1. ఊదీతో మోకాలి మంటను తగ్గించిన బాబా
2. సాయినాథుని అనుగ్రహం
ఊదీతో మోకాలి మంటను తగ్గించిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః. సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. 25 సంవత్సరాలుగా నాకు ఏ సమస్య వచ్చినా నేను బాబాకే చెప్పుకుంటూ 'సాయి సాయి' అనే స్మరించుకుంటున్నాను. బాబా నాకు అండగా ఉండి నన్ను ఆదుకుంటున్నారు. ఆయన ప్రతి విషయంలో నాకు ఎంతో అండగా ఉండి ముందుకు నడిపిస్తున్నారు. నేను అందరి దేవుళ్లను సాయిబాబాగానే భావిస్తాను. సాయిగణేశా, సాయిపార్వతీపరమేశ్వర, సాయిలక్ష్మీనారాయణ అని అనుకుంటాను. ఇది నాకు ఈ బ్లాగు ద్వారానే అలవాటైంది. గతంలో ఒక సాయిభక్తురాలు తన అనుభవంలో 'సాయినారాయణ' అని వ్రాసారు. అది చదివిన దగ్గర నుండి అందరి దేవుళ్లను సాయిబాబాగా చూడటం నాకు అలవాటైంది. ఆమధ్య చాలారోజులు నా కుడి మోకాలు వద్ద మండుతున్నట్టు ఉండేది. దానితో నేను చాలా ఇబ్బందిపడ్డాను. ఊదీ రాసుకుందామని అనుకున్నాను కానీ, డబ్బాలో బాబా ఊదీ తక్కువగా ఉండటం వలన ప్రతిరోజూ ఉదయం దేవుడికి దణ్ణం పెట్టుకొనేటప్పుడు దేవుడి దగ్గర వెలిగించిన అగరుబత్తి పొడిని బాబా ఊదీగా భావించి, దాన్ని నా మోకాలికి రాసుకొని, "మంటను తగ్గించు బాబా" అని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అలా కొన్ని రోజులు చేసాక మోకాలి మంట తగ్గిపోయింది. ఇప్పుడు ఆ బాధ లేదు.
మా బాబుకి వెన్ను కిందగా అంటే నడుముకి కిందన చాలా పెద్ద సెగ్గడ్డలా వస్తుండేది. అది వచ్చినప్పుడు ఒళ్లునొప్పులు, జ్వరం ఉన్నట్లుగా ఉండి బాబు చాలా బాధపడుతుండేవాడు. అలా ప్రతినెలలో 5 రోజులు బాబు ఇబ్బందిపడటం, మందులు వేసుకుంటే తగ్గడం, మళ్లీ అలాగే జరగటం జరుగుతుండేది. అన్ని రకాల టెస్టులు చేయించాము. రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చేవి కానీ, ఎంతమంది డాక్టర్లకు చూపించినా అదే పరిస్థితి కొనసాగింది. అలా బాబు రెండు సంవత్సరాలు ఇబ్బందిపడ్డాడు. వాడి ఇబ్బంది చూస్తుంటే నాకు చాలా బాధ కలిగేది. డాక్టర్, "నేను అన్ని రకాలుగా ప్రయత్నించాను. కానీ బాబుకి తగ్గట్లేదు. కాబట్టి సర్జరీ చేస్తాను" అని అన్నారు. కానీ మేము సర్జరీకి ఇష్టపడలేదు. ఆ సమయంలో "జ్వరానికి, గడ్డలకి భయపడవద్దు" అని బాబా సందేశాలలో వచ్చేది. దాంతో కాస్త ధైర్యం వచ్చి హోమియో మందులు వాడి చూసాము. అయితే ఆ మందులకు కూడా బాబుకి పూర్తిగా తగ్గలేదు. అప్పుడు బాబా ముందు చీటీలు వేస్తే, 'సర్జరీ చేయించమ'ని వచ్చింది. దాంతో మేము సర్జరీ చేయించాము. బాబా దయవలన సర్జరీ చాలా తేలికగా జరిగి ఆ సాయంత్రానికే బాబు మామూలుగా కూర్చోగలిగాడు. సాయితండ్రి దయవల్ల ఇప్పుడు బాబు ఆరోగ్యం బాగానే ఉంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
సాయినాథుని అనుగ్రహం
శ్రీసాయి దివ్యపాదపద్మములకు నమస్కారాలు. సాయి భక్తులందరికీ నమస్సులు. నేను ఒక సాయి భక్తురాలిని. శ్రీసాయిని కొలుస్తున్నప్పటినుండి వారి దివ్యలీలలు నాకు అనుభవం అవుతూ ఉన్నాయి. నాకు కాలునొప్పులు ఎక్కువగా ఉంటుంటాయి. అందువల్ల నేను ఆఫీసు, ఇల్లు తప్ప ఎక్కడికీ వెళ్ళను. అలాంటిది ఒకసారి మా బంధువులందరితో కలిసి కాశీ వెళ్లి మా అత్తగారికి పిండప్రదానం చేయవలసి వచ్చింది. అందుకోసం అందరికీ ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసాము. తర్వాత హఠాత్తుగా నాకు తీవ్రమైన పాదాల నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చాయి. దాంతో నేను కాశీ వెళ్లకూడదని అనుకున్నాను. కానీ భగవాన్ శ్రీ సాయినాథుని శరణువేడి డాక్టరుని సంప్రదించి, ప్రయాణంలో అవసరమయ్యే మందులు తీసుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాను. అప్పుడు బాబాను, "స్వామీ! నా యాత్ర బాగా జరగాల"ని ప్రార్థించి కాశీ వెళ్ళాను. మేము ముందుగా కాశీ వెళ్లి విశ్వనాథుని దర్శించుకున్నాము. తర్వాత అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, గణపతి, ఆంజనేయ దేవాలయాలు దర్శించి గంగ యాత్ర చేసాం. ఆపై గయ, బుద్ధగయ, అయోధ్య, నైమిశారణ్యం, ప్రయాగ చూసి క్షేమంగా తిరిగి వచ్చాం. నా జీవితంలోనే ఇది ఒక గొప్ప యాత్రగా నిలిచింది. ఇదంతా కేవలం సాయినాథుని అనుగ్రహమే.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteSai ram, naaku ishtam lenidi na manasuki nachanidi jaragakunda unde la chudu tandri pls, chelli intern location hyd ki change chese la chudu tandri pls
ReplyDeleteOm sairam 🙏
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
sai baba maa sai madavaki eeroju vantings ai schoolki vella ledu. Repu school ki vellatattu cheyandi baba. madavani marchandi baba. madava bharam antha meede baba. alage maa vari kopam taggi madava paroblem ardham chesukoni koppadakunda chudandi baba.
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please baba safe delivery chei baba please baba.delivery time daggaraku vachindi baba nannu na baby ni mere kapadali Baba
ReplyDeleteOm Sai Ram Baba today I am meeting my brother please bless my with courage.om Sai Ram.please bless my children, grand children, husband with health and full 🙏🙏🙏 aayush.
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sri Sainathaya Namah
ReplyDeleteJaisai Jai Sai kapadu Tandri 🙏🙏 omsaisri Jai Sai 🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం
ReplyDeleteSAI please change my mind
ReplyDeletenaaku manchi budhini prasadinchu
Om sairam