్కడే కింద పడిపోవాలి. కానీ దూరాన వున్న నాపై వచ్చి పడింది. అది కూడా కింద పడకుండా అగరబత్తి స్టాండ్ నానుకొని నా తలపై వాలిపోయింది. ఇది నా దగ్గరకి ఎలా వచ్చిందని నేను చాలా ఆశ్చర్చపడ్డాను. కొద్దిసేపటివరకు నాకు ఏమీ అర్థం కాలేదు కానీ, తర్వాత అర్ధమైంది, 'బాబా మహిమ'. బాబా నన్ను ఆశీర్వదించారని గ్రహించాను. దాంతో నాలో ఉన్న ఆందోళన అంతా తొలిగిపోయి చాలా సంతోషపడ్డాను. క్షణాల్లో జరిగిన ఆ సంఘటనను నా జీవితంలో నేను ఎప్పటికీ మరువలేను. బాబా నా బాధను విన్నారు, ఆయన నాతో ఉన్నారు, నాన్న ఆరోగ్యం మంచిగా ఉంటుంది, రిపోర్టులు నార్మల్‌గా వస్తాయని నా మనసుకి అనిపించింది. నేను దానినే ధృఢంగా నమ్మాను. చివరగా రిపోర్ట్ తీసుకోవాల్సిన రోజు వచ్చింది. రోజూ బాబాను ధ్యానిస్తూ, ఆయనపై నమ్మకంతో ఉన్న నాకు రిపోర్ట్ తీసుకోవాల్సిన సమయం వచ్చేసరికి మళ్ళీ ఆందోళన మొదలైంది. ఎందుకంటే. మేము చాలా సున్నిత మనస్కులం. మా నాన్న అంటే మాకు చాలా ఇష్టం. సరే, రిపోర్ట్ తీసుకోవడానికి హాస్పిటల్‌కి వెళ్ళాము. కానీ అక్కడ రిపోర్ట్ తెరిచి చూసే ధైర్యం లేక అలాగే ఇంటికి తెచ్చుకున్నాం. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి బాబాను ధ్యానిస్తూ ఉండిపోయాను కొంతసేపటికి ఇలా కాదని, ధైర్యం తెచ్చుకుని బాబాపైన పూర్తి నమ్మకంతో రిపోర్టుకి  ముందుగా ఊదీ పెట్టి తర్వాత ఓపెన్ చేశాను. బాబా మహిమ చూపారు. రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. ఇంక నా సంతోషానికి అవధులు లేవు. "ధన్యవాదాలు బాబా! నా సమస్యకు ఇలా పరిష్కారం చూపావు తండ్రీ. నేను మీకు చాలా ఋణపడి ఉంటాను బాబా. ఎప్పుడూ ఇలాగే నా కుటుంబానికి తోడుగా ఉండి అంతా మంచి జరిగేలా ఆశీర్వదించండి బాబా. అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి వ్యక్తితో మా అక్కకు వివాహం జరిపించి, చక్కటి వైవాహిక జీవితాన్ని అనుగ్రహించండి  బాబా". 


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


18 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om sai ram, anta manchiga unde la chudu tandri

    ReplyDelete
  3. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  4. Om Sri Sai Arogyakshemadhaaya Namaha 🙏🙏🙏

    ReplyDelete
  5. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri vadini bless cheyandi

    ReplyDelete
  6. sai baba ee roju maa sai madava school ki velladu . repu kuda school ki velle laga cheyand baba, madava bharam antha meede baba.

    ReplyDelete
  7. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  8. ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  9. ఓం శ్రీ సాయిరామ్

    ReplyDelete
  10. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  11. Baba, bless peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  12. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  13. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  14. Baba ,maa problem solve ayyela anugrahinchandi...maa valla evaru kastapadakunda kantlo nellu rakunda solve ayyela chudandi baba please 🙏🥺😭

    ReplyDelete
  15. Omsai Sri Sai Jai Sai omsai Sri Sai Jai Sai kapadu Tandri Raksha Raksha omsai Sri Sai omsai

    ReplyDelete
  16. ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo