సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1731వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • తమ అనుగ్రహానికి ఎన్నో నిదర్శనాలిస్తున్న బాబా

నా పేరు హాసిని. మా అమ్మనాన్నలకు మేము ఇద్దరం ఆడపిల్లలం. మా అమ్మ భవిష్యత్తులో ఉపయోగపడతాయన్న ఆలోచనతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా పోస్ట్ ఆఫీసులో డబ్బులు దాచిపెడుతుండేది. ఇంట్లో తెలిస్తే స్కీం మధ్యలో బ్రేక్ చేసి ఆ డబ్బులు తీసుకుంటారని అమ్మ భయం. ఇలా ఉండగా ఒకరోజు మా అక్క(ఫామిలీ ఫ్రెండ్) ఆ పోస్టల్ ఎకౌంటు పుస్తకం చూసి, "నాకు తెలియకుండా డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు ఏంటి? ఈ డబ్బులు ఎవరివి?" అని అమ్మని ప్రశ్నించడం మొదలుపెట్టింది. తను ఏదైనా విషయాన్ని పట్టుకుంటే, ఎన్ని రోజులైనా వదలకుండా ఏడిపిస్తూనే ఉంటుంది. ఆ విషయం గుర్తొచ్చి నేను బాబాకి, "ఈ సమస్య ఇక్కడితో ఆగిపోయేలా చేయండి. మీకు గురువారం పాలాభిషేకం చేస్తాను. అలానే మీ అనుగ్రహం గురించి బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. బాబా దయ చూడండి. 30 నిమిషాల్లో సమస్య సద్దుమణిగింది. అక్క మళ్ళీ ఆ విషయం గురించి అడగలేదు. అలా బాబా సమస్య పెద్దది కాకుండా కాపాడారు. ఇది చూడటానికి చిన్న విషయంగా అనిపించొచ్చు కానీ, అమ్మని ఏడిపించడం అంటే పెద్ద విషయమే కదా! మా అమ్మ కూడా, "ఇలా చిన్న వాటికి కూడా బ్లాగు ఎందుకు? నా కష్టం నేను పడతాను కదా!" అని అంది. అప్పుడు నేను అమ్మతో, "విషయం చిన్నదని కాదు. బ్లాగు ఒక 'ఆధునిక సాయి సచ్చరిత్ర'. అందులో పంచుకుంటే, ఇలాంటి కష్టమే వేరే వాళ్ళకి వస్తే వాళ్ళు మన అనుభవాన్ని చదివి, 'మనకొచ్చిన కష్టమే ఆ భక్తురాలికి వచ్చింది. ఆమె బాబాకి చెప్పుకుంటే, బాబా సహాయం చేసారు' అని వాళ్ళు కూడా బాబాని ఆశ్రయిస్తారు, ఆయన అనుగ్రహంతో కష్టం నుండి బయట పడతారు" అని చెప్పాను. "థాంక్యూ సాయినాన్నా".


ఒకరోజు బాబా నాకు స్వప్న దర్శనమిచ్చారు. సరిగా గుర్తులేదుగాని ఆ కలలో బాబా ఎదురుగా నేను లేదా కొంతమంది పిల్లలు కూర్చున్నట్లు కనిపించింది. తర్వాత కలలోనే నేను మా అమ్మతో ‘బాబా హారతి, హారతి’ అని చెప్తుండగా నాకు మెలకువ వచ్చింది. తర్వాత గురువారంనాడు ఒక ఫోటో రూపంలో, "నా హారతికి రా. నా ఆశీస్సులు ఇస్తాను" అని ఒక సందేశమిచ్చారు బాబా. కానీ ఆరోజు హారతికి వెళ్ళడానికి నాకు కుదరదని, "సాయినాన్నా! ఈరోజు హారతికి రావడానికి అవ్వదు. ఇంకెప్పుడైనా వస్తాను" అని బాబాతో చెప్పుకున్నాను. అయితే బాబా ఆరోజు హారతిలో నన్ను చూడాలని అనుకున్నారేమో! ఆరోజు సాయంత్రం మా పక్కింటి అక్క, "బాబా హారతికి వస్తావా?" అని అడిగింది. "వస్తాను అక్క" అని నేను తనతో వెళ్ళాను. అప్పుడు మాటల్లో అక్క, "నేను 2 నెలల నుండి బాబా హారతికి వెళ్తున్నాను. కానీ ఈరోజే ఎందుకు నిన్ను పిలిచానో నాకు తెలియదు" అని అంది. అప్పుడు నాకు, 'ఆరోజు స్వప్నంలో బాబా నన్ను తమ హారతికి రమ్మని సందేశమిచ్చార'ని అర్థమై చాలా సంతోషించాను. ఆయన ఆహ్వానించడమే కాకుండా వీలు కాదనుకున్న నన్ను రప్పించుకొని మరీ తమ దర్శనాన్ని అనుగ్రహించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


2023, డిసెంబర్ 11న నేను నా పరీక్ష అయ్యాక బాబా గుడికి వెళ్ళాను. బాబా పాదపద్మములకు దణ్ణం పెట్టుకొనే ముందు నేను నా కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టాను. అయితే దణ్ణం పెట్టుకున్నాక కళ్లద్దాలు తీసి పెట్టుకోవడం మర్చిపోయి ఇంటికి వచ్చేసాను. రాత్రి 8 గంటలప్పుడు చూసుకుంటే నా కళ్లద్దాలు కనపడలేదు. అప్పుడు, 'బాబా! కళ్లద్దాలు ఎక్కడ మార్చిపోయాను?' అని అనుకొని గుర్తుకు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తే, బాబా గుడిలో మార్చిపోయానని గుర్తొచ్చింది. వాటిని బాబా గుడిలో భక్తులెవరూ తీయరన్న నమ్మకం నాకు ఉన్నప్పటికీ మరుసటిరోజు పరీక్ష ఉన్నందున కళ్లద్దాలు లేకపోతే ఎలాగని టెన్షన్ పడి, "బాబా! నా కళ్లద్దాలు మీ గుడిలో వుండేలా చూడండి. అలా అయితే మీ అనుగ్రహం బ్లాగ్ ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించి గుడికి వెళ్ళాను. నేను ఇంకా గుడిలో అడుగు కూడా పెట్టలేదు. అంతలో పంతులుగారు నేను రావడం చూసి, "నువ్వేనా అమ్మా, కళ్లద్దాలు లోపల పెట్టాను. చూసుకో!" అని అన్నారు. సాధారణంగా నేను ఎప్పుడూ నా కళ్లద్దాలు ఎక్కడా మర్చిపోను. అలాంటిది అప్పుడు మర్చిపోయాను. అలా ఎందుకు జరిగిందంటే, నేను మొదట బాబా గుడికి వెళ్లినప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్లి బాబా పదాలకు దణ్ణం పెట్టుకున్నాను. తిరిగి వచ్చేటప్పుడు మనస్పూర్తిగా దణ్ణం పెట్టుకోలేదని నాకు అనిపించింది కూడా. నేను సరిగ్గా దణ్ణం పెట్టుకోలేదనే బాబా ఆవిధంగా నన్ను మళ్ళీ గుడికి రప్పించారని అర్థమై బాబాకి మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకొని వచ్చాను. "బాబా! మీ దయవల్ల నేను వ్రాస్తున్నా పరీక్షలన్నీ మీరే దిద్ది నన్ను పాస్ చేయండి. మీరు నాకు ఎన్నో నిదర్శనాలు చూపిస్తున్నారు. వాటినన్నింటిని నిజం చేయండి బాబా". 

 

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు


13 comments:

  1. తృతీయ వర్మ సాయినాథ అనుతితుల కుటుంబ తొలగించి నేను నా భర్త కలిసి కాపురం చేసిన చూడు సాయి

    ReplyDelete
  2. Om Sai Ram, chelli ki intern location hyd ki chsnge syye la chudu tandri, ye problem lekunda e week wfh eche la chudu tandri pls

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please complications lekunda chudu baba please safe delivery chei baba please baba tomorrow delivery baba antha manchiga jargitattu chei baba

    ReplyDelete
  7. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  8. ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  9. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  10. Baba ,maku inka thattukune opika ledu....edoka dari chupinchandi please....anni extend avuthune vasthunnayi dayachesi mammalni gattu ekkinchandi 🙏😔

    ReplyDelete
  11. baba maa sai madava bharam antha meede baba. baba madava GK exam paper meere diddi marks veyandi baba.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo