ఈరోజు భాగంలో అనుభవాలు:
- సాయిబాబా మా ఇంట కొలువైన తీరు
- 24 గంటల్లో సాయి చేసిన సహాయం
సాయిబాబా మా ఇంట కొలువైన తీరు
వైజాగ్ నుండి జయంతిప్రసాద్ గారు ఒక అద్భుతమైన సాయిలీలని మనతో పంచుకుంటున్నారు:
సాయిభక్తులందరికీ నమస్తే!
కొన్ని ఆశ్చర్యకర విషయాలు అందరూ వింటుంటారు, చదువుతుంటారు. విని 'ఔరా!' అనుకుంటారు. ఆ భగవంతుని కృపాకటాక్షాలుంటే ఏదైనా జరుగుతుంది అనటానికి ఉదాహరణే మీరిప్పుడు చదవబోయే అనుభవం.
శిరిడీ సమాధిమందిరంలో మురళీధరుని విగ్రహం ప్రతిష్ఠించాలని అనుకున్న స్థానంలో సాయిబాబా కొలువుదీరిన వివరాలు సచ్చరిత్రలో అందరూ చదివి వుంటారు. అలాంటి సంఘటన ఒకటి ఈరోజు నేను విని చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. నా స్నేహితుడు, వైజాగ్ నివాసస్తులైన శ్రీనివాస్ గారు తమ ఇంటి ప్రవేశద్వారం వద్ద చిన్న మందిరంలా కట్టి, అందులో అడుగున్నర ఎత్తున్న శిరిడీ సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠించి ఉంచారు. ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్లినా ఏదో ఆదరాబాదరాగా వెళ్ళి, పని చూసుకొని వచ్చేస్తుండేవాడినే కానీ, ఆ బాబా గురించి తెలుసుకోవాలన్న ఆలోచనే రాలేదు. అనుకోకుండా ఈరోజు, "బాబూ! ఇంత చిన్న జాగాలో బాబాను పెట్టారు. మీకు బాబా అంటే అంత ఇష్టమా? ఏమిటా కథ?" అని ఆరా తీసాను. అందుకతనిలా సెలవిచ్చారు:
"నాకు ఎప్పటినుంచో చేతిలో వేణువు ధరించి, వెనుక గోవు ఉన్న మురళీకృష్ణుని విగ్రహం ఒకటి సేకరించాలనే కోరిక ఉండేది. అందునిమిత్తం విగ్రహాల పరిజ్ఞానమున్న ఓ మనిషిని కలిసి విగ్రహం విషయం అతనికి పురమాయించాను. వారంరోజులు గడిచిన తరువాత ఆ వ్యక్తి వచ్చి, "పదండి సార్, విగ్రహాన్ని చూద్దాము" అని నన్ను ఓ చోటకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఓ విగ్రహాన్ని చూపిస్తూ, "సైజ్ సరిపోతుందాండీ?" అని అడిగాడు. విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోవడం నా వంతైంది! విషయం ఏమిటంటే, అది శిరిడీ సాయిబాబా విగ్రహం! నేను, "అదేంటి స్వామీ! నేను మురళీకృష్ణుని విగ్రహము, అది కూడా వెనుక గోవు ఉండాలని చెప్పాను కదా!" అంటే, అతను, "లేదండీ, మీరు చెప్పింది బాబా విగ్రహమే!" అంటాడు. నేను, "లేదయ్యా బాబూ! కృష్ణుడే" అంటే, మళ్లీ అతను, "లేదు సార్. మీరు బాబా విగ్రహం అన్నారు. కాలు మీద కాలు వేసుకొని కూర్చునే బాబా అనే నాకు చెప్పారు" అంటూ వాదించాడు. ఎంతకీ ఆ వాదులాట తెగలేదు. ఇక చేసేదేమీ లేక సరేనని బాధతో ఆ బాబా విగ్రహాన్ని ఇంటికి తెచ్చి అటక మీద పెట్టాను.
తరువాత దసరా సమయంలో మా ఇంటిలో ఏర్పాటు చేసిన బొమ్మలకొలువులో ఈ బాబా విగ్రహాన్ని కూడా పెట్టాము. బొమ్మలకొలువు చూడటానికి వచ్చిన పేరంటాళ్ళందరూ బాబా విగ్రహాన్ని భలేవుందని మెచ్చుకున్నారు. మా కాలనీలో ఉన్న ఒక 18 ఏళ్ళ అమ్మాయి కూడా వచ్చి బొమ్మలకొలువు చూసి ఫోటోలు తీసుకొని వెళ్ళింది. రెండురోజుల తరువాత ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి, "అంకుల్! చాలా పెద్ద విచిత్రం జరిగింది. మీరు వెంటనే బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయండి" అని హడావిడి చేసింది. నాకేం అర్థంకాక, "ఎందుకమ్మా అలా అంటున్నావు?" అని అడిగాను. ఆ అమ్మాయి తాను తీసిన ఫోటోలు చూపించింది. అవి చూసి మేమంతా ఆశ్చర్యపోయాము. 36 ఫోటోలు వుండే రీలులో 1 నుండి 15 వరకు, 17 నుండి 36 వరకు ఉన్న ఫోటోలన్నీ ఫుల్ బ్లాక్, అంటే పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఒక్క 16వ ఫోటోలో మాత్రం సాయిబాబా దర్శనమిస్తున్నారు. దాంతో ఆ బాబా విగ్రహంలో ఏదో మహత్యం ఉందని మాకనిపించి దానిని ఒకచోట ప్రతిష్ఠిద్దామని అనుకున్నాము".
"ఆ తరువాత పంచాంగం చూసి, "ఫలానా పౌర్ణమినాడు వచ్చి, సిమెంట్ పనిచేసి, సాయిబాబాను ఒక ఎత్తులో ప్రతిష్ఠించాలి" అని ఒక మేస్త్రీకి కబురుపెట్టాను. అతడు దానికి అంగీకరించి, పౌర్ణమినాడు రాకుండా, కబురూ కాకరకాయా లేకుండా అమావాస్యనాడు ఒక గునపం, పారతో వచ్చి 'పని మొదలుపెడతాన'ని అన్నాడు. నేను, "అదేంటయ్యా! మొన్న పౌర్ణమినాడు కదా నిన్ను రమ్మని చెప్పింది. అప్పుడు రాకపోగా అమావాస్యనాడు వస్తావా?" అని అంటే, అతడు, "లేదు సార్, మీరు ఈరోజే రమ్మన్నారు" అన్నాడు. ఎంత గదమాయించినా అతడు, "నేను నా డైరీలో కూడా వ్రాసుకున్నాను సార్" అని మరీ మరీ చెప్పాడు. ఇక నేను, "సరే, ఆ బాబా ఈరోజే కూర్చుంటానంటే నేనెందుకు వద్దనాలి?" అని ఊరుకున్నాను. అలా ఆరోజు ఈ బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించాము. అదీ సాయిబాబా మా ఇంట కొలువైన తీరు".
"ఆ తర్వాత కొన్నాళ్ళకి పైనున్న లింటల్(సన్ షేడ్)ను వెడల్పు చేసి బాబాకు ఎండనుండి, వాననుండి రక్షణ ఏర్పాటు చేశాము. అనూహ్యంగా మూడునెలల్లో మా అబ్బాయికి మా ఇంటిపై ఇల్లు కట్టాలని ఆలోచన రావడం, డబ్బు సమకూరడము, అవాంతరాలేవీ లేకుండా నిర్మాణం పూర్తి కావడం తలచుకొంటే ఆశ్చర్యంగా ఉంది. అంతా సాయిబాబా అనుగ్రహమే! అనుకోకుండా మా ఇంటికి వచ్చి మాకు అండగా నిలిచారు బాబా. నాకు తోచినంతలో ప్రతిరోజూ బాబా ముందు దీపం పెట్టి, బాబాకు ఒక పండు సమర్పించుకుంటాను".
వైజాగ్ నుండి జయంతిప్రసాద్ గారు ఒక అద్భుతమైన సాయిలీలని మనతో పంచుకుంటున్నారు:
సాయిభక్తులందరికీ నమస్తే!
కొన్ని ఆశ్చర్యకర విషయాలు అందరూ వింటుంటారు, చదువుతుంటారు. విని 'ఔరా!' అనుకుంటారు. ఆ భగవంతుని కృపాకటాక్షాలుంటే ఏదైనా జరుగుతుంది అనటానికి ఉదాహరణే మీరిప్పుడు చదవబోయే అనుభవం.
శిరిడీ సమాధిమందిరంలో మురళీధరుని విగ్రహం ప్రతిష్ఠించాలని అనుకున్న స్థానంలో సాయిబాబా కొలువుదీరిన వివరాలు సచ్చరిత్రలో అందరూ చదివి వుంటారు. అలాంటి సంఘటన ఒకటి ఈరోజు నేను విని చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. నా స్నేహితుడు, వైజాగ్ నివాసస్తులైన శ్రీనివాస్ గారు తమ ఇంటి ప్రవేశద్వారం వద్ద చిన్న మందిరంలా కట్టి, అందులో అడుగున్నర ఎత్తున్న శిరిడీ సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠించి ఉంచారు. ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్లినా ఏదో ఆదరాబాదరాగా వెళ్ళి, పని చూసుకొని వచ్చేస్తుండేవాడినే కానీ, ఆ బాబా గురించి తెలుసుకోవాలన్న ఆలోచనే రాలేదు. అనుకోకుండా ఈరోజు, "బాబూ! ఇంత చిన్న జాగాలో బాబాను పెట్టారు. మీకు బాబా అంటే అంత ఇష్టమా? ఏమిటా కథ?" అని ఆరా తీసాను. అందుకతనిలా సెలవిచ్చారు:
తరువాత దసరా సమయంలో మా ఇంటిలో ఏర్పాటు చేసిన బొమ్మలకొలువులో ఈ బాబా విగ్రహాన్ని కూడా పెట్టాము. బొమ్మలకొలువు చూడటానికి వచ్చిన పేరంటాళ్ళందరూ బాబా విగ్రహాన్ని భలేవుందని మెచ్చుకున్నారు. మా కాలనీలో ఉన్న ఒక 18 ఏళ్ళ అమ్మాయి కూడా వచ్చి బొమ్మలకొలువు చూసి ఫోటోలు తీసుకొని వెళ్ళింది. రెండురోజుల తరువాత ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి, "అంకుల్! చాలా పెద్ద విచిత్రం జరిగింది. మీరు వెంటనే బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయండి" అని హడావిడి చేసింది. నాకేం అర్థంకాక, "ఎందుకమ్మా అలా అంటున్నావు?" అని అడిగాను. ఆ అమ్మాయి తాను తీసిన ఫోటోలు చూపించింది. అవి చూసి మేమంతా ఆశ్చర్యపోయాము. 36 ఫోటోలు వుండే రీలులో 1 నుండి 15 వరకు, 17 నుండి 36 వరకు ఉన్న ఫోటోలన్నీ ఫుల్ బ్లాక్, అంటే పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఒక్క 16వ ఫోటోలో మాత్రం సాయిబాబా దర్శనమిస్తున్నారు. దాంతో ఆ బాబా విగ్రహంలో ఏదో మహత్యం ఉందని మాకనిపించి దానిని ఒకచోట ప్రతిష్ఠిద్దామని అనుకున్నాము".
"ఆ తరువాత పంచాంగం చూసి, "ఫలానా పౌర్ణమినాడు వచ్చి, సిమెంట్ పనిచేసి, సాయిబాబాను ఒక ఎత్తులో ప్రతిష్ఠించాలి" అని ఒక మేస్త్రీకి కబురుపెట్టాను. అతడు దానికి అంగీకరించి, పౌర్ణమినాడు రాకుండా, కబురూ కాకరకాయా లేకుండా అమావాస్యనాడు ఒక గునపం, పారతో వచ్చి 'పని మొదలుపెడతాన'ని అన్నాడు. నేను, "అదేంటయ్యా! మొన్న పౌర్ణమినాడు కదా నిన్ను రమ్మని చెప్పింది. అప్పుడు రాకపోగా అమావాస్యనాడు వస్తావా?" అని అంటే, అతడు, "లేదు సార్, మీరు ఈరోజే రమ్మన్నారు" అన్నాడు. ఎంత గదమాయించినా అతడు, "నేను నా డైరీలో కూడా వ్రాసుకున్నాను సార్" అని మరీ మరీ చెప్పాడు. ఇక నేను, "సరే, ఆ బాబా ఈరోజే కూర్చుంటానంటే నేనెందుకు వద్దనాలి?" అని ఊరుకున్నాను. అలా ఆరోజు ఈ బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించాము. అదీ సాయిబాబా మా ఇంట కొలువైన తీరు".
"ఆ తర్వాత కొన్నాళ్ళకి పైనున్న లింటల్(సన్ షేడ్)ను వెడల్పు చేసి బాబాకు ఎండనుండి, వాననుండి రక్షణ ఏర్పాటు చేశాము. అనూహ్యంగా మూడునెలల్లో మా అబ్బాయికి మా ఇంటిపై ఇల్లు కట్టాలని ఆలోచన రావడం, డబ్బు సమకూరడము, అవాంతరాలేవీ లేకుండా నిర్మాణం పూర్తి కావడం తలచుకొంటే ఆశ్చర్యంగా ఉంది. అంతా సాయిబాబా అనుగ్రహమే! అనుకోకుండా మా ఇంటికి వచ్చి మాకు అండగా నిలిచారు బాబా. నాకు తోచినంతలో ప్రతిరోజూ బాబా ముందు దీపం పెట్టి, బాబాకు ఒక పండు సమర్పించుకుంటాను".
24 గంటల్లో సాయి చేసిన సహాయం
సాయిభక్తుడు వెంకటేష్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను మన ప్రియమైన సాయికి సాధారణ భక్తుడిని. "సాయీ! మీ బిడ్డలమైన మేము చేసిన తప్పులన్నింటినీ దయతో క్షమించండి". నేనిప్పుడు చెప్పబోయే అనుభవం చాలా సరళంగా, చిన్నదిగా అనిపించవచ్చు కానీ, సాయిపై నాకున్న విశ్వాసాన్ని అది మరింత బలపరిచింది. కేవలం సాయి దయతో 2018 డిసెంబరులో మేము మా అబ్బాయి వివాహం చేశాము. వివాహానికి వచ్చే బంధువులకోసం మా ఇంటి మొదటి అంతస్తులో ఉన్న ఒక పోర్షన్ ను ఖాళీ చేయించాము. వివాహమయ్యాక నా కొడుకు, కోడలు ఢిల్లీ ప్రయాణమయ్యారు. తరువాత 2019, ఫిబ్రవరి నెలలో నేను ఆ పోర్షన్ ని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. సరైన వాళ్ళు అద్దెకు కుదరడంలో జాప్యం ఏర్పడుతుందేమోనని నేను ఆందోళనపడి బాబాను ప్రార్థించి, ఇల్లు అద్దెకు ఉందని తెలియజేస్తూ కొన్ని వెబ్‌సైట్లలో ప్రకటన పెట్టాను. ఆ పని నేను శనివారం సాయంత్రం చేశాను. నా ప్రియమైన మిత్రులారా! నన్ను నమ్మండి. మరుసటిరోజే నాకు 3 - 4 కాల్స్ వచ్చాయి. ఆరోజు సాయంత్రానికల్లా ఒక యువకుడు కొత్తగా కాపురం పెట్టడానికి 50% అడ్వాన్స్ ఇచ్చి మా ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అంత త్వరగా సాయి చేసిన సహాయానికి ఆనందంతో సాయిని స్మరించుకున్నాను. అది సాయి లీల తప్ప మరోటి కాదు. నెలల తరబడి ఇళ్ళు ఖాళీగా ఉండటం నేను ఎన్నోసార్లు చూశాను. కానీ నా విషయంలో ప్రకటన ఇచ్చిన 24 గంటల్లో నా సాయి తమ లీలను చూపారు. "బాబా! నా గుండె సవ్వడితో సదా మీ దివ్యనామం అనుసంధానం అవనీయండి. మీ భక్తులందరినీ మీ దివ్య నామస్మరణతో శుద్ధి చేసి అందరినీ ఆశీర్వదించండి".
బోలో శ్రీ జగదానందకర జగదోద్ధార శిరిడీవాస, దత్తావతార, అనంతకోటి బ్రహ్మాండనాయక రాజధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! జై సాయిరామ్! జై సాయిరామ్! జై సాయిరామ్!
Sri shiridi sainath maharajuki jai
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sairam
ReplyDelete🕉 sai Ram
ReplyDelete