సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1745వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆర్థిక బాధల నుండి కాస్త ఉపశమనం ప్రసాదించిన బాబా
2. సప్తాహ పారాయణ చేయమన్న ప్రేరణ - తద్వారా సమస్యకు పరిష్కారం

ఆర్థిక బాధల నుండి కాస్త ఉపశమనం ప్రసాదించిన బాబా


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు శాంతి. మాది వైజాగ్. 20 సంవత్సరాల నుంచి బాబా మా జీవితంలో ఉన్నారు. కష్టమైనా, సుఖమైన బాబాకి చెప్పుకోవడం నాకు అలవాటు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా బాబా మాతో ఉన్నారనే నమ్మకం మరింతా పెరిగింది. ప్రతిరోజూ 'సాయి మహారాజ్ సన్నిధి' ఫేస్బుక్ పేజీ ఓపెన్ చేయగానే వచ్చే బాబా వచనాలు మా మనసులను చాలా దృఢంగా తయారుచేస్తున్నాయి. ఇక నా అనుభవానికి వస్తాను. మా కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందిపడుతుండేది. మావారు ఆటో నడిపి మా కుటుంబాన్ని పోషిస్తుండేవారు. వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకు, పిల్లల్ని చదివించడానికి సరిపోయేది కాదు. అందువల్ల మేము, "బాబా! నా భర్తకు ఒక మంచి పని దొరికేలా అనుగ్రహించండి తండ్రీ" అని బాబాను వేడుకున్నాము. తర్వాత బాబా దయవల్ల ఒక సంస్థలో మంచి పని ఉందని మా దృష్టిలోకి వచ్చింది. అయితే ఆ పని చాలా సిపారసులతో కూడుకొని ఉన్నందున మళ్ళీ బాబాను, "తండ్రీ! మీరే ఏదో ఒక సిపారసు ద్వారా ఆ పని మావారికి వచ్చేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఆ సంస్థకి చెందిన పెద్ద సారు సిపారసు చేశారు. కానీ ఆ పనిలో నైట్ డ్యూటీలు ఉంటాయని తెలిసి, నైట్ డ్యూటీలు మావారి ఆరోగ్యానికి సరిపోవని మేము ఆందోళన చెందాము. అయినా నేను బాబాని ఒకటే వేడుకున్నాను: "తండ్రీ! మీ అనుగ్రహం ఉంటే గురువారం మావారిని డ్యూటీకి పిలిచేలా చేయండి" అని. బాబా దయవల్ల నేను కోరుకున్నట్లు గురువారమే రమ్మని మావారికి ఫోన్ వచ్చింది. కానీ ఒక సమస్య వచ్చి పడింది. అదేమిటంటే, ఆ పనిలో చేరడానికి డ్రైవింగ్‌కి సంబంధించి ఒక ఎంట్రన్స్ టెస్ట్ తప్పనిసరిగా పాసవ్వాలి. శుక్రవారం మాత్రమే ఉండే ఆ టెస్టుకు మావారు బయలుదేరేముందు ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తే, "ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయ"ని బాబా వచనం వచ్చింది. కానీ మావారు టెస్టులో ఫెయిల్ అయ్యారు. అక్కడున్న ఒక సార్‌ని రిక్వెస్ట్ చేస్తే, "సోమవారం మళ్ళీ రమ్మ"ని చెప్పారు. దాంతో మావారు సోమవారం మళ్ళీ టెస్టుకు వెళ్లారు. అయితే అప్పుడు కూడా మావారు ఫెయిల్ అయ్యారు. 28 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండి కూడా మావారు ఫెయిల్ అవ్వడం వల్ల మేము చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాము. మా కుటుంబమంతా చాలా బాధపడ్డాము. ఆ సమయంలో సంస్థవాళ్ళు ఇంకో అవకాశం ఉందని తెలియజేసారు. అప్పుడు నేను సాయిని, "తండ్రీ! మావారు ఎందుకు పాస్ అవ్వడం లేదు? అయినా మీ అనుగ్రహం లేని పని మాకు ఎందుకు? కానీ అవమానాలు భరించడం మావల్ల కావడం లేదు తండ్రీ" అని వేడుకున్నాను. బాబాకి ఉపవాసం అంటే ఇష్టం ఉండదని తెలిసి కూడా గురువారంనాడు నేను, నా భర్త  ఉపవాసం ఉన్నాము. మావారు, "బాబా! మీ దయతో ఈ పని కుదిరితే నేను ఇక మీదట గురువారం మాంసాహారం తినను" అని మొక్కుకున్నారు. నేను, 'ఐదు వారాలు దివ్యపూజ చేస్తాన'ని అనుకున్నాను. ఇంకా 'సాయి మహరాజ్ సన్నిధి'లో బాబా అనుగ్రహాన్ని పంచుకుంటాన'ని కూడా అనుకున్నాను. మరుసటిరోజు శుక్రవారం ఉదయం ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడగా "భయపడకు. అంతా సవ్యంగా జరుగుతుంది" అని బాబా వచనం వచ్చింది. బాబా దయవల్ల ఆరోజు మావారు టెస్టులో పాసయ్యారు. మావారికి పని దొరికింది. నైట్ డ్యూటీలకి కూడా వెళ్తున్నారు. డ్యూటీకి వెళ్లేముందు కొంచెం నీళ్లలో ఊదీ కలుపుకొని తాగి వెళ్తున్నారు. బాబా దయవల్ల డ్యూటీ సవ్యంగా చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకొని సంతోషంగా ఉన్నాము. ఇది బాబా చేసిన అద్భుతంకాక ఇంకేమిటి? "ధన్యవాదాలు బాబా. ఇలాగే ఎప్పుడూ మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి సాయితండ్రీ".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహారాజ్ కీ జై!!!


సప్తాహ పారాయణ చేయమన్న ప్రేరణ - తద్వారా సమస్యకు పరిష్కారం


నా పేరు వెంకటేశ్వరరావు. నేను హైదరాబాద్ నివాసిని. 2023, జూలైలో నేను ఒక సమస్య గురించి ఆలోచిస్తూ ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేసి ఒక భక్తుని అనుభవం చదివాను. అందులో వాళ్ళు సాయి సచ్చరిత్ర ఏడు సప్తాహ పారాయణాలు చేసాము, శ్రీసాయి మా సమస్యను పరిష్కరించారు అని వ్రాశారు. అది చదివాక శ్రీసాయి నన్ను శ్రీసాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణ చేయమంటున్నట్లు ప్రేరణ కలిగింది. దాంతో నేను తొమ్మిది సప్తాహ పారాయణాలు చేస్తాననుకొని మరుసటి గురువారం నుండి పారాయణ మొదలుపెట్టాను. మొదటి సప్తహం పూర్తి కాకుండానే బాబా నా సమస్యకు పరిష్కారం చూపారు. నేను చాలా సంతోషించి ముందుగా అనుకున్నట్లు తొమ్మిది సప్తాహాలు పూర్తి చేశాను. "ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహం మా మీద, అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలి తండ్రీ. నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి సాయి".


18 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om sai ram, antha manchiga unde la chudu tandri

    ReplyDelete
  3. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri pl vadini bless cheyandi

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  6. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  7. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  8. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  9. Om Sri Sai Arogyakshemadhaaya Namaha 🙏🙏🙏

    ReplyDelete
  10. Baba ,maa problem solve chesi munduki velle laga chudandi mee anugraham maa meda vunchandi 🥺🙏

    ReplyDelete
    Replies
    1. Nannu nammukuni vachina evariki ebbandi lekunda maa problems solve cheyandi Baba....chala kastam gaa vundi eduti valla naa valla bhada paduthunnaru ane alochana..... please Baba 🙏

      Delete
  11. Baba please cure stomach pain Sai.please help Sai.Om Sai Ram

    ReplyDelete
  12. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  13. sai baba maa sai madava bharam antha meede baba

    ReplyDelete
  14. Baba naa arogyam bagu chesi edhaina job chese avakasam ivvu thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo