1. సొంత బిడ్డల్లా భక్తులను కాపాడుతూ ఉండే బాబా
2. కష్టసమయంలో తలచుకోగానే నేనున్నానంటూ ధైర్యం కలిగించే బాబా
3. బాబా ఊదీ మహాత్మ్యము - భరించలేని తలనొప్పి మాయం
సొంత బిడ్డల్లా భక్తులను కాపాడుతూ ఉండే బాబా
సాయిబాబా భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఉషనీలిమ. నేను చిన్నప్పటినుండి బాబా భక్తురాలిని. బాబా నా జీవితంలో చాలాసార్లు అడిగిన వెంటనే సహాయం చేసారు. 2023, నవంబర్ నెలాఖరులో నాకు నెలసరి సమయంలో అయ్యే విధంగా పది రోజులు బ్లీడింగ్ అయింది. అయితే ఎక్కువగా కాదు, కొంచెంగానే అవుతుండేది. కడుపునొప్పి మాత్రం బాగా ఎక్కువగా వస్తుండేది. 'అది నెలసరా? లేక ఇంకేమైనా గర్భాశయ సమస్యా?' అన్నది నాకు అర్థంకాక బాబా పటం దగ్గరకి వెళ్లి, "బాబా! నాకు చాలా భయంగా ఉంది. నెలసరి అయితే మాములుగా వచ్చేలా చేయండి లేదా బ్లీడింగ్ ఆగిపోయేలా చేయండి" అని చెప్పుకున్నాను. చిత్రంగా మరుసటిరోజే నాకు నెలసరి మామూలుగా వచ్చేసింది. బాబా దయవల్ల నా మనసులోని భయం, సందేహాలు పోయాయి. తర్వాత నా భర్తకి, మా పాపకి బాగా జలుబు చేసి జ్వరమొచ్చి చాలా ఇబ్బందిపడ్డారు. వాళ్ళిద్దరికీ తొందరగా తగ్గాలని నేను బాబా పూజ చేశాను. ఆ మరుసటిరోజు వాళ్ళిద్దరికీ జ్వరం తగ్గింది, జలుబు కూడా కొంచెం తగ్గింది. ఇప్పుడు ఇద్దరి ఆరోగ్యం చాలా బాగుంది. బాబా తన భక్తులను సొంత బిడ్డల్లా ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు. ఆయన భక్తురాలిని అయినందుకు చాలా గర్వంగా ఉంది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే నన్ను, నా కుటుంబాన్ని, మీ భక్తులందరినీ కాపాడు బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
కష్టసమయంలో తలచుకోగానే నేనున్నానంటూ ధైర్యం కలిగించే బాబా
నా పేరు చైతన్య. మేము చెన్నై నగరంలో ఉంటున్నాము. ఈ బ్లాగు పరిచయం అయినప్పటి నుండి నేను క్రమం తప్పకుండా ఇందులో ప్రచురితమవుతున్న అనుభవాలు చదువుతున్నాను. అవి నాకు బాబా మీద నమ్మకం పెంచడంలో, నన్ను మంచి మార్గంలో నడిపించడంలో సహాయం చేస్తున్నాయి. 2023, డిసెంబరు 11న నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. భరించటం చాలా కష్టంగా అనిపించింది. ఇంకా టాబ్లెట్ వేసుకోవాలని అనుకున్న సమయంలో బాబాని ప్రార్థించి ఊదీ రాసుకున్నాను. తర్వాత కళ్ళు మూసుకొని బాబా నామం జపిస్తూ ఒక 5 నిముషాలు పడుకున్నాను. అప్పుడు బాత్రూంకి వెళ్ళాల్సిన అవసరమొచ్చి లేచి వెళ్లాను. తలనొప్పి విపరీతంగా వుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఇలానే మా అమ్మ తలనొప్పితో బాధపడుతూ బాత్రూంకి వెళ్లి, లోపల పడిపోయింది. బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయితే ఆపరేషన్ చేశారు. ఆ విషయం గుర్తొచ్చి, 'నాకు ఏమైనా అవుతుంది ఏమోన'ని భయమేసింది. కానీ బాబా తమని నమ్ముకున్నవాళ్లను తప్పక కాపాడతారు. ఆయన దయవల్ల బాత్రూం నుండి బయటకి వచ్చాక నాకు తలనొప్పి తగ్గిపోయింది. అప్పటివరకూ అంతలా ఉన్న నొప్పి పూర్తిగా అదృశ్యమైంది. ఇదంతా బాబా ఊదీ మహాత్మ్యము కాకపోతే ఇంకేంటి? ఈ అనుభవం ద్వారా బాబా నాతో ఉన్నారన్న నమ్మకం నాకు వచ్చింది. "ధన్యవాదాలు బాబా. నేను జీవితంలో తెలిసి, తెలియక చాలా తప్పులు చేశాను. నా తప్పులు నేను తెలుసుకున్నాను. నన్ను మన్నించి అనుగ్రహించండి బాబా".
సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై!!!
Om Sairam!!
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram, baba chelli intern location banglore nunchi hyd change chese la chudu tandri pls, ofce lo ye problem lekunda chesinanduku chala thanks tandri, migilina vishayalu kuda anni bagunde la chudandi
ReplyDeleteOm Sairam 🙏
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku
ReplyDeleteMeku satha koti vandanalu urgent ga Kalyan marriage chai thandri
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteBaba,naa situations valla evaru ebbandi padakunda chudandi please....chala kastam ga anipisthundi baba...dayachesi intha duram thesuku vachina mere ee paristhiti ni kuda chakkadiddandi 🙏....antha mede baram....ellapudu naku darshanam ichi natho vunnaru ani chupisthune vunnaru ee kastam nundi kuda mere bayataki vachela cheyandi please 🥺
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOm sai ram baba with your blessings our Tirupati trip was very nice. We had good darshan at Srinivas tempil. Aliveru mangamma temple. Thank you🙏🙏🙏 Baba
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం సాయిరాం బాబా నా భర్త మనసు మార్చగలిగే శక్తి మీకు తప్పై ప్రపంచంలో ఎవ్వరికి లేదు సాయి న్యాయమనిపిస్తే సాయి
ReplyDeleteOmsaisri Sai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 omsaisri
ReplyDelete