1. కష్టకాలంలో బాబా అండ
2. ప్రార్థన విని బాబు స్కూలుకి వెళ్లేలా అనుగ్రహించిన బాబా
కష్టకాలంలో బాబా అండ
అందరికీ నమస్కారం. నేను ఒక సాయిబాబా భక్తురాలిని. నాకు బాబా అంటే చాలా ఇష్టం. బాబాని నమ్మిన తరువాతే మేము బ్రతికి ఉన్నామని నేను అనుకుంటున్నాను. అలా అనడానికి మా అనుభవాలే కారణం. మాది ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం. మా నాన్న మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు. నాకు మా అక్క అంటే చాలా ఇష్టం. తను ఎవరినైనా ఇబ్బందిపెట్టడం లేదా మర్యాద లేకుండా మాట్లాడటం నేను ఇప్పటివరకూ చూడలేదు. అందువల్ల నేను చాలా సందర్భాలలో ఒక మనిషి ఇలా కోపం లేకుండా, ఇంత మర్యాదగా ఎలా ఉంటారని అనుకుంటూ ఉంటాను. అక్కకి పెళ్ళైన తరువాత మా బావ ఉద్యోగ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని తనకి తెలిసింది. ఆ పరిస్థితులను అధిగమించడానికి తను మాకు తెలిసిన బందువుల దగ్గర అప్పు చేసి తన కుటుంబాన్ని నెట్టుకుంటూ వెళ్ళేది. కానీ ఏనాడూ తన పరిస్థితి గురించి మా అమ్మవాళ్లతో గాని, నాతో గాని చెప్పలేదు. అలాంటి అక్కకి అనుకోకుండా ఆర్యోగ్య సమస్యలు తలెత్తి కాలు తీసేయాల్సి వచ్చింది. మేము చాలా బాదపడ్డాము. మా తల్లిదండ్రులు 'మన అమ్మాయిని మనమే చూసుకోవాలి' అని మా బావకి ఇబ్బంది లేకుండా ప్రతిదీ చూసుకున్నారు. అన్నివిధాలా అక్కకి అండగా వుండి హాస్పిటల్ ఖర్చులన్నీ మేమే భరించాము. ఇంతా చేస్తే మా బావ కట్టుకున్న భార్యకి కనీసం ఒక్క రూపాయి పెట్టలేదు సరికదా, తనకి ఎలా ఉందని కూడా ఆలోచించకుండా 'ఈ అమ్మాయి మాకు అవసరం లేద'ని వదిలేసి అక్కని చాలా మానసిక క్షోభకు గురిచేసాడు. అప్పటివరకు ఎన్ని ఇబ్బందులున్నా సంతోషంగా నెట్టుకొచ్చిన జీవితం ఒక్కసారిగా తలకిందులయ్యేసరికి మా అక్క దాదాపు డిప్రెషన్‌లోకి వెళ్లే పరిస్తితి ఏర్పడింది. అయినా మా బావ కట్టుకున్న భార్య ఒక ఆడపిల్లని, అందులోనూ జీవితంలో అనుకోని పెద్ద సంఘటనను ఎదుర్కొందన్నవేవీ ఆలోచించలేదు. అతను, అతని తల్లిదండ్రులు 'కాలులేని అమ్మాయి మాకు అవసరం లేద'ని కోర్టులో కేసు వేశారు. అలాంటి సమయంలో మా పక్కింటివాళ్ళ ద్వారా సాయి సచ్చరిత్ర పారాయణ గురించి మాకు తెలిసింది. అప్పటికి మేము బాబాను అంతగా ఆరాధించేవాళ్ళం కాదు. అయినా బాబాని నమ్మడం తప్ప, మాకు ఇంకో దిక్కు లేదు. అందుచేత ఈ సమస్య నుండి బాబా కాపాడతారని దృఢంగా నమ్మి ఆయనని ఆరాధించడం మొదలుపెట్టాము. ఆ బాబా కృపవలన మా అక్క ఆరోగ్యం కొంచెంకొంచెంగా మెరుగుపడుతుంది. ఒక 5 నెలల మందులకు సరిపడా డబ్బులు బాబా ఒక ఫౌండేషన్ ద్వారా అందే ఏర్పాటు చేసారు. అయినప్పటికీ డబ్బులు విషయంలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అక్క తన చదువు వృధాగా పోకుండా ట్యూషన్లు చెప్తూ కనీసం తన మందులకు సరిపడా సంపాదిస్తూ తనకి బాబా ఎలాగైనా మంచి చేస్తారని, ఏదైనా ఉద్యోగం ఇస్తారని నమ్ముతుంది. అలాగే కోర్టు విషయంలో కూడా బాబా దయతో తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఆయన ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటారని, తన బిడ్డలని కాపాడుతారని గట్టి నమ్మకంతో ఉన్నాము.
ఓం శ్రీ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
ప్రార్థన విని బాబు స్కూలుకి వెళ్లేలా అనుగ్రహించిన బాబా
నేను ఒక సాయిభక్తురాలిని. మేము యు.ఎస్.ఏలో నివాసముంటున్నాము. నేను 5 సంవత్సరాల బాబుకి తల్లిని. మేము తనని ఈ సంవత్సరం(2023) నర్సరీ స్కూల్లో జాయిన్ చేసాము. తను చాలా మంచి పిల్లాడు, కానీ తనకి సిగ్గు ఎక్కువ. అందువల్ల తను బయటవాళ్ళతో పెద్దగా మాట్లాడడు. తన విషయంలో నాకు అదే పెద్ద చింత. ఇటీవల తను స్కూలుకి వెళ్లానని అనడం ప్రారంభించి ప్రతిరోజూ ఉదయం నా మనసు పాడు చేస్తుండేవాడు. బాధతో నాకు చాలా ఆందోళనగా ఉంటుండేది. ఒకరోజు నేను తనకి చాలా మంచిగా అంతా వివరించాక తను బలవంతంగా స్కూలుకు వెళ్ళాడు. తను స్కూలుకి వెళ్ళిన తర్వాత నేను బాబాను, "రేపు బాబు సంతోషంగా స్కూలుకి వెళ్తే, మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విన్నారు. మరుసటిరోజు బాబు చాలా సంతోషంగా స్కూలుకు వెళ్ళాడు. "చాలా ధన్యవాదాలు బాబా. కానీ తను ఇప్పటికీ కొన్నిసార్లు ఇబ్బందిపడుతున్నాడు. తను ఎందుకో అమెరికన్లతో స్నేహం చేయడం లేదు. తనని తాను సర్దుబాటు చేసుకోలేక అసౌకర్యంగా ఉంటున్నాడు. దయచేసి తనని ఆశీర్వదించి ఈ తల్లి చింతను తొలగించండి బాబా".
సాయి స్మరణం సంకట హరణం!!!
బాబా శరణం భవభయ హరణం!!!
Om Sairam!!
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDelete🌺🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm Sri Sai Arogyakshemadhaaya Namaha🙏🙏🙏
ReplyDeleteOmsaisri Sai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha Raksha
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOm Sairam🙏
ReplyDeleteOmsairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om.Sai Ram
ReplyDeleteBaba ,maa problem solve ayyela anugrahinchandi baba...maa valla evaru ebbandi padakunda evari kantlo nellu rakunda problem solve ayyela chudandi please baba 🙏🥺
ReplyDelete